PC: IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బౌలర్ కగిసో రబాడ అరుదైన ఫీట్ అందుకున్నాడు. మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రబాడ 33 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. తన మూడో ఓవర్లో హ్యాట్రిక్ తీసే అవకాశం మిస్ అయిన రబాడ ఓవరాల్‌గా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ నేపథ్యంలోనే రబాడ ఒక రికార్డు సాధించాడు.
ఐపీఎల్ చరిత్రలో నాలుగు వికెట్ల ఫీట్‌ను ఎక్కువసార్లు సాధించిన జాబితాలో రబాడ మూడో స్థానానికి చేరుకున్నాడు. రబాడ 59 మ్యాచ్‌ల్లో ఆరుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తొలి స్థానంలో ఉన్న సునీల్ నరైన్ 144 మ్యాచ్‌ల్లో ఎనిమిదిసార్లు నాలుగు వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. మలింగ ఏడుసార్లు 4 వికెట్ల ఫీట్(122 మ్యాచ్‌లు) సాధించి రెండో స్థానంలో ఉండగా.. రబాడ మూడోస్థానం(59 మ్యాచ్‌ల్లో ఆరుసార్లు 4 వికెట్ల ఫీట్), ఇక నాలుగో స్థానంలో అమిత్ మిశ్రా 154 మ్యాచ్‌ల్లో ఐదుసార్లు 4 వికెట్లు ఫీట్ అందుకున్నాడు.
చదవండి: IPL 2022: 'నోటితో చెప్పొచ్చుగా'.. సహనం కోల్పోయిన తెవాటియా
Comments
Please login to add a commentAdd a comment