
ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఎస్‌ఐ)... తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ టూవీలరైన ‘యాక్టివా’ అమ్మకాలు 2 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. మొదటి కోటి యాక్టివాలను విక్రయించడానికి 15 ఏళ్ల సమయం పట్టగా, ఆ తరువాత కోటి వాహనాల అమ్మకాలను కేవలం మూడేళ్లలోనే పూర్తిచేయగలిగినట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మినోరు కటో మాట్లాడుతూ.. ‘గడిచిన 18 సంవత్సరాల్లో ఐదు జనరేషన్ల యాక్టివా స్కూటర్లను విడుదల చేశాం. జపనీస్ మాతృ సంస్థకు ఈ టూవీలర్ 33 శాతం అంతర్జాతీయ మార్కెట్ వాటాను అందిస్తోంది.’ అని కటో వ్యాఖ్యానించారు. ఆటోమేటిక్ స్కూటర్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండటం వల్లనే యాక్టివా అమ్మకాలు సరికొత్త మైలురాయిని అధిగమించాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్. గులేరియా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment