Honda Activa
-
జుపీటర్ 125 Vs యాక్టివా 125: ఏది బెస్ట్?
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి ''టీవీఎస్ జుపీటర్ 125, హోండా యాక్టివా 125''. ఈ రెండూ 125సీసీ విభాగంలోనే స్కూటర్లు. కాబట్టి ఈ రెండు స్కూటర్లలో ఏ స్కూటర్ కొనుగోలు చేయాలి?, ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ధరలు, మైలేజ్ వంటి విషయాలు కొంత గందరగోళాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాంటి వారికోసం ఈ కథనం ఓ చక్కని పరిష్కారం..టీవీఎస్ జుపీటర్ 125, హోండా యాక్టివా 125 స్కూటర్స్ రెండూ డిజైన్, ఫీచర్స్ పరంగా కూడా ఉత్తమంగా ఉంటాయి. కాబట్టి ధర, మైలేజ్, కలర్ ఆప్షన్స్ అన్నీ బేరీజు వేసుకుని.. అవసరాలకు దృష్ట్యా నచ్చిన స్కూటర్ ఎంచుకోవడం అనేది పూర్తిగా కొనుగోలు చేసే వ్యక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. -
కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' (HMSI) అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. దక్షిణ భారతదేశంలో ఒక కోటి (10 మిలియన్) యాక్టివా స్కూటర్లను విక్రయించి సేల్స్‌లో సరికొత్త మైలురాయిని చేరుకుంది.2001లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన యాక్టివా 2017 నాటికి 50 లక్షల అమ్మకాలను సాధించింది. ఆ తరువాత 50 లక్షల సేల్స్ సాధించడానికి 7 సంవత్సరాల సమయంలో పట్టింది. యాక్టివా స్కూటర్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ దీవులు వంటి ప్రాంతాల్లో విరివిగా అమ్ముడైంది. దీంతో 1 కోటి సేల్స్ సాధించింది. అమ్మకాల్లో యాక్టివా 110 సీసీ, 125 సీసీ మోడల్స్ రెండూ ఉన్నాయి.ఇదీ చదవండి: బీఎండబ్ల్యూ కొత్త ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే..హోండా మోటార్‌సైకిల్ విక్రయిస్తున్న టూ వీలర్స్ ఇవే..యాక్టివా 110 సీసీ, 125 సీసీ మోటార్‌సైకిల్స్ మాత్రమే కాకుండా డియో, షైన్ 100, సీడీ 110 డ్రీమ్ డీలక్స్, షైన్ 125, ఎస్పీ125, హార్నెట్ 2.0, సీబీ200ఎక్స్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్, సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, ఎన్ఎక్స్500, ఎక్స్ఎల్750 ట్రాన్సల్ప్, ఆఫ్రికా ట్విన్, గోల్డ్ వింగ్ టూర్, హార్నెట్ 2.0, సీబీ200ఎక్స్ వంటి టూ వీలర్స్ విక్రయిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం 110సీసీ, 125 సీసీ బైకులు అమ్ముడవుతున్నాయి. -
హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్.. రూ.80 వేలకే!
ఏదైనా స్కూటర్ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నవారికి శుభవార్త ఇది. దేశంలో స్కూటర్లలో ప్రముఖంగా పేరొందిన హోండా యాక్టీవా (Honda Activa) లిమిటెడ్ ఎడిషన్ తాజాగా మార్కెట్లో లాంచ్ అయింది. హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ (Honda Activa Limited Edition) ఎక్స్ షోరూమ్ ధర రూ.80,734 మాత్రమే. ఇది డీఎల్ఎక్స్ ట్రిమ్ మోడల్ ధర. ఇక స్మార్ట్ ట్రిమ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.82,734. లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి తక్కువ యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. కావాలనుకున్నవారు దేశవ్యాప్తంగా ఉన్న హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌ల వద్ద వీటిని బుక్ చేసుకోవచ్చు. ఈ పరిమిత ఎడిషన్ స్కూటర్లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ రంగుల్లో ఇది లభ్యమవుతుంది. ఇందులో డార్క్ కలర్ థీమ్, బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్లు ఉంటాయి. DLX వేరియంట్లో అల్లాయ్ వీల్స్ ఉండగా, స్మార్ట్ వేరియంట్లో హోండా స్మార్ట్ కీ ఫీచర్ ఉంటుంది. -
హోండా మోటార్‌సైకిల్ మాస్టర్ ప్లాన్.. భవిష్యత్ ప్రణాళిక ఇలా!
భారతదేశంలో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా పేరు పొందిన హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో ఏకంగా పది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కంపెనీ ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందిస్తోంది. నివేదికల ప్రకారం.. మల్టిపుల్ పవర్‌ట్రెయిన్స్, స్పీడ్ కేటగిరి, బాడీ టైప్ వంటి వాటిని ఆధారంగా చేసుకుని కంపెనీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. సుమారు రెండు సంవత్సరాల తరువాత కంపెనీ ఈ ప్లాన్ సిద్ధం చేసింది. (ఇదీ చదవండి: సైడ్ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న హీరోయిన్లు వీళ్లే!) 2024 నాటికి దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి కంపెనీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ పాపులర్ స్కూటర్ హోండా యాక్టివాను ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదల చేయనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన ఉనికిని చాటుకోవడానికి హోండా చేయవలసిన అన్ని ప్రయత్నాలను నిర్విరామంగా చేస్తోంది. (ఇదీ చదవండి: హయ్యర్ స్టడీస్ లోన్‌పై బ్యాంకు విధించే చార్జెస్, ఇవే!) 2024లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ విడుదలైన తరువాత మరో టూ వీలర్ కూడా లాంచ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే వచ్చే ఏడాదిలో కంపెనీ రెండు ఈవీ మోడల్స్ విడుదల చేయనున్నట్లు స్పష్టమైంది. ఆ తరువాత 2026-27 మధ్యలో మరికొన్ని మోడల్స్ విడుదల చేయాలనీ సంస్థ యోచిస్తోంది. మొత్తం మీద కంపెనీ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తప్పకుండా మంచి అభివృద్ధిని సాధిస్తుందని భావిస్తున్నాము. -
మెదక్ జిల్లా: ఘరానా దొంగలు.. చూస్తుండగానే రూ.6 లక్షలు మాయం!
-
సీసీటీవీ దృశ్యాలు: ఘరానా దొంగలు.. చూస్తుండగానే రూ.6 లక్షలు మాయం!
సాక్షి, మెదక్: జిల్లాలోని చేగుంట మండల కేంద్రంలో పట్టపగలే దొంగలు చెలరేగిపోయారు. మక్క రాజుపేట గ్రామానికి చెందిన చింతల రమేష్ వద్ద నుంచి రూ.6 లక్షల 70 వేలు కొట్టేశారు. ఎస్బీఐ బ్యాంకు నుంచి రమేష్ 6 లక్షల 70 వేల రూపాయలు తీసుకొని బయటకు వచ్చాడు. తన హోండా యాక్టీవా డిక్కీలో ఆ సొమ్ము పెట్టి లాక్ చేశాడు. అనంతరం సమీపంలోని హీరో షాప్‌లో పని ఉండటంతో అక్కడే రోడ్డు పక్కన బండి నిలిపి వెళ్లాడు. అప్పటికే రెక్కీ నిర్వహించిన దొంగలు నిముషాల వ్యవధిలో రమేష్ యాక్టీవా ఉన్న చోటుకి చేరుకున్నారు. సెకండ్ల వ్యవధిలో లాక్ ఓపెన్ చేసి డబ్బులున్న బ్యాగ్‌తో పరారయ్యారు. హీరో షాప్‌లోకి వెళ్లి వచ్చిన రమేష్ వాహనం లాక్ ఓపెన్ చేసి ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. సొమ్ము కనిపించకపోవడంతో లోబోదిబోమన్నాడు. చదవండి👉 హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. అక్కడే ఉన్న కొందరి సూచనతో వెంటనే పోలీసులకు తన గోడువెళ్లబోసుకున్నాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన చేగుంట పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కేసు విచారిస్తున్నారు. గురువారం జరిగిన ఈ ఘరానా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి👇 ఇద్దరికీ వేరువేరు పెళ్లిళ్లు.. ప్రియుడితో ఇంటి నుంచి పారిపోయి కోర్టును ఆశ్రయించిన ప్రజ్ఞారెడ్డి.. పుల్లారెడ్డి కొడుకు, మనవడికి నోటీసులు జారీ -
వామ్మో..ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇంత ఖర్చా..! బండి ఖరీదు వేలల్లో ఉంటే..నెంబర్ మాత్రం!
వాహనదారులు కొత్త వెహికల్స్ కొనడం ఒక ఎత్తైతే. వాటికి ఫ్యాన్సీ నెంబర్లను ఎంపిక చేయడం మరో ఎత్తు. వాహనదారులు ప్రతీ నెంబర్‌కు ఓ ప్రత్యేకత ఉందని భావిస్తారు. నెంబర్ 1 నాయకత్వానికి సూచిక. అందుకే దాదాపూ ఈ నెంబర్ కోసం పోటీ పడుతుంటారు. ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. గతంలో ఈ తరహా పోటీ జరగ్గా... తాజాగా అదే తరహా సీన్ రిపీట్ అయ్యింది. ఛండీఘడ్కు చెందిన బ్రిజ్ మోహన్ అడ్వటైజింగ్ ఏజెన్సీలో జాబ్ చేస్తున్నాడు. అయితే మోహన్ తాజాగా రూ.71వేలకు హోండా యాక్టీవాను కొనుగోలు చేశాడు. కానీ ఆ బండి ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంత ఖర్చు చేశాడో తెలుసా? అక్షరాల రూ.15.44లక్షలుగా ఉంది. ఫ్యాన్సీ నెంబర్‌ను కొనుగోలు చేయడంపై మోహన్ మాట్లాడుతూ..హోండా యాక్టీవాను ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను వినియోగిస్తాను. త్వరలో కారు కొంటా. ఆ కారుకి కూడా సేమ్ ఫ్యాన్సీ నెంబర్‌ను ఉపయోగిస్తానని చెబుతున్నాడు. ఇటీవల ఛండీఘడ్ ఆర్టీఓ అధికారులు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 16 వరకు ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో కొత్త సిరీస్ సీహెచ్01- సీజే-0001 (CH01-CJ) నెంబర్ ఉందని అన్నారు. తాము నిర్వహించిన వేలంలో ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.1.5కోట్ల వరకు వాహనదారులు చెల్లించినట్లు తెలిపారు. సీహెచ్01- సీజే-0001 ఫ్యాన్సీ నెంబర్‌కు మోహనే అత్యధికంగా రూ.15.44 లక్షలు చెల్లించాడని ఆర్టీఓ అధికారులు చెప్పారు. ఇక ఈ నెంబర్ రిజర్వ్ ధర రూ.50వేలు ఉండగా రెండవ అత్యంత ఖరీదైన ఫ్యాన్సీనెంబర్ సీహెచ్-01-సీజే-002పై రూ.5.4 లక్షలు చెల్లించిచారని..సీహెచ్-01-సీజే-007 నెంబర్ ధర రూ.4.4 లక్షలు పలకగా..సీహెచ్-01-సీజే-003 నెంబర్ రూ.4.2లక్షలకు వాహనదారులు సొంతం చేసుకున్నారు. ఇక ఈ నంబర్ రిజర్వ్ ధర రూ.30వేలుగా ఉంది. కాగా, ఇప్పటివరకు, 0001కి అత్యధిక బిడ్ 2012లో వచ్చింది. సెక్టార్ 44 నివాసి సీహెచ్ -01-ఏపీ సిరీస్ నుండి రూ.26.05 లక్షలకు నంబర్‌ను కొనుగోలు చేశారు.ఇది అతని ఎస్ -క్లాస్ మెర్సిడెస్ బెంజ్ కోసం కొనుగోలు చేశాడని ఆర్టీఓ అధికారులు గుర్తు చేశారు. -
ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి హోండా ఈవీ స్కూటర్ వచ్చేది అప్పుడే..!
మన దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వెహికల్ ట్రెండ్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో, దిగ్గజ కంపెనీలతో సహ స్టార్టప్ కంపెనీలు కూడా తమ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ప్రస్తుతం లభిస్తున్న వాటిలో ఎక్కువగా స్టార్టప్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక దిగ్గజ కంపెనీ స్టార్టప్ కంపెనీల పోటీ ఇచ్చేందుకు మార్కెట్లోకి రాబోతుంది. జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా మోటార్ ఇండియా ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా ఎలక్ట్రిక్ వాహనాల కోసం మా మార్కెట్'ను మదింపు చేస్తున్నట్లు ధృవీకరించారు. "వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా నిజమైన హెచ్ఎమ్ఎస్ఐ ఎలక్ట్రిక్ వాహనాన్ని మీరు చూడగలుగుతారు" ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గత ఏడాది పూణేలోని ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఫెసిలిటీలో హోండా బెన్లీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టెస్టింగ్ చేసినట్లు తెలిపారు. బ్యాటరీ-మార్పిడి సాంకేతికతను పరీక్షించడం కోసం హోండా తన అనుబంధ సంస్థ హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'ను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బెంగళూరులో త్రిచక్ర వాహనాలలో పైలట్ ప్రాజెక్టు కింద రన్ చేస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు మెట్రో నగరాలకు మాత్రమే చేరువ అయ్యాయని చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు చేరువ కాలేదని ఒగాటా అన్నారు. హోండా మోటార్ ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి మూడు వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించింది. ఇప్పటికే దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బ్యాటరీ స్వాపింగ్(బ్యాటరీ ఇచ్చి ఛార్జైన బ్యాటరీ తీసుకోవడం) ప్లాట్‌ఫామ్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు తైవాన్‌కు చెందిన గోగోరో ఇంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. హీరో-బ్రాండ్ పేరు మీద మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడానికి రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 2022లో ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్నట్లు నిరంజన్ గుప్తా వెల్లడించారు. అది మా స్వంత ఉత్పత్తి లేదా గోగోరో సహకారంతో అయిన కావొచ్చని పేర్కొన్నారు. ఈ వాహనాలు ఎప్పుడైన రావొచ్చు అని తెలిపారు. (చదవండి: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు..!) -
ఇది మామూలు లిస్టు కాదు.. నాలుగేళ్లుగా ‘జంప్’ అవుతున్నాడు, కానీ ఈసారి
బంజారాహిల్స్: స్కేటింగ్ కోచ్ జునైద్ శనివారం (టీఎస్09 ఎఫ్డీ 3792) యాక్టివాపై వెళ్తుండగా.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో పట్టుబడ్డాడు. ఆ స్కూటర్‌కు సంబంధించిన పెండింగ్ చలానాలు పరిశీలించగా గత నాలుగేళ్లుగా పెండింగ్ చలానాలతో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నట్లుగా తేలింది. మొత్తం 107 పెండింగ్ చలానాలు ఈ బైక్‌పై నమోదై ఉన్నాయి. చలాన్ల జాబితా చాంతాడంత ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. రూ. 35,835 జరిమానా పెండింగ్‌లో ఉండటంతో ఆ మొత్తాన్ని సదరు వాహనదారుడు చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు. హెల్మెట్ లేకుండా పోలీసులను తప్పించుకొని తిరుగుతున్న అతడు ఎట్టకేలకు జూబ్లీహిల్స్‌లో పోలీసులకు చిక్కాడు. అబిడ్స్‌లో నివసించే జునైద్ హైటెక్ సిటీ గూగుల్ బిల్డింగ్‌లో స్కేటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. (చదవండి: ‘మేడారం’ పనులు మొదలయ్యేదెప్పుడు?) -
హోండా కస్టమర్లకు అలర్ట్.. వెంటనే బైక్స్ షో రూమ్ కి తీసుకెళ్లండి
మీ దగ్గర కొత్త హోండా మోటార్ సైకిల్ వాహనం ఉందా? అయితే, వెంటనే షో రూమ్ తీసుకెళ్లండి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్లలలో సమస్య కారణంగా మన దేశంలోని కొన్ని మోడళ్లను రీకాల్ చేస్తుంది. వెనక్కి పిలిపించిన వాటిలో హోండా యాక్టివా 5జీ, హోండా యాక్టివా 6జీ, హోండా యాక్టివా 125, సిబి షైన్, హార్నెట్ 2.0, ఎక్స్-బ్లేడ్, హెచ్ నెస్ సీబి 350, సీబి 300ఆర్ ఉన్నాయి. రీకాల్ చేయబడ్డ మొత్తం యూనిట్ సంఖ్య ఇంకా తెలియదు. రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్ల సమస్య వల్ల రాత్రి సమయంలో వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందు వెళ్తున్న వాహనం సరిగా కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. అందుకే ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా నవంబర్ 2019 నుంచి జనవరి 2021 మధ్య తయారు చేయబడ్డ మోడల్స్ కు వారెంటీ స్టేటస్ తో సంబంధం లేకుండా కొత్త రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్ ని ఉచితంగా అధీకృత హెచ్ఎంఎస్ఐ డీలర్ లు మార్చానున్నట్లు తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి కంపెనీ జూన్ 1, 2021న రీకాల్ ప్రక్రియను ప్రారంభించింది. వాహనాన్ని తనిఖీ చేయడానికి అవసరమైతే రీప్లేస్ మెంట్ కోసం కాల్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులను చేరుకొనున్నట్లు హెచ్ఎంఎస్ఐ తెలిపింది. అదేవిధంగా, కస్టమర్ లు కంపెనీ వెబ్ సైట్ లో విఐఎన్ ని కూడా నమోదు చేయవచ్చు. హెచ్ ఎమ్ ఎస్ఐ డీలర్ షిప్ లు/విడిభాగాల డిస్ట్రిబ్యూటర్ ల వద్ద అనుమానిత స్పేర్ పార్టుల స్టాక్ కూడా రీకాల్ చేయనున్నారు. అమెరికాలోలో కూడా ఇలాంటి సమస్య కారణంగా హోండా మోటార్ కంపెనీ రీకాల్ చేసింది. యుఎస్ఎలో 28,528 మోటార్ సైకిళ్లలో లోపభూయిష్టమైన రియర్ రిఫ్లెక్టర్ ఫిట్ మెంట్ లను మార్చేసింది. చదవండి: BMW : మూడు సెకన్లలోనే అంత వేగమా -
మార్కెట్లోకి ‘హోండా యాక్టివా 6జీ’
ముంబై: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ).. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరో స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘యాక్టివా 6జీ’ పేరిట విడుదలైన ఈ అధునాతన స్కూటర్ స్టాండర్డ్, డీలక్స్ వేరియంట్లలో లభిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ. 63,912– 65,412 (ఎక్స్–షోరూం, ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. మును పటి మోడలైన స్టాండర్డ్ 5జీతో పోల్చితే నూతన స్కూటర్ ధర రూ.7,978 అధికం కాగా, డీలక్స్ ధర రూ. 7,613 ఎక్కువగా ఉంది. ‘బీఎస్–6 నూతన ఉద్గార ప్రమాణాలతో కూడిన మూడవ యాక్టివా ఇది. ఈ నెలాఖరుకు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఇది అందుబాటులోకి వస్తుంది’ అని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్ గులేరియా తెలిపారు. -
బంజారాహిల్స్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో మంగళవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హోండా యాక్టీవాపై వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తలపైనుంచి బస్సు వెళ్లడంతో ఆమె తల ఛిద్రమైంది. ఈ ఘటనలో మృతి చెందిన మహిళను టీసీఎస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ సోహిని సక్సేనాగా గుర్తించారు. బస్సు చక్రాల కింద నలిగిపోయి ఆమె నడిపిస్తున్న యాక్టివా వాహనం నుజ్జునుజ్జయింది. బస్సును తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపినట్టు తెలుస్తోంది. ఘటన అనంతరం తాత్కాలిక డ్రైవర్‌ను పట్టుకొని స్థానికులు చితకబాదారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఇదే ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడేళ్లలో ఇక్కడి బ్లాక్‌స్పాట్‌లో రోడ్డు ప్రమాదాలు జరిగి ఐదుగురు ప్రాణాలు విడిచారు. తాజా రోడ్డు ప్రమాదంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
‘హోండా యాక్టివా’ మరో మైలురాయి
ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ)... తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. కంపెనీ ఫ్లాగ్షిప్ టూవీలరైన ‘యాక్టివా’ అమ్మకాలు 2 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. మొదటి కోటి యాక్టివాలను విక్రయించడానికి 15 ఏళ్ల సమయం పట్టగా, ఆ తరువాత కోటి వాహనాల అమ్మకాలను కేవలం మూడేళ్లలోనే పూర్తిచేయగలిగినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మినోరు కటో మాట్లాడుతూ.. ‘గడిచిన 18 సంవత్సరాల్లో ఐదు జనరేషన్ల యాక్టివా స్కూటర్లను విడుదల చేశాం. జపనీస్ మాతృ సంస్థకు ఈ టూవీలర్ 33 శాతం అంతర్జాతీయ మార్కెట్ వాటాను అందిస్తోంది.’ అని కటో వ్యాఖ్యానించారు. ఆటోమేటిక్ స్కూటర్ మార్కెట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండటం వల్లనే యాక్టివా అమ్మకాలు సరికొత్త మైలురాయిని అధిగమించాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్. గులేరియా అన్నారు. -
హోండా యాక్టివా 5జీ వచ్చేసింది...
ద్విచక్ర వాహన మార్కెట్లో బాగా ఫేమస్ అయిన హోండా యాక్టివా ఐదో జనరేషన్ వచ్చేసింది. కొత్త యాక్టివా 5జీని ఆటో ఎక్స్పో 2018లో హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లు ఆవిష్కరించాయి. కొత్త డీలక్స్ వేరియంట్, ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, పొజిషన్ ల్యాంప్, కొత్త ఫ్రంట్ క్రోమ్ గార్నిష్‌తో ఈ ఐదవ జనరేషన్ యాక్టివాను మార్కెట్లోకి ఆవిష్కరించినట్టు హోండా చెప్పింది. ఈ కొత్త యాక్టివా 5జీ రెండు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. ఒకటి డజెల్ యెల్లో మెటాలిక్, రెండు పెర్ల్ స్పార్టన్ రెడ్. అంతేకాక ఫ్రంట్ హుక్, సీట్ ఓపెనర్ స్విచ్‌తో 4-ఇన్-1 లాక్, కొత్త మఫ్లర్ ప్రొటెక్టర్లు కూడా ఉన్నాయి. మెకానిక్ పరంగా యాక్టివా 5జీ అలానే ఉండనుంది. 109సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్, బీఎస్-4 ఇంజిన్ నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. ఈ కొత్త స్కూటర్ త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. -
మళ్లీ యాక్టివానే టాప్
ముంబై: జూలై నెల టూవీలర్ అమ్మకాల్లోనూ హోండా ‘యాక్టివా’ వరుసగా ఏడవసారి టాప్‌లో నిలిచింది. అలాగే ఇదే సమయంలో పరిశ్రమలోని మొత్తం ఇన్క్రిమెంటల్ అమ్మకాల్లో (1,62,703 యూనిట్లు) యాక్టివా 38 శాతం వాటాను కైవసం చేసుకుంది. దీంతో కంపెనీ ఈ ఏడాది స్కూటర్ విక్రయాల టార్గెట్‌ను 24 శాతంపైకి సవరించుకుంది. ఆటోమొబైల్ పరిశ్రమ సమాఖ్య సియామ్ ప్రకారం.. జూలైలో యాక్టివా విక్రయాలు హీరో స్ల్పెండర్ అమ్మకాల కన్నా 58,413 యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి. -
సెల్‌ఫోన్ చోరీలు చేస్తున్న ఇద్దరికి రిమాండ్
అడ్డగుట్ట: పరీక్షా సమయాల్లో విద్యార్థుల సెల్ఫోన్లు దొంగలించిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించిన ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం...లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన బెన్హర్(20) తండ్రి పేరు ఇమాన్యుల్ డిప్లొమా చదువుతున్నాడు. కే. విజయ్(19) ఐటీ చేస్తున్నాడు. వీరిద్దరు స్నేహితులు. అయితే, ఈ నెల 9వ తేదిన ఉదయం ఈస్ట్ మారేడుపల్లిలోని సేయింట్ జాన్స్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు రాయడానికి వెళ్లిన విద్యార్థులు తమ సెల్ఫోన్లు వారి వారి వాహనాల్లో పెట్టుకొని వెళ్లారు. కాగా, విద్యార్థులు పరీక్షలు రాయడానికి వెళ్లిన అంనంతరం బెన్హర్, విజయ్ హోండా యాక్టివాపై సేయింట్ జాన్స్ కాలేజీ దగ్గరకు వచ్చారు. విద్యార్థుల వాహనాల్లో నుంచి సెల్ఫోన్లు దొంగలించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ సెల్ఫోన్లు పోయాయని ఆలస్యంగా తెలుసుకున్న విద్యార్థులు వెంటనే స్థానిక తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలేజీ వద్దనున్న సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడ్డ వారి వాహనం నంబర్లు గుర్తించి ఆ ఇద్దరు యువకుల్ని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. -
టూవీలర్ అమ్మకాల్లో టాప్ హోండా యాక్టివా
-
టాప్స్పీడ్లో స్కూటర్‌ర్‌ర్‌ర్!
ముంబై: స్కూటర్ల అమ్మకాలు రయ్‌మని దూసుకుపోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఆటోమొబైల్ మార్కెట్లో దాదాపు అన్ని రకాల వాహనాల విక్రయాల జోరు తగ్గినప్పటికీ, స్కూటర్ల అమ్మకాలు మాత్రం ఏ నెలకానెల పెరుగుతూనే ఉన్నాయి. బైక్‌లతో పోల్చితే స్కూటర్లకు ఇంధన చార్జీలు అధికం (మైలేజీ బైక్‌లకు ఎక్కువగా వస్తుంది)అయినప్పటికీ , స్కూటర్ల అమ్మకాలు ప్రతి నెలా రెండంకెల వృద్ధి సాధించడం విశేషం. ఎందుకు పెరుగుతున్నాయంటే.., ఇంట్లో బైక్ ఉంటే మగవాళ్లు మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. అదే స్కూటరయితే ఆలుమగలు, ఇంట్లో టీనేజ్ పిల్లలుంటే వాళ్లు కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని చాలా మంది మధ్యతరగతి మాధవరావులు స్కూటర్‌కే ఓటు వేస్తున్నారు. నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం కూడా వారిని స్కూటర్ల వైపే మొగ్గేలా చూస్తోంది. అంతకంతకూ అధికం అవుతున్న ట్రాఫిక్ సమస్య వల్ల పురుషులు కూడా స్కూటర్లపై ఆసక్తి చూపుతున్నారు. స్కూటర్లకైతే గేర్లు మార్చాల్సిన జంఝాటం ఉండకపోవడం, సులువుగా డ్రైవ్ చేయగలిగే సౌకర్యం వంటి కారణాల వల్ల మైలేజీ తక్కువ వచ్చినా స్కూటర్లే హాయి అని వారంటున్నారు. పట్టణీకరణ విస్తృతి, పట్టణ మౌలిక సదుపాయాలు మెరుగుపడడం, మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండడం, పెరుగుతున్న మహిళా సాధికారత వంటి అంశాలు కూడా స్కూటర్ల విక్రయాలు అధికం కావడానికి తోడ్పడుతున్నాయి. బైక్‌లతో పోల్చితే స్కూటర్లతో బహుళ ప్రయోజనాలుండడం కూడా స్కూటర్ల అమ్మకాల వృద్ధికి తోడ్పడింది. హోండా ఆక్టివాతో ఆరంభం.. ఒకప్పుడు స్కూటర్లంటే బజాజ్ కంపెనీదే హవా. హమారా బజాజ్ నినాదం ఇంటింటా మార్మోగేది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బజాజ్ ఆటో కంపెనీ బైక్‌ల వైపు దృష్టి సారించింది. అయితే ఆ తర్వాత హోండా కంపెనీ ఆక్టివా స్కూటర్‌తో రంగ ప్రవేశం చేసింది. భారత స్కూటర్ల మార్కెట్‌ను పునరుజ్జీవింపజేసిన ఘనత హోండా కంపెనీకే దక్కుతుంది. గత పదేళ్లుగా స్కూటర్ల సెగ్మెంట్లో ఈ కంపెనీదే అగ్రస్థానం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ బైక్‌ల కన్నా హోండా ఆక్టివా స్కూటర్ అమ్మకాలు అధికంగా ఉండడం విశేషం. చండీగఢ్, ఇంఫాల్, గోవా, కేరళ మార్కెట్లలో బైక్‌ల కంటే స్కూటర్ల అమ్మకాలే అధికంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నైల్లో బైక్‌ల, స్కూటర్ల అమ్మకాల మధ్య వ్యత్యాసం అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. కేరళలో బైక్‌ల కన్నా స్కూటర్ల అమ్మకాలే అధికం. గుజరాత్లో కూడా త్వరలో ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా. గత నాలుగేళ్లలో బైక్‌ల అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందగా, స్కూటర్ల అమ్మకాలు మాత్రం 26 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో బైక్‌ల అమ్మకాలు స్వల్పంగా 1 శాతం పెరిగి 50.1 లక్షలకు చేరగా, స్కూటర్ల విక్రయాలు మాత్రం 17 శాతం వృద్ధితో 16.6 లక్షలకు చేరాయి. ఏడాదికి భారత్‌లో 28 లక్షలకు పైగా స్కూటర్లు అమ్ముడవుతాయని అంచనా. 3 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ఒక్క బజాజ్ కంపెనీ తప్ప మిగిలిన అన్ని కంపెనీలు(హోండా, హీరో మోటోకార్ప్, యమహా, సుజుకి, టీవీఎస్, మహీంద్రా, వెస్పా) స్కూటర్లను అందిస్తున్నాయి. బజాజ్ కంపెనీ కూడా బజాజ్ బ్లేడ్ పేరుతో స్కూటర్‌ను మార్కెట్లోకి తేనున్నదని సమాచారం. హోండా ఆక్టివా, హీరో మ్యాస్ట్రో స్కూటర్లకు కనీసం మూడు నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వార్షిక ఉత్పత్తిని పలు కంపెనీలు పెంచుతున్నాయి. టూవీలర్ల విక్రయాల్లో ఇప్పటికీ 70 శాతం బైక్లవే అయినప్పటికీ, బైక్‌ల అమ్మకాలను సవాల్‌చేసే స్థాయికి త్వరలో స్కూటర్ల అమ్మకాలు పెరుగుతాయని నిపుణులంటున్నారు.