book my show
-
చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..
ఈ రోజు ఏ సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా అందరికీ మొదట గుర్తొచ్చే యాప్ 'బుక్ మై షో' (Book My Show). ఇంతకీ ఈ బుక్ మై షో ఎలా ప్రారంభమైంది. ఎవరు స్థాపించారు, దీని నెట్‌వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.ముంబైలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన 'ఆశిష్ హేమ్రజని' (Ashish Hemrajani), మరో ఇద్దరు స్నేహితులతో (పరీక్షిత్ దార్, రాజేష్ బల్పాండే) కలిసి బుక్ మై షో స్థాపించారు. ఆశిష్ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం జుహులో పూర్తయింది. ఆ తరువాత మితిబాయి కాలేజీలో గ్రాడ్యుయేట్, సిడెన్‌హామ్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత జే.వాల్టర్ థాంప్సన్ అనే అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించారు.ఆశిష్ హేమ్రజని 1999లో హాలిడే ట్రిప్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ ఒక రోజు చెట్టుకింద కూర్చుని రేడియోలో ప్రోగ్రామ్ వింటూ ఉన్నారు. ఆ సమయంలో రబ్బీ గేమ్ టికెట్లకు సంబంధించిన ప్రకటన గురించి విన్నారు. ఆ సమయంలో ఓ ఆలోచన వచ్చింది. ఇలాంటి టికెట్ల వ్యాపారాన్ని సినిమా రంగంలో ప్రవేశపెడితే బాగుంటుందని అనుకున్నారు.సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన తరువాత ఆలోచనకు కార్యరూపం దాల్చడానికి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తరువాత సిడెన్హామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థులు.. ఆశిష్ స్నేహితులైన పరీక్షిత్ దార్, రాజేష్ బల్పాండేతో కలిసి 'గో ఫర్ టికెటింగ్' ప్రారభించారు. ఇదే తరువాత ఇండియా టికెట్ పేరుతో వచ్చింది. చివరకు బుక్ మై షోగా స్థిరపడింది.ఆశిష్ బుక్ మై షో ప్రారంభించిన సమయంలో స్మార్ట్‌ఫోన్స్, ఆన్లైన్ చెల్లింపులు పెద్దగా అందుబాటులో లేదు. దీంతో చాలా రోజులు ఇందులో ఒడిదుడుకుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక సందర్భంలో బుక్ మై షో మూసి వేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఆశిష్ వెనుకడుగు వేయలేదు. ఒడిదుడుకులు మనల్ని తిరుగులేని వ్యాపారవేత్తను చేస్తాయి అనే మాటలను గట్టిగా నమ్ముకున్న ఆశిష్ ఎప్పుడూ నిరాశ చెందలేదు.ఇదీ చదవండి: భారత్‌లో రూ.10,000 నోటు.. ఎప్పుడు మొదలైందంటే?2006లో నెట్ బ్యాంకింగ్ ప్రారంభమైంది. అంతే కాకుండా దేశంలో మల్టీప్లెక్స్‌ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో ఆశిష్ బుక్ మై షో ఎదగడం ప్రారంభించింది. ఆన్లైన్ చెల్లింపులు ఎప్పుడైతే ఎక్కువయ్యాయి.. క్రమంగా సినిమా టికెట్స్ బుక్ చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో కంపెనీ 2011లో 16 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుతం బుక్ మై షో విలువ ఏకంగా రూ. 7500 కోట్లకు చేరింది. -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన రూ.1500 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపే చూస్తున్నారు. ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నారు. దీంతో ఓటీటీ ప్రేక్షకుల కోసం ఎప్పటికప్పుడు సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ డ్యూన్ పార్ట్- 2 ఓటీటీలోకి వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం రెంటల్ విధానంలోనే మాత్రం అందుబాటులో ఉంది. ప్రస్తుతం రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌తో పాటు బుక్‌మై షో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రూ.1500 కోట్ల బడ్డెజ్తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.4500 కోట్ల వసూళ్లు సాధించింది. 2024లో హాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్‌లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా.. లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్లపై డెనీస్ విల్లెన్యువే దర్శకత్వంలో రూపొందించారు. ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన డ్యూన్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో తిమోతీ ఛాలామెట్, జెండ్యా, రెబాకా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్ కీలక పాత్రలు నటించారు. 2021లో విడుదలైన అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా డ్యూన్‌కు సీక్వెల్‌గా పార్ట్- 2 తీసుకొచ్చారు. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. -
సీఎం ఆగ్రహం.. బుక్ మై షో నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్!
సన్ బర్న్ షోకు సంబంధించి ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షో టికెట్లు విక్రయించడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా షో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అసలు ఈ సన్ బర్న్ షో నిర్వాహకులు ఎవరని నిలదీశారు. ఎలాంటి అనుమతి లేకుండా టికెట్లు విక్రయించడంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ ఆదేశాలతో సన్ బర్న్ ఈవెంట్‌కు ఎలాంటి అనుమతులు లేవని సైబరాబాద్ సీపీ మహంతి వెల్లడించారు. అనుమతి కోసం కూడా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్లు సీపీ తెలిపారు. అనుమతుల్లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఈ సంఘటనపై బుక్ మై షోతో పాటు సన్ బర్న్ షో నిర్వాహకులపై కూడా మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు సన్ బర్న్ షోకు పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. -
‘సోల్డ్ అవుట్’
న్యూఢిల్లీ: ‘మీరు క్యూలో ఉన్నారు... దయచేసి కాసేపు వేచి ఉండండి’... ఈ కాసేపు కాస్తా గంట నుంచి 10 గంటల వరకు కూడా చూపించింది! చివరకు కొద్ది సేపట్లోనే అది కాస్తా ‘సోల్డ్ అవుట్’ బోర్డుతో ముగిసింది. వన్డే వరల్డ్ కప్ టికెట్ల కోసం మంగళవారం ఆన్లైన్లో ప్రయత్నించిన భారత అభిమానుల్లో ఎక్కువ మందికి ఇదే తరహాలో నిరాశ ఎదురైంది. భారత్ ఆడే 9 లీగ్ మ్యాచ్‌లకు సంబంధించి ‘మాస్టర్ కార్డ్’ వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల నుంచి ‘బుక్ మై షో’లో టికెట్లు అందుబాటులో ఉంచారు. అయితే గంటల వ్యవధిలోనే అన్ని మ్యాచ్‌ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు 9 మ్యాచ్‌లకు కూడా ‘సోల్డ్ అవుట్’ అనే చూపిస్తోంది. నిజానికి గత బుధవారం బీసీసీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం 31 ఆగస్టు నుంచి 3 సెపె్టంబర్ వరకు భారత లీగ్ మ్యాచ్‌లకు సాధారణ అభిమానుల కోసం దశలవారీగా టికెట్లు అమ్ముతారు. అయితే ఇప్పుడు ‘సోల్డ్ అవుట్’ అంటే పూర్తిగా అమ్ముడుపోయాయా లేక పరిమిత సంఖ్యలో ‘మాస్టర్ కార్డ్’ కోసం అందుబాటులో ఉంచి మిగతా టికెట్లు ఆపి ఉంచారా తెలీదు. అసలు టికెట్ల సంఖ్య విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఆయా తేదీల్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే! -
ఆన్లైన్ టికెట్లపై 1న ఉత్తర్వులిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల విధానంపై స్టే కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై జూలై 1వ తేదీన తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు వెల్లడించింది. సినిమా టికెట్ల విక్రయంపై ప్రభుత్వం తెచ్చిన సవరణ నిబంధనలను, తదనుగుణ జీవోలను కొట్టేయాలంటూ దాఖలైన ప్రధాన వ్యాజ్యాలపై జూలై 27న తుది విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల వ్యవస్థను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ)కు అనుసంధానిస్తూ ప్రభుత్వం నిబంధనలను సవరించిది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ బుక్ మై షో, మల్టీప్లెక్స్ థియేటర్ల అసోసియేషన్, విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. బుక్ మై షో తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం 2 శాతం సర్వీస్ చార్జి చెల్లించాలని ఆదేశించడమే ప్రధాన అభ్యంతరమని అన్నారు. సర్వీసు చార్జి, ఇతర కన్వీనియన్స్ చార్జీలు కలిపితే తాము అమ్మే టికెట్ ధర ఎక్కువ ఉంటుందన్నారు. ప్రభుత్వం సర్వీసు చార్జి మాత్రమే వసూలు చేస్తున్నందున, వినియోగదారులు ఏపీఎఫ్డీసీ పోర్టల్ ద్వారానే టికెట్ కొంటారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మాకు అలా అనిపించడం లేదు. మీరు కన్వీనియన్స్ చార్జి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అది వసూలు చేయదు. దీంతో ప్రభుత్వం వద్ద తక్కువ రేటుకు టికెట్ దొరుకుతుంది. అది మీకు ఇబ్బంది. మీ సమస్యంతా కన్వీనియన్స్ ఫీజే’ అని వ్యాఖ్యానించింది. వ్యాపారాల్లో జోక్యం చేసుకోకుండా నియంత్రించండి మల్టీప్లెక్స్ థియేటర్ల అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వ ఒప్పందంలో సంతకం చేస్తే తాము కొత్త సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఇది ఆర్థిక భారమన్నారు. పన్నుల విషయంలో ప్రభుత్వానికి ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఇస్తామని తెలిపారు. ఒప్పందాల ద్వారా తమ వ్యాపారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్నారు. ప్రభుత్వ విధానం వల్ల స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోలేమని విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ చెప్పారు. థియేటర్లలో ప్రభుత్వం కూర్చుంటుందని, తాము క్యాంటీన్, పార్కింగ్ నిర్వహణకే పరిమితం కావాలని అన్నారు. అనుబంధ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. దీంతో అనుబంధ వ్యాజ్యాల్లో జూలై 1న ఉత్తర్వులిస్తామని ధర్మాసనం తెలిపింది. పలు కీలక అంశాలు ఉన్నందున కొత్త విధానాన్ని 15–20 రోజుల పాటు ఎందుకు ఆపకూడదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ఏజీ స్పందిస్తూ, కొత్త విధానానికి అత్యధికులు ఆమోదం తెలిపారన్నారు. గత ఆరు నెలలుగా అందరితో చర్చించి, వారి సలహాలతో కొత్త విధానాన్ని తెచ్చామన్నారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరంలేదని చెప్పారు. -
ఆన్లైన్ టికెట్లపై రోజంతా వాదనలు
సాక్షి, అమరావతి: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టులో వాదనలు మంగళవారం వాడీవేడిగా సాగాయి. బుక్ మైషో, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దాదాపుగా రోజంతా వాదనలు సాగాయి. మల్టీప్లెక్స్ థియేటర్ల సంఘం వాదనల నిమిత్తం తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. మధ్యంతర ఉత్తర్వుల జారీకి బుక్ మైషో తరఫున సీనియర్ న్యాయవాది పలుమార్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అందరి వాదనలు విన్న తరువాతే నిర్ణయాన్ని వెలువరిస్తామని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. కొంతకాలం ప్రభుత్వం తెస్తున్న వ్యవస్థను కొనసాగనిద్దామని, అప్పుడు బుక్ మైషో వ్యక్తం చేస్తున్న భయాందోళనలు నిజమో కాదో తేలిపోతుందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. సినిమా టికెట్లను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్లో విక్రయించుకునేందుకు వీలుగా ప్రభుత్వం తెచ్చిన సవరణ చట్ట నిబంధనలతో పాటు ఉత్తర్వులను సవాలు చేస్తూ బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (బుక్ మైషో) యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. బాహుబలికి 50 శాతం ఆక్యుపెన్సీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. బుక్ మైషో లాంటి సంస్థలు రకరకాల చార్జీల పేరుతో చేస్తున్న దోపిడీని అడ్డుకునేందుకే ప్రభుత్వం రంగంలోకి దిగిందన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థను ఏపీఎఫ్డీసీ ద్వారా అనుసంధానం చేస్తున్నామన్నారు. ఆన్లైన్ టికెట్లను 50 శాతం సీటింగ్ కెపాసిటీకి పరిమితం చేసి మిగిలిన టికెట్లను థియేటర్లో నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వంద శాతం టికెట్లను ఆన్లైన్లో బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నాయన్నారు. రూ.100 బేస్ రేటు కలిగిన టికెట్‌ను బుక్ మై షో రూ.145కు విక్రయిస్తోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దేశంలోనే అత్యధిక గ్రాస్ సాధించిన బాహుబలి–2 సినిమాకు కేవలం 50 శాతం ఆక్యుపెన్సీనే బుక్ మైషో లాంటి సంస్థలు చూపాయని నివేదించారు. ఆన్లైన్ టికెట్ విక్రయాలపై తామేమీ నిషేధం విధించలేదని, నియంత్రణ మాత్రమే చేస్తున్నామన్నారు. కొత్త పోర్టల్ వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రభుత్వానికి 2 శాతం లోపు సర్వీస్ చార్జి చెల్లిస్తే సరిపోతుందన్నారు. ప్రభుత్వం పోటీదారుగా వ్యవహరించదని ధర్మాసనానికి స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానాన్ని ముందుకు సాగనివ్వాలని, కొంతకాలం పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. అంతా ప్రభుత్వ పోర్టల్‌లోనే కొంటారు.. బుక్ మైషో తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న ఆన్లైన్ టికెట్ వ్యవస్థ ద్వారా గుత్తాధిపత్యం ఏర్పడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని ఇలాంటి వ్యవస్థ వల్ల వ్యాపారం చేయడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వానికి 2 శాతం సర్వీసు చార్జీ చెల్లించాలంటే వినియోగదారుడి నుంచి అధిక మొత్తాలు వసూలు చేయాల్సి ఉంటుందన్నారు. జూలై 2 నుంచి కొత్త విధానం అమలు చేయకుండా యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని ఎక్కడ ఉందని, ఏ చట్టం నిషేధిస్తుందో చూపాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఒత్తిడి చేయకుండా ఆదేశాలివ్వండి జూలై 2 నుంచి కొత్త విధానం అమలుకు ఏపీఎఫ్‌డీసీతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి నివేదించారు. లేదంటే లైసెన్సులు రద్దు చేస్తామని చెబుతోందన్నారు. ఒప్పందాల కోసం ఒత్తిడి చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ సమయంలో ఏజీ శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ 80 శాతం థియేటర్లకు బీ లైసెన్సులు లేవని తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. -
బుక్ మై షో ‘ఎక్స్ట్రా’ దోపిడీ
సాక్షి, అమరావతి: సినిమా.. సగటు పౌరునికి అందుబాటులో ఉన్న మాద్యమం. కానీ, ఈ వినోదాల వెండితెరను తమ దోపిడీకి రాచబాటగా చేసుకుంటోంది సినిమా మాఫియా. ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాల పేరుతో ‘బుక్ మై షో’ అనే ప్రైవేటు సంస్థ ఏళ్ల తరబడి యథేచ్ఛగా దోపిడీకి తెగబడుతోంది. అడ్డగోలు ఆర్జనకు కక్కుర్తిపడుతున్న థియేటర్ల యాజమాన్యాలు ఇందుకు వత్తాసు పలుకుతున్నాయి. థియేటర్లను గుప్పెటపట్టి.. టికెట్ల ధరలపై అత్యధికంగా కమీషన్లు వసూలుచేస్తూ ‘బుక్ మై షో’ దోచుకుంటోంది. దేశవ్యాప్తంగా వేళ్లూనుకున్న ఈ మాఫియాను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవడంతో ఇప్పుడీ మాఫియా బెంబేలెత్తుతోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సినిమా టికెట్లను ఆన్లైన్లో పారదర్శకంగా విక్రయిస్తామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు కుట్రలకు తెరలేపింది. థియేటర్లను గుప్పెటపట్టి గుత్తాధిపత్యం ‘బుక్ బై షో’ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సినిమా థియేటర్లను గుప్పెట్లో పెట్టుకుంది. థియేటర్ల యజమానులకు డిపాజిట్ల రూపంలో అప్పులిచ్చి తమ సంస్థ ద్వారానే ఆన్లైన్లో టికెట్లు విక్రయించాలనే షరతుతో నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలు చేసుకుంది. ఇది కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్య నిరోధక చట్టానికి విరుద్ధమైనప్పటికీ బేఖాతరు చేస్తోంది. ఏపీలో 1,140 థియేటర్లు ఉండగా.. తెలంగాణాలో 1,250 థియేటర్లు (వాటిలో 40 శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనేనివే) ఉన్నాయి. వీటిల్లోని అత్యధిక థియేటర్లు ‘బుక్ మై షో’ ద్వారానే ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నాయి. అంతేకాక.. దేశంలో ఏకంగా 78 శాతం ఆన్లైన్ సినిమా టికెట్ల విక్రయాలను బుక్ మై షో కంపెనీ తన గుప్పెట్లో పెట్టుకుంది. ఒక్కో టికెట్‌పై రూ.25వరకు అదనపు భారం.. ఇక సినిమా థియేటర్లు తమ గుప్పెట్లోకి వచ్చిన తరువాత టికెట్ల దందాకు ఈ సంస్థ తెరతీసింది. థియేటర్లను బట్టి ఒక్కో టికెట్‌పై రూ.19 నుంచి రూ.25వరకు అదనంగా వసూలుచేస్తోంది. వాటిలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అయితే టికెట్‌కు రూ.8 చొప్పున, మల్టీపెక్స్ థియేటర్లకు రూ.14 చొప్పున కమీషన్ చెల్లిస్తోంది. అంటే.. టికెట్‌పై ఆ సంస్థ రూ.11 వరకు లాభం తీసుకుంటోంది. థియేటర్ల యాజమాన్యాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా 50శాతానికి పైగా టికెట్లను ఈ సంస్థకే కేటాయిస్తున్నాయి. దీంతో ప్రేక్షకుడిపై ఒక్కో టికెట్‌పై రూ.19 నుంచి రూ.25వరకు అదనపు భారం పడుతోంది. ఇలా బుక్ మై షో ఎంతగా దోపిడీకి పాల్పడుతో స్పష్టమవుతోంది. మరోవైపు.. ఎన్ని టికెట్లు ఎంత ధరకు విక్రయిస్తోందన్న రికార్డులు కూడా ప్రభుత్వానికి చెప్పకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. తద్వారా పన్ను ఎగవేతకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో.. మార్కెట్లో ఉన్న కొన్ని పోటీ సంస్థలు సినిమా టికెట్‌పై రూ.11 అదనపు చార్జీతో ఆన్లైన్లో విక్రయిస్తామని ముందుకొచ్చాయి. కానీ, ముందస్తు ఒప్పందాల పేరిట ‘బుక్ మై షో’ సంస్థ అందుకు అడ్డంకులు సృష్టిస్తోంది. రూ.1.95 సర్వీస్ చార్జితోనే విక్రయాలకు ఏపీ నిర్ణయం దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను దోచుకుంటున్న ఈ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. సినిమా టికెట్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్లో విక్రయించాలన్న విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. టికెట్‌పై కేవలం రూ.1.95 మాత్రమే సర్వీస్ చార్జ్‌తో ఆన్లైన్లో సినిమా టికెట్లను విక్రయించాలని నిర్ణయించింది. దాంతో తమ దందాకు అడ్డుకట్ట పడుతుందని ‘బుక్ మై షో’ సంస్థ ఆందోళన చెందింది. ఏపీ ప్రభుత్వ విధానాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే తమ అక్రమాల పుట్టి పూర్తిగా మునిగిపోతుందని ఆ సంస్థ, థియేటర్లు బెంబేలెత్తుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ‘బుక్ మై షో’ కోర్టులో కేసు వేసింది. కానీ, వీరి దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గుత్తాధిపత్యం చట్టవిరుద్ధమే.. మరోవైపు.. బుక్ మై షో గుత్తాధిపత్య పోకడలతో సగటు ప్రేక్షకులు తీవ్రంగా నష్టపోతున్న అంశంపై కొందరు ఢిల్లీలోని ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను ఆశ్రయించారు. దేశంలో ఏ రంగంలో కూడా గుత్తాధిపత్యంతో వినియోగదారులు నష్టపోకుండా చూసే చట్టబద్ధమైన సంస్థ ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’. గత కొన్నేళ్లుగా ఆన్లైన్లో సినిమా విక్రయాల వాటా, వాటి విలువ మొదలైన అంశాలతో నివేదిక సమర్పించాలని కమిషన్ ‘బుక్ మై షో’ సంస్థను ఆదేశించింది. అయినా ఆ సంస్థ ఖాతరు చేయలేదు. ఈ కేసుపై ఇరుపక్షాల వాదనాలు విన్న తరువాత ‘బుక్ మై షో’ గుత్తాధిపత్యంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లుగా కమిషన్ అభిప్రాయపడింది. థియేటర్లతో ముందస్తు ఒప్పందాలు చేసుకోవడం చట్ట విరుద్ధమని చెప్పింది. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసి డైరెక్టర్ జనరల్(డీజీ)ని ఆదేశిస్తూ ఈనెల 16న ఆదేశాలు జారీచేసింది. -
సినిమా టికెట్ల వ్యవహారం.. బుక్ మై షో, ఐనాక్స్‌లపై కేసు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా సినిమా టికెట్లను 100 శాతం ఆన్లైన్లోనే విక్రయిస్తున్న ఆరోపణలపై బుక్ మై షో పోర్టల్‌తో పాటు ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లపై సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తార్నాక ప్రాంతానికి చెందిన విజయ్ గోపాల్ ఫిర్యాదు మేరకు శనివారం నమోదైన ఈ కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 2006లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీఓ నెం.47) ప్రకారం సినిమా ప్రదర్శనకు సంబంధించి సగం టిక్కెట్లను నేరుగా, మిగిలిన సగం ఆన్లైన్లో విక్రయించాల్సి ఉంటుంది. అయితే బుక్ మై షో, ఐనాక్స్‌లు 100 శాతం టికెట్లను ఆన్లైన్లోనే అమ్ముతున్నాయనేది విజయ్ గోపాల్ ఆరోపణ. ఈ మేరకు ఆయన సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆ వీడియో కాల్ ఎత్తారో..బతుకు బస్టాండే -
ఐపీఎల్ అభిమానులకు బుక్ మై షో శుభవార్త..!
ముంబై: ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో ఐపీఎల్ అభిమానులకు శుభవార్త తెలిపింది. భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)తో బుక్ మై షో కీలక ఒప్పందం చేసుకుంది. మార్చి 26న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు సంబంధించిన టికెట్ల విక్రయ హక్కులను సంస్థ పొందింది. ఈ ఒప్పందంలో భాగంగా.. ఈ ఏడాది మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై, నవీ ముంబై మరియు పూణేలలో జరిగే 70 లీగ్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను విక్రయించడంతో పాటు గేట్ ఎంట్రీ, ప్రేక్షక నిర్వహణ సేవలను కూడా బుక్ మై షో అందించనుంది. అయితే, ఇంకా ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు వేదికను బీసీసీఐ ప్రకటించలేదు. ఈ ఐపీఎల్ 15వ సీజన్లో కొత్త అహ్మదాబాద్, లక్నో జట్లతో సహా ఇతర 10 జట్లు పాల్గొననున్నాయి. 70 మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ ధరలు రూ.2500 నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కొనుగోలు అందుబాటులోకి వచ్చాయి. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లు తిరిగి మన స్వదేశంలో జరగనున్నాయి. వేదికల వద్ద అభిమానులు & సిబ్బంది భద్రత & శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని బుక్ మై షో కఠినమైన కోవిడ్-ప్రోటోకాల్స్ అనుసరిస్తుందని కంపెనీ తెలిపింది. వాంఖడే స్టేడియం(ముంబై), డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం(నవీ ముంబై)లో 20 చొప్పున, బ్రాబోర్న్ స్టేడియం (ముంబై), ఎంసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం(పూణే)లో 15 చొప్పున మ్యాచ్‌లు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ VS కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో మార్చి 26న తొలి టాటా ఐపీఎల్ 2022 మ్యాచ్ ప్రారంభం కానుంది. (చదవండి: ఆంబ్రేన్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్.. అదిరిపోయే ఫీచర్స్ ఇవే!) -
‘కూ’ కోసం దేశీ ఇన్వెస్టర్ల క్యూ!
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా తెరపైకొచ్చిన దేశీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం ‘కూ’ భారీగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. టికెట్ల బుకింగ్ పోర్టల్ బుక్‌మైషో సీఈవో ఆశీష్ హేమ్‌రాజానీ, డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థ జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కొత్త ఇన్వెస్టర్లు ముందుకొస్తుండటంతో.. మరో ఉత్పత్తి కోసం గతంలో ‘కూ’లో ఇన్వెస్ట్ చేసిన చైనా సంస్థ షున్‌వై .. తన వాటాలను విక్రయించి పూర్తిగా వైదొలగాలని భావిస్తోంది. పలువురు దేశీ ఔత్సాహిక వ్యాపారవేత్తలు .. ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తిగా ఉన్నట్లు ‘కూ’ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. బుక్‌మైషో వ్యవస్థాపకుడు, సీఈవో ఆశీష్ హేమ్‌రాజానీ, బౌన్స్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు వివేకానంద హలెకెరె, జిరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ సహా పలువురు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినట్లు వివరించారు. ‘దేశీ ఇన్వెస్టరు 3వన్4 క్యాపిటల్ సారథ్యంలోని ఇన్వెస్టర్లు .. ‘కూ’ మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్‌లో ఇటీవలే 4.1 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. మా సంస్థలో భారతీయ ఇన్వెస్టర్లు మరింతగా పెట్టుబడులు పెడుతున్నారనడానికి ఇదే నిదర్శనం‘ అని రాధాకృష్ణ తెలిపారు. గతంలో వోకల్ అనే ఉత్పత్తి కోసం ‘కూ’ లో ఇన్వెస్ట్ చేసిన షున్‌వై .. కొత్త ఇన్వెస్టర్లకు వాటాలను విక్రయించి పూర్తిగా వైదొలగనుందని ఆయన వివరించారు. ‘ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన 3వన్4 క్యాపిటల్, కలారి తదితర సంస్థలు కూడా మరికొంత వాటాలు కొనుగోలుచేయనున్నాయి’ అని రాధాకృష్ణ తెలిపారు. పది రెట్లు పెరిగిన డౌన్లోడ్స్ .. ప్రస్తుతం ‘కూ’ యాప్‌నకు ముప్ఫై లక్షలకు పైగా యూజర్లు ఉన్నారు. ఈ వారంలో యాప్ డౌన్లోడ్లు ఏకంగా పది రెట్లు పెరిగాయి. భారతీయ వ్యవస్థాపకులు, దేశీయంగా రిజిస్ట్రేషన్‌తో పూర్తి దేశీ యాప్‌గా కూ కొద్ది రోజులుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు మొదలుకుని వివిధ ప్రభుత్వ శాఖలు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నాయి. విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను కట్టడి చేయాలన్న ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ ట్విటర్‌పై అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కేంద్ర ఐటీ శాఖ కూడా ‘కూ’ నే ఎంచుకుంది. పీయూష్ గోయల్ లాంటి కేంద్ర మంత్రులు సైతం ‘కూ’ యాప్‌నకు మళ్లాలంటూ పిలుపునివ్వడంతో.. దీనికి మరింతగా ప్రాచుర్యం పెరిగింది. ఆత్మనిర్భర్ చాలెంజ్ విజేత.. ‘కూ’ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ గతంలో ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సంస్థ ట్యాక్సీఫర్ష్యూర్ను నెలకొల్పారు. ఆ తర్వాత దాన్ని మరో ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ కంపెనీ ఓలాకు విక్రయించారు. అటుపైన మయాంక్ బిదావత్కాతో కలిసి 2017లో ప్రాంతీయ భాషల్లో ఆన్లైన్ ప్రశ్నోత్తరాల ప్లాట్‌ఫాం వోకల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘కూ’ ప్లాట్‌ఫామ్‌ను గతేడాది ఆవిష్కరించారు. యూజర్లు భారతీయ భాషల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికగా దీన్ని రూపొందించారు. తెలుగు, హిందీ, బెంగాలీ సహా పలు ప్రాంతీయ భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన ఆత్మనిర్భర్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో గెలుపొందిన వాటిల్లో ‘కూ’ కూడా ఒకటి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ ఎగ్జిక్యూటివ్ టీవీ మోహన్‌దాస్ పాయ్ వంటి ప్రముఖులు .. దీనికి మద్దతుగా ఉన్నారు. గత వారమే యాక్సెల్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్, డ్రీమ్ ఇన్క్యుబేటర్, 3వన్4 క్యాపిటల్ తదితర సంస్థలు ‘కూ’లో ఇన్వెస్ట్ చేశాయి. -
2 నెలలు... 7 లక్షల టికెట్లు...
దాదాపు ఏడు నెలల తర్వాత సినిమా థియేటర్లు మళ్లీ ఆరంభమైన విషయం తెలిసిందే. లాక్డౌన్లో విడుదలైన తొలి సినిమా ‘టెనెట్’. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ హాలీవుడ్ చిత్రాన్ని ఎక్కువమంది ప్రేక్షకులు చూశారని ‘బుక్ మై షో’ పేర్కొంది. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 18 వరకూ ఈ సినిమా టికెట్లు 3 లక్షల వరకూ అమ్ముడుపోయాయని కూడా లెక్క చెప్పింది. థియేటర్ల రీ–ఓపెన్ తర్వాత మన దేశంలో ఇన్ని టికెట్లు తెగిన సినిమా ఇదేనంటూ ‘షో ఆఫ్ ది ఇయర్ –2020’ అనే తన రిపోర్ట్‌లో తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెరిచిన 2800 థియేటర్ స్క్రీన్లలో, ఈ రెండు నెలల్లో మొత్తం మీద 7 లక్షల టికెట్లు తెగినట్టు బుక్ మై షో వారి నివేదిక వివరించింది. ఎక్కువ మంది చూసిన చిత్రాలలో రెండు, మూడు స్థానాల్లో తమిళ సినిమా ‘బిస్కోత్’, ఆ తర్వాత ‘ఇరండామ్ కూత్తు’ నిలిచాయి. ఆ తర్వాత హిందీ చిత్రం ‘సూరజ్ పే మంగళ్ భారీ’, బెంగాలీ సినిమా ‘డ్రాకులా సార్’ టికెట్లు బాగా తెగాయి. -
సాహో అ'ధర'హో!
సాక్షి, హైదరాబాద్: మొన్న మహర్షి నేడు సాహో.. టికెట్ల ధరలు చుక్కలు చూపెడుతున్నాయి. ఈ నెల 30న విడుదల కానున్న సాహో సినిమా టికెట్ల ధరలను రాష్ట్రంలో కొన్ని థియేటర్ యాజమాన్యాలు అమాంతంగా పెంచేశాయి. దీంతో సామాన్య ప్రేక్షకులకు వినోదభారం తప్పడం లేదు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాకు సగానికిపైగా థియేటర్లు రేట్లు పెంచడం వినోద ప్రియులను కలవరపెడుతోంది. ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసే ‘బుక్ మై షో’వెబ్సైట్లో ఈ మేరకు పెంచిన ధరలు దర్శనమిస్తున్నాయి. దాదాపు వారం రోజులుగా ఈ పెంచిన ధరలతోనే బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఈ సినిమా శుక్రవారం విడుదలవనుంది. తరువాత శని, ఆదివారాలు సెలవు దినాలు రావడం, సోమవారం వినాయక చవితి కావడంతో సినిమా బుకింగ్‌లు అమాంతం పెరిగాయి. రూ.10 నుంచి రూ.150 అధికంగా.. సాధారణంగా నాన్ ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్ ధర రూ.80, ఏసీ థియేటర్లలో రూ.125గా ఉంటుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చాలా థియేటర్లు ఇవే ధరల్ని కొనసాగిస్తున్నాయి. కానీ కొన్ని మాత్రం అస్సలు పాటించడం లేదు. మొదటివారం వీలైనంత వసూలు చేసుకోవాలన్న ఆలోచనతో టికెట్ ధరలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ల్లో ఈ వ్యత్యాసం అధికంగా ఉంటోంది. వాస్తవానికి జీఎస్టీతో కలిపి మల్టీప్లెక్స్‌లో టికెట్ల ధర రూ.138 వద్ద మొదలై గరిష్టంగా రూ.150 వరకు ఉంది. కానీ, సాహో సినిమాకు ఈ వ్యత్యాసం మరీ పెరిగిపోయింది. కొన్ని రూ.175, ఇంకొన్ని రూ.230కి చేరింది. ఇక ఓ ప్రముఖ థియేటర్లో అయితే సోఫా టికెట్ ధర రూ.300, బాల్కనీ ధర రూ.200గా ఉంది. అయినా దీనిపై అధికారులు దృష్టి సారించకపోవడం గమ నార్హం. ప్రస్తుతం అన్ని సినిమాలకు ఇవే థియేటర్లు వసూలు చేస్తోన్న మొత్తంలో సాహో సినిమాకు వసూలు చేస్తో న్న మొత్తంలో కనిష్టంగా రూ.10 నుంచి గరిష్టంగా రూ.150కి వరకు వ్యత్యాసం ఉండటం గమనార్హం. సామాన్యులకు అందుబాటులో ఉండే సెకండ్ క్లాస్ టికెట్ ధరలను సైతం భారీగా పెంచారు. చాలా థియేటర్లలో సెకండ్ క్లాస్ కనిపించకుండా పోతోంది. ఏపీ హైకోర్టుకు వివాదం.. సాహో సినిమాకు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారని ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. సాహో సినిమా టికెట్ల రేటు పెంపునకు అనుమతించలేదు. తమకు అన్ని సినిమాలు ఒక్కటేనని, ఒక్కో సినిమాను ఒక్కోలా చూడలేమని తేల్చి చెప్పింది. కాగా, మహర్షి సినిమా విడుదల సమయంలోనూ కొన్ని థియేటర్ యాజమాన్యాలు తమకు తామే టికెట్ల రేటు పెంచాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కానీ, రెండు మూడు రోజుల అనంతరం థియేటర్ యాజమాన్యాలు టికెట్ల రేట్లు తగ్గించడంతో వివాదం సద్దుమణిగింది. -
బుక్–మైషోలో వాటా కోసం దిగ్గజాల క్యూ
ముంబై: ఆన్లైన్ టికెటింగ్ సంస్థ బుక్–మైషోలో వాటా కొనుగోలు కోసం పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. బుక్–మైషోలో 10–12 శాతం వాటా కొనుగోలు కోసం ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్, సింగపూర్ సావరిన్ వెల్త్‌ఫండ్ టెమసెక్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. వాటా కొనుగోళ్లకు సంబంధించిన చర్చలన్నీ తుది దశకు చేరాయని, మరికొన్ని వారాల్లో ఖరారవుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థల డీల్స్ ఖరారైతే, బుక్–మైషో విలువ వంద కోట్ల డాలర్లను (రూ.7,000 కోట్లు) దాటుతుందని అంచనా. గత ఏడాది జూలైలో బుక్‌మైషో సంస్థ టీపీజీ గ్రోత్ నుంచి 10 కోట్ల డాలర్లు సమీకరించింది. అప్పుడు ఈ కంపెనీ విలువను 80 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు. తాజా డీల్స్‌లో భాగంగా సైఫ్ పార్ట్నర్స్ తన మొత్తం 5.6 శాతం వాటాను విక్రయిస్తుందని, యాక్సెల్ ఇండియా తన వాటాలో కొంత భాగాన్ని అమ్మేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2016 వరకూ ఆన్లైన్ టికెటింగ్ సెగ్మెంట్లో బుక్–మైషో సంస్థదే గుత్తాధిపత్యం. ఆ తర్వాత పేటీఎమ్ రంగంలోకి రావడంతో బుక్–మైషో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. పేటీఎమ్‌లో కూడా భారీగా పెట్టుబడులుండటంతో బుక్–మైషో నుంచి వైదొలగాలని సైఫ్ పార్ట్నర్స్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. నెలకు 2 కోట్ల టికెట్లు... 1999లో బిగ్‌ట్రీ ఎంటర్టైన్మెంట్ పేరుతో బుక్–మైషో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఆరంభంలో థియేటర్లలో సీట్ల మేనేజ్మెంట్ కార్యకలాపాలు చూసిన సంస్థ, ఆ తర్వాత ఆన్లైన్లో టికెట్లను అమ్మడం మొదలెట్టింది. ప్రస్తుతం నెలకు 2 కోట్ల వరకూ టికెట్లను అమ్ముతోంది. సినిమా టికెట్లనే కాకుండా సంగీత కచేరీలు, స్టాండ్–అప్ కామెడీ షోలు, స్పోర్ట్స్ ఈవెంట్లు తదితర కార్యక్రమాల టికెట్లను కూడా బుక్–మైషో విక్రయిస్తోంది. ఈ సంస్థ మొత్తం ఆదాయంలో ఈ సెగ్మెంట్ వాటా దాదాపు మూడోవంతు ఉంటుందని అంచనా. 2016–17 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.391 కోట్లకు పెరగ్గా, నికర నష్టాలు 17 శాతం పెరిగి రూ.162 కోట్లకు చేరాయి. -
సెకనుకు 12 టికెట్లు బుక్!
బాహుబలి-2 సినిమా అన్ని రకాల రికార్డులను బద్దలుకొడుతోంది. తాజాగా ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షో కూడా ఈ విషయం ప్రకటించింది. ఇప్పటివరకు తాము దాదాపు 33 లక్షల టికెట్లు అమ్మినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రతి సెకనుకు 12 టికెట్లు బుక్ అవుతున్నాయని, దాంతో ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బాహుబలి మొదటి పార్ట్ కంటే రెండో భాగానికి 350 శాతం ఎక్కువగా అడ్వాన్స్ టికెట్ల అమ్మకాలు జరిగినట్లు ప్రకటించింది. కేవలం దక్షిణ భారతంలోనే కాక, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా టికెట్ల అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గలేదని, దాంతో ఇది భారతీయ సినీ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తిందని బుక్ మై షోకు చెందిన ఆశిష్ సక్సేనా అన్నారు. విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొదటిరోజే వందకోట్ల క్లబ్బులో చేరిపోయిందన్నారు. భాషా భేదాల సంకెళ్లను కూడా ఈ సినిమా తెంచుకుందని, సినిమా బాగుంటే ఎక్కడైనా ఎవరైనా చూస్తారన్న విషయం మరోసారి రుజువైందని ఆయన చెప్పారు. -
హైదరాబాద్ స్టార్టప్‌ను కొనుగోలు చేసిన బుక్‌మైషో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ టికెట్ బుకింగ్ దిగ్గజం ‘బుక్‌మైషో’.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మస్తిటికెట్స్ను చేజిక్కించుకుంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. మస్తిటికెట్స్ కొనుగోలు ద్వారా ఉద్యోగులతో పాటూ సంస్థ ఒప్పందాలు కూడా బుక్‌మైషోకు బదిలీ అవుతాయని బుక్‌మైషో సీఈఓ ఆశిష్ హెమ్రాజనీ ఒక ప్రకటనలో తెలిపారు. ముంబై కేంద్రంగా 2007లో ప్రారంభమైన బుక్‌మైషో దేశంలోని 400 పట్టణాల్లో సేవలందిస్తోంది. నిధులు సమీకరించిన వీడెలివర్.. కాగా హైపర్ లోకల్ లాజిస్టిక్ సంస్థ వీడెలివర్ హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌సీపీ హోల్డింగ్స్, ఆస్ట్రేలియాకు చెందిన బాస్ కన్స్ల్టింగ్ నుంచి నిధులు సమీకరించింది. ఎంత మొత్తమనేది మాత్రం వెల్లడించలేదు. ఈ నిధులను టెక్నాలజీ అభివృద్ధి, సేవల విస్తరణ నిమిత్తం వినియోగిస్తామని.. కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ శ్రీనివాస్ మాధవం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
బుక్ మై షో టాప్–10లో కబాలి
బుక్ మై షో టాప్–10లో నమోదైన చిత్రంగా సూపర్‌స్టార్ నటించిన కబాలి చిత్రం చోటు చేసుకోవడం విశేషం. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత దాన్ని అందిపుచ్చుకోవడానికి అన్ని రంగాల మాదిరిగానే సినీరంగానికి చెందిన వారు, సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య నానాటికి అధికం అవుతోందని చెప్పకతప్పదు. ఇక సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ విధానం అమల్లోకొచ్చి చాలా కాలం అయ్యింది. అలాంటి సోషల్ మాద్యమాల్లో బుక్ మై షో అగ్రగామిగా రాణిస్తోంది. సినిమా టిక్కెట్ల కోసం భారతదేశంలో అత్యధిక ప్రేక్షకులు ఉపయోగిస్తున్న సోషల్ మాద్యమం బుక్ మై షో. ఈ మద్యమం ద్వారా 2016లో అధికంగా ప్రేక్షకులు టికెట్స్ బుక్ చేసుకున్న చిత్రాల టాప్–10లో రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం నమోదు కావడం విశేషం. ఇక బాలీవుడ్ బాద్షా నటించిన ఫ్యాన్ చిత్రం 14వ స్థానానికి పరిమితమయ్యింది. అదే విధంగా రీజినల్ భాషా చిత్రాల పట్టికను తీసుకుంటే 2016లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా కబాలి రికార్డు సాధించినట్టు బుక్ మై షో కో–ఫౌండర్, డైరెక్టర్ పరిక్షిత్ దర్ పేర్కొన్నారు. ఇక తెలుగులో చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ వసూళ్లను సాధించిన చిత్రంగా అఆ, మలయాళంలో పులిమురుగన్, కన్నడంలో గోది బన్న «సధర్న మై కట్టు చిత్రాలు రికార్డు సాధించినట్లు ఆయన తెలిపారు. కాగా బుక్ మై షో ద్వారా టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య 2016లో భారీగా పెరిగిందని, ఇది 2017లో మరింతగా పెరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. -
బుక్ మైషో భారీ నిధుల సమీకరణ
రూ.550 కోట్ల డి రౌండ్ ఫండింగ్ న్యూఢిల్లీ: బుక్‌మైషో(బీఎంఎస్)ను నిర్వహించే బిగ్‌ట్రీ ఎంటర్టైన్మెంట్ తాజాగా రూ.550 కోట్ల నిధులను సమీకరించింది. ఈ నిధుల్లో అధిక భాగం అమెరికాకు చెందిన స్ట్రైప్స్ గ్రూప్ నుంచి లభించగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు-నెట్వర్క్ 18, యాక్సెల్ పార్ట్నర్స్, ఎస్ఏఐఎఫ్ పార్ట్‌నర్స్‌లు కూడా ఇన్వెస్ట్ చేశాయి. కాగా స్ట్రైప్స్ గ్రూప్‌కు భారత మార్కెట్లో ఇదే తొలి పెట్టుబడి. ఈ డి రౌండ్ ఫండింగ్‌లోనే బిగ్‌ట్రీ ఎంటర్టైన్మెంట్ అధిక మొత్తంలో పెట్టుబడులను సమీకరించింది. ఈ తాజా నిధులతో దేశీయ మార్కెట్లో ఆఫర్స్‌ను మరింత పటిష్టం చేస్తామని, అంతర్జాతీయంగా మరింతగా విస్తరిస్తామని బుక్‌మైషో పేర్కొంది. అంతేకాకుండా తమ ప్లాట్‌ఫామ్‌పై కంటెంట్‌ను మరింత శక్తివంతం చేస్తామని, బిగ్ డేటా, ఎనలిటిక్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను కొనుగోలు చేస్తామని బుక్‌మైషో సీఈవో, వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆశిష్ హేమ్జ్రని వెల్లడించారు. ఆదాయం వంద శాతం వృద్ధి... కాగా ఇప్పటివరకూ బుక్‌మైషో రూ.200 కోట్ల నిధులను సమీకరించిందని, ప్రస్తుత రౌండ్ నిధుల సమీకరణ పరంగా చూస్తే కంపెనీ విలువ రూ.3,500 కోట్ల సమీపంలో ఉంటుందని హేమ్జ్రని చెప్పారు. గత నెలలోనే ఇండోనేసియా మార్కెట్లోకి ప్రవేశించామని, శ్రీలంక మార్కెట్లోకి ఈ నెలలో ప్రవేశిస్తామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో బీఎంఎస్ ప్లాట్‌ఫామ్‌పై 10 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఈ ఏడాది ఆదాయం 100 శాతం వృద్ధి చెందుతుందన్నారు. -
నేటినుంచి భారత్ మ్యాచ్‌ల టికెట్లు
టి20 ప్రపంచకప్‌లో భారత్ ఆడే నాలుగు లీగ్ మ్యాచ్‌లతోపాటు రెండు సెమీస్, ఫైనల్ మ్యాచ్ టికెట్లు నేటినుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఏడు మ్యాచ్‌ల కోసం లాటరీ పద్ధతిని అనుసరిస్తారు. అభిమానులు ‘బుక్ మై షో’లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్చి 2 వరకు ఈ అవకాశం ఉంది. ఆ తర్వాత లాటరీ తీసి టికెట్లు అమ్ముతారు. ఇతర మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. -
కోటీశ్వరుడిని చేసిన ఐడియా!
విజయుడు మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ‘బుక్ మై షో’ ప్రారంభించారు. పదిహేను సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. అయితే ఎప్పుడూ నిరాశ పడలేదు. మనుషుల్లో రెండు రకాలు వారు ఉంటారు. విధిని నమ్ముకునే వాళ్లు. విధిగా ప్రయత్నం చేసి విజయం సాధించేవాళ్లు. ముప్పై తొమ్మిది సంవత్సరాల ఆశిష్ హేమ్రాజని రెండో కోవకు చెందిన వ్యక్తి. ‘‘ఓడిపోవడమే అంటే ఏమిటో కాదు...ప్రయత్నించకపోవడమే’’ అంటారు ఆయన.ఆన్లైన్ టికెటింగ్ సర్వీస్‌ను 1999లో ప్రారంభించారు ఆశిష్. పాతికవేలతో ప్రారంభించిన ఆ వ్యాపారం ఇప్పుడు కోట్లలోకి చేరుకుంది. మూవీ, ఈవెంట్ టికెటింగ్ పోర్టల్‌గా దేశంలోనే అగ్రగామిగా నిలచింది. ముంబయిలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ మార్కెటింగ్‌లో పట్టా పుచ్చుకున్న ఆశిష్ ఆ తరువాత ‘జె. వాల్టర్ థామ్సన్’ అడ్వర్వైజింగ్ కంపెనీలో చేరారు. ఆశిష్‌కు ప్రయాణాలంటే వల్లమాలిన ఇష్టం.ప్రయాణాలలో సృజనాత్మక ఆలోచనలు మొలకెత్తుతాయనేది ఆయన విషయంలో నిజమైంది. ఒకసారి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు రేడియో వింటున్నారు. రగ్బీ ఆటకు టికెట్లు అమ్మడానికి సంబంధించిన కార్యక్రమం అది. ఈ కార్యక్రమం తరువాత ఆశిష్ ఒక చెట్టు కింద నిల్చున్నాడు. అయితే పండేమీ రాలి పడలేదు. ఒక ఐడియా మాత్రం వచ్చింది. అదే ‘బుక్ మై షో’ రాబోయే రోజుల్లో ఇంటర్నెట్దే హవా అని గ్రహించిన ఆశిష్ ‘బుక్ మై షో’కు రూపకల్పన చేశారు. మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ‘బుక్ మై షో’ ప్రారంభించారు. పదిహేను సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. అయితే ఎప్పుడూ నిరాశ పడలేదు. ‘‘ఒడిదుడుకులు మనల్ని తిరుగులేని వ్యాపారవేత్తను చేస్తాయి’’ అంటారు ఆయన. ‘‘అనుభవాలే పాఠాలు నేర్పుతాయి. యూనివర్శిటీలు కాదు’’ అని నమ్మే ఆశిష్ అదృష్టాన్ని నమ్ముకోలేదు. కష్టాన్ని నమ్ముకున్నారు. అందుకే ఇంత పెద్ద విజయాన్ని సాధించారు. -
ఎయిర్ షోలో యూకే బృందంతో విన్యాసాలు..
ఏవియేషన్ షో టికెట్లను బుక్‌మైషో పోర్టల్, యాక్సిస్ బ్యాంకు కేంద్రాలు, అలాగే బేగంపేట విమానాశ్రయం వద్ద విక్రయిస్తామని ఫిక్కీ ట్రేడ్ ఫెయిర్స్ ప్రాంతీయ డెరైక్టర్ వివేక్ కొడికల్ చెప్పారు. వైమానిక విన్యాసాల్లో పేరున్న యూకేకు చెందిన మార్క్ జెఫరీస్, టామ్ క్యాజిల్స్ ప్రదర్శన ఈసారి హైలైట్‌గా నిలవనుంది. ఉదయం 11, మధ్యాహ్నం 3 గంటలకు వీరి విన్యాసాలు అయిదు రోజులపాటు ఉంటాయి. బిజినెస్ సందర్శకులకు 12-14 తేదీల్లో, సాధారణ ప్రజానీకానికి 15, 16న మాత్రమే అనుమతిస్తారు. 15, 16 తేదీల్లో రోజుకు రెండు సెషన్లుగా ఉదయం 10 నుంచి 1, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ప్రదర్శన ఉంటుంది. ప్రతి సెషన్‌కు 5,000 టికెట్లను మాత్రమే జారీ చేస్తారు. నిరాశ కలిగించే అంశమేమంటే ప్రపంచంలో అతిపెద్ద విమానమైన ఏ380 కేవలం బిజినెస్ విజిటర్లను మాత్రమే అలరించనుంది. 12-14 తేదీల్లో మాత్రమే దీనిని ప్రదర్శిస్తున్నారు.