సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌లో అతిత్వరలోనే పూర్తిగా ఆన్‌లైన్ సినిమా టిక్కెట్ల పొందే వెసులుబాటును ప్రేక్షకుల కోసం తీసుకురాబోతోంది ప్రభుత్వం. ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాల కోసం టెండర్లు పూర్తి చేసిన ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థలకంటే తక్కువ ధరకు ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది.
టెండర్లలో జస్ట్ టిక్కెట్ సంస్థ L -1 గా నిలిచినట్లు సమాచారం అందుతోంది. అదే సమయంలో అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అంతేకాదు ప్రేక్షకులపై ఆన్‌లైన్ చార్జీల భారం పడకుండా ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించుకుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా టికెట్ రేట్ల నియంత్రణతో పాటు క్యూలలో ప్రేక్షకులు గంటలు గంటలు నిలబడాల్సిన పరిస్థితికి ముగింపు పడడంతో పాటు, బ్లాక్ టికెట్ల విక్రయ దందాకు చెక్ పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment