PC: ipl.com
ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అరేంగట్ర సీజన్‌లో జట్టుకు టైటిల్‌ను అందించిన గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఏడాది సీజన్‌లో హార్ధిక్ కెప్టెన్‌గా కాకుండా ఆల్‌రౌండర్‌గాను అద్భుతంగా రాణించాడు. తాజాగా ఆ జట్టు యువ ఆటగాడు రవి సాయి కిషోర్.. పాండ్యా కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురిపించాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని భారత మాజీ కెప్టెన్ ఎంస్ ధోనితో సాయి కిషోర్ పోల్చాడు.
"ధోని, హార్ధిక్ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ధోని లాగే హార్దిక్ కూడా తన జట్టులో ఆటగాళ్లకు మద్దతుగా నిలిచి.. అత్యుత్తమ ప్రదర్శన చేసేలా కృషి చేస్తాడు. హార్దిక్ కూడా ధోని లాగా గొప్ప కెప్టెన్ అవుతాడు. కాబట్టి హార్దిక్‌ని ధోని జూనియర్ వెర్షన్‌గా అభివర్ణిస్తాను. ఇది నాకు బెస్ట్ సీజన్. అయితే వచ్చే ఏడాది సీజన్‌లో మరింత మెరుగ్గా రాణిస్తాను అని భావిస్తున్నాను. నెట్స్‌లో ధోనికి బౌలింగ్ చేయడం, అతడితో మాట్లడటం నాకు ఎంతో ఆనుభూతిని కలిగించింది.
అదే విధంగా ధోని నుంచి నేను చాలా స్కిల్స్ నేర్చుకున్నాను" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి కిషోర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సాయి కిషోర్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో అతడిని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్‌లో కిషోర్ పర్వాలేదనిపించాడు. 5 మ్యాచ్‌లు ఆడిన కిషోర్ 6 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: ENG vs IND: 'ఇంగ్లండ్‌లో అతడు చెలరేగి ఆడుతాడు.. ఒక్క సెంచరీ సాధిస్తే చాలు..'
Comments
Please login to add a commentAdd a comment