
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా.. ఆల్‌రౌండర్‌గా మంచి ప్రదర్శన కనబరుస్తున్న హార్దిక్ జట్టును కూడా విజయవంతంగా నడిపిస్తున్నాడు. అతని నాయకత్వంలో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో దూసుకుపోతుంది. అయితే మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం హార్దిక్ పాండ్యా నిరాశపరిచాడు. ఒక్క పరుగు మాత్రమే చేసి రిషి ధవన్ బౌలింగ్‌లో కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
రిషి ధవన్ ఆఫ్‌స్టంప్ అవతల బంతిని వేయగా.. హార్దిక్ కట్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. ఒక్క పరుగుకే హార్దిక్‌ను ఔట్ చేశానన్న ఆనందంతో పాండ్యాకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. ఇదే సమయంలో డగౌట్‌లో ఉన్న హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిక్.. పాండ్యా ఔట్‌తో నిరాశలో కూరుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Kagiso Rabada: ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ బౌలర్ అరుదైన ఫీట్
— Addicric (@addicric) May 3, 2022
Comments
Please login to add a commentAdd a comment