Rishi Dhawan
-
టీమిండియా ప్లేయర్ షాకింగ్ రిటైర్మెంట్..
టీమిండియా వెటరన్ ఆల్ రౌండర్, హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 34 ఏళ్ల రిషి ధావన్ వైట్‌బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నిధావన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. విజయ్ హజారే ట్రోఫీ(VHT) 2024-25 గ్రూపు స్టేజి నుంచి హిమాచల్ ప్రదేశ్ నిష్క్రమించిన వెంటనే ధావన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు."పరిమిత ఓవర్ల క్రికెట్‌కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. చాలా బాధగా ఉంది. కానీ అన్ని ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. గత 20 ఏళ్లగా క్రికెట్ నా జీవితంలో భాగమైంది. ఈ క్రీడ నాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలను ఇచ్చింది.బీసీసీఐ (BCCI), హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA), పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైలకు ధన్యవాదాలు. అత్యున్నత స్ధాయిలో నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు ఎల్లప్పుడూ గర్వకారణం" అంటూ ఇన్‌స్టాలో ధావన్ రాసుకొచ్చాడు. ధావన్ ఇకపై రెడ్‌బాల్ క్రికెట్లో మాత్రం ఆడనున్నాడు.ధోని సారథ్యంలో అరంగేట్రం..కాగా ఈ హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ 2016లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రిషి.. తన కెరీర్లో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్‌లన్నీ 2016లోనే అతడు ఆడాడు. ఆ తర్వాత అతడికి ఛాన్స్‌లు లభించలేదు. భారత తరపున అతడు కేవలం 2 వికెట్లు మాత్రమే సాధించాడు.దేశవాళీ క్రికెట్లో అదుర్స్..దేశవాళీ క్రికెట్లో మాత్రం రిషి ధావన్‌కు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి సారథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్ తొలిసారిగా విజయ్ హజారే ట్రోఫీ(2021-22)ని గెలుచుకుంది. ఆ సీజన్లో ధావన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. 458 పరుగులతో పాటు17 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు.తన కెరీర్లో 34 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన ధావన్.. 2906 పరుగులతో పాటు 186 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 135 టీ20ల్లో 1740 పరుగులతో పాటు 118 వికెట్లను అతడు సాధించాడు. మొత్తంగా 4,646 పరుగులు, 186 వికెట్లతో తన వైట్ బాల్ కెరీర్‌ను ధావన్ ముగించాడు. అదే విధంగా ధావన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైలకు ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: ట్రోఫీ ప్రదానోత్సవానికి ఆహ్వానించలేదు: గావస్కర్ -
టీ20 టోర్నీ ఫైనల్లో తొలిసారిగా.. మరో ట్రోఫీకి అడుగు దూరంలో ధావన్ సేన
Syed Mushtaq Ali Trophy 2022- Punjab vs Himachal Pradesh, Semi Final 1: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 సెమీ ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. సమిష్టి కృషితో తొలిసారిగా దేశవాళీ టీ20 టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది. కోల్‌కతాలో పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. సెమీ ఫైనల్-1 ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 తొలి సెమీ ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్- పంజాబ్ తలపడ్డాయి. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన రిషి ధావన్ సేనకు ఆదిలోనే షాకిచ్చారు పంజాబ్ బౌలర్లు. ఆదుకున్న సుమీత్ వర్మ, ఆకాశ్ ఓపెనర్లు ప్రశాంత్ చోప్రా, అంకుశ్ బైన్స్ వరుసగా 17, 16 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన అభిమన్యు రాణా(2 రన్స్) పూర్తిగా నిరాశపరిచాడు. జట్టు ఇలా కష్టాల్లో కూరుకుపోయిన వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుమీత్ వర్మ పట్టుదలగా నిలబడ్డాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 51 పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో ఆకాశ్ వశిష్ట్ 43 పరుగులతో సహకారం అందించాడు. వీరిద్దరు కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. పంకజ్ జైస్వాల్ సైతం 27 పరుగులతో రాణించాడు. శుభారంభం లభించకపోయినా మిడిలార్డర్ రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో హిమాచల్ ప్రదేశ్ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది. రిషి మూడు వికెట్లు పడగొట్టి ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లలో శుబ్‌మన్ గిల్ 45 పరుగులతో ఆకట్టుకోగా.. అభిషేక్ శర్మ మాత్రం ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరాడు. మిగిలిన వాళ్లలో అన్మోల్ప్రీత్ సింగ్ 30, కెప్టెన్ మన్దీప్ సింగ్ 29(నాటౌట్), రమణ్‌దీప్ సింగ్ 29 పరుగులు చేశారు. అయితే, అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేజారిపోయింది. డెత్ ఓవర్లలో హిమాచల్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మరో టైటిల్ దిశగా హిమాచల్ బౌలర్లలో కెప్టెన్ రిషి ధావన్‌కు మూడు, కున్వార్ అభినయ్ సింగ్‌కు ఒకటి, మయాంక్ దాగర్‌కు రెండు, ఆకాశ్ వశిష్ట్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇక ఈ విజయంతో హిమాచల్ ప్రదేశ్ తొలిసారిగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. మరో సెమీ ఫైనల్లో విజేత(విదర్భ వర్సెస్ ముంబై)తో తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనుంది. పరిమిత ఓవర్లలో మరో దేశవాళీ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా గతేడాది.. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని హిమాచల్ ప్రదేశ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పటిష్ట జట్టు అయిన తమిళనాడును ఓడించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: T20 WC Ind Vs Ban: అప్పుడు కూడా నరాలు తెగే ఉత్కంఠ! బంగ్లా ఒక్క పరుగుతో.. టాయ్‌లెట్‌కి వెళ్లి Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్ 4⃣ Overs 2⃣5⃣ Runs 3⃣ Wickets Talk about leading from the front! 👏 👏 #SyedMushtaqAliT20 | @mastercardindia Relive Himachal Pradesh skipper @rishid100's match-winning bowling display against Punjab in #SF1 of the #PUNvHP contest🎥 🔽https://t.co/cW86hcSBTa — BCCI Domestic (@BCCIdomestic) November 3, 2022 -
'టీమిండియాలోకి తిరిగి రావడమే నా టార్గెట్'
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ రిషి ధావన్ టీమిండియాలోకి తిరిగి రావాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. రిషి ధావన్ బ్యాట్‌తో పాటు బాల్‌తో కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాగా ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్‌కు తొలి సారి విజయ్ హజారే ట్రోఫీని ధావన్ అందించాడు. ఇక ఐదేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధావన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ ఏడాది సీజన్లో ధావన్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ధావన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. "నేను జట్టులో సీనియర్ ఆటగాడిని. భారత జట్టులో తిరిగి వచ్చి అత్యత్తుమ ప్రదర్శన చేయడమే నా లక్ష్యం. ఐపీఎల్ లాంటి మెగా టోర్నీల్లో రాణించడం చాలా కష్టం. కానీ మ్యాచ్ పరిస్థితిని బట్టి బౌలింగ్ చేయమని కోచ్‌లు నాకు చెప్పారు. అది నాకు చాలా సహాయపడింది. నేను కగిసో రబాడా నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అతడు బౌలింగ్‌లో నా బలాలపై దృష్టి పెట్టమని చెప్పాడు ”అని ఎన్డీటీవికు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ పేర్కొన్నాడు. ధావన్ టీమిండియా తరపున మూడు వన్డేలు, కేవలం ఒక్క టీ20 మాత్రమే ఆడాడు. చదవండి: IPL 2022: ముంబైతో తలపడనున్న సీఎస్కే.. నిలవాలంటే గెలవాలి..! -
గుజరాత్ కెప్టెన్‌కు రిషి ధవన్ ఫ్లైయింగ్ కిస్; నిరాశలో హార్దిక్ భార్య
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా.. ఆల్‌రౌండర్‌గా మంచి ప్రదర్శన కనబరుస్తున్న హార్దిక్ జట్టును కూడా విజయవంతంగా నడిపిస్తున్నాడు. అతని నాయకత్వంలో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో దూసుకుపోతుంది. అయితే మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం హార్దిక్ పాండ్యా నిరాశపరిచాడు. ఒక్క పరుగు మాత్రమే చేసి రిషి ధవన్ బౌలింగ్‌లో కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రిషి ధవన్ ఆఫ్‌స్టంప్ అవతల బంతిని వేయగా.. హార్దిక్ కట్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. ఒక్క పరుగుకే హార్దిక్‌ను ఔట్ చేశానన్న ఆనందంతో పాండ్యాకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. ఇదే సమయంలో డగౌట్లో ఉన్న హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిక్.. పాండ్యా ఔట్‌తో నిరాశలో కూరుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Kagiso Rabada: ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ బౌలర్ అరుదైన ఫీట్ pic.twitter.com/OYEEacKAmK — Addicric (@addicric) May 3, 2022 -
ఫేస్‌గార్డ్‌తో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్.. అసలు కథ ఇదే!
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ రిషి ధవన్ ఐదేళ్ల తర్వాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చాడు. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రిషి ధవన్ బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్‌తో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చిన అతను మ్యాచ్ విజయంలోనూ కీలకపాత్ర పోషించాడు. కాగా మ్యాచ్‌లో రిషి ధావన్ ఫేస్‌గార్డ్ పెట్టుకొని బౌలింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఫేస్‌గార్డ్ వెనుక ఉన్న కథను రిషి ధవన్ మ్యాచ్ అనంతరం రివీల్ చేశాడు. కాగా ఐపీఎల్ 2022కు ముందు జరిగిన రంజీ ట్రోఫీలో రిషి ధవన్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్‌కు రిషి ధవన్ ముక్కు పగిలి రక్తం బయటికి వచ్చింది. దీంతో ముక్కుకు సర్జరీ చేయించుకున్న అతను ఐపీఎల్ 15వ సీజన్లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇక సీఎస్కేతో మ్యాచ్‌కు బరిలోకి దిగిన రిషి ధవన్ ఫేస్‌గార్డ్ పెట్టుకొని బౌలింగ్ దిగాడు. ''దాదాపు ఐదేళ్ల తర్వాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇస్తున్నా. ఒక రకంగా ఇన్నేళ్లు ఐపీఎల్‌కు దూరమయ్యాననే బాధ ఉండేది. కానీ రంజీ ట్రోఫీలో గాయపడిన నేను ముక్కుకు సర్జరీ చేయించుకున్నా. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరు చెప్పలేరు. రిస్క్ తీసుకోవడం ఎందుకని సీఎస్కేతో మ్యాచ్‌లో ఫేస్‌గార్డ్‌తో బరిలోకి దిగా. ఐదేళ్ల తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ధోని వికెట్ పడగొట్టడం సంతోషమనిపించింది. ఓవరాల్‌గా నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానంటూ'' చెప్పుకొచ్చాడు. ఇక గతేడాది డిసెంబర్లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ తొలి టైటిల్ గెలవడంలో రిషి ధవన్ పాత్ర కీలకం. కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా సూపర్ ప్రదర్శన కనబరిచాడు. ఈ ప్రదర్శనే అతన్ని ఐపీఎల్ మెగావేలంలో పంజాబ్ కింగ్స్ రూ.55 లక్షలకు దక్కించుకునేలా చేసింది. చదవండి: Rishi Dhawan: ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. అయితేనేం అదరగొట్టాడు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Sher shikaar karna kabhi bhulta nahi! 🦁#SaddaPunjab #IPL2022 #PunjabKings #ਸਾਡਾਪੰਜਾਬ #PBKSvCSK pic.twitter.com/ZHfGBP9cgh — Punjab Kings (@PunjabKingsIPL) April 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. అయితేనేం అదరగొట్టాడు
సీఎస్కేతో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విజయంలో శిఖర్ ధావన్ కీలకపాత్ర పోషించాడని అనుకుంటున్నాం. కానీ మనకు కనబడని మరో వ్యక్తి కూడా గెలుపులో బాగమయ్యాడు. అతనే పంజాబ్ కింగ్స్ బౌలర్ రిషి ధవన్. ఐదేళ్ల తర్వాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చిన అతను తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 2016లో రిషి ధవన్ ఆఖరిసారి పంజాబ్ కింగ్స్ తరపునే ఐపీఎల్ ఆడడం విశేషం. ముందు సూపర్ ఫామ్‌లో ఉన్న శివమ్ ధూబేను కీలక సమయంలో వెనక్కి పంపిన రిషి ధవన్.. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలి వికెట్ సాధించాడు. . ముఖ్యంగా ఆఖరి ఓవర్లో సీఎస్కేకు 27 పరుగులు అవసరమైన దశలో సూపర్ బౌలింగ్ చేశాడు. ముంబైతో మ్యాచ్‌లో ఫినిషర్ పాత్రతో అదరగొట్టిన ధోనిని తెలివైన బంతితో బోల్తా కొట్టించి సీఎస్కేను విజయానికి దూరం చేశాడు. ఓవరాల్‌గా ఆఖరి ఓవర్లో 16 పరుగులు మాత్రమే ఇచ్చి పంజాబ్‌ను గెలిపించాడు. బ్యాటింగ్ శిఖర్ ధావన్(88*పరుగులు) సాధించగా.. బౌలింగ్‌లో రిషి ధవన్ 4 ఓవర్లలో 39 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్‌లో రిషి ధవన్ ఫేస్‌గార్డ్ పెట్టుకొని బౌలింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయుడు 78 పరుగుల వీరోచిత పోరాటం సరిపోలేదు. తద్వారా సీఎస్కే సీజన్లో ఆరో ఓటమిని మూటగట్టుకుంది. పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. చదవండి: Ravindra Jadeja: 'మా కెప్టెన్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయలేడు..' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4281444471.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022 Auction: అతడి కోసం మూడు జట్లు పోటీ.. రికార్డులు బద్దలు అవ్వాల్సిందే!
విజయ్-హజారే ట్రోఫీని తొలిసారి గెలిచి హిమాచల్ ప్రదేశ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే హిమాచల్ ప్రదేశ్ అద్భుత విజయంలో ఆ జట్టు కెప్టెన్ రిషి ధావన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్లో బ్యాట్‌తోను, బాల్‌తోను అద్భుతంగా రాణించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు సాధించాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో 458 పరుగులతో రెండో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో రానున్న ఐపీఎల్ మెగా వేలంలో అతడిని దక్కించకోనేందుకు చాలా జట్లు పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మూడు జట్లు అతడిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2022 వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో బీసీసీఐ నిర్వహించనుంది. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలంజ్సర్ బెంగళూరు జట్లు అతడి కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్-2022 వేలానికి ముందు కెప్టెన్ రిషబ్ పంత్, ఓపెనర్ పృథ్వీ షా, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, అన్రిచ్ నార్జేను రీటైన్ చేసుకుంది. కాగా సరైన ఆల్ రౌండర్ జట్టులో లేకపోవడంతో రిషి ధావన్‌పై డిసీ కన్నేసినట్లు సమాచారం. అతడి కోసం ఎంత మొత్తం అయినా వెచ్చించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: Ind Vs Wi- Kieron Pollard: ‘నిజంగా విచారకరం.. పొలార్డ్ మిస్సయాడు.. పోలీసులకు రిపోర్టు చేయండి లేదంటే..’.. అవునా? -
ఐపీఎల్ ఆడకపోవడమే అతను చేసిన నేరమా.. అందుకే టీమిండియాకు ఎంపిక చేయలేదా..?
వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో దేశవాళీ స్టార్ ఆల్‌రౌండర్, హిమాచల్‌ప్రదేశ్ ఆటగాడు రిషి ధవన్ పేరు లేకపోవడం సగటు క్రికెట్ అభిమానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. జట్టులో నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కొరత ఉందంటూ ముసలి కన్నీరు కార్చే సెలెక్టర్లకు ఇటీవల దేశవాళీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రిషి ధవన్ కనిపించలేదా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. How is Deepak hooda selected over Rishi Dhawan. Rishi was second highest run scorer and second highest wicket taker this vijay Hazare trophy. You gotta feel for him#INDvWI #CricketTwitter — Nakli Deadpool🦁 (@NakliDeadpool) January 27, 2022 ఐపీఎల్లో ఆడకపోవడమే రిషి ధవన్ చేసిన నేరమా, అందుకే అతన్ని టీమిండియాకు ఎంపిక చేయలేదా అంటూ అతని అభిమానులు నిలదీస్తున్నారు. ఒకప్పుడు దేశవాళీ టోర్నీల్లో పర్ఫామెన్స్ ఆధారంగానే టీమిండియాకి ఎంపిక చేసేవాళ్లని, ఇప్పుడేమో ఐపీఎల్ ప్రతిభ ఆధారంగా సెలక్షన్ జరుగుతోందంటున్నారు టీమిండియా అభిమానులు. గత ఐపీఎల్లో కేవలం కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే రాణించి జట్టులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌ను ఇందుకు ఉదహరిస్తున్నారు. సెలెక్టర్లు ఇకనైనా మొద్దు నిద్రను వీడి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను ఎంకరేజ్ చేయాలని, ఇది భారత జట్టుకు మేలు చేస్తుందని వారు సూచిస్తున్నారు. Why did Venkatesh Iyer drop out of ODI team? And why did Rishi Dhawan not get a chance in a format? 👇 *And this guy showed all-round performance like putting out fires in #SMAT & #VijayHazare Trophy. *Day by day the value of Indian Domestic Cricket is getting lost. @BCCI — Md Sahid Mondal (@imdsahidmondal) January 27, 2022 కాగా, గతేడాది ముస్తాక్ ఆలీ టోర్నీలో అద్భుతంగా రాణించిన రిషి ధవన్.. విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగిపోయాడు. హిమాచల్‌ప్రదేశ్ జట్టుని ముందుండి నడిపించి, ఆ జట్టుకు మొట్టమొదటి దేశవాళీ ట్రోఫీని అందించాడు. ఫైనల్లో పటిష్టమైన తమిళనాడును మట్టికరిపించడంలో రిషి కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతను కీలకమైన 3 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లో 42 పరుగులు చేసి సత్తా చాటాడు. విజయ్ హాజారే ట్రోఫీ 2021లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన రిషి.. 69.33 సగటుతో 458 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 5.95 ఎకానమీతో బౌలింగ్ చేసి 14 వికెట్లు పడగొట్టాడు. Bhai India ka core grp set hai !!! Jab vacancy ayegi, tab naye ko uthaya jayega !!! Vacancy nahi hai !! Ab kya sirf unko khush karne kiliye squad rakhe !!!🤷🏻♀️😐 — Shubham Speaks (@ShubhamRetweets) January 26, 2022 అంతకుముందు ముస్తాక్ ఆలీ టోర్నీలో సైతం రాణించిన రిషి.. 117 పరుగులతో పాటు 14 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతను ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కే ఎంపికవుతాడని అంతా ఊహించారు. అయితే, అప్పుడు హ్యాండ్ ఇచ్చిన సెలెక్టర్లు.. తాజాగా విండీస్ సిరీస్‌కు కూడా మొండి చెయ్యే చూపించారు. కాగా, టీమిండియా తరఫున 3 వన్డేలు, ఓ టీ20 ఆడిన ధవన్.. ఐపీఎల్లో కూడా ఆడాడు. అయితే అక్కడ ఆశించిన మేర రాణించకపోవడంతో అతనికి అవకాశాలు దక్కలేదు. అతను పంజాబ్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల తరఫున 26 మ్యాచ్‌ల్లో 153 పరుగులు, 18 వికెట్లు పడగొట్టాడు. -
Ind Vs WI: ఆ ఇద్దరికి బంపరాఫర్.. ఒకరు వన్డే, మరొకరు టీ20 సిరీస్‌కు ఎంపిక!
India Vs West Indies Series 2022: దక్షిణాఫ్రికా పర్యటనతో పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. మూడు వన్డేలు, మూడు టీ20లతో కూడిన సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానుండగా.. దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. సౌతాఫ్రికాతో టూర్లో తుది జట్టు కూర్పు.. తదనంతర ఫలితాలు దృష్టిలో పెట్టుకుని సమతౌల్యమైన జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఆల్‌రౌండర్ రిషి ధావన్, షారుఖ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 458 పరుగులు.. 17 వికెట్లు.. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్ అద్భుత ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే. బ్యాటర్‌గా.. బౌలర్‌గా రిషి ధావన్ అత్యుత్తమంగా రాణించాడు.ఈ టోర్నీలో మొత్తంగా 458 పరుగులు చేయడంతో పాటుగా 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలతో పాటు ఒక 4 వికెట్ హాల్ కూడా ఉండటం విశేషం. ఇలా ఆటగాడిగా.. సారథిగా హిమాచల్ ప్రదేశ్ మొట్టమొదటి సారిగా ఈ మెగా ఈవెంట్లో విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రిషి సుదీర్ఘకాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. విండీస్‌తో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. #VijayHazareTrophy winners. 🏆 Congratulations and a round of applause for Himachal Pradesh on their triumph. 👏 👏#HPvTN #Final pic.twitter.com/bkixGf6CUc — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. మరోవైపు... తమిళనాడు ఆటగాడు షారుఖ్ ఖాన్ సైతం దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో రాణించాడు. ముఖ్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి తమిళనాడును విజేతగా నిలిపి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఈ ప్రదర్శన దృష్ట్యా విండీస్ టీ20 సిరీస్‌కు షారుఖ్‌ను సెలక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా... దక్షిణాఫ్రికా టూర్లో ఘోరంగా వైఫల్యం చెందిన వెంకటేశ్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ తదితరులపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గాయం కారణంగా టూర్‌కు దూరమైన అక్షర్ పటేల్, కరోనా కారణంగా వన్డే సిరీస్ మిస్సైన వాషింగ్టన్ సుందర్.. వీరితో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. Sensational Shahrukh! 💪 💪 Sit back & relive this @shahrukh_35 blitz which powered Tamil Nadu to #SyedMushtaqAliT20 title triumph. 🏆 👏 #TNvKAR #Final Watch his knock 🎥 ⬇️https://t.co/6wa9fwKkzu pic.twitter.com/evxBiUdETk — BCCI Domestic (@BCCIdomestic) November 22, 2021 చదవండి: రాహుల్, పంత్‌కు ప్రమోషన్.. రహానే, పుజారాలకు డిమోషన్! -
IPL Auction: 13 ఫోర్లు, సిక్స్.. 136 పరుగులు నాటౌట్.. శుభమ్‌తో పాటు ఆ ముగ్గురు కూడా!
IPL 2022 Auction- Vijay Hazare Trophy Winner Himachal Pradesh Players: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో తొలిసారి చాంపియన్‌గా అవతరించి చరిత్ర సృష్టించింది హిమాచల్ ప్రదేశ్. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా విజేతగా నిలిచింది. ఆరుసార్లు చాంపియన్ అయిన తమిళనాడుకు షాకిచ్చి ట్రోఫీని ముద్దాడింది. ముఖ్యంగా కెప్టెన్ రిషి ధావన్, పంకజ్పవన్ జైస్వాల్, ప్రశాంత్ చోప్రా, శుభమ్ అరోరా హిమాచల్ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించారు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం ఆసన్నమైన నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. ఈ నలుగురిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంఛైజీలు తప్పక ఆసక్తి కనబరుస్తాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీలో వీరి ప్రయాణాన్ని గమనిద్దాం. రిషి ధావన్(ఆల్‌రౌండర్) విజయ్ హజారే ట్రోఫీ ఆసాంతం కెప్టెన్‌గా, బ్యాటర్‌గా.. బౌలర్‌గా రిషి ధావన్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. టోర్నీలో మొత్తంగా 458 పరుగులు చేయడంతో పాటుగా 17 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలతో పాటు ఒక 4 వికెట్ హాల్ కూడా ఉంది. తాజా ప్రదర్శనతో మెగా వేలం నేపథ్యంలో క్యాష్ రిచ్‌లీగ్‌లో రీఎంట్రీ ఇవ్వడంతో పాటు మంచి ధరకు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి. పంకజ్ జైస్వాల్ తమిళనాడుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హిమాచల్ బౌలర్ పంకజ్ జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. టోర్నీలో మొత్తంగా 4 మ్యాచ్‌లు ఆడిన పంకజ్ ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రశాంత్ చోప్రా(బ్యాటర్) విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు ప్రశాంత్ చోప్రా. ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 99. మొత్తంగా టోర్నీలో 12 సిక్సర్లు బాదాడు. ఇలాంటి హిట్టర్ పట్ల ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో సందేహం లేదు. శుభమ్ అరోరా(బ్యాటర్) ఉత్కంఠ రేపిన ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ విజేతగా నిలవడంలో శుభమ్దే కీలక పాత్ర. మ్యాచ్ ఆరంభం నుంచి చివరిదాకా క్రీజులో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 136 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టోర్నీలో మొత్తంగా 313 పరుగులతో రాణించాడు. సగటు 44+. చదవండి: Virat Kohli Dismissal: 94 బంతులు.. 35 పరుగులు.. మరీ అలా అవుట్ అవడం ఏంటి!.. ఫ్రస్ట్రేషన్‌తో హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో! #VijayHazareTrophy winners. 🏆 Congratulations and a round of applause for Himachal Pradesh on their triumph. 👏 👏#HPvTN #Final pic.twitter.com/bkixGf6CUc — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 1⃣3⃣6⃣* Runs 1⃣3⃣1⃣ Balls 1⃣3⃣ Fours 1⃣ Six Shubham Arora scored a fantastic unbeaten ton & powered Himachal Pradesh to their first-ever #VijayHazareTrophy triumph. 👏 👏 #HPvTN #Final Watch his superb knock 🎥 🔽https://t.co/cRZh6TjyVh pic.twitter.com/7YEwih1oTs — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 THAT. WINNING. FEELING! 👏 👏 The @rishid100-led Himachal Pradesh beat Tamil Nadu to clinch their maiden #VijayHazareTrophy title. 🏆 👍#HPvTN #Final Scorecard ▶️ https://t.co/QdnEKxJB58 pic.twitter.com/MeUxTjxaI1 — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 A fine hundred in the chase by Shubham Arora! 👍 👍 The Himachal Pradesh opener is doing a fantastic job with the bat in the #VijayHazareTrophy #Final. 👌👌 #HPvTN Follow the match ▶️ https://t.co/QdnEKxJB58 pic.twitter.com/q1LtOrZ0Im — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 -
ధావన్ ఆల్‌రౌండ్ షో.. తొలిసారి ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్
జైపూర్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ జట్టు తొలిసారి... ఐదుసార్లు చాంపియన్ తమిళనాడు జట్టు ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్‌లో హిమాచల్ ప్రదేశ్ 77 పరుగుల ఆధిక్యంతో సర్వీసెస్ జట్టుపై... తమిళనాడు రెండు వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై గెలుపొందాయి. ఫైనల్ రేపు జరుగుతుంది. సర్వీసెస్‌తో జరిగిన సెమీఫైనల్లో హిమాచల్ కెప్టెన్ రిషి ధావన్ ఆల్‌రౌండ్ షో (84; 9 ఫోర్లు, 1 సిక్స్; 4/27) కనబరిచాడు. మొదట హిమాచల్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 281 పరుగులు చేసింది. సర్వీసెస్ 46.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మరో సెమీస్‌లో సౌరాష్ట్ర నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. WHAT. A. WIN!👏 👏 Captain @rishid100 stars with bat and ball as Himachal Pradesh beat Services by 77 runs to march into the #VijayHazareTrophy #Final. 👍 👍 #SF1 #HPvSER Scorecard ▶️ https://t.co/MWsWAq2Q2B pic.twitter.com/tsK7Ua08Mr — BCCI Domestic (@BCCIdomestic) December 24, 2021 -
ఓటమితో ఆంధ్ర ముగింపు...
వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించింది. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 30 పరుగుల తేడాతో ఓడింది. దాంతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండింటిలో నెగ్గి మరో మూడింటిలో ఓడిన ఆంధ్ర 8 పాయింట్లతో గ్రూప్‌లో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది. తొలుత హిమాచల్‌ప్రదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఆంధ్ర పేసర్ చీపురపల్లి స్టీఫెన్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఛేదనలో ఆంధ్ర 20 ఓవర్లలో 118 పరుగులు మాత్రమే చేసింది. అశ్విన్ హెబ్బార్ (43; 3 ఫోర్లు, 1 సిక్స్), రికీ భుయ్ (41; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. హిమాచల్ బౌలర్లలో పంకజ్ జైస్వాల్ ఐదు వికెట్లు... రిషి ధావన్ 3 వికెట్లు తీశారు. చదవండి: T20 WC 2021: ఇంగ్లండ్ ఫెవరెట్.. న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా! -
భువనేశ్వర్ స్థానంలో రిషి ధావన్ కు చోటు
ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు జరిగింది. బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో ఆల్‌రౌండర్ రిషి ధావన్‌కు స్థానం లభించింది. గాయపడ్డ మరో బ్యాట్స్‌మన్ అజింక్య రహానే స్థానంలో ప్రత్యామ్నాయంగా గుర్కీరత్ సింగ్ జట్టుతోపాటు కొనసాగుతాడు. -
పట్టు జారిపోతోంది...
♦ కెప్టెన్‌గా ధోనికి కష్టకాలం ♦జట్టు ఎంపికలోనూ చెల్లని మాట ♦వ్యూహాల్లో గందరగోళం ‘ముగ్గురు ప్రధాన పేసర్లే ధారాళంగా పరుగులిస్తున్నప్పుడు రిషి ధావన్ ఏం చేయగలడు? అతను మరీ వేగంగా కూడా వేయలేడు. జడేజా కాస్త బ్యాటింగ్ చేయగలడు కాబట్టి ధావన్‌కు అవకాశం ఇవ్వాలంటే అశ్విన్‌ను కూర్చోబెట్టడంవంటి కఠిన నిర్ణయం తీసుకోవాలి. లేదా ఒక ప్రధాన బ్యాట్స్‌మన్‌ను తప్పించాలి. అప్పుడు ఆరుగురు బౌలర్లవుతారు. కాబట్టి ఇలాంటి స్థితిలో రిషి గురించి ఆలోచించడం లేదు...’ రెండో వన్డే తర్వాత భారత కెప్టెన్ ధోని ఇచ్చిన స్పష్టమైన వివరణ ఇది. ధోని దృష్టిలో అసలు పనికే రాడనుకున్న రిషి ధావన్ ఆ తర్వాత మూడో వన్డేలో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చాడు. ధోని చెప్పినట్లు కఠిన నిర్ణయమే అయినా అశ్విన్‌పై వేటు పడింది. పనిలో పనిగా మరో కొత్త ఆటగాడు గుర్‌కీరత్‌కు కూడా అవకాశం ఇచ్చేందుకు రెగ్యులర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండేను పక్కన పెట్టేశారు. ఈ రోజుల్లో సాధ్యం కాదంటూనే ఆరుగురు బౌలర్లను ఆడించేశారు... రెండు రోజుల్లోపే రిషి ఒక్కసారిగా బౌన్స్ రాబట్టగల పేస్ బౌలర్‌గా మారాడా, లేక ధోని మారిపోయాడా. ఒకప్పుడు రొటేషన్ పేరు చెప్పి సచిన్, సెహ్వాగ్‌లకు కూడా ‘విశ్రాంతి’ ఇవ్వగలిగిన ధోని ఇప్పుడు తనకు నచ్చిన జట్టును ఎంచుకోవడంలో కూడా ఇబ్బంది పడిపోతున్నాడు. సెలక్టర్లు ఎలాంటి జట్టును ఎంపిక చేసి ఇచ్చినా... ఇన్నేళ్ల కెప్టెన్సీలో మూడు మ్యాచ్‌ల వ్యవధిలో ముగ్గురు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ధోని డిక్షనరీలోనే లేదు. గతంలోలాగా అతను స్వతంత్రంగా వ్యవహరించలేక పోతున్నాడని, జట్టుపై అతని పట్టు జారుతోందడానికి ఇది తాజా ఉదాహరణ. సాక్షి క్రీడా విభాగం సాధారణంగా మ్యాచ్ రోజు ఉదయం మాత్రమే పిచ్‌ను పరిశీలించిన తర్వాత ఒక అంచనాకు వచ్చి తుది జట్టును ప్రకటించడం ఆనవాయితీ. ఇది తప్పనిసరి కాకపోయినా భారత్ ఎప్పుడూ ఒక రోజు ముందుగానే జట్టును నిర్ణయించుకున్న దాఖలాలు లేవు. అయితే మెల్బోర్న్ మ్యాచ్ బరిలోకి దిగే వరకు కూడా టీమ్ మేనేజ్మెంట్ కనీసం పిచ్ వైపు చూడలేదు. మరో వైపు రిషి ధావన్‌కు మాత్రం తాను తుది జట్టులో ఉండబోతున్నట్లు ముందు రోజే తెలిసిపోయినట్లు సమాచారం. ఇది ఓ రకంగా అనూహ్య నిర్ణయమే. పిచ్ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండానే జట్టును ప్రకటించడం అంటే ముందే ఎవరుండాలో సిద్ధమైపోయినట్లు. రెండో వన్డే తర్వాత ధోని వ్యాఖ్యలపై అతనికి ‘బోర్డు పెద్దలు’ గట్టి క్లాస్ పీకినట్లు జాతీయ మీడియా కథనం ప్రసారం చేసింది. జట్టులో ఫలానా ఆటగాడు పనికి రాడు అని బహిరంగంగా అనడం అంటే సెలక్టర్ల నిర్ణయాన్ని సవాల్ చేసినట్లేనని వారు గట్టిగా చెప్పారు. దాంతో చిర్రెత్తిన ధోని మీకు కావాల్సిన వాళ్లనే తీసుకుంటానంటూ నేరుగా రిషిని బరిలోకి దించేశాడు. స్పిన్‌ను అనుకూలమైన ఈ పిచ్‌పై అశ్విన్‌నే పక్కన పెట్టేశాడు. ఈ మ్యాచ్ మొత్తంలో స్పిన్నర్లు జడేజా, మ్యాక్స్‌వెల్ ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేయడం విశేషం. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు ఎంపికపై మాట్లాడేందుకు కూడా ధోని నిరాకరించాడు. భరోసా కల్పించలేకపోతున్నాడు నాలుగో వన్డేలో జడేజా నాటౌట్‌గా నిలవడం కోసమే నెమ్మదిగా ఆడాడంటూ విమర్శలు వచ్చాయి. జట్టులో మళ్లీ స్థానం కోల్పోతాననే అభద్రతా భావం వల్లే అతను సాహసాలకు పోకుండా నేనైతే ప్రయత్నించాను అన్నట్లుగా బయటపడే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే గతంలోలాగా ఎలా ఆడినా కెప్టెన్ అండగా ఉంటాడు అనే నమ్మకం అతనిలోనూ లేదేమో. వారం రోజుల క్రితం ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్ అంటూ ప్రశంసలు అందుకున్న అశ్విన్‌కు కూడా జట్టులో చోటు లేదంటే ఇక జడేజా ఎంత? పైగా ఎలాంటి కష్టకాలంలోనూ, ఇంతకంటే ఘోరమైన పరాజయాల్లోనూ వెనకేసుకొచ్చిన జడేజాను ధోని నేరుగా విమర్శించడం కూడా ఆశ్చర్యపరిచేదే. గతంలో అంతా నేనే అన్నట్లుగా వ్యవహరించిన ధోని, ఇప్పుడు తుది జట్టుపై కూడా నమ్మకంతో ఉండలేకపోతున్నాడు. సాధారణంగా సెలక్టర్లు ఎవరిని ఎంపిక చేసినా, దేశవాళీలో అతని గణాంకాలు ఎంత గొప్పగా ఉన్నా ఒకటి, రెండు టూర్ల పాటు మ్యాచ్‌లు ఇవ్వకుండా అనుభవం కోసం తిప్పుకోవడం ధోని శైలి. ఈ సారి మాత్రం భిన్నంగా ఈ సిరీస్ సాగింది. కెప్టెన్‌గా ప్రకటించినా... టి20 ప్రపంచకప్‌కు ముందు గందరగోళానికి తెర దించేందుకు ధోనిని అప్పటి వరకు కెప్టెన్‌గా అధికారికంగా ప్రకటించారు. కానీ ఆలోగానే అతని కెప్టెన్సీపై ప్రతీ మ్యాచ్‌కు నిఘా పెరుగుతోంది. ఒక వైపు జట్టు పరాజయాలు, మరో వైపు స్వీయ వైఫల్యం, దీనికి తోడు కోహ్లి ఫామ్, అతని టెస్టు రికార్డు... ఇలా అన్నీ మిహీకి వ్యతిరేకంగానే సాగుతున్నాయి. అయితే ఓటమి మాత్రమే కాదు... గత నాలుగు వన్డేలు చూస్తే ధోని కూడా తనకు రోజులు దగ్గర పడ్డట్లే భావిస్తున్నాడా అనిపిస్తోంది. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినా అతను మళ్లీ పెకైగిసాడు. దురదృష్టవశాత్తూ ఈ సారి అతని వ్యూహాలు, ప్రణాళికలు అన్నీ విఫలం అవుతున్నాయి. ఫలితం సంగతి తర్వాత... ఏదైనా కొత్తగా తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నాడా అంటే అదీ లేదు. ‘రొటీన్‌కు భిన్నం’లాంటి ఆలోచనలతో అతను మ్యాచ్ దిశను మార్చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ అలాంటి నాయకత్వపు మెరుపు ఒక్కచోట కూడా కనిపించడం లేదు. ఒక రకంగా ఇక చాలు, ఎలా పోతే నాకేం అన్నట్లుగా అతని బాడీలాంగ్వేజ్ ఉంటోంది. చివరి మ్యాచ్‌లోనైనా ‘ కెప్టెన్ ధోని’ ముద్ర కనిపించకపోతే... టెస్టుల్లాగే మిహీ వన్డే కెరీర్ కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే ముగిసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.