online tickets
-
మరో 10 రోజుల్లో క్రికెట్ పండుగ.. ఆన్లైన్లో టికెట్లు ఇలా బుక్ చేసుకోవచ్చు
ఐపీఎల్-2023 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 10 రోజుల్లో క్రికెట్ పండుగ ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 31న జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభమవుతుంది. మార్చి 31 నుంచి మే 28 వరకు జరిగే ఈ క్రికెట్ సంబరంలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రతి జట్టు సొంత మైదానాల్లో 7 మ్యాచ్‌లు ఆడనుండటంతో ఈసారి మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందు భారీ సంఖ్యలో అభిమానులు మైదానాలకు తరలిరావచ్చని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్లకు భారీగా డిమాండ్ పెరుగనుంది. దీంతో అభిమానులు టికెట్ల కోసం ముందుగానే ఎగబడుతున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి ఆన్లైన్లో బుకింగ్ సేవలను పేటీఎమ్ ఇన్సైడర్.ఇన్, బుక్ మై షో, టికెట్జీనీ సంస్థలు అందిస్తున్నాయి. ఆయా ఫ్రాంచైజీల అధికారిక వెబ్సైట్ల ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ల ధరలు రూ. 500 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది (వెన్యూని బట్టి టికెట్ ధర నిర్ణయించబడుతుంది). వెబ్సైట్ లేదా సంబంధిత యాప్‌ల ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. బుకింగ్ కన్ఫర్మేషన్ అయిన 72 గంటల తర్వాత టికెట్ హార్ఢ్ కాపీని ఆన్లైన్లోనే పొందవచ్చు. -
ఆరు లక్షల టికెట్లు 60 నిమిషాల్లో ఖాళీ
తిరుమల: శ్రీవారి దర్శనాలకు ఆన్లైన్లో డిమాండ్ కొనసాగుతూనే ఉంది. మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను శుక్రవారం ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. ఆరు లక్షల టికెట్లను భక్తులు 60 నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసేసుకున్నారు. ఏప్రిల్, మే మాసాలకు సంబంధించిన అంగప్రదక్షిణ టికెట్లను రోజుకు 750 చొప్పున టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తే కేవలం 9 నిమిషాల వ్యవధిలో భక్తులు పొందారు. మార్చి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రోజుకు 20 వేల చొప్పున 6.2 లక్షల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తే గంటా 25 నిమిషాల వ్యవధిలో భక్తులు కొనుగోలు చేసేశారు. దీంతో టీటీడీ ఖాతాలో గంట వ్యవధిలో రూ.18.6 కోట్లు జమైంది. వయోవృద్ధులు, వికలాంగుల దర్శనానికి సంబంధించి రోజుకు వెయ్యి చొప్పున మార్చి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తే గంటా 35 నిమిషాల వ్యవధిలో భక్తులు పొందారు. ఇక మూడు నెలలకు సంబంధించి రూ.10 వేల శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తే భక్తులు నుంచి అదే స్పందన లభిస్తోంది. మూడు నెలల కాలానికి సంబంధించిన 46 వేల టికెట్లను విడుదల చేస్తే రెండు గంటల వ్యవధిలో 10 వేల టికెట్లను భక్తులు కొనుగోలు చేయడంతో టీటీడీకి రూ.10 కోట్లు జమైంది. ఇలా ధరలతో సంబంధం లేకుండా శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయడమే తరువాయి అన్నట్లుగా భక్తులు పొందుతున్నారు. కాగా, తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి వరకు 61,265 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
22న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల: మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లకు ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ 22న ఉదయం 10 గంటల నుంచి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి సేవను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వ దర్శనానికి 10 గంటలు తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం అర్ధరాత్రి వరకు 61,374 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.4.20 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు ఉన్నవారికి సకాలంలో, దర్శనం టికెట్లు లేనివారికి 10 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న వారికి 2 గంటల్లో దర్శనమవుతోంది. కాగా, శ్రీవారిని మంగళవారం ఏపీ హోం మంత్రి తానేటి వనిత, ఇండియన్ క్రికెట్ క్రీడాకారుడు సూర్యకుమార్ యాదవ్, ఎంపీలు ప్రిన్సెస్ దియా కుమారి, శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. అలాగే, మంత్రి తానేటి వనిత కుటుంబ సభ్యులతో తిరుచానూరుకు వెళ్లి పద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. -
శ్రీవాణి దర్శనం టికెట్ల కోటా రోజుకు 1000
తిరుమల: శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేసింది. ఇందులో ఆన్లైన్లో 750, ఆఫ్ లైన్లో 250 టికెట్లను జారీచేస్తారు. ఇప్పటికే టీటీడీ 500 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయగా, అదనంగా బుధవారం మరో 250 టికెట్లు విడుదల చేయనుంది. మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. ఇక నుంచి శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌ను అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్టు కౌంటర్లో మాత్రమే ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తారు. శ్రీవాణి దాతలు బ్రేక్ దర్శనం టికెట్‌కి బోర్డింగ్ పాస్‌ను జతచేయాలి. టికెట్‌పై ఎయిర్‌లైన్ రిఫరెన్స్‌తో కూడిన పీఎన్ఆర్ నంబర్‌ను కూడా నమోదు చేయించాలి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని సిబ్బంది బ్రేక్ దర్శన టికెట్‌తో పాటు బోర్డింగ్ పాస్‌ను తనిఖీ చేసి దర్శనానికి అనుమతిస్తారు. తిరుప్పావడ సేవ పునఃప్రారంభం తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావడ ఆర్జిత సేవ ఈ నెల 12 నుంచి పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం యాత్రికులు తిరుమలలోని సీఆర్వో కౌంటర్లో నమోదు చేసుకోవాలి. వీరికి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఎల్రక్టానిక్ డిప్ ద్వారా 25 టికెట్లు జారీ చేస్తారు. నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం తిరుమలలో నిర్ణీత సమయంలో కేటాయించిన టైమ్స్ స్లాట్ టికెట్లకు త్వరితగతిన దర్శనమవుతోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 56,003 మంది స్వామి వారిని దర్శించుకోగా, 20,365 మంది తలనీలాలు సమర్పించారు. -
ఏపీలోని ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే శ్రీశైలంలో ఆన్ లైన్ సేవలని నైన్ అండ్ నైన్ సంస్ధ సహకారంతో చేపట్టామని తెలిపారు. శ్రీశైలంలో విజయవంతం కావడంతో ఇపుడు ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు అదే సంస్ధ ఉచితంగా చేపట్టిందన్నారు. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు అన్ని దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలు విస్తరిస్తామన్నారు. అవినీతిని అరికట్టేందుకు.. పారదర్శత కోసం ఆన్లైన్ సేవలు ఉపయోగపడతాయన్నారు. క్యూ లైన్ నిర్వహణ కూడా ఈ యాప్ ద్వారా చేస్తామన్నారు. రూమ్‌లు, దర్శనాలు, సేవలు, ఈ- హుండీ.. ఇలా అన్నీ ముందుగానే ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. తొమ్మిది ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు ముందుగా ప్రారంభిస్తున్నామన్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయానికి దసరా మహోత్సవాల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం, శ్రీకాళహస్తి, కాణిపాకం, పెనుగంచిప్రోలులలో కూడా ఆన్లైన్ సేవలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఆలయ భూములు, ఆభరణాలపై జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. ఆన్‌లైన్‌తో పాటే భక్తులు ఆఫ్ లైన్లో సేవలు కొనసాగుతాయని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ గెలుస్తాం: మంత్రి పెద్దిరెడ్డి) -
ఆన్లైన్లో శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మొత్తం 600 టికెట్లను జారీ చేస్తారు. రూ.2,500 చెల్లించి భక్తులు టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు స్నపన తిరుమంజనంలో, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు. పవిత్రోత్స వాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1 వద్దకు చేరుకోవాలి. టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజి నల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి. (క్లిక్: బ్రహ్మోత్సవాల సమయంలో ‘ప్రత్యేక’ దర్శనాలు రద్దు) -
సినిమా టికెట్ల వ్యవహారం.. బుక్ మై షో, ఐనాక్స్‌లపై కేసు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా సినిమా టికెట్లను 100 శాతం ఆన్లైన్లోనే విక్రయిస్తున్న ఆరోపణలపై బుక్ మై షో పోర్టల్‌తో పాటు ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లపై సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తార్నాక ప్రాంతానికి చెందిన విజయ్ గోపాల్ ఫిర్యాదు మేరకు శనివారం నమోదైన ఈ కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 2006లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీఓ నెం.47) ప్రకారం సినిమా ప్రదర్శనకు సంబంధించి సగం టిక్కెట్లను నేరుగా, మిగిలిన సగం ఆన్లైన్లో విక్రయించాల్సి ఉంటుంది. అయితే బుక్ మై షో, ఐనాక్స్‌లు 100 శాతం టికెట్లను ఆన్లైన్లోనే అమ్ముతున్నాయనేది విజయ్ గోపాల్ ఆరోపణ. ఈ మేరకు ఆయన సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆ వీడియో కాల్ ఎత్తారో..బతుకు బస్టాండే -
ఏపీలో త్వరలోనే ఆన్లైన్లో సినిమా టికెట్లు
-
ఏపీ: అతిత్వరలోనే ఆన్లైన్లో సినిమా టికెట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో అతిత్వరలోనే పూర్తిగా ఆన్లైన్ సినిమా టిక్కెట్ల పొందే వెసులుబాటును ప్రేక్షకుల కోసం తీసుకురాబోతోంది ప్రభుత్వం. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాల కోసం టెండర్లు పూర్తి చేసిన ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థలకంటే తక్కువ ధరకు ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. టెండర్లలో జస్ట్ టిక్కెట్ సంస్థ L -1 గా నిలిచినట్లు సమాచారం అందుతోంది. అదే సమయంలో అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అంతేకాదు ప్రేక్షకులపై ఆన్లైన్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా టికెట్ రేట్ల నియంత్రణతో పాటు క్యూలలో ప్రేక్షకులు గంటలు గంటలు నిలబడాల్సిన పరిస్థితికి ముగింపు పడడంతో పాటు, బ్లాక్ టికెట్ల విక్రయ దందాకు చెక్ పడనుంది. -
నిర్ణీత రేట్లకే టికెట్ల విక్రయం.. రోజూ 4ఆటలు మాత్రమే: మంత్రి పేర్ని నాని
సాక్షి, అమరావతి: సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ఏపీ రవాణా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకే సినిమా టికెట్లను విక్రయించడం, నిర్దేశిత ఆటలతోనే సినిమాలు ప్రదర్శించడం, పన్ను ఎగవేతను అడ్డుకోవడమే ఈ విధానం లక్ష్యమన్నారు. ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు ఉద్దేశించిన ‘ఏపీ సినిమాల (నియంత్రణ– సవరణ) బిల్లు’ను అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకు ముందు చర్చ సందర్భంగా బిల్లు ఉద్దేశాలను మంత్రి పేర్ని నాని వివరించారు. ప్రేక్షకుల ఆదరణ ను కొందరు అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని ప్రస్తావించారు. ఒక్కో టిక్కెట్‌పై ఇష్టారాజ్యంగా రూ.300 నుంచి రూ.500 వరకు అధికంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. రోజుకు 4 ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సినా చట్ట విరుద్ధంగా 6 – 8 షోలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇక ఆటలు సాగవు.. చిత్ర పరిశ్రమలో కొందరు మాకు ఎదురు ఉండకూడదు.. ఏచట్టాలూ మమ్మల్ని ఆపలేవు అన్నట్లు వ్యవహరిస్తున్నారని మంత్రి నాని పేర్కొన్నారు. ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా టిక్కెట్లు విక్రయించే వ్యవస్థ తేవాలని నిర్ణయిం చిందన్నారు. బస్సులు, రైలు టికెట్ల మాదిరిగా సినిమా టిక్కెట్లను కూడా మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని వివరించారు. గంట ముందు థియేటర్లో కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. అయితే అక్కడ కూడా ఆన్లైన్ విధానంలోనే థియేటర్ల యజమానులు టిక్కెట్లు విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు ఆన్లైన్ విధానాన్ని సమర్థిస్తున్నారని మంత్రి తెలిపారు. కాగా, సమాజ హితం కోసం స్వచ్ఛంద సంస్థలు థియేటర్ యాజమాన్యాలతో కలసి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే బెనిఫిట్ షోలకు అవకాశం ఉంటుందని తెలిపారు. -
‘అందుబాటులో ఉండే ధరకి సినిమా టికెట్లను తీసుకొస్తాం’
సాక్షి, అమరావతి: సినిమా అనగానే తమకి ఎదురుండకూడదన్న ధోరణిలో కొందరు ఉన్నారని, పేద, మధ్యతరగతి వాళ్ల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సినిమా చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. సినిమా షోలను ఇష్టానుసారంగా వేస్తున్నారని, చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్నారని అన్నారు. చదవండి: ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదు: మంత్రి పెద్దిరెడ్డి కొందరు ఇష్టానుసారం ధరలను పెంచుకుంటున్నారని, అందుకే ఆన్లైన్ విధానంలో టికెట్ ఇచ్చే పద్ధతి తేవాలనుకున్నామని వివరించారు. దాంతో పాటు సినిమా షోలను కూడా అదుపు చెయ్యాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడవాలని తెలిపారు.సినిమా కలెక్షన్లు, కడుతున్న టాక్సులకు సంబంధం లేదని చెప్పారు. ప్రభుత్వ పోర్టల్ ద్వారా పారదర్శకంగా, ప్రజలకు మంచి అందుబాటులో ఉండే ధరకి టికెట్లను తీసుకొస్తామని తెలిపారు. దీనిపై కొన్ని పార్టీలు, పేపర్లు, టీవీలు బురద వెయ్యడం దుర్మార్గమని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు అందరు తమ విధానాలను స్వాగతించారని పేర్కొన్నారు. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేశామని తెలిపారు. థియేటర్లతో పాటు ఆన్లైన్లో కూడా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. సినిమా వినోదం అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రజల ఉత్సాహాన్ని సోమ్ము చేసుకునేలా ఉండకూడదని తెలిపారు. ప్రొడ్యూసర్లుర, డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి సాఫ్ట్‌వేర్‌ను తీసుకొస్తామని అన్నారు. పర్యావరణ హితం కోసం గ్రీన్ టాక్స్ పెంచుతున్నాం: పర్యావరణ హితం కోసమే కేంద్రం ఆదేశాల మేరకు గ్రీన్ టాక్స్ పెంచుతున్నామని, పాత వాహనాలను నిరుత్సాహ పరిచి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆటో, టూ వీలర్స్‌కి ఈ పెంపుదల ఉండదని, రూ. 20 లక్షలు పైబడిన వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. బెనిఫిట్ షోకి అవకాశం ఉందని, కానీ స్వచ్చంద సంస్థల కోసం బెనిఫిట్ షోలు ఉంటాయని, ఆయా సంస్థలు జాయింట్ కలెక్టర్ వద్ద దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అదనపు షోలు దొంగాటలేనని చట్టప్రకారం 4 షోలు మాత్రమే వేయాలని అన్నారు. తమ ప్రభుత్వానికి పెద్ద హీరో చిన్న హీరో అనేది లేదని, తాము ప్రేక్షకుల కోణంలో మాత్రమే చూస్తామని వివరించారు. వ్యతిరేకిస్తున్న ఒక పెద్ద హీరో ఏమి ఇబ్బంది ఉందొ చెప్తే.. అది సహేతుకమైతే పరిశీలిస్తామని తెలిపారు. -
ఏపీఎస్ఆర్టీసీ ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం
సాక్షి,తిరుపతి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి దృష్టా గత రెండేళ్ల కాలంపాటు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలను రద్దుచేసిన విషయం తెలిసిందే. అనంతరం భక్తుల కోసం దర్శనాలను పరిమితం చేసింది.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతూ ఉచిత దర్శనాలు,వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలు కరోనా నిభందన మేరకు అనుమతి ఇస్తోంది. ఈ క్రమంలోనే రూ. 300ల స్పెషల్ దర్శన టికెట్లను విడుదల చేశారు. అయితే పరిమిత సంఖ్యలో టికెట్లు విడుదల చేస్తుండడంతో.. చాలా తక్కువ సమయంలో టికెట్లు కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో దేశ విదేశాల్లోని వెంకన్న భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఇలా టికెట్ దొరకని వారి కోసం టీటీడీ, ఏపీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఇటీవల టీటీడీ కల్పించింది .ఇందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలు నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు రోజుకు 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో టికెట్స్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు దర్శనం కోసం వచ్చే భక్తులు www.apsrtconline.in వెబ్సైట్లో ప్రయాణ చార్జీలు, జీఎస్టీతో పాటు రూ. 300 చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్‌ను పొందవచ్చు. ఇలా టికెట్ పొందిన వారికి ప్రతి రోజూ ఉదయం 11:00 గంటలకు, సాయంత్రం 4:00 గంటలకు తిరుమ శ్రీవారి దర్శనం కల్పిస్తారు. తిరుమల బస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడంలో ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయం చేస్తారు. ఇదిలా ఉంటే ఏపీఎస్ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడిపిస్తోంది. భక్తుల సద్వినియోగం చేసుకోవాలి టీటీడీ అధికారులు ఆధ్మాత్మిక కోణంలో ఆలోచించి ఇచ్చిన దర్శన అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలి.విజయవాడ,గుంటూరు, బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన ప్రధాన నగరాల నుంచి తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు ఆన్లైన్ విధానంలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఒరిజినల్ ఇడీ ప్రూఫ్,ఆర్టీసీ టికెట్స్ జిరాక్స్ కాఫీ,సాంప్రదాయ వస్త్ర దారణలో టీటీడీ నిభందనల మేరకు భక్తులను టీటీడీ అనుమతి ఇస్తోంది. –ఆర్టీసీ రీజనల్ మేనేజర్ టి.చెంగల్ రెడ్డి చదవండి: గోల్డెన్ ఫిష్ @ రూ.2.60 లక్షలు -
పవన్ కల్యాణ్ బెదిరింపులకు ఎవరూ భయపడరు: నాని
సాక్షి, హైదరాబాద్: నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్లను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం రామానాయుడు స్టూడియోలో 'ఆటో రజనీ' మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జొన్నలగడ్డ హరి హీరోగా, శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమాకు మంత్రి కొడాలి నాని కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఎంపీ నందిగం సురేష్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమను నమ్ముకున్న వారందరికీ న్యాయం జరగాలి. ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్లు పెంచుకోవడాన్ని మేము సమర్థించము. కొంతమందికి లాభాలు తెచ్చిపెట్టాలని విధానపరంగా సరైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచారు. చిన్న సినిమాలు ఆడాలి పెద్ద సినిమాలు ఆడాలి. పవన్ కల్యాణ్ ఆహు అంటే అదిరి బెదిరి పోయే వాళ్లము కాదు' అని మంత్రి కొడాలి నాని అన్నారు. చదవండి: ('పవన్ కల్యాణ్ కులాల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారు') -
మంత్రి పేర్ని నానితో నిర్మాతల బృందం భేటీ
-
నోరు ఉంది కదాని పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం మాట్లాడతారా
-
సినిమా టికెట్ల ఆన్లైన్ విధానంపై ఏకాభిప్రాయం
-
ఆన్లైన్లో సినిమా టికెట్ల విధానం మంచిది
గోకవరం: సినిమా టికెట్లు ఆన్లైన్లో విక్రయించే విధానం మంచిదని మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అభిప్రాయపడ్డారు. ప్రముఖ నటులు కూడా ఇదే విధానం కోరుతున్నారన్నారు. ఈ మేరకు ఆయన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం లేఖ రాశారు. సినిమా టికెట్లు ఆన్లైన్లో విక్రయించేలా చూడాలని ప్రముఖ నటులు కోరిన విషయం ఎమ్మెల్యే రోజా, మరికొందరు ఇటీవల ప్రస్తావించారన్నారు. మాజీ ఎగ్జిబిటర్‌గా తాను ఈ విధానాన్నే సమర్థిస్తానన్నారు. చిత్ర నిర్మాణం కోసం హీరో, హీరోయిన్లు మొదలుకొని ఆఖరి వ్యక్తి వరకు చెల్లించే మొత్తాన్ని నిర్మాత నుంచి ప్రభుత్వం జమ చేయించుకుని ఆన్లైన్లో టికెట్ల మాదిరిగా వారి బ్యాంకు ఖాతాలోకి వెళ్లేలా చూస్తే బాగుంటుందని సూచించారు. దీనివల్ల దుబారా, ఎగవేతలు ఉండవన్నారు. ప్రతీ పైసా ఖర్చుకు పారదర్శకత ఉంటుందన్నారు. -
సినిమా టికెట్ల ఆన్లైన్ విధానంపై ఏకాభిప్రాయం
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయంపై సినీ పరిశ్రమ ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందని సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. సోమవారం సచివాలయం నాలుగో బ్లాకులో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ఆన్లైన్ బుకింగ్ విధానం–2002 నుంచి అమలుకు నోచుకోలేదన్నారు. తమ ప్రభుత్వం దీనిపై వివిధ కమిటీలను నియమించి విస్తృతంగా అధ్యయనం చేస్తోందని వివరించారు. ఇందులో భాగంగానే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టేక్ హోల్డర్లతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నట్టు చెప్పారు. ఆన్లైన్ టికెట్ల విక్రయంపై అందరూ ఏకాభ్రిపాయం వ్యక్తం చేయడంతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారన్నారు. వారి విజ్ఞప్తులను పరిశీలించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి సమావేశంలో వివరించామని, వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సినిమాపై తమ ఇష్టాన్ని ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరల ప్రకారం ప్రజలకు వినోదం అందిస్తామన్నారు. చాలా వరకు థియేటర్లలో ఆన్లైన్ టికెట్ల విక్రయిస్తున్నారని, త్వరలో అన్ని థియేటర్లలో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ఏపీ సినిమా చిత్రీకరణకు అవసరమైన మౌలిక వసతుల కల్పన విషయంలో ప్రతినిధుల బృందం ప్రభుత్వానికి చేసిన సూచనలను పరిశీలిస్తామన్నారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవం చిత్రరంగ సమస్యలను పరిష్కరించాలని మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విన్నవించిన విషయమై విలేకరులు ప్రశ్నించగా.. చిరంజీవి అంటే సీఎం జగన్ ఎంతో గౌరవం ఉందని, ఆయనను సోదరభావంతో చూస్తారని చెప్పారు. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు విజయచందర్, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ టి.విజయకుమార్‌రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సీఈవో వాసుదేవరెడ్డి, ఏపీ తెలుగు ఫిల్మ్ చాంబర్‌కు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంఘాల ప్రతినిధులు సి.కల్యాణ్, దిల్ రాజు, జి.ఆదిశేషగిరిరావు, వంశీ, డీఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు చిత్ర సీమ సంతోషంగా ఉంది: సి.కల్యాణ్ సమావేశం అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భరోసాతో తెలుగు చిత్రసీమ చాలా సంతోషంగా ఉందన్నారు. టికెట్ రేట్ల సవరణ, వంద శాతం ఆక్యుపెన్సీ, రోజుకు నాలుగు షోలు, విద్యుత్ బిల్లులు తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. సినీ పరిశ్రమలో పారదర్శకత కోసం ఆన్లైన్ టికెట్ల విక్రయ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని తామే కోరినట్టు చెప్పారు. థియేటర్ వ్యవస్థను ఆదుకోవాలని కోరాం.. మరో నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. ‘2006లో ఆన్లైన్ టికెట్ విధానం ఐచ్చికంగా ఉండేది. ఇప్పుడు తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. పారదర్శకత కోసం గవర్నమెంట్ పోర్టల్ ఉండాలి. ఒకప్పుడు 1,800 థియేటర్లు ఉంటే ఇప్పుడు 1,200కు తగ్గిపోయాయి. వాటిలో ఐదారొందల థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. వాటిని విద్యుత్ టారిఫ్ సమస్య వేధిస్తోంది. జీతాలు, డీజిల్ రేట్లు పెరిగాయి. ఈ మేరకు రేట్లు సవరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా సానుకూల స్పందన లభించింది’ అన్నారు. నిర్మాత డీఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ సినీ పరిశమ్ర సమస్యలపై ప్రభుత్వ సానుకూల స్పందన తెలుగు చిత్రసీమకు ఊరటనిచ్చిందన్నారు. -
ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష
-
Andhra Pradesh: అధ్యయనం చేశాకే ‘ఆన్లైన్ సినిమా టికెట్లు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించే అంశంపై ఉన్నత స్థాయి కమిటీతో అధ్యయనం చేయిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ ప్రతినిధులతో చర్చించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఇటీవల తెలుగు సినీ రంగ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌ను కలిసినప్పుడు పలు అంశాలపై చర్చించారని చెప్పారు. ఇందులో భాగంగా సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించే అంశాన్ని పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారన్నారు. ఈ మేరకు త్వరలోనే సీఎం సమక్షంలో సినీ రంగ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేలా సీఎం జగన్ అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఇందులో భాగంగా కోవిడ్ సమయంలో పలు రాయితీలను కూడా ప్రకటించారని గుర్తు చేశారు. ఆన్లైన్ సినిమా టికెట్ల విక్రయంతో పన్ను ఎగవేతకు, బాక్ల్ టికెట్ దందాకు చెక్ పెట్టొచ్చన్నారు. అనధికార షోలు, టికెట్ ధర నియంత్రణతో ప్రజలు తక్కువ రేటుకే వినోదం అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని థియేటర్లను అనుసంధానం చేస్తూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రతిపక్షాలది రాద్ధాంతం.. సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలన్న ప్రభుత్వ ఆలోచనపై ప్రతిపక్షంలో మేధావులుగా భావించేవారు కూడా నానా రాద్ధాంతం చేస్తుండటంపై పేర్ని నాని మండిపడ్డారు. ఈ అంశం గత రెండు దశాబ్దాలుగా నడుస్తోందన్నారు. 2002లోనే ఆన్లైన్ సినిమా టికెట్లపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2003లో విజయవాడకు చెందిన విశ్వ మీడియా ఎంటర్ప్రైజెస్, 2004లో విశాఖకు చెందిన గెలాక్సీ ఎంటర్‌ప్రైజెస్‌లు ఆన్లైన్లో టికెట్ల విక్రయానికి ముందుకు వచ్చాయన్నారు. 2006లో అప్పటి ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ల విక్రయంపై గెజిట్ కూడా విడుదల చేసిందని చెప్పారు. 2009లో గెలాక్సీ ఎంటర్‌ప్రైజెస్‌కు అనుమతి ఇచ్చినా ఈ ప్రక్రియ మొదలుకాలేదన్నారు. ఈ అంశంపై 2017లో టీడీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని నియమించిందని గుర్తు చేశారు. మళ్లీ అదే ఏడాది హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (ఎఫ్డీసీ) ఎండీ, తెలుగు సినీ పరిశ్రమ చైర్మన్, తదితరులుతో కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. 2018లో కమిటీ ఆన్లైన్లో టికెట్ల అమ్మకానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. తమ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 22న ఆర్థికశాఖ కార్యదర్శి, ఎఫ్డీసీ చైర్మన్, ఏపీటీఎస్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాక కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ప్రభుత్వం ఆన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకం చేపట్టాలని భావిస్తోందన్నారు. కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం సబబు కాదని హితవు పలికారు. -
సులభంగా శ్రీవారి దర్శనం
-
ఏపీ: ఆన్లైన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల బుకింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టికెట్ల ఆన్లైన్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే టికెట్ల బుకింగ్ తరహాలో ఈ పోర్టల్‌ను రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సినిమా టికెట్ల విక్రయాల విధానాన్ని అధ్యయనం చేసిన తరువాత ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ అభివృద్ధి కార్పొరేషన్ నిర్వహిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌విశ్వజిత్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆన్లైన్ పోర్టల్ రూపొందించడం, అమలును పర్యవేక్షించడానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీలో ఐటీ శాఖ కార్యదర్శి, సమాచార శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ప్రతినిధి, ఏపీటీఎస్ ఎండీ, కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఇవీ చదవండి: అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ ఉప్పొంగుతున్న వరద.. టీచర్ల సాహసం -
టికెట్ల ఇక్కట్లకు చెక్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్ విషయంలో ఎదురవుతోన్న ఇబ్బందులను అధిగమించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు చేపట్టింది. ఇందుకుగాను క్లౌడ్ మేనేజ్మెంట్ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించింది. మరో నెల రోజుల్లో ఈ టెక్నాలజీని వినియోగించి దర్శన టికెట్ల బుకింగ్ సమయంలో ఎదురవుతోన్న ఇబ్బందులను సరిచేయనుంది. ► శ్రీవారి దర్శనం కోసం టీటీడీ ప్రతి నెలా విడుదల చేస్తోన్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవడంలో సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకేసారి 3 లక్షల మందికిపైగా భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌ను హిట్ చేస్తుండటంతో తరచూ సాంకేతిక సమస్యలు (సర్వర్ ట్రాఫిక్ లాంటివి) ఉత్పన్నమవుతున్నాయి. హై ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే తప్ప గ్రామీణ ప్రాంతాలు, సామాన్య భక్తులకు దర్శనం టికెట్లు లభించడం లేదు. ఈ విషయమై ప్రతి నెలా టీటీడీ ఉన్నతాధికారులకు భక్తుల నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. కోవిడ్ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఉచిత దర్శనం టికెట్లు రద్దు చేయడంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం రోజుకు 8 వేల టికెట్ల చొప్పున రాబోయే నెల కోసం ప్రతి నెల 20 నుంచి 25వ తేదీలోగా 2 లక్షల 40 వేల టికెట్లు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేస్తుంది. విడుదలైన 2 నుంచి 3 గంటల్లోపే నెల కోటాకు సంబంధించిన టికెట్లు మొత్తం బుక్ అయిపోతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలు, ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్న వారికి టికెట్లు దొరకడం లేదనే ఫిర్యాదులు రావడంతో టీటీడీ దీనిపై దృష్టి సారించింది. సామాన్య భక్తులకు కూడా రూ.300 దర్శనం టికెట్లు అందేలా చేయాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థతో మాట్లాడి ఇటీవల సర్వర్ సామర్థ్యం పెంచేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ భక్తుల డిమాండ్‌ను టీటీడీ అందుకో లేకపోతోంది. నెల రోజుల్లో అందుబాటులోకి ‘క్లౌడ్’ ఇకపై ఇంటర్నెట్ స్పీడ్‌తో సంబంధం లేకుండా క్లౌడ్ మేనేజ్మెంట్ టెక్నాలజీని వాడుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఈ టెక్నాలజీతో టీటీడీ వెబ్‌సైట్‌ను ఒకేసారి లక్షల మంది హిట్ చేసినా..ఆటో స్కేలింగ్ పద్ధతి ద్వారా సీపీయూ వర్చువల్ స్కేల్ అప్, స్కేల్ డౌన్‌తో ఆన్లైన్ ఇబ్బందులకు ఏ మాత్రం అవకాశం ఉండదని టీటీడీ భావిస్తోంది. ఒకవేళ ఆన్లైన్ సమస్య వచ్చినా మైక్రో సెకన్లలోనే తిరిగి పనిచేసేలా సాంకేతికత సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక పనులు కూడా టీటీడీ ప్రారంభించింది. మరో నెల రోజుల్లో క్లౌడ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ వినియోగించి ఆన్లైన్లో రూ.300 దర్శనం టికెట్లు జారీ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే సామాన్య భక్తులకు రూ.300 దర్శనం టికెట్లు సులువుగా లభిస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు. -
భక్తులకు మరింత సులభతరంగా ‘తిరుమల’ గదులు
తిరుమల: ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకున్న యాత్రికులు తిరుమలలో మరింత సులభతరంగా గదులు పొందేలా టీటీడీ పలు మార్పులు తీసుకొచ్చింది. ఇందుకోసం తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం, అలిపిరి టోల్గేట్, శ్రీవారి మెట్టు వద్ద గదుల రశీదుల స్కానింగ్ కేంద్రాలను సోమవారం ప్రారంభించింది. వీటితోపాటు ఓఆర్వో జనరల్ కార్యాలయంలో ఇదివరకే ఉన్న కౌంటర్ల వద్ద గదుల రశీదులను స్కాన్ చేసుకోవచ్చు. నూతన విధానంలో యాత్రికులు సీఆర్వో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశారు. యాత్రికులు గదుల రిసిప్టును స్కాన్ చేయించుకున్న కొంత సమయంలోనే రిజిష్టర్డ్ మొబైల్ నంబరుకు సబ్ ఎంక్వైరీ కార్యాలయ వివరాలు పంపుతారు. తద్వారా యాత్రికులు నేరుగా గదులు పొందే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా, త్వరలో తిరుమలలో సీఆర్వో కార్యాలయాన్ని వికేంద్రీకరించి ఆరు ప్రాంతాల్లో 12 రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాట్మెంట్ కౌంటర్లను సబ్ ఎంక్వైరీ కార్యాలయాలకు తరలిస్తారు. హోటల్లోకి దూరి పాము కలకలం తిరుమలలోని వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలోని ఓ హోటల్లోకి జెర్రిపోతు దూరి కలకలం సృష్టించింది. హోటల్లోకి పాము దూరినట్లు నిర్వాహకులు టీటీడీ అటవీ ఉద్యోగి భాస్కరనాయుడుకి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన లోపల దూరిన పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. బహ్మోత్సవాల్లో వాహన సేవలు రద్దు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై 23వ తేదీ నుంచి నిర్వహించనున్న దుర్గా మల్లేశ్వర స్వామివార్ల చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలను రద్దు చేస్తూ ఆలయ ఈవో భ్రమరాంబ ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చైత్రమాస బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో భక్తులు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది భద్రత దృష్ట్యా బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలను నిలుపుదల చేయాలని దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది వాహన సేవల స్థానంలో పల్లకీ సేవ నిర్వహించాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులంతా తప్పనిసరిగా మాస్క్‌లు, శానిటైజర్లను వినియోగించాలని ఈవో సూచించారు. చదవండి: కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్‌గా జవహర్‌రెడ్డి -
తిరుమల: ఆన్లైన్ టికెట్ల అక్టోబర్ కోటా విడుదల
సాక్షి, తిరుమల: అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆన్లైన్ కల్యాణోత్సవ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 25న శ్రీవారి పార్వేట ఉత్సవం ఉన్న కారణంగా ఆ తేదీల్లో కల్యాణోత్సవం లేదు. ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. (చదవండి: సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు) తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. (చదవండి: సీఎం జగన్‌ను అభినందించిన ప్రధాని మోదీ)