ప్రస్తుతం దేశమంతా పండుగ సీజన్ నడుస్తోంది. ఈ ఉత్తేజకరమైన సమయంలో మీరు బైక్ కొనాలనుకుంటున్నారా? అది కూడా మంచి రేంజ్, స్పీడ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్‌ల చూస్తున్నారా? అయితే మీ కోసమే రయ్‌మంటూ దూసుకెళ్లే టాప్10 లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ల సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం.
రివోల్ట్ ఆర్‌వీ400 బీఆర్‌జెడ్
రివోల్ట్ ఆర్‌వీ400 బీఆర్‌జెడ్ (Revolt RV400 BRZ) భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌గా ప్రసిద్ధి చెందింది. అధిక పనితీరు, సొగసైన డిజైన్, ఉత్తమ ఫీచర్లను కలిగి ఉంది. రివోల్ట్ ఆర్‌వీ400 బీఆర్‌జెడ్ లాంచ్‌తో కంపెనీ ఇటీవలే ఆర్‌వీ400ని అప్‌డేట్ చేసింది. దీని రేంజ్ 150 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్లు. ప్రారంభ ధర రూ.1.09 లక్షలు.
ఓలా రోడ్‌స్టర్ ప్రో
ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే ఓలా రోడ్‌స్టర్ సిరీస్ విడుదలతో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇది అత్యుత్తమ రేంజ్, పనితీరు, ఫీచర్లను అందిస్తుంది. విడుదల చేసిన మోడళ్లలో టాప్-ఎండ్ వేరియంట్, ఓలా రోడ్‌స్టర్ ప్రో (Ola Roadster Pro). దీని ప్రారంభ ధర రూ.1,99,999. అత్యధిక రేంజ్ 579 కిలో మీటర్లు. టాప్ స్పీడ్ 194 కిలో మీటర్లు.
రివోల్ట్ ఆర్‌వీ1, ఆర్‌వీ1+
ఇటీవల రివోల్ట్ మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కమ్యూటర్ మోటార్‌సైకిల్స్ రివోల్ట్ ఆర్‌వీ1, ఆర్‌వీ1+ (Revolt RV1 and RV1+)లను విడుదల చేసింది. ఆర్‌వీ1, ఆర్‌వీ1 ప్లస్ ఇప్పుడు దేశ మొట్టమొదటి కమ్యూటర్ మోటార్‌సైకిళ్లుగా నిలిచాయి. బేస్ మోడల్ ధర రూ. 84,990, ప్లస్ వెర్షన్ రూ. 99,990 (ఎక్స్-షోరూమ్). టాప్ రేంజ్ 160 కిలో మీటర్లు.
ఒబెన్ రోర్
బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తయారు చేసిన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్ (Oben Rorr). ఇది ఒక పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్. స్టైలిష్ నియో-క్లాస్ డిజైన్ లుక్స్‌తో ఉన్న ఈ బైక్ ప్రతి రైడర్‌ను ఆకట్టుకుంటుంది. దీని రేంజ్ 187 కిలో మీటర్లు. టాప్ స్పీడ్ 100 కిలో మీటర్లు. ధర రూ.1,49,999.
అల్ట్రావయోలెట్ ఎఫ్77 మాక్ 2
ఎలక్ట్రిక్ బైక్‌లలో అల్ట్రావయోలెట్ అత్యంత ఇష్టమైన పేర్లలో ఒకటి. బెంగుళూరుకు చెందిన ఈ సంస్థ ప్రత్యేకమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఉత్తమ ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్‌లను ఉత్పత్తి చేస్తుంది. అల్ట్రావయోలెట్ ఎఫ్77 మాక్ 2 (Ultraviolette F77 Mach 2) దాని ఎఫ్77 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా విడుదలైంది. దీని రేంజ్ 323 కి.మీ. కాగా టాప్ స్పీడ్ 155 కి.మీ. ప్రారంభ ధర రూ.2,99,000.
కొమాకి రేంజర్ ఎక్స్‌పీ
కొమాకి రేంజర్ పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు ఉన్నాయి. అవి రేంజర్, ఎం16. రేంజర్‌ను భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్‌గా చెప్తారు. ఇది భారీ, దృఢమైన చక్రాలు, అద్భుతమైన క్రోమ్ ఎక్స్‌టీరియర్స్, ప్రీమియం పెయింట్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. కొమాకి రేంజర్ ఎక్స్‌పీ (Komaki Ranger XP) రేంజ్ 250 కిలో మీటర్లు కాగా స్పీడ్ 70-80 కిలో మీటర్లు. ఇక దీని ధర రూ.1,84,300.
మ్యాటర్ ఏరా
మ్యాటర్ ఎనర్జీ కంపెనీ గత ఏడాది తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ మ్యాటర్ ఏరా (Matter Aera)ను విడుదల చేసింది. ఇది సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో స్పష్టమైన, వినూత్న సాంకేతికతను మిళితం చేస్తూ బోల్డ్, స్ఫుటమైన డిజైన్‌తో వస్తుంది. ఈ బైక్ రేంజ్ 125 కి.మీ.కాగా ధర రూ.1,73,999 నుంచి ప్రారంభమవుతుంది.
టోర్క్ క్రాటోస్-ఆర్ అర్బన్
పుణెకి చెందిన ఎలక్ట్రిక్ బైక్‌మేకర్ టోర్క్ మోటార్స్ కొత్త క్రాటోస్-ఆర్ మోడల్ ( Tork Kratos R Urban)ను విడుదల చేసింది. ఈ సరికొత్త మోడల్‌ను రోజువారీ ప్రయాణాల కోసం, అర్బన్ రైడర్లకు సౌకర్యంగా రూపొందించారు. దీని ధర రూ.1.67 లక్షలు. ఇది 105 కిలో మీటర్ల టాప్ స్పీడ్, 120 కిలో మీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుంది.
ఒకాయ ఫెర్రాటో డిస్‌రప్టర్
ఒకాయ ఈవీ ఈ ఏడాది మార్చిలో తన కొత్త ప్రీమియం అనుబంధ బ్రాండ్ ఫెర్రాటోను ప్రారంభించింది. ఇదే క్రమంలో ఫెర్రాటో బ్రాండ్ కింద డిస్రప్టర్ (Okaya Ferrato Disruptor)పేరుతో మొదటి మోడల్‌ను పరిచయం చేసింది.
ఫెర్రాటో డిస్‌రప్టర్ ఆధునిక, ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 95 కి.మీ. కాగా 129 కిలో మీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ధర రూ.1,59,999.
ఓర్క్సా మాంటిస్
ఓర్క్సా ఎనర్జీస్ గత సంవత్సరం మాంటిస్ (Orxa Mantis) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ప్రీమియం ధర కలిగిన మాంటిస్, పదునైన ట్విన్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, స్ట్రైకింగ్ ట్యాంక్ కౌల్, విలక్షణమైన కట్‌లు,క్రీజ్‌లతో ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.3.6 లక్షలు. 221 కి.మీ.రేంజ్‌ను, 135 కి.మీ టాప్ స్పీడ్‌ను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment