
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. నవంబర్ 2022 - మార్చి 2023 మధ్య తయారు చేసిన బైకులకు రీకాల్ ప్రకటించింది. రొటీన్ టెస్టింగ్ సమయంలో వెనుక, సైడ్ రిఫ్లెక్టర్‌లతో సమస్యను గుర్తించిన కంపెనీ, దీనిని పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించింది.
నిర్దేశించిన సమయంలో తయారైన మోటార్‌సైకిళ్లలోని రిఫ్లెక్టర్‌లు.. రిఫ్లెక్టివ్ పనితీరు సరిగ్గా ఉండకపోవచ్చు. దీని వల్ల కాంతి తక్కువగా ఉండటం వల్ల దృశ్యమానత దెబ్బతింటుంది. ఇది రోడ్డుపైన ప్రమాదాలు జరగడానికి కారణమవుతుంది. అయితే ఈ సమస్యపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగానే రీకాల్ ప్రకటించింది.
ఇదీ చదవండి: చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..
కంపెనీ ఈ సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. బైకులో ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి భర్తీ ప్రక్రియ త్వరగా, సమర్ధవంతంగా ఉంటుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ పేర్కొంది. బ్రాండ్ సర్వీస్ టీమ్‌లు వారి సమీప సర్వీస్ సెంటర్‌లో రీప్లేస్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి ప్రభావిత మోటార్‌సైకిళ్ల యజమానులను నేరుగా సంప్రదించనున్నట్లు సమాచారం.