వామ్మో..ఫ్యాన్సీ నెంబర్‌ కోసం ఇంత ఖర్చా..! బండి ఖరీదు వేలల్లో ఉంటే..నెంబర్‌ మాత్రం! | Chandigarh man buys rs15.4 lakh fancy number for rs71,000 Activa | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ నెంబర్‌ కోసం ఇంత మోజా! స్కూటీ ధర వేలల్లో ఉంటే.

Published Sun, Apr 17 2022 4:10 PM | Last Updated on Sun, Apr 17 2022 9:45 PM

Chandigarh man buys rs15.4 lakh fancy number for rs71,000 Activa - Sakshi

వాహనదారులు కొత్త వెహికల్స్‌ కొనడం ఒక ఎత్తైతే. వాటికి ఫ్యాన్సీ నెంబర‍్లను ఎంపిక చేయడం మరో ఎత్తు. వాహనదారులు ప్రతీ నెంబర్‌కు ఓ ప్రత్యేకత ఉందని భావిస్తారు. నెంబర్‌ 1 నాయకత్వానికి సూచిక. అందుకే దాదాపూ ఈ నెంబర్‌ కోసం పోటీ పడుతుంటారు. ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. గతంలో ఈ తరహా పోటీ జరగ్గా... తాజాగా అదే తరహా సీన్‌ రిపీట్‌ అయ్యింది.  

ఛండీఘడ్‌కు చెందిన బ్రిజ్‌ మోహన్‌ అడ‍్వటైజింగ్‌ ఏజెన్సీలో జాబ్‌ చేస్తున్నాడు. అయితే మోహన్‌ తాజాగా రూ.71వేలకు హోండా యాక్టీవాను కొనుగోలు చేశాడు. కానీ ఆ బండి ఫ్యాన్సీ నెంబర్‌ కోసం ఎంత ఖర్చు చేశాడో తెలుసా? అక్షరాల రూ.15.44లక్షలుగా ఉంది. ఫ్యాన్సీ నెంబర్‌ను కొనుగోలు చేయడంపై మోహన్‌ మాట్లాడుతూ..హోండా యాక్టీవాను ఈ ఫ్యాన్సీ నెంబర్‌ను వినియోగిస‍్తాను. త్వరలో కారు కొంటా. ఆ కారుకి కూడా సేమ్‌ ఫ్యాన్సీ నెంబర్‌ను ఉపయోగిస్తానని చెబుతున్నాడు. 

ఇటీవల ఛండీఘడ్‌ ఆర్టీఓ అధికారులు ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు. ఈ ఫ్యాన్సీ నెంబర్‌ల వేలంలో కొత్త సిరీస్ సీహెచ్‌01- సీజే-0001 (CH01-CJ) నెంబర్‌ ఉందని అన్నారు. తాము నిర్వహించిన వేలంలో ఫ్యాన్సీ నెంబర్‌ కోసం రూ.1.5కోట్ల వరకు వాహనదారులు చెల్లించినట్లు తెలిపారు. 

సీహెచ్‌01- సీజే-0001 ఫ్యాన్సీ నెంబర్‌కు మోహనే అత్యధికంగా రూ.15.44 లక్షలు చెల్లించాడని ఆర్టీఓ అధికారులు చెప్పారు. ఇక ఈ నెంబర్‌ రిజర్వ్ ధర రూ.50వేలు ఉండగా రెండవ అత్యంత ఖరీదైన ఫ్యాన్సీనెంబర్‌ సీహెచ్‌-01-సీజే-002పై రూ.5.4 లక్షలు చెల్లించిచారని..సీహెచ్‌-01-సీజే-007 నెంబర్‌ ధర రూ.4.4 లక్షలు పలకగా..సీహెచ్‌-01-సీజే-003 నెంబర్‌ రూ.4.2లక్షలకు వాహనదారులు సొంతం చేసుకున్నారు. ఇక ఈ నంబర్‌ రిజర్వ్ ధర రూ.30వేలుగా ఉంది. 

కాగా, ఇప్పటివరకు, 0001కి అత్యధిక బిడ్ 2012లో వచ్చింది. సెక్టార్ 44 నివాసి సీహెచ్‌ -01-ఏపీ సిరీస్ నుండి రూ.26.05 లక్షలకు నంబర్‌ను కొనుగోలు చేశారు.ఇది అతని ఎస్‌ -క్లాస్ మెర్సిడెస్ బెంజ్ కోసం కొనుగోలు చేశాడని ఆర్టీఓ అధికారులు గుర్తు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement