tamilandu
-
యోగిబాబు హీరోగా.. 'కానిస్టేబుల్ నందన్'
తమిళసినిమా: చిన్న చిన్న పాత్రల నుంచి ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగిన యోగిబాబు ఆ తరువాత కథానాయకుడి అవతారమెత్తి సక్సెస్‌పుల్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. అటు హాస్య పాత్రల్లోనూ, ఇటు హీరోగానూ రెండు పడవలపై విజయవంతంగా పయనిస్తున్న యోగిబాబు తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్ నందన్. శంకర్ పిక్చర్స్ పతాకంపై డి.శంకర్ తిరువణ్ణామలై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా భూపాల నటేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు సుందర్.సి, శశికుమార్, ఎం.కళైంజయం వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. కాగా ఈయన దర్శకుడిగా పరి చయం అవుతున్న చిత్రం కానిస్టేబుల్ నందన్ ఆదివారం ఉదయం తిరువణ్ణామలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శంకర్ తిరువణ్ణామలై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ పలువురు నటులకు స్ఫూర్తిగా నిలిస్తున్న నటుడు యోగిబాబు వంటి ఉత్తమ నటుడితో కలిసి చిత్రం చేయడం ఘనతగా భావిస్తున్నానన్నారు.కథ చెబుతున్నప్పుడే ఆయన చూపించిన ఆసక్తి నిజంగానే అభినందనీయమన్నారు. పలు వురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసి చాలా విషయాలు నేర్చుకున్న భూపాల నటేశన్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో కానిస్టేబుల్ నందన్ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మంచి కథా చిత్రాలను మరిన్ని చేయాలని కోరుకుంటున్నానన్నారు.దర్శకుడు భూపాల నటే శన్ పేర్కొంటూ మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న భావన కలిగిన నిర్మాతలను కనుగొనడం ఒక వరప్రసాదం అన్నారు. అలాంటి శంకర్ తన కథను చిత్రంగా నిర్మించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు, బయ్యర్లకు నచ్చిన నటుడు యోగిబాబుతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతూనే హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న ఆయన కేరీర్ కానిస్టేబుల్ నందన్ చిత్రం ఒక మైలు రాయిగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇందులో యోగిబాబుకు విలన్‌గా ఓ బలమైన పాత్ర ఉంటుందన్నారు. ఆ పాత్ర కోసం ప్రతిభావంతుడైన నటుడిని ఎంపికచేసి త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు భూపాల నటేశన్ పేర్కొన్నారు.ఇవి చదవండి: 'మదర్ ఇండియా'కు సిద్ధం.. -
రెబల్ పన్నీర్ సెల్వానికి నలుగురు పన్నీర్ సెల్వంలతో పోటీ
1973లో వచ్చిన చైనీస్ చిత్రం ‘ఎంటర్ ది డ్రాగన్’లో, బ్రూస్ లీ తన ప్రత్యర్థి హాన్‌తో అద్దాల గదిలో పోరాడుతారు. అప్పుడు పలు ప్రతిబింబాలు బ్రూస్ లీని కలవరపరుస్తాయి. తమిళనాట ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురై రెబల్‌గా మారిన ఓ పన్నీర్‌సెల్వం పరిస్థితి కూడా రామనాథపురంలో బ్రూస్లీ మాదిరిగానే పరిణమించింది. ఓ పన్నీర్‌సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, అదే పేరుతో మరో నలుగురు తమ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఓటర్లకు ‘ఓ పన్నీర్‌సెల్వం’ విషయంలో గందరగోళం ఏర్పడనుంది. నిజానికి ఓ పన్నీర్‌సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ డమ్మీ అభ్యర్థులను అతని ప్రత్యర్థులు రంగంలోకి దింపినట్లు సమాచారం. ఓ పన్నీర్ సెల్వంను ఎన్నికల్లో దెబ్బతీయాలన్నదే వారి లక్ష్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పేరుతో ఉన్న ఒక స్వతంత్ర అభ్యర్థికి బీజేపీ మద్దతు ఉండటం విశేషం. ఓ పన్నీర్‌సెల్వం పూర్తి పేరు ఒట్టకరతేవర్ పన్నీర్ సెల్వం. పోటీలో దిగిన ఇతర అభ్యర్థులకు పన్నీర్‌సెల్వం ఒచ్చప్పన్, ఒయ్యారం, ఒయ్యతేవర్, ఒచ్తేవర్ వంటి పేర్లు చేరి ఉన్నాయి. మెక్కిలార్పట్టి నుంచి ఓచప్పన్ పన్నీర్‌సెల్వం, రామనాథపురం నుంచి ఊయారం పన్నీర్‌సెల్వం తదితరులు కూడా బరిలోకి దిగడం గమనార్హం. -
స్టాలిన్ బర్త్‌డే.. బీజేపీ ‘కౌంటర్’ విషెస్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. కానీ, అందులో ఆయనకు కౌంటరే వేసింది. ఇటీవల ఇస్రో కొత్త కాంప్లెక్స్ శంకుస్థాపన సందర్భంగా డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలో చైనా జెండా ఉండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఈ యాడ్‌పై రాష్ట్ర మత్స్య మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్ వివరణ కూడా ఇచ్చారు. ‘ప్రకటనలో చిన్న పొరపాటు జరిగింది. మాకు వేరే ఉద్దేశ్యం లేదు. మా హృదయాల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉంది’ తెలిపారు. అయితే.. వివాదాన్ని కొనసాగిస్తూ.. సీఎం స్టాలిన్‌కు మాండరీన్ భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బీజేపీ. ఆయనకు(స్టాలిన్‌కు) ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ‘ఎక్స్’(ట్విటర్)లో బీజేపీ కౌంటర్ వేసింది. On behalf of @BJP4Tamilnadu, here’s wishing our Honourable CM Thiru @mkstalin avargal a happy birthday in his favourite language! May he live a long & healthy life! pic.twitter.com/2ZmPwzekF8 — BJP Tamilnadu (@BJP4TamilNadu) March 1, 2024 అంతకు ముందు.. తిరునెల్వేలిలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ డీఎంకేపై విమర్శలు సంధించారు. ‘ప్రస్తుతం హద్దులు దాటేశారు. ఇస్రో లాంచ్ చేసే రాకెట్‌కు చైనా స్టిక్కర్‌ను అతికించారు. ఇది మన అంతరిక్ష శాస్త్రవేత్తలు, అంతరిక్ష రంగాన్ని అవమానించడమే. ప్రజల పన్ను, డబ్బు, దేశాన్ని అవమానించటమే’అని ప్రధాని మోదీ అన్నారు. అయితే ప్రధాని వ్యాఖ్యలకు డీఎంకే ఊరుకోలేదు.. కౌంటర్ ఇచ్చింది. తూర్పు లడఖ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా చొరబాట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటి చూపు కూడా సన్నగిల్లిందేమో.. మోదీ చైనా జెండాను పేపర్ యాడ్‌లో నిశిత దృష్టితో చూడగలరు. కానీ, గత పదేళ్లలో భారత భూభాగంలో చైనా జెండా పాతిందనే నివేదికలు ఆయన కళ్లను కప్పేశాయయేమో అని డీఎంకే ఎంపీ పి విల్సన్ విమర్శించారు. -
ఓలా ఎలక్ట్రిక్ బంపరాఫర్!
ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ ఓలా కీలక ప్రకటన చేసింది. త్వరలో ఓలా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని ఆ సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ ప్రకటించారు. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో మాట్లాడిన ఆయన..తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో న్యూ ఈవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తున్నారు. ఈ యూనిట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 25 వేల మందికి కొలువులు లభిస్తాయని తెలిపారు. తద్వారా ప్రతి ఏటా సుమారు ఒక కోటి టూ వీలర్స్ తయారవుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ కోసం గతేడాది తమిళనాడు ప్రభుత్వంతో ఓలా ఎలక్ట్రిక్.. ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం ఓలా ఎలక్ట్రిక్ రూ.7000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఎనిమిది నెలల్లో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ యూనిట్ విజయవంతంగా నిర్మించుకున్నట్లు భవిష్ అగర్వాల్ తెలిపారు. వచ్చేనెల నుంచి ఈవీ స్కూటర్ల ఉత్పత్తి తయారవుతుందని అన్నారు. గత జూన్‌లోనే తమిళనాడులో మెగా మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సహకారంతో తమిళనాడు గిగా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు తెలిపింది. దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ లీడర్‌గా నిలిచింది. నవంబర్ నెలాఖరు నాటికి మొత్తం ఈవీ స్కూటర్ల విక్రయంలో ఓలా ఎలక్ట్రిక్ వాటా సుమారు 32 శాతం. గతేడాది నవంబర్ నాటికి దాదాపు 30 వేల ఈవీ స్కూటర్లను విక్రయించింది. -
దినేష్ కార్తీక్ విధ్వంసం.. 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో! అయినా పాపం
విజయ్ హజారే ట్రోఫీ-2023లో తమిళనాడు తొలి ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జరిగిన పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో తమిళనాడు పరాజయం పాలైంది. తమిళనాడు కెప్టెన్, టీమిండియా వెటరన్ దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 252 పరుగుల లక్ష్య ఛేదనలో 40 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తమిళనాడు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కార్తీక్ జట్టును అదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికీ కార్తీక్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 82 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. ఆఖరికి సిద్దార్ద్ కౌల్ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో కార్తీక్ పోరాటం ముగిసింది. కార్తీక్ ఔటైన తర్వాత వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తమిళనాడు.. 175 పరుగులకే చాపచుట్టేసింది. పంజాబ్ బౌలర్లలో సిద్దార్ద్ కౌల్ ఐదు వికెట్లతో చెలరేగాడు. కాగా ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న డికే.. ఐపీఎల్‌తో పాటు దేశీవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కార్తీక్‌ను రిటైన్ చేసుకుంది. చదవండి: ఐపీఎల్-2024 షెడ్యూల్ విషయంలో బీసీసీఐకి తలనొప్పులు! ఈసారి ఇక్కడ కష్టమే? -
హీరో రేంజ్ లో సీఎం స్టాలీన్
-
ఇందులో తక్కువ కులం ఏది? ప్రశ్నాపత్రంపై తీవ్ర దుమారం
చెన్నై: తమిళనాడు పెరియార్ యూనివర్సిటీ పరీక్షల్లో ఓ ప్రశ్నాపత్రంలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం తీవ్ర దుమారం రేపింది. ఎంఏ హిస్టరీ మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్ష గురువారం జరిగింది. అయితే ప్రశ్నాపత్రంలో 'కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏది?' అనే ప్రశ్న వచ్చింది. జవాబు ఎంచుకునేందుకు నాలుగు కులాల పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. 'ఫ్రీడం మూవ్మెంట్ ఆఫ్ తమిళనాడు ఫ్రం 1800-1947' అనే సబ్జెక్టు పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ ప్రశ్న ఎదురైంది. Tamil Nadu | 1st-year MA History students of Periyar University in Salem got asked in the exam, "Which one is the lower caste that belongs to Tamil Nadu?" with 4 options mentioning different castes pic.twitter.com/kdJxQrMo5R — ANI (@ANI) July 15, 2022 అయితే పరీక్షలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం వివాదాస్పదమైంది. దీనిపై పెరియార్ యూనివర్సిటీ ఉప కులపతి జగన్నాథన్ స్పందించారు. సమాజంలో అసమానతలు రూపుమాపే దిశగా విద్యను అందించాల్సిన ప్రొఫెసర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ప్రశ్నాపత్రం తాము తయారు చేయలేదని, వేరే యూనివర్సిటీ సిబ్బంది రూపొందించారని జగన్నాథన్ తెలిపారు. క్వశ్చన్ పేపర్ లీక్ కాకూడదనే ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష జరిగే వరకు ప్రశ్నాపత్రాన్ని ఎవరూ చూడలేదని, అందులోని వివాదాస్పద ప్రశ్న గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. చదవండి: పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..? -
ధావన్ ఆల్‌రౌండ్ షో.. తొలిసారి ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్
జైపూర్: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ జట్టు తొలిసారి... ఐదుసార్లు చాంపియన్ తమిళనాడు జట్టు ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్‌లో హిమాచల్ ప్రదేశ్ 77 పరుగుల ఆధిక్యంతో సర్వీసెస్ జట్టుపై... తమిళనాడు రెండు వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై గెలుపొందాయి. ఫైనల్ రేపు జరుగుతుంది. సర్వీసెస్‌తో జరిగిన సెమీఫైనల్లో హిమాచల్ కెప్టెన్ రిషి ధావన్ ఆల్‌రౌండ్ షో (84; 9 ఫోర్లు, 1 సిక్స్; 4/27) కనబరిచాడు. మొదట హిమాచల్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 281 పరుగులు చేసింది. సర్వీసెస్ 46.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మరో సెమీస్‌లో సౌరాష్ట్ర నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. WHAT. A. WIN!👏 👏 Captain @rishid100 stars with bat and ball as Himachal Pradesh beat Services by 77 runs to march into the #VijayHazareTrophy #Final. 👍 👍 #SF1 #HPvSER Scorecard ▶️ https://t.co/MWsWAq2Q2B pic.twitter.com/tsK7Ua08Mr — BCCI Domestic (@BCCIdomestic) December 24, 2021 -
శాశ్వతంగా తప్పుకున్న ఇళయరాజా
సాక్షి, చెన్నై: ప్రసాద్ స్టూడియో యాజమాన్యం, సంగీత దర్శకుడు ఇళయరాజా మధ్య కొన్నేళ్లుగా నడుస్తున్న వివాదానికి సోమవారం తెరపడింది. ఇళయరాజా కోసం ప్రసాద్ స్టూడియో యాజమాన్యం 1976లో ప్రత్యేక రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం ఇరుపక్షాల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఖాళీ చేయాలని స్టూడియో యాజమాన్యం ఇళయరాజాను కోరింది. ఇందుకు ఇళయరాజా నిరాకరించారు. ఈ వివాదంపై రెండేళ్లుగా మద్రాసు హైకోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచించింది. అయితే స్టూడియోలోని తన సంగీత పరికరాలు, అవార్డులను తీసుకునేందుకు, ధ్యానం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇళయరాజా న్యాయస్థానంలో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించిన స్టూడియో యాజమాన్యం ఆ తరువాత కొన్ని షరతులతో అంగీకరించింది. ఏదో ఒక రోజు ఉదయం 9 నుంచి సాయత్రం 4 గంటల వరకు ధ్యానం చేసుకుని సంగీత పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతించాలని యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఇళయరాజా సోమవారం ఉదయం ప్రసాద్ స్టూడియోకు వస్తారని ప్రకటన విడుదలైంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇళయరాజా, స్టూడియో తరఫు న్యాయవాదులు వచ్చారు. పరికరాలు తీసుకెళ్లేందుకు ఇళయరాజా రాకుండా సహాయకులను పంపారు. అయితే ఇళయరాజా వినియోగించే రికార్డింగ్ థియేటర్ తలుపులు పగులగొట్టి అందులోని పరికరాలను మరో గదిలోకి తరలించి ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఇళయరాజ తీవ్ర మనస్తాపానికి గురై స్టూడియోకి రాలేదని ఆయన పీఆర్వో మీడియాకు తెలిపారు. వీడియోలో అన్ని దృశ్యాలు చిత్రీకరిస్తుండగా గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఇళయరాజా సహాయకులే సామగ్రిని తీసుకెళ్లారు. (చదవండి: తానే సీఎం అభ్యర్థి అంటున్న కమల్ హాసన్) -
సీఎంతో హీరో విజయ్ భేటీ..!
సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామితో సినీ నటుడు విజయ్ భేటీ అయ్యారు. అత్యంత రహస్యంగా ఆదివారం రాత్రి గ్రీన్‌వేస్ రోడ్డులోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. విజయ్ను రాజకీయాల్లోకి రప్పించడానికి ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఎంతో ప్రయత్నం చేశారు. అయితే విజయ్ వ్యతిరేకత తెలపడంతో ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ పేరు నమోదును వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. విజయ్ నటించిన మాస్టర్ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నా, తెర మీదకు రావడంలో సమస్యలు తప్పడం లేదు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. అయి తే, కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యా రు. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా చిత్రం విడుదల కాబోతుంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో 50 శాతం మేరకు మాత్రమే సీట్ల భర్తీకి అను మతి ఉంది. ఈ సమయంలో సినిమా విడుదల చేస్తే నష్టం తప్పదన్న ఆందోళన చిత్ర బృందం ఉంది. రహస్య భేటీ.. మాస్టర్ చిత్రాన్ని రూ. 143 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తే నష్టాలు తప్పవని భావిస్తున్న చిత్ర బృందం వాటి నుంచి గట్టెక్కే ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే సీఎం పళనిస్వామిని కలిసి తమ అభ్యర్థనను ఉంచేందుకు సిద్ధమయ్యారు. విజయ్‌తో పాటు నిర్మాతలు, దర్శకుడు సీఎంతో భేటీకి నిర్ణయించారు. అయితే ఈ భేటీని రహస్యంగా ఉంచారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో గ్రీన్ వేస్ రోడ్డులోని సీఎం ఇంటికి విజయ్ వెళ్లారు. తమ తరఫున ఓ లేఖను సీఎంకు అందజేశారు. అందులో థియేటర్లను పూర్తి స్థాయిలో తెరవడం, వంద శాతం సీట్లను భర్తీ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. అన్ని పరిశీలించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని విజయ్‌కు సీఎం హామీ ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా గతంలో విజయ్ నటించిన అనేక చిత్రాలు అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో ముందుగానే సీఎంతో విజయ్ భేటీ కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
నేను ఎంజీఆర్ రాజకీయ వారసుడ్ని: కమల్
సాక్షి, చెన్నై: దివంగత ఎంజీఆర్ కలను సాకారం చేస్తే, ఆయనకు తానే రాజకీయ వారసుడ్ని అని మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తిరునల్వేలి, కన్యాకుమారిలో కమల్ పర్యటించారు. విద్యార్థులు, యువ సమూహం, మహిళాలోకంతో సమావేశం అయ్యారు. మీడియాతో కమల్ మాట్లాడుతూ రజనీ సిద్ధాంతాలు వేరు, తన సిద్ధాంతాలు వేరని, అయితే, తామిద్దరం మంచి మిత్రులం అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తమ సిద్ధాంతాలు ఒకే రకంగా ఉంటాయా అన్నది రజనీ చేయబోయే వ్యాఖ్యలు, నిర్ణయాలపై ఆధారపడి ఉందన్నారు. మార్పు జరుగుతుందని ఆశిద్దామని, ఆయనతో రహస్యాలు ఏవీలేవు అని, బహిరంగంగానే రజనీకి తాను ఆహ్వానం పలికేశానని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బహిరంగంగానే మళ్లీ పిలుస్తున్నానని, తన కూటమిలోకి రావాలంటూ చమత్కరించారు. టార్చ్‌లైట్ చిహ్నం కోసం ప్రయ త్నాలు చేస్తున్నారని, దక్కుతుందని భావిద్దామన్నారు. మక్కల్ నీది మయ్యం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అన్నది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ, అందుకు తగ్గ పరిస్థితుల కోసం వేచి చూద్దామన్నారు. ఎంజీఆర్ కలను సాకారం చేయగలిగితే, ఆయనకు తానే వారసుడ్ని అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వదులుకోను.. టార్చ్‌లైట్ చిహ్నం కోసం మక్కల్ నీది మయ్యం ఈసీని అభ్యర్థించేందుకు సిద్ధమైంది. ఈ చిహ్నంను వదులుకునే ప్రసక్తే లేదని ఎంజీఆర్ మక్కల్ కట్చి నేత విశ్వనాథన్ తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆ పార్టీ కన్నా ముందే, తాము సంఘంగా ఉన్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేశామని, ఇప్పుడు రాజకీయపార్టీగా నమోదు చేసుకున్నామని గుర్తు చేశారు. తమకు టార్చ్‌లైట్ చిహ్నంను ఎన్నికల కమిషన్ కేటాయించిందని, కమల్ వచ్చి అభ్యర్థించినా, ఆ చిహ్నంను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఆశ.. స్టార్లు అందరూ రాజకీయపార్టీలపై దృష్టిపెట్టడంతో నటుడు పార్థిబన్లోనూ ఆశలు చిగురించినట్టున్నాయి. పుదుచ్చేరిలో జరిగిన ఒత్త సెరుప్పు చిత్ర అవార్డు కార్యక్రమంలో పార్థిబన్ తన మదిలో మాటను బయటపెట్టారు. అందరూ రాజకీయపార్టీలు పెట్టేస్తున్నారని, విజయ్ కూడా పెట్టేస్తాడేమో అని పేర్కొంటూ, తాను ఓ రాజకీయపార్టీ పెట్టా లన్న ఆశతో ఉన్నట్టు, భవిష్యత్తులో ఇది జరుగుతుందేమో ఆ పార్టీకి పుదియపాదై అని పేరు పెట్టనున్నట్టు ప్రకటించారు. దీంతో చప్పట్లు మార్మో గాయి. చివరకు దీనిని సీరియస్‌గా తీసుకోకూడదని, కేవలం కామెడీ అంటూ ముగించారు. తన కుమార్తె రాజకీయాల్లోకి వస్తే, ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తానంటూ నటుడు సత్యరాజ్ ఓ మీడి యా ప్రశ్నకు సమాధానం ఇవ్వడం గమనార్హం. -
9 మంది పోలీసులపై సీబీఐ చార్జిషీట్
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకులు జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేసింది. సత్తాన్‌కులం పోలీస్ స్టేషన్ హౌజ్ ఇన్చార్జ్ సహా తొమ్మిది మంది పోలీసుల పేర్లను అభియోగపత్రంలో చేర్చింది. ఎస్ శ్రీధర్, కె.బాలకృష్ణ, పి.రఘుగణేష్, ఏఎస్ మురుగన్, ఎ. సమదురై, ఏఎమ్ ముత్తురాజ, ఎస్. చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, ఎస్.వేల్‌ముత్తు తదితరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు మధురై కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేసింది. ఈ కేసులో అరెస్టైన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై ఇటీవలే కరోనాతో మృతి చెందినట్లు సీబీఐ వెల్లడించింది. (చదవండి: ‘కొడుకు ఒంటిపై 13, తండ్రి శరీరంపై 17 గాయాలు’) కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సత్తాన్‌కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో జూలై 7న సీబీఐ రెండు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఇక కస్టడీ డెత్ కేసులో అరెస్టైన సత్తాన్‌కుళం పోలీసు స్టేషను అధికారులు ముత్తురాజ్ మరుగన్, థామస్ ఫ్రాన్సిస్ బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఇటీవల మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం ఎదుట హాజరైన సీబీఐ అధికారులు, పదునైన గాయాల కారణంగానే మృతి చెందినట్లు పేర్కొంది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం బెనిక్స్ ఒంటిపై 13 గాయాలు, జయరాజ్ శరీరంపై 17 గాయాలు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. తాజాగా తొమ్మిది మంది పేర్లను చార్జిషీట్లో చేర్చింది. -
‘అమ్మా, అప్పా.. అలసిపోయా.. క్షమించండి’
చెన్నై: ‘‘నేను మెడికల్ సీటు సాధించకపోతే .. ఇన్నాళ్లు పడిన శ్రమంతా వృథా అయిపోతుంది. నన్ను క్షమించండి. నేను అలసిపోయాను. పరీక్ష కోసం బాగానే చదివాను. కానీ నాకు భయంగా ఉంది. నా కోసం ఎవరినీ నిందించవద్దు. సారీ అప్పా, అమ్మా’’ అంటూ ఓ విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)లో ఉత్తీర్ణత సాధించలేననే భయంతో ప్రాణాలు తీసుకుంది. ఈ మేరకు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాయడంతో పాటుగా.. చనిపోవడానికి ముందు ఓ వీడియోను రికార్డు చేసింది. పరీక్షకు ఒకరోజు ముందు కూతురు ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన మురుగసుందరం సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కుటుంబంతో కలిసి మధురైలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె జ్యోతి శ్రీదుర్గ 2019లో క్లాస్ 12లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. గత కొన్ని రోజులుగా నీట్ పరీక్ష కోసం సన్నద్ధమవుతోంది. (చదవండి: ‘నా తమ్ముడి జీవితం నాశనం చేశారు’) ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన జ్యోతి శ్రీదుర్గ శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, పాస్ అవుతానో లేదోనన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా అరియలూర్ చెందిన విగ్నేష్ అనే విద్యార్థి సైతం నీట్ పరీక్షకు సిద్ధమవుతూ ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. ఇక ఈ వరుస ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పళనిస్వామి దయచేసి విద్యార్థులెవరూ ఒత్తిడికి లోనుకావద్దని, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక మూడేళ్ల క్రితం అనిత అనే మెరిట్ విద్యార్థిని సైతం ఇదే తరహాలో ఆత్మహత్యకు పాల్పడటం తమిళనాట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో నీట్ పరీక్ష నిర్వహణను వాయిదా వేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో.. మహమ్మారి కారణంగా విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరం కోల్పోరాదన్న సుప్రీంకోర్టు.. నిబ్బందనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబరు 13న నిర్వహించే నీట్ పరీక్షలకు మార్గం సుగమమైన విషయం తెలిసిందే. ఇక జేఈఈ మెయిన్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి కొనసాగున్న విషయం విదితమే. -
సంపూర్ణ లాక్డౌన్, రోడ్ల మీదకు జనాలు
సాక్షి , చెన్నై: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు చెన్నై, కోయంబత్తూరు, మధురై జిల్లాల్లోని నగరాలు, పట్టణాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు సేలం, తిరుప్పూర్‌లో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఆయా రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్డౌన్ అమల్లో కానుంది. కాగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే నాలుగు రోజుల సంపూర్ణ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు కిరాణా, కూరగాయలు, నిత్యావసరాల కోసం క్యూలు కట్టారు. శనివారం ఉదయం నుంచే జనాలు పెద్ద ఎత్తున నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో షాపుల వద్ద ప్రజల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రభుత్వం ఓ వైపు భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నా... జనాలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వేలాదిగా తరలి వచ్చారు. ఇదిలా ఉండగా శుక్రవారం 72 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,755కి పెరిగింది. అలాగే మరో ఇద్దరు మృతితో మరణాల సంఖ్య 22కి చేరుకుంది. (కరోనా : ప్రాణం తీసిన అభిమానం ) వీరికి మాత్రమే మినహాయింపు.. ఆసుపత్రులు, వైద్య పరిశోధనలు, అంబులెన్స్, శ్మశానశకటాలకు మినహాయింపు ఉంటుంది. అలాగే అత్యవసర విధులు నిర్వర్తించే సచివాలయ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, పోలీస్, తాగునీరు, విద్యుత్ శాఖల సిబ్బంది, రెవెన్యూ, ప్రకృతి విపత్తుల సహాయ బృందాలు, ఆవిన్ సిబ్బంది పనిచేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో అత్యవసర విధుల్లో ఉండే 33 శాతం సిబ్బందికి మాత్రమే అనుమతి. అమ్మాక్యాంటీన్లు, ఏటీఎం సెంటర్లు యథావిధిగా పనిచేస్తాయి. హోం డెలివరీ చేసే రెస్టారెంట్లకు అనుమతినిచ్చారు. (లాక్డౌన్ ఉల్లంఘించిన వారికి కరోనా సినిమా) వృద్ధులు, దివ్యాంగులు, అనాధలకు సేవలందించేవారికి సైతం తగిన అనుమతితో మినహాయింపు ఉంటుంది. కోయంబేడు వంటి హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లు, సంతలు వారికి సూచించిన ఆంక్షలకు కట్టుబడి నిర్వహించాల్సి ఉంటుంది. కూరగాయలు, పండ్ల మొబైల్ వాహనాలను అనుమతిస్తారు. కాగా తమిళనాట మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సూచించిన విషయం తెలిసిందే. వైద్య పరంగా మరింత మెరుగైన చర్యలను విస్తృతం చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. చెన్నైలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా కేంద్రం నుంచి ప్రత్యేక బృందం వస్తుందన్ని పేర్కొన్నారు. (రోడ్ల మీద తిరుగుతున్న కరోనా) -
టీషర్ట్స్ దాచి అడ్డంగా దొరికిపోయాడు
టీ.నగర్ : తిరుపూర్ సమీపంలో తాను పనిచేస్తున్న ఓ కంపెనీ నుంచి వేల రూపాయల విలువైన టీ షర్ట్‌లను దుస్తుల్లో దాచి చోరీ చేసిన వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. తిరుపూర్ జిల్లా పెరుమానల్లూర్ సమీపంలోని నేతాజీ అపేరెల్ పార్క్‌లో అనేక ఎక్స్పోర్ట్ బనియన్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. వీటిలో బయటి రాష్ట్రాలకు చెందిన అనేకమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులోని ఒక ఎక్స్పోర్ట్ సంస్థలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన కార్మికుడు ఒకడు పనిచేస్తున్నాడు. కాగా ఈ ఘటన జరిగిన రోజున ఆ వ్యక్తి తన విధులు ముగించుకుని కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో గేట్ వద్ద ఉన్న వాచ్‌మన్‌కు అతనిపై అనుమానం ఏర్పడింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానం చెప్పాడంతో వాచ్‌మన్ అతని వద్ద తనిఖీలు జరిపాడు. తను వేసుకున్న షర్ట్ లోపల టీషర్టులను ధరించినట్లు గుర్తించాడు. ప్యాంట్లో కూడా కొన్ని షర్ట్‌లను దాచుకున్నాడు. ఈ విధంగా మొత్తం 40 టీషర్ట్లను దాచినట్లు తెలిసింది. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న సంస్థ నిర్వాహకులు కార్మికుడిని హెచ్చరించి, ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
అది రజనీకి మాత్రమే సాధ్యం..
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి కుమారుడు అళగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వ లోటు ఉందని, ప్రజలను ఆదుకునేందుకు ఓ నాయకుడు కావాలని అన్నారు. అది సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మాత్రమే సాధ్యమని ఆళగిరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడూతూ.. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విపక్ష నేతగా విఫలమయ్యారని విమర్శించారు. అలాగే ప్రజల సమస్యలపై అన్నాడీఎంకే ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయ సంక్షోభం దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని, ఈ దశలోనే రజనీకాంత్ లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ముందుండు నడిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉందన్నారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అళగిరిని డీఎంకే నుంచి కరుణానిధి బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే కరణానిధి మరణాంతరం తిరిగి డీఎంకే పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే రాజకీయంగా నిలదొక్కుకున్న స్టాలిన్ ఆళగిరిని పార్టీ నీడ కూడా తాకనీయలేదు. అయితే అళగిరి బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో బుధవారం భేటీ అయిన ఆయన.. రజనీ గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాగా రజనీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ అవేవీ నిజం కాలేదు. -
రైల్వే స్టేషన్లు, ఆలయాలు పేలుస్తాం
చండీగఢ్ : దేశమంతా దసరా ఉత్సవాల్లో మునిగిపోయిన వేళ నరమేధం సృష్టించేందుకు సిద్ధమైనట్లు ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ప్రకటన విడుదల చేసింది. మసూద్ అహ్మద్ అనే పేరిట రాసిన లేఖలో.... దసరా సందర్భంగా ఆరు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడనున్నట్లు పేర్కొంది. సదరు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లతో పాటు జన సమ్మర్థంతో ఉండే ఆలయాల్లో కూడా బాంబు దాడులకు తెగబడతామని తెలిపింది. అక్టోబర్ 8న హర్యానాలోని రోహతక్ రైల్వే స్టేషనుతో పాటు... ముంబై సిటీ, బెంగళూరు, చెన్నై, జైపూర్, భోపాల్, కోటా, ఇటార్సీ రైల్వే స్టేషన్లను పేల్చివేస్తామని జైషే లేఖలో హెచ్చరించింది. అదే విధంగా రాజస్తాన్, జైపూర్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు ఆలయాల్లో కూడా పేలుళ్లకు పాల్పడతామని పేర్కొంది. ఈ మేరకు జైషే రాసిన లేఖ... రోహతక్ రైల్వే జంక్షన్ సూపరిండెంటెండ్ కార్యాలయానికి శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోస్టు ద్వారా చేరుకుంది. పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి మసూద్ అహ్మద్ పేరిట వచ్చిన ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లేఖలో పేర్కొన్న ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక పదే పదే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ సైనికులకు భారత సైన్యం తగిన రీతిలో జవాబిస్తున్నా వారి వైఖరి మాత్రం మారడం లేదు. భారత్‌లో సంప్రదాయ యుద్ధం జరిగితే ఓడిపోతామని అంగీకరించిన పాక్...ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు ఉగ్రవాదుల సహాయం తీసుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇదేం చర్య?!
న్యాయస్థానాల హితబోధలు, మందలింపుల మాటెలా ఉన్నా దేశంలో స్పీకర్ల వ్యవస్థ పెద్దగా మారిందేమీ లేదని మరోసారి రుజువైంది. తమిళనాడులో టీటీవీ దినకరన్‌కు చెందిన అన్నా డీఎంకే వర్గం ఎమ్మెల్యేలు 18మందిని అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ ధన్పాల్ సోమవారం తీసుకున్న నిర్ణయం అత్యంత వివాదా స్పదమైనది. విచారకరమైనది. పళనిస్వామి ప్రభుత్వం బల పరీక్షకు రాష్ట్ర హైకోర్టు విధించిన గడువుకు రెండు రోజుల ముందు తీసుకున్న ఈ చర్యలోని అంతరా ర్ధమేమిటో సుస్పష్టమే. దినకరన్ వర్గం ఎమ్మెల్యేల వేరు కుంపటి కారణంగా పళని స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. దాన్ని కాపాడటం కోసమే స్పీకర్ ఈ చర్యకు ఉపక్రమించారు. నిజానికి ఇలాంటి ప్రమాదాన్ని ఊహించబట్టే తక్షణం బల పరీక్షకు ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు కోరారు. ఆయన ఈ విషయమై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తుండటాన్ని గమనించి మద్రాస్ హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నెల 20 వరకూ ఎలాంటి బలపరీక్ష జరపరాదని కోర్టు స్టే విధించింది. ఈ ఆదేశం వల్ల దినకరన్ వర్గానికి ఒరిగిందేమీ లేకపోగా స్పీకర్‌కు తగినంత సమయం చిక్కింది. దాన్ని వినియోగించుకుని ఆయన పళనిస్వామి ప్రభుత్వాన్ని కాపాడారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకుని తగినంత సంఖ్యాబలాన్ని సాధించు కున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సర్వసాధారణం. అనుకోని పరిణా మాలు సంభవించి ఆ పార్టీ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దాని బలాబలాలు తేలాల్సింది చట్టసభలోనే. అక్కడ ఎవరికీ తగినంత బలం లేదని తేలిన పక్షంలో అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించడమే సబబు. ఎస్ఆర్ బొమ్మై కేసులో చరిత్రాత్మకమైన తీర్పునిస్తూ ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్ట సభల్లో తప్ప రాజ్భవన్లలో కాదని సుప్రీంకోర్టు ఎన్నడో స్పష్టం చేసింది. అయినా అడపా దడపా ఏదో రకమైన సాకుతో ప్రభుత్వాలను పడగొట్టడం ఆగలేదు. అలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని సరిదిద్దుతూనే ఉన్నాయి. ఈ దుస్సంప్రదాయాన్ని ప్రారంభించిందీ, యథేచ్ఛగా కొనసాగించిందీ కాంగ్రెసే అయినా... ఆ తర్వాత వచ్చిన ఇతర పార్టీలు కూడా అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని ఉపయోగిస్తూనే వచ్చాయి. తమిళనాడులో ఇప్పుడు నెలకొన్న పరిస్థితి విచిత్రమైనది. నిరుడు మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ఘన విజయం సాధించి వరసగా రెండోసారి అధికారంలోకొచ్చింది. కానీ మూడు నెలలు గడవ కుండానే జయ అనారోగ్యం బారినపడ్డారు. గత డిసెంబర్ 5న కన్నుమూశారు. ఆ తర్వాత నుంచి తమిళనాడు రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఆమె తర్వాత వచ్చిన పన్నీర్‌సెల్వం చాలా త్వరలోనే రాజీనామా చేయడం, శాసనసభా పక్ష నేతగా శశికళ పేరు ప్రతిపాదించడం, ఆ తర్వాత తిరుగుబాటు చేయడం చకచకా జరిగిపోయాయి. సీఎంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన శశికళ అవినీతి కేసులో జైలుపాలు కావడంతో ఆమె ఆశీస్సులతో పళనిస్వామి సీఎం పదవి చేపట్టారు. శశికళ మేనల్లుడు దినకరన్ రంగ ప్రవేశం చేశాక పళనిస్వామి కూడా ఆమెకు దూరమయ్యారు. అప్పటినుంచి పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాలని దినకరన్ ప్రయత్నిస్తున్నారు. ఆయన శిబిరంలో 19మంది ఎమ్మెల్యేలున్నారు. పన్నీర్‌సెల్వం పళనిస్వామి వర్గాలు చేతులు కలిపాక వారి బలం 111. 234మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వానికి కావలసిన కనీస సంఖ్యాబలం 117. విపక్షాల బలం 98. వీరితో దినకరన్ వర్గం జతగూడితే పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుంది. పరి స్థితి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు బలపరీక్షలో జాప్యం ఎందుకు జరగాలి? ఒకపక్క దినకరన్ బలవంతంగా ఎమ్మెల్యేలను తన శిబిరంలో ఉంచుకున్నారని పళనిస్వామి ఆరోపిస్తున్నారు. అలాంటపుడు ఓటింగ్‌కు ఆయన ఎందుకు సిద్ధపడలేకపోయారు? ఆయన తప్పించుకు తిరుగుతున్నారు సరే... దానికి గవర్నర్ సహకరించ డంలోని అంతరార్ధం ఏమిటి? కనీసం ఈ వ్యవహారం తన ముందుకొచ్చినప్పుడు మద్రాస్ హైకోర్టయినా వెనువెంటనే బలపరీక్షకు ఆదేశించి ఈ నాటకానికి తెరదిం చాల్సింది. లేదా బలపరీక్ష లోపు ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయరాదన్న తాత్కాలిక ఆదేశాలైనా ఇవ్వాల్సింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు పోను అసెం బ్లీలో ఇప్పుడున్న సభ్యుల సంఖ్య 215. పర్యవసానంగా ప్రభుత్వానికి కావలసిన కనీస మెజారిటీ 108 అయింది. కనుక పళనిస్వామి ప్రభుత్వం గట్టెక్కడం పెద్ద కష్టం కాదు. కానీ ఇది ఆరోగ్యకరమైన పోకడేనా? అనర్హత వేటు చట్టబద్ధతను ఇప్పుడు ఎటూ దినకరన్ వర్గం న్యాయస్థానంలో సవాల్ చేస్తుంది. కానీ సంక్షోభం ఏర్పడినప్పుడు దానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలన్న ఆత్రుత ఎవరిలోనూ లేకపోవడం విచారకరం. ఆమధ్య పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య పోటీ ఏర్పడినప్పుడు రోజుల తరబడి రెండు వర్గాలూ శిబిరాలు నడిపాయి. మళ్లీ ఇప్పుడు దినకరన్ వర్గం ఆ పనే చేసింది. ఇందువల్ల చట్టసభలపై, మొత్తంగా ప్రజాస్వామ్యంపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. పాలన కుంటుబడుతుంది. అధికారం ఎవరికుంటుంది, ఎవరికి పోతుందన్నది ప్రధానం కాకూడదు. ఏర్పరుచుకున్న నిబంధనలు అమ లయ్యేలా చూడటం, వ్యవస్థలు నవ్వులపాలు కాకుండా చూడటం ప్రధానం. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలతో తమకు సంబంధం లేదని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ చెబుతోంది. అది నిజమే కావొచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. కానీ రాష్ట్రంలో పాలన కుంటుబడినప్పుడు, సంక్షోభం ఎడతెగకుండా సాగుతున్నప్పుడు దాన్ని చక్క దిద్దాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? ఇప్పటికైనా తమిళనాట సంక్షోభానికి అర్ధవంతమైన ముగింపు పలకాలి. పళనిస్వామి సర్కారు మనుగడ కన్నా అక్కడ ప్రజాస్వామ్యం పదిలంగా ఉండటం అవసరమన్న స్పృహ అందరిలోనూ ఏర్పడాలి. -
‘తలైవా’ వస్తున్నారు!
- ఇక రాజకీయంగా ఇక, అడుగులు - త్వరలో అధికారిక ప్రకటన: అర్జున్ సంపత్ వ్యాఖ్య - రజనీతో భేటీ సాక్షి, చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటంపై తమిళనాట చర్చ ఊపందుకుని ఉన్న విషయం తెలిసిందే. రజనీ రాజకీయంగా అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా ‘కాలా’ సినిమా షూటింగ్ నుంచి కాస్త విరామం దొరకడంతో తలైవా మళ్లీ రాజకీయ అంశాలపై దృష్టి కేంద్రీకరించారని తెలుస్తోంది. ఇందుకు అద్దంపట్టే విధంగా ఆదివారం అన్నదాతలతో భేటీ అయ్యారు. సోమవారం రజనీ హిందూ మక్కల్ కట్చి నేతలతో భేటీ అయ్యారు. మార్పు తలైవాతోనే సాధ్యం! రజనీ రాజకీయ అరంగ్రేటానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారి నోళ్లకు తాళం వేసేవిధంగా హిందూ మక్కల్ కట్చి నేతలు గళం విప్పారు. రజనీకి భద్రత కల్పించాలంటూ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్‌కు రజనీకాంత్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్, ప్రధాన కార్యదర్శి రామ్ రవికుమార్, యువజన ప్రధాన కార్యదర్శి గురుమూర్తితో పాటుగా పలువురు పోయెస్ గార్డెన్‌కు వెళ్లి.. రజనీకాంత్‌ను కలిశారు. రాజకీయాల్లోకి రావాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు తలైవా తనదైన స్టైల్లో చిరునవ్వుతో సమాధానం ఇచ్చినట్టు హిందూ మక్కల్ కట్చి వర్గాలు తెలిపాయి. ఈ భేటీ అనంతరం మీడియాతో అర్జున్ సంపత్ మాట్లాడుతూ, ‘తలైవా వస్తారు.. రావడం తథ్యం. త్వరలో అధికారిక ప్రకటన’ అని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన సిద్ధం అవుతున్నారని, మార్పు తలైవాతోనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కొత్త పార్టీని ప్రకటించే కసరత్తుల్లో ఉన్నట్టున్నారని, రాజకీయంగా సింహం.. సింగిల్‌గా ప్రభంజనం సృష్టించడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. డిసెంబర్ 12న కొత్తపార్టీ ప్రకటిస్తారా? అని ప్రశ్నించగా చిరునవ్వుతో రజనీ సమాధానం ఇచ్చారని తెలిపారు. తమ మద్దతు రజనీకి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అయితే, ఈ భేటీలో ఎలాంటి రాజకీయం లేదని, వాళ్లంతట వాళ్లే వచ్చి రజనీతో మర్యాదపూర్వకంగా కలిశారని తలైవా సన్నిహితులు పేర్కొనడం గమనార్హం. -
తమిళ సంక్షోభం కాంగ్రెస్‌కు తగిలింది
చెన్నై: సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిందన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం ఏఐఏడిఎంకేలో శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య ఏర్పడిన సంక్షోభం కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు దారితీసింది. ఇరువురిలో ఎవరికి మద్దతివ్వాలన్న అంశంపై రాష్ట్ర అసెంబ్లీలో ఎనిమిది మంది సభ్యులు గల రాష్ట్ర కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునవుక్కరసర్ బహిరంగంగా శశికళకు మద్దతు ప్రకటించడం పట్ల ఎమ్మెల్యేలు సహా పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు విభేదిస్తున్నారు.ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి శశికళను ఆహ్వానించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును తిరునవుక్కరసర్ విమర్శించడంతో ఎనిమిది మంది కాంగ్రెస్ శాసన సభ్యుల్లో ఆరుగురు విభేదించినట్లు రాష్ట్రానికి చెందిన మాజీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడొకరు తెలియజేశారు. రాష్ట్రంలో డీఎంకేతోని కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ అనుబంధం ఉన్నప్పుడు ఏఐడీఎంకేలో ఓ పక్షానికి మద్దతు ఎలా ఇస్తామంటూ గురువారం జరిగిన రాష్ట్ర పార్టీ సమావేశంలో కొంత మంది ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్లు తెల్సింది. పైగా శశికళను ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించారట. పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు రెండుగా చీలిపోయినప్పుడు ఒక పక్షం వహించక తప్పదన్న అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తం అయినట్లు తెల్సింది. ఇరువురు మధ్య బలపరీక్ష జరిగినట్లయితే సభా విశ్వాసం కోసం 117 సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయ పరిణామాలను రాహుల్ గాంధీతో చర్చించేందుకు తిరునవుక్కరసర్ శుక్రవారం బయల్దేరి ఢిల్లీ వెళ్లినట్లు తెల్సింది. ఆయన విద్యాసాగర్ రావును విమర్శించిన నేపథ్యంలోనే కేంద్ర కేంగ్రెస్ కమిటీ కూడా గవర్నర్ పాత్రను విమర్శించింది. కేంద్రంలోని బీజేపీ జోక్యం కారణంగానే తమిళనాడు ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడిందని కూడా ఆరోపించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకు గవర్నర్ నిరీక్షించాలంటూ చిదంబరం విజ్ఞప్తి చేయడం ద్వారా భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ.రామచంద్రన్ చనిపోయినప్పుడు ఇలాంటి సంక్షోభమే ఏర్పడగా, అప్పడు ఏఐఏడిఎంకేలో ఉన్న తిరునవుక్కరసర్, జయలలిత పక్షం వహించారు. ఆ తర్వాత ఆయనకు జయలలితతో విభేదాలు రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న తమిళ రాజకీయాలపై రాహుల్‌తో చర్చించి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పన్నీర్ సెల్వం, శశికళలలో గవర్నర్ ఎవరిని బలపరీక్షకు పిలిచినా విమర్శించే అవకాశం కాంగ్రెస్‌కు ఎలాగు ఉంటుంది. -
'తమిళనాడు ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయాలి'
ఢిల్లీ: విద్యార్థులు తమిళంలోనే పరీక్షలు రాయాలని తమిళనాడు ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తప్పుపట్టారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఇతర భాషల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆయన తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని కోరిన ఆయన దీనిపై ఈ నెల 23న జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. -
తమిళనాడులో ఐఎస్ కలకలం
చెన్నై: ఐఎస్ తీవ్రవాద ముఠాలో చేరేందుకు తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు టూరిస్ట్‌వీసా ముసుగులో బయలుదేరి కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు పట్టుబడడం రాష్ట్రంలో కలకలం రేపింది. చెన్నై రాయపేటకు చెందిన 23 ఏళ్ల బీకాం పట్టభద్రుడు, కరూరు జిల్లాలో పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేసిన మరో 22 ఏళ్ల యువకుడు ఐఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇంటర్నెట్ ద్వారా ఐఎస్ తీవ్రవాదులను ఎలా సంప్రదించాలో వీరిద్దరూ తెలుసుకున్నారు. ఉద్యోగ వేట కోసం బెంగళూరుకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి ఇళ్లు వదలిపెట్టారు. కొందరి సూచనల మేరకు ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరు నుంచి దుబాయ్‌కి, అక్కడి నుంచి టర్కీకి చేరుకున్నారు. నేరుగా సిరియాకు వెళితే అనుమానం వస్తుందని జాగ్రత్తను పాటించి టూరిస్టు వీసాపై టర్కీ, మలేషియా, దుబాయ్ తదితర దేశాల మీదుగా ప్రయాణాన్ని ఖరారుచేసుకున్నారు. 15 రోజుల క్రితం వీరు టర్కీకి చేరుకోగా ఆ దేశంలో వీరి కదలికలను అనుమానించిన అక్కడి అధికారులు పదిరోజుల క్రితం తిరిగి బెంగళూరుకు పంపివేశారు. కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు వీరిద్దర్నీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారించారు. భవిష్యత్తు ఐఎస్దే, ఐఎస్ త్వరలో ప్రపంచాన్ని ఏలబోతోంది, అందుకే ఐఎస్ పట్ల ఆకర్షితులమైనాం, ఐఎస్‌లో చేరడం ద్వారా తాము కూడా ప్రపంచాన్ని శాసించవచ్చు అంటూ తమలో దాగిన కోర్కెను పోలీసుల ముందు బైటపెట్టారు. ఇద్దరు యువకులకు గట్టిగా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలివేసినట్లు సమాచారం. అయినా మొత్తం ఈ వ్యవహారం వెనుక మరేదైనా కుట్రదాగి ఉందా అనే కోణంలో కూడా విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది.