ఎలక్ట్రిక్ బైక్ వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ ఓలా బడ్జెట్ వేరియంట్ బైక్ ఎక్స్ ఎక్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. 4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్‌తో రూ.1.10లక్షలకే (ఎక్స్-షోరూమ్) ఈ బైక్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.
ఇక ఈ కొత్త వేరియంట్ బైక్‌కు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే చాలు 190 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు. ఛార్జింగ్ పెట్టేందుకు 6 గంటల 30 నిమిషాల సమయం పట్టనుంది. టాప్ స్పీడ్ 90 కేఎంపీఎహెచ్ వరకు ప్రయాణం చేయొచ్చని ఓలా యాజమాన్యం తెలిపింది.
ఈ కొత్త ఈవీ వేరియంట్‌తో పాటు, 8 ఏళ్ల వరకు ఎక్స్ టెండెండ్ వారెంటీని ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ సదుపాయం అన్నీ వాహనాలకు వర్తిస్తుంది. ఇందుకోసం వాహనదారులు రూ.5వేలు చెల్లించి 1,25,000 కిలోమీటర్ల వరకు పొడిగించుకునే అవకాశాన్ని ఓలా కల్పిస్తుంది.
బుకింగ్స్ ప్రారంభం ఎప్పుడంటే?
ఓలా ఎస్1 ఎక్స్ 4 కేడబ్యూహెచ్ డెలివరీలు ఏప్రిల్ నుండి ప్రారంభమవుతాయి. ఓలా ఎస్1 ఎక్స్ రెడ్ వెలాసిటీ, మిడ్‌నైట్, వోగ్, స్టెల్లార్, ఫంక్, పోర్సిలైన్ వైట్, లిక్విడ్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment