ప్రముఖ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ ఓలా ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించింది. ఈ సేల్‌లో ఓలా ఈవీ బైక్స్ హాట్‌కేకుల్లా అమ్ముడు పోయాయని ఆ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలపై భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 2022 ఫెస్టివల్ సీజన్‌తో పోల్చితే.. ఈ ఏడాది దసరా, నవరాత్రులలో ప్రతి పది సెకన్లకు ఒక ఓలా బైక్‌ను అమ్మినట్లు పేర్కొన్నారు. దీంతో 2022 కంటే ఈ ఏడాది 2.5 రెట్లు అమ్ముడు పోయినట్లు సంతోషం వ్యక్తం చేశారు.
Our sales have gone through the roof this Dussehra and Navratri! Selling a scooter every 10 seconds right now, and almost 2.5x of last year!😀
— Bhavish Aggarwal (@bhash) October 24, 2023
India’s EV moment is here this festive season!#endICEage
అందుబాటులో ఐదు మోడళ్లు
ఓలా దేశీయ మార్కెట్‌లో 5 మోడల్స్‌ను అమ్ముతుంది. గత ఆగస్ట్ నెలలో ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో జనరేషన్2, ఎస్1 ఎక్స్ పేరుతో మూడు వేరియంట్స్‌ను వాహనదారులకు పరిచయం చేసింది.
2030 నాటికి భారత్ లక్ష్యం ఇదే
2030 నాటికి భారతదేశం రోడ్ల పై ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తిరగాలని అప్పటి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2017లో ప్రకటించారు. అంతేకాదు, 2030 నాటికి దేశంలో 30 శాతం ప్రైవేటు కార్లు, 70 శాతం కమర్షియల్ వాహనాలు, 40 శాతం బస్సులు, 80 శాతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. తాజాగా, ఓలా సేల్స్ చూస్తుంటే భారత ప్రభుత్వ నిర్ధేశించిన లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
చదవండి👉 నెలకు రూ.70వేలు సంపాదించుకోవచ్చు.. ఓలా సీఈవో బంపరాఫర్
Comments
Please login to add a commentAdd a comment