
ధావన్, వార్నర్, భువనేశ్వర్
హైదరాబాద్: నగరంలో జరిగే ఐపీఎల్-2018 మ్యాచ్‌లను చూడాలనుకుంటున్న క్రికెట్ అభిమానులకు సన్‌రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం శుభావార్త తెలిపింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల టికెట్లను ఆన్‌లైన్‌లో ముందస్తుగా కొనగోలు చేయవచ్చని తన అధికారిక ట్విటర్‌లో పేర్కొంది.
‘మన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్టేడియంలోని స్టాండ్స్‌లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. అమ్మకానికి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. తక్షణమే http://www.sunrisershyderabad.in లోకి వెళ్లి మీకు నచ్చిన మ్యాచ్‌ను బుక్ చేసుకోండి.’ అని వార్నర్ వీడియోతో కూడిన సందేశాన్ని ట్వీట్ చేసింది.
ఇక మరో ట్వీట్‌లో ‘కప్ కొట్టడానికి మీ మద్దతు కావాలి.. గేమ్ మొదలైంది టికెట్స్ బుక్ చేసుకొండి’ అని పేర్కొంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల టికెట్ ధరలు రూ.500, రూ.781, రూ.976, రూ.1,171, రూ.2,734, రూ. 3,906 లుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో మెత్తం 7 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇక హైదరాబాద్‌లో ఏప్రిల్ 9న రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్-11 తొలి మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆరంభ వేడుకల అనంతరం డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది.
Our captain wants to see you in the stands. Online ticket sales NOW OPEN! Buy your tickets now at https://t.co/p9YgYA2ueZ ! #OrangeArmy pic.twitter.com/lB7DNxXzP9
— SunRisers Hyderabad (@SunRisers) 23 March 2018
Comments
Please login to add a commentAdd a comment