
PC: IPL Twitter
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రనౌట్ అయ్యే అవకాశం నుంచి తృటిలో తప్పించుకున్న రాహుల్ తెవాటియా తన సహనాన్ని కోల్పోయాడు. కోపంతో ఊగిపోయిన తెవాటియా నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న సాయి సుదర్శన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది.
ఆ ఓవర్‌లో ఒక బంతికి తెవాటియా సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. సగం పిచ్ దాటి వచ్చిన తెవాటియాకు సుదర్శన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో వెనక్కి పరిగెట్టిన తెవాటియా కొద్దిలో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించకున్నాడు. వెంటనే సాయి సుదర్శన్ వైపు తిరిగిన తెవాటియా.. సింగిల్ వద్దని నోటితో చెప్పొచ్చుగా అంటూ సీరియస్ లుక్ ఇస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు సాహా, గిల్‌లు తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.
Tewatia angry! pic.twitter.com/7okGTIC0S8
— Cricketupdates (@Cricupdates2022) May 3, 2022
Comments
Please login to add a commentAdd a comment