![Honda Activa 7G Coming Soon And Details](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/honda-activa-7g.jpg.webp?itok=HTisg8YH)
భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన 'హోండా యాక్టివా' స్కూటర్.. '7జీ' వెర్షన్‌లో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే 6జీ వెర్షన్‌లో అమ్మకానికి ఉన్న ఈ స్కూటర్.. త్వరలోనే మరిన్ని ఆధునిక హంగులతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా గొప్ప సేల్స్ పొందే అవకాశం ఉందని సమాచారం.
కస్టమర్ల ఊహలకు లేదా అంచనాలను 7జీ యాక్టివా దగ్గరగా ఉంటుందని సమాచారం. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది రైడర్‌ల అవసరమైన సమాచారాన్ని వీక్షించడానికి మాత్రమే కాకుండా.. స్మార్ట్‌ఫోన్‌ను యాక్సెస్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. దీని ద్వారా నావిగేషన్, కాల్ అలర్ట్‌లు, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి మెరుగైన ఫీచర్‌లు డాష్‌బోర్డ్‌లో కనిపిస్తాయి.
కంపెనీ 7జీ యాక్టివాకు సంబంధించిన చాలా వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది 109.51 సీసీ సింగిల్ సిలిండర్ బీఎస్6 ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. ఇది 7.79 పీఎస్ పవర్, 8.84 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ 68 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.
హోండా యాక్టివా 7జీ స్కూటర్.. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్స్ (CBS) లేదా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ABS) వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు.. స్టాండర్డ్ లేదా ఆప్షనల్ అప్‌గ్రేడ్స్ పొందే అవకాశం ఉందని సమాచారం. వీటితోపాటు ఇందులో జియో-ఫెన్సింగ్ ఫీచర్ వంటి లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉంటుందనే వివరాలను కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment