ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ ఓలా శుభవార్త చెప్పింది. భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓలా కస్టమర్ డే ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా బడ్జెట్ ధరలో ఓలా ఎస్ 1 ఎక్స్‌తో పాటు ఓలా ఎస్1 ప్రో జనరేషన్ 2 బైక్‌లను లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ఎక్స్ ధర రూ.79,000 (ఎక్స్ షోరూం) ఉండగా, ఓలా ఎస్ 1 ప్రో జనరేషన్ 2 ధర రూ.1.47 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంది
ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ఎక్స్‌ను మూడు వేరింట్లలలో అందిస్తుంది. ఎస్1 ఎక్స్ ప్లస్, 2కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీతో ఎస్1 ఎక్స్, 3కేడబ్ల్యూ హెచ్ బ్యాటరీతో ఎస్1 ఎక్స్‌ను అందిస్తుంది. ఈ వేరియంట్‌లలో టాప్ ఆఫ్ ది లైన్ మోడల్‌తో ఎక్స్ ప్లస్ 5.0 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఎక్స్ మోడల్‌లు 3.5 అంగుళాల డిస్‌ప్లేతో వస్తాయి. కానీ రెండింటి పనితీరు ఒకేలా ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్
కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఓలా సంస్థ వెహికల్ బాడీ తయారీ కోసం బ్లాక్ ప్లాస్టిక్‌ను ఉపయోగించింది. ఇక, ఎస్1 ఎక్స్ ప్లస్, ఎస్1 ఎక్స్3 రెండూ 6 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్‌తో 3కేడబ్ల్యూహెచ్ ఛార్జర్‌తో వస్తున్నాయి. ఈ రెండు వేరియంట్ల రేంజ్ 151 కిలోమీటర్లు కాగా, టాప్ స్పీడ్ 90 కేఎంపీఎంహెచ్‌తో డ్రైవ్ చేయొచ్చు. 3.3 సెకండ్లలో 0 నుంచి 40కేఎంపీహెచ్ వరకు వెళుతుంది. ఓలా ఎస్1 ఎక్స్2 6కే డబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటర్‌తో 2కేడబ్ల్యూ బ్యాటరీ ఛార్జర్‌ను అందిస్తుంది. లోయర్ రేంజ్ స్పీడ్ 91కేఎం, లోయర్ టాప్ స్పీడ్‌తో 85కేఎంపీహెచ్‌తో వెళ్లొచ్చు.
కేవలం రూ.999 చెల్లించి
ఆగస్ట్ 15 పర్వదినాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ 21 వరకు పరిచయ ఆఫర్‌ను పొందవచ్చు. ఇందులో భాగంగా ఓలా ఎస్1 ఎక్స్‌ప్లస్‌ను రూ.99,999కే సొంతం చేసుకోవచ్చు. డెలివరీలు సెప్టెంబర్ నుంచి మొదలు కానున్నాయి. ఎస్1ఎక్స్3, ఎస్1 ఎక్స్2 ప్రీ రిజర్వేషన్ కోసం కేవలం రూ.999 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎస్1 ఎక్స్3 వెహికల్ ధర రూ.89,999 ఉండగా, ఎస్1 ఎక్స్2 ధర రూ.79,999గా ఉంది. కేవలం ఈ ఆఫర్ నేటి నుంచి మరో ఆరు రోజులు మాత్రమే ఉంది.
టాప్ స్పీడ్ 120 కేఎంపీహెచ్
ఓలా ఎస్1 ఎయిర్ జనరేషన్ 2ను లాంచ్ చేసింది. బ్యాటరీని రీడిజైన్ చేసి విడుదల చేయడంతో వెహికల్ పనితీరు అద్భుతంగా ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు పవర్‌ట్రయిన్‌లో మార్పులు చేసి 11 డబ్ల్యూ మోటార్‌ను డిజైన్ చేసింది. దీంతో ఎస్1 ప్రో జనరేషన్ 2 ‘0 నుంచి 40 కేఎంపీహెచ్ వేగాన్ని కేవలం 2.6 సెకన్లలో అధిగమించవచ్చు. టాప్ స్పీడ్ 120 కేఎంపీహెచ్.
పరిధి 195 కిలో మీటర్లుగా ఉంది. ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, వెనుకవైపు మెరుగైన మోనోషాక్ ఉన్నాయి. ఇది స్కూటర్ 6 కిలోల బరువు తగ్గడానికి సహాయపడింది. కొత్త ఓలా ఎస్ ప్రో జనరేషన్ 2 ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, పరిచయ) ధరలతో సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది.
అదరగొట్టేస్తున్న ఓలా బైక్‌లు
ఈ సందర్భంగా ఓలా మరికొద్ది రోజుల్లో నాలుగు ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేస్తామని ప్రకటించింది. డైమండ్ హెడ్, అడ్వెంచర్, రోడ్‌స్టర్, క్రూయిజర్ పేరిట వావ్ అనిపించేలా ఉన్న కాన్సెప్ట్ బైక్స్‌ను ప్రదర్శించింది. 2024 చివరికల్లా మార్కెట్‌కు పరిచయం చేయనుంది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో సైతం ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను అమ్మాలని ఓలా ఎలక్ట్రిక్ భావిస్తోంది.
చదవండి👉 ఇదేందయ్యా..ఇది నేను చూడలా.. ‘ఓలా’ ఎలక్ట్రిక్ స‍్కూటర్ వైరల్!
Comments
Please login to add a commentAdd a comment