తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.
ఇక.. నిన్న(మంగళవారం) 61,446 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,374 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లుగా లెక్క తేలింది.
ఉగ్ర శ్రీనివాసమూర్తి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహించాము. శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించిన టీటీడీ. చిరుజల్లుల మద్య ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
– టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి.
Comments
Please login to add a commentAdd a comment