
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ ధరల్ని రూ.25 వేల వరకు తగ్గించినట్లు వెల్లడించింది.
ఓలా ఎలక్ట్రిక్ సంస్థ వాహనదారులకు మొత్తం మూడు మోడళ్లపై ఈ భారీ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఓలా అఫిషియల్ వెబ్‌సైట్ ప్రకారం.. ఓలా ఎస్1 ఎక్స్ ప్రారంభ ధర రూ.79,999 (ఎక్స్ షోరూం ధర) ఉండగా, ఓలా ఎస్1 ఎయిర్ ప్రారంభ ధర రూ.1,19,999 (ఎక్స్ షోరూం ధర), ఓలా ఎస్1 ప్రో ప్రారంభ ధర రూ.1,29,999 (ఎక్స్ షోరూం) కే అందిస్తుంది.
You asked, we delivered! We’re reducing our prices by upto ₹25,000 starting today for the month of Feb for all of you!! Breaking all barriers to #EndICEage!
— Bhavish Aggarwal (@bhash) February 16, 2024
Valentine’s Day gift for all our customers 🙂❤️🇮🇳 pic.twitter.com/oKFAVzAWsC
వాహన్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనరిలో ఓలా సంస్థకు మొత్తం 31000 యూనిట్ల ఆర్డర్లు వచ్చాయి. ఈ మొత్తం 2023 డిసెంబర్ నెలలో 30000 యూనిట్లు ఉన్నాయని హైలెట్ చేసింది. కాగా, ఓలా సంస్థ ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో మార్కెట్ షేరు 40 శాతం ఉందని వాహన్ నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment