![Tirumala Srivari Pavithrotsavam: TTD to Release online Tickets on Aug 1 - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/30/Tirumala_Temple.jpg.webp?itok=Pporb1QS)
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మొత్తం 600 టికెట్లను జారీ చేస్తారు. రూ.2,500 చెల్లించి భక్తులు టికెట్ బుక్ చేసుకోవచ్చు.
టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే 3 రోజులు స్నపన తిరుమంజనంలో, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు. పవిత్రోత్స వాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1 వద్దకు చేరుకోవాలి. టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజి నల్ ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి. (క్లిక్: బ్రహ్మోత్సవాల సమయంలో ‘ప్రత్యేక’ దర్శనాలు రద్దు)
Comments
Please login to add a commentAdd a comment