ఈ రోజు ఏ సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా అందరికీ మొదట గుర్తొచ్చే యాప్ 'బుక్ మై షో' (Book My Show). ఇంతకీ ఈ బుక్ మై షో ఎలా ప్రారంభమైంది. ఎవరు స్థాపించారు, దీని నెట్‍వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
ముంబైలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన 'ఆశిష్ హేమ్రజని' (Ashish Hemrajani), మరో ఇద్దరు స్నేహితులతో (పరీక్షిత్ దార్, రాజేష్ బల్పాండే) కలిసి బుక్ మై షో స్థాపించారు. ఆశిష్ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం జుహులో పూర్తయింది. ఆ తరువాత మితిబాయి కాలేజీలో గ్రాడ్యుయేట్, సిడెన్‌హామ్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత జే.వాల్టర్ థాంప్సన్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించారు.
ఆశిష్ హేమ్రజని 1999లో హాలిడే ట్రిప్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ ఒక రోజు చెట్టుకింద కూర్చుని రేడియోలో ప్రోగ్రామ్ వింటూ ఉన్నారు. ఆ సమయంలో రబ్బీ గేమ్ టికెట్లకు సంబంధించిన ప్రకటన గురించి విన్నారు. ఆ సమయంలో ఓ ఆలోచన వచ్చింది. ఇలాంటి టికెట్ల వ్యాపారాన్ని సినిమా రంగంలో ప్రవేశపెడితే బాగుంటుందని అనుకున్నారు.
సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన తరువాత ఆలోచనకు కార్యరూపం దాల్చడానికి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తరువాత సిడెన్‌హామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పూర్వ విద్యార్థులు.. ఆశిష్ స్నేహితులైన పరీక్షిత్ దార్, రాజేష్ బల్పాండేతో కలిసి 'గో ఫర్ టికెటింగ్' ప్రారభించారు. ఇదే తరువాత ఇండియా టికెట్ పేరుతో వచ్చింది. చివరకు బుక్ మై షోగా స్థిరపడింది.
ఆశిష్ బుక్ మై షో ప్రారంభించిన సమయంలో స్మార్ట్‌ఫోన్స్, ఆన్‌లైన్ చెల్లింపులు పెద్దగా అందుబాటులో లేదు. దీంతో చాలా రోజులు ఇందులో ఒడిదుడుకుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక సందర్భంలో బుక్ మై షో మూసి వేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఆశిష్ వెనుకడుగు వేయలేదు. ఒడిదుడుకులు మనల్ని తిరుగులేని వ్యాపారవేత్తను చేస్తాయి అనే మాటలను గట్టిగా నమ్ముకున్న ఆశిష్ ఎప్పుడూ నిరాశ చెందలేదు.
ఇదీ చదవండి: భారత్‌లో రూ.10,000 నోటు.. ఎప్పుడు మొదలైందంటే?
2006లో నెట్ బ్యాంకింగ్ ప్రారంభమైంది. అంతే కాకుండా దేశంలో మల్టీప్లెక్స్‌ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో ఆశిష్ బుక్ మై షో ఎదగడం ప్రారంభించింది. ఆన్‌లైన్ చెల్లింపులు ఎప్పుడైతే ఎక్కువయ్యాయి.. క్రమంగా సినిమా టికెట్స్ బుక్ చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో కంపెనీ 2011లో 16 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుతం బుక్ మై షో విలువ ఏకంగా రూ. 7500 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment