సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబరు నెలకు సంబంధించి 49, 060 ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. 49,060 టిక్కెట్లలో 8,235 సేవా టిక్కెట్లను ఆన్‌లైన్ లాటరీ విధానంలోను, 40,825 ఆర్జిత సేవా టిక్కెట్లను కరెంట్ బుకింగ్ సదుపాయం కింద టీటీడీ అందుబాటులోకి తెచ్చింది.
టిక్కెట్ల విడుదల సమయం నుంచి నాలుగు రోజుల పాటు నమోదు అవకాశం కల్పించింది. అనంతరం డిప్ విధానంలో టిక్కెట్ల కేటాయింపు, నగదు చెల్లింపునకు అవకాశం ఇస్తుంది. ఆన్‌లైన్ జనరల్ కేటగిరి కింద విడుదల చేసిన విశేష పూజ, కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ టిక్కెట్లను వెంటనే బుక్ చేసుకోవచ్చు.
టిక్కెట్ల వివరాలు:
సుప్రభాతం 6,805
తోమాల 80
అర్చన 80
అష్టదళ పాదపద్మారాధన 120
నిజపాద దర్శనం 1,150
విశేష పూజ 1,500
కల్యాణోత్సవం 9,975
ఊంజల్ సేవ 3,150
ఆర్జిత బ్రహ్మోత్సవం 5,500
వసంతోత్సవం 9,900
సహస్ర దీపాలంకరణ 10,800
Comments
Please login to add a commentAdd a comment