ప్రముఖ లగ్జరీ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో అమ్మకాల్లో దూసుకెళ్తుంది. జూన్ నెలలో 26శాతం వృద్దిని సాధించి 77,109 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది జూన్‌లో 61,407 బైక్స్ అమ్మింది.
భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు ఏడాది క్రితం 50,265 యూనిట్లు అమ్ముడు పోగా..ఈ ఏడాది 34 శాతం పెరిగి 67,495 అమ్మినట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2022 జూన్ లో 11,142 యూనిట్లను ఎగుమతి చేయగా.. గత నెలలో వాటి సంఖ్య 9,614 యూనిట్లతో సరిపెట్టుకుంది.
ఈ సందర్భంగా రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ బీ గోవింద రాజన్ మాట్లాడుతూ.. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన మోటారు సైకిళ్లతో తాము దేశీయంగా, గ్లోబల్ మార్కెట్లలో మంచి సేల్స్ నమోదు చేశామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ వెహికల్స్ బైక్ లవర్స్‌ను ఆకట్టుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment