
పుష్ప ప్రదర్శనకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు
:ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని లాల్‌బాగ్‌లో ఏర్పాటయ్యే పుష్ప ప్రదర్శన ఇప్పుడిక హైటెక్
పాఠశాల విద్యార్థులకు 24, 26న ఉచిత ప్రవేశం
నిఘా కోసం మొదటిసారిగా ‘డ్రోన్’
ఉద్యానవన శాఖ డెరైక్టర్ ఎస్.పి.సదాక్షరిస్వామి
బెంగళూరు:ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని లాల్‌బాగ్‌లో ఏర్పాటయ్యే పుష్ప ప్రదర్శన ఇప్పుడిక హైటెక్ హంగులను సంతరించుకుంటోంది. సందర్శకులకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు లభ్యం కానున్నాయి. మొట్టమొదటి సారి సందర్శకుల కోసం ఈ ఏడాది నుంచి ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఉద్యానవన శాఖ డెరైక్టర్ ఎస్.పి.సదాక్షరిస్వామి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. లాల్‌బాగ్ ఉద్యానవనంలో ఈ నెల 17 నుంచి గణతంత్ర పు ష్ప ప్రదర్శన ప్రారంభం కానుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 26 వరకు ప్రదర్శన కొనసాగుతుందని తెలి పారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వర కు ప్రదర్శన ఉంటుందన్నారు. www.lalbaghflowe rshow.in వెబ్‌సైట్‌లో టికెట్‌లను కొనుగోలు చేయవచ్చన్నా రు. వెంటనే ఇందుకు సంబంధించిన టికెట్ సంబంధిత వ్యక్తి మెయిల్ ఐడీకి వస్తుందన్నారు. దాన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ నెల 16 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పాఠశాల విద్యార్థులు పుష్ప ప్రదర్శనను తిలకించేందుకు ఈ నెల 24, 26న ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు సదాక్షరిస్వామి చెప్పారు. గతంలో ఒకరోజు మాత్రమే ఈ అవకాశం కల్పించే వారన్నారు. బయటి ఆహార పదార్థాలను లాల్‌బాగ్‌లోకి అనుమతించబోమని, సందర్శకుల కోసం ప్రదర్శన ప్రాంతంలోనే హాప్‌కామ్స్ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
డ్రోన్‌తో నిఘా....
లాల్‌బాగ్‌లో భద్రతా చర్యలను ఈ ఏడాది మరింత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. లాల్‌బాగ్‌లోనికి ప్రవేశించే నాలుగు ప్రధా న ద్వారాలు, గ్లాస్‌హౌస్ తదితర ప్రాంతాల్లో మొత్తం 40 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక సెలవు రోజులు, జనసందోహం ఎక్కువగా ఉన్న రోజుల్లో నిఘా కోసం డ్రోన్‌ని సైతం వినియోగించనున్నట్లు వెల్లడించారు.
శాంతినగర బస్‌స్టేషన్‌లో వాహనాల పార్కింగ్
పుష్ప ప్రదర్శన సమయంలో లాల్‌బాగ్‌లోకి వ్యక్తిగత వాహనాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. కేవలం పాఠశాలల వాహనాలను మాత్రమే లాల్‌బాగ్‌లోని డాక్టర్ ఎం.హెచ్.మరిగౌడ మెమోరియల్ హాల్ వద్ద పార్కింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇతరులు తమ వాహనాలను శాంతినగర బస్‌స్టేషన్‌లోని పార్కింగ్ ప్రాంతంలో, జేసీరోడ్ గేట్ నుంచి వచ్చే వాహనదారులు మయూర రెస్టారెంట్‌కు దగ్గరలోని బీబీఎంపీ మల్టీస్టోర్డ్ పార్కింగ్ ప్రాంతంలో నిలపాల్సి ఉంటుందన్నారు.