జైపూర్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ జట్టు తొలిసారి... ఐదుసార్లు చాంపియన్ తమిళనాడు జట్టు ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్‌లో హిమాచల్ ప్రదేశ్ 77 పరుగుల ఆధిక్యంతో సర్వీసెస్ జట్టుపై... తమిళనాడు రెండు వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై గెలుపొందాయి.
ఫైనల్ రేపు జరుగుతుంది. సర్వీసెస్‌తో జరిగిన సెమీఫైనల్లో హిమాచల్ కెప్టెన్ రిషి ధావన్ ఆల్‌రౌండ్ షో (84; 9 ఫోర్లు, 1 సిక్స్; 4/27) కనబరిచాడు. మొదట హిమాచల్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 281 పరుగులు చేసింది. సర్వీసెస్ 46.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మరో సెమీస్‌లో సౌరాష్ట్ర నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది.
చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్..
WHAT. A. WIN!👏 👏
— BCCI Domestic (@BCCIdomestic) December 24, 2021
Captain @rishid100 stars with bat and ball as Himachal Pradesh beat Services by 77 runs to march into the #VijayHazareTrophy #Final. 👍 👍 #SF1 #HPvSER
Scorecard ▶️ https://t.co/MWsWAq2Q2B pic.twitter.com/tsK7Ua08Mr
Comments
Please login to add a commentAdd a comment