బంజారాహిల్స్: స్కేటింగ్ కోచ్ జునైద్ శనివారం (టీఎస్09 ఎఫ్‌డీ 3792) యాక్టివాపై వెళ్తుండగా.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో పట్టుబడ్డాడు. ఆ స్కూటర్‌కు సంబంధించిన పెండింగ్ చలానాలు పరిశీలించగా గత నాలుగేళ్లుగా పెండింగ్ చలానాలతో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నట్లుగా తేలింది. మొత్తం 107 పెండింగ్ చలానాలు ఈ బైక్‌పై నమోదై ఉన్నాయి. చలాన్ల జాబితా చాంతాడంత ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు.
రూ. 35,835 జరిమానా పెండింగ్‌లో ఉండటంతో ఆ మొత్తాన్ని సదరు వాహనదారుడు చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు. హెల్మెట్ లేకుండా పోలీసులను తప్పించుకొని తిరుగుతున్న అతడు ఎట్టకేలకు జూబ్లీహిల్స్‌లో పోలీసులకు చిక్కాడు. అబిడ్స్‌లో నివసించే జునైద్ హైటెక్ సిటీ గూగుల్ బిల్డింగ్‌లో స్కేటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
(చదవండి: ‘మేడారం’ పనులు మొదలయ్యేదెప్పుడు?)
Comments
Please login to add a commentAdd a comment