
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా తన 'సీఆర్ఎఫ్1100 ఆఫ్రికా ట్విన్' బైకులకు రీకాల్ ప్రకటించింది. త్రాటల్ ఆపరేషన్ సమస్య కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. 2022 ఫిబ్రవరి - 2022 అక్టోబర్ మధ్య తయారైన బైకులలో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.
ఎన్ని బైకులు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయో.. కంపెనీ వెల్లడించలేదు. త్రాటల్ ఆపరేషన్ సమస్య వల్ల రైడర్.. రైడింగ్ సమయంలో బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడానికి కంపెనీ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ యూనిట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రూపొందించనుంది.

వారంటీతో సంబంధం లేకుండా ప్రభావిత బైక్‌లలో సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. హోండా బిగ్‌వింగ్ వెబ్‌సైట్‌లో VINని నమోదు చేయడం ద్వారా కస్టమర్‌లు.. తమ బైక్ జాబితాలో ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. ఈ బైక్ ధరలు మార్కెట్లో రూ. 16.01 లక్షల నుంచి రూ. 17.55 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.