ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ ఓలా కీలక ప్రకటన చేసింది. త్వరలో ఓలా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని ఆ సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ ప్రకటించారు. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో మాట్లాడిన ఆయన..తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో న్యూ ఈవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తున్నారు. ఈ యూనిట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 25 వేల మందికి కొలువులు లభిస్తాయని తెలిపారు.
తద్వారా ప్రతి ఏటా సుమారు ఒక కోటి టూ వీలర్స్ తయారవుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ కోసం గతేడాది తమిళనాడు ప్రభుత్వంతో ఓలా ఎలక్ట్రిక్.. ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం ఓలా ఎలక్ట్రిక్ రూ.7000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా ఎనిమిది నెలల్లో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ యూనిట్ విజయవంతంగా నిర్మించుకున్నట్లు భవిష్ అగర్వాల్ తెలిపారు. వచ్చేనెల నుంచి ఈవీ స్కూటర్ల ఉత్పత్తి తయారవుతుందని అన్నారు.
గత జూన్‌లోనే తమిళనాడులో మెగా మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ సహకారంతో తమిళనాడు గిగా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు తెలిపింది. దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ లీడర్గా నిలిచింది. నవంబర్ నెలాఖరు నాటికి మొత్తం ఈవీ స్కూటర్ల విక్రయంలో ఓలా ఎలక్ట్రిక్ వాటా సుమారు 32 శాతం. గతేడాది నవంబర్ నాటికి దాదాపు 30 వేల ఈవీ స్కూటర్లను విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment