IPL 2022, PBKS vs GT: Rahul Tewatia Competes with This MS Dhoni Record - Sakshi
Sakshi News home page

IPL 2022: వారెవ్వా తెవాటియా.. ధోని తర్వాత...

Published Sat, Apr 9 2022 8:23 AM | Last Updated on Sat, Apr 9 2022 1:28 PM

IPL 2022 GT Vs PBKS: Rahul Tewatia Emulates Dhoni With This Record - Sakshi

గుజరాత్‌ ‘హ్యాట్రిక్‌’(PC: IPL/ BCCI)

IPL 2022 GT Vs PBKS: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. ఇంకొక్క సిక్సర్‌ కొడితే చాలు... విజయం వరిస్తుంది.. ఐపీఎల్‌లో అరంగేట్ర సీజన్‌లోనే విజయాల హ్యాట్రిక్‌ కొట్టిన జట్టుగా పేరూ వస్తుంది.. పంజాబ్‌ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ పరిస్థితి ఇది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒత్తిడిని అధిగమించి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు రాహుల్‌ తెవాటియా. తద్వారా గుజరాత్‌ టైటాన్స్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.

ఈ క్రమంలో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తెవాటియా చెన్నై సూపర్‌కింగ్స్‌ మాజీ కెప్టెన్, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని సరసన చేరాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌లో విజయానికి 2 బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో రెండు వరుస సిక్స్‌లతో టీమ్‌ను గెలిపించిన రెండో ప్లేయర్‌గా తెవాటియా నిలిచాడు. 2016లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ధోని పుణే సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఈ ఘనత సాధించాడు. 

కాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఓడియన్‌ స్మిత్‌కు తెవాటియా  చేదు అనుభవాన్ని మిగిల్చాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు బంతులు ఎదుర్కొన్న తెవాటియా 2 సిక్సర్ల సాయంతో 13 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇక విధ్వసంకర ఆట తీరుతో విరుచుకుపడిన ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(59 బంతుల్లో 96 పరుగులు– 11 ఫోర్లు, ఒక సిక్స్‌) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ స్కోర్లు
పంజాబ్‌–189/9 (20)
గుజరాత్‌– 190/4 (20) 

చదవండి: Shubman Gill: సెంచరీ మిస్‌.. అయినా 'రికార్డు' సృష్టించిన గిల్‌!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement