![Hyderabad: Case Booked Against Inox Book My Show Over 100 Percent Online Ticket Sale] - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/03/30/Untitled-5.jpg.webp?itok=w3RrXJ-z)
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా సినిమా టికెట్లను 100 శాతం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్న ఆరోపణలపై బుక్ మై షో పోర్టల్‌తో పాటు ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లపై సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తార్నాక ప్రాంతానికి చెందిన విజయ్ గోపాల్ ఫిర్యాదు మేరకు శనివారం నమోదైన ఈ కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
2006లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీఓ నెం.47) ప్రకారం సినిమా ప్రదర్శనకు సంబంధించి సగం టిక్కెట్లను నేరుగా, మిగిలిన సగం ఆన్‌లైన్‌లో విక్రయించాల్సి ఉంటుంది. అయితే బుక్ మై షో, ఐనాక్స్‌లు 100 శాతం టికెట్లను ఆన్‌లైన్‌లోనే అమ్ముతున్నాయనేది విజయ్ గోపాల్ ఆరోపణ. ఈ మేరకు ఆయన సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment