ఆన్ లైన్‌లో కళ్యాణోత్సవ సేవ.. రేపటి నుంచి టికెట్లు | Srivari Kalyanotsavam Seva Tickets Available In online From 6th August | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లు

Published Wed, Aug 5 2020 6:56 PM | Last Updated on Wed, Aug 5 2020 6:58 PM

Srivari Kalyanotsavam Seva Tickets Available In online From 6th August - Sakshi


సాక్షి, తిరుమల : గురువారం నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఆగష్టు7 నుంచి 31వ తేది వరకు సంబంధించిన కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను గురువారం విడుదల చేయనున్నట్లు తిరుమల టీటీడీ అధికారులు తెలియజేశారు. అయితే ఈ కల్యాణోత్సవ సేవలో భక్తులు ఆన్ లైన్ లో పాల్గొననున్నారు.

 ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవ సేవ ప్రారంభం కానుంది. మొదట పది నిముషాలు టిక్కెట్లును కలిగిన భక్తులకు అర్చకులు సంకల్పం చెప్పించనున్నారు. ఆన్ లైన్ ద్వారా కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని టీటీడీ స్పష్టం చేసింది. వస్త్రం, లడ్డూ ప్రసాదం, అక్షింతలను పోస్టల్ ద్వారా భక్తుల ఇంటికి పంపిణీ చేయబోతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement