టూవీలర్లలో స్కూటర్లది ప్రత్యేకమైన విభాగం. అన్నివర్గాల వారూ స్కూటర్లను నడిపేందుకు ఇష్టపడతారు. ఈ క్రమంలో వాటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన అక్టోబర్‌లో జరిగిన విక్రయాల ఆధారంగా టాప్ 10 స్కూటర్లు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..
ఆటో న్యూస్ వెబ్‌సైట్ రష్‌లేన్ నివేదిక ప్రకారం.. గత అక్టోబర్‌లో టాప్ 10 స్కూటర్ల అమ్మకాలు 6,64,713 యూనిట్లతో ఏడాది ప్రాతిపదికతోపాటు అంతక్రితం నెలతో పోల్చి చేసినా మెరుగయ్యాయి. ఇవి గతేడాది అక్టోబర్‌లో 5,22,541 యూనిట్లు, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 6,05,873 యూనిట్లు అమ్ముడుపోయాయి.
ఇక అక్టోబర్ నెలలో ఏ స్కూటర్ ఎన్ని యూనిట్లు అమ్ముడుపోయాయో పరిశీలిస్తే.. 2,66,806 యూనిట్లతో హోండా యాక్టివా అగ్ర స్థానంలో ఉంది. మరోవైపు కస్టమర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా ఓలా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఓలా ఎస్1 గత అక్టోబర్‌లో 41,651 యూనిట్లు అమ్ముడుపోయింది. మొత్తం స్కూటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఎలక్ట్రిక్ విభాగంలో టాప్‌లో నిలిచింది.
ఏ స్కూటర్ ఎన్ని?
» హోండా యాక్టివా 2,66,806
» టీవీఎస్ జూపిటర్ 1,09,702
» సుజుకి యాక్సెస్ 74,813
» ఓలా ఎస్1 41,651
» టీవీఎస్ ఎన్‌టార్క్ 40,065
» హోండా డియో 33,179
» బజాజ్ చేతక్ 30,644
» టీవీఎస్ ఐక్యూబ్ 28,923
» సుజుకి బర్గ్‌మన్ 20,479
» యమహా రేజర్ 18,451
Comments
Please login to add a commentAdd a comment