queline
-
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(ఆదివారం) 82,233 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 61,142 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,525 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 6 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో నిండి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 63,936 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 18,697 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.55 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట TBC వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం) 84,060 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో గోకులాష్టమి వేడుకలు...శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం28న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసిన టీటీడీ.అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు04/10/2024 - సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.05/10/2024 - ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.06/10/2024 - ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం08/10/2024 - ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక.. నిన్న(ఆదివారం) 86,604 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,536 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా లెక్క తేలింది. -
‘యాదాద్రి’లో ఆకర్షణీయమైన క్యూలైన్లు
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నార్మాణంలో భాగంగా క్యూలైన్ల ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. ఈ నెల 13వ తేదీన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పనులను పరిశీలించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ క్యూలైన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అంతే కాకుండా వాటిలో పలు మార్పులు చేశారు. ఈ క్యూలైన్లకు సంబంధించిన ఏర్పాట్లను వైటీడీఏ అధికారులు త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఆర్కెటెక్టు ఆనంద్ సాయి పర్యవేక్షణలో నూతన క్యూలైన్ల డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. డిజైన్లకు ఓకే చెప్పిన సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసే క్యూలైన్లకు సంబంధించిన పలు డిజైన్లను సీఎం కేసీఆర్ ఫైనల్ చేశారు. ఇటీవల ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రధాన ఆలయంలో క్యూలైన్లకు సంబంధించిన పవర్ ప్రజంటేషన్ ఆర్కెటెక్టు ఆనంద్‌సాయి ఇచ్చారు. క్యూలైన్ అద్భుతంగా ఉండటంతో సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసి, వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఆలయానికి వచ్చే భక్తులు క్యూలైన్లలో వెళ్లేటప్పుడు ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉండేందుకు వైటీడీఏ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా భక్తుల రద్దీ ఉన్న రోజుల్లో క్యూలైన్లను పెంచే విధంగా, భక్తులు లేని రోజుల్లో క్యూలైన్లను ఒకే దగ్గరికి చేర్చే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. క్యూలైన్లు ఏ మార్గంలో వస్తుందనే అంశాలపై గతంలోనే లక్నోకు చెందిన అనుభవం ఉన్న టెక్నీషియన్స్ యాదాద్రి ప్రధాన ఆలయం వద్దకు వచ్చి పరిశీలించారు. క్యూలైన్లలో పలు మార్పులు ఆలయంలోకి భక్తులు శ్రీస్వామి దర్శనానికి వెళ్లే సమయంలో ఏర్పాటు చేసే క్యూలైన్లపై అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు, సలహాలు, మార్పులు, చేర్పులు చేశారు. నూతనంగా నిర్మాణం అయ్యే ప్రసాదం కౌంటర్ నుంచి బ్రహ్మోత్సవ మండపం వెనుక నుంచి అష్టభుజి ప్రాకార మండలంలో నుంచి తూర్పు రాజగోపురం కింది నుంచి ఒక లైన్, బ్రహ్మోత్సవ మండపం నుంచి అష్టభుజి ప్రాకార మంపం నుంచి దక్షిణ రాజగోపురం కింది నుంచి ప్రధాన ఆలయంలోకి వెళ్లే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.అంతే కాకుండా దర్శనం అనంతరం భక్తులు నేరుగా పడమటి రాజగోపురం నుంచి బయటకు వెళ్లకుండా ఆలయ నిర్మాణాలు, ఆధ్మాత్మిక కట్టడాలు చేసేందుకు వీలుగా క్యూలైన్లు ఉండాలని సూచనలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయంలో రెండు వరుసల లైన్లు స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లలను అద్భుతంగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే వైటీడీఏ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్రసాదం కాంప్లెక్స్ నుంచి తూర్పు రాజగోపురం వరకు 16 ఫీట్ల వెడల్పుతో క్యూలైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యూలైన్ తూర్పు రాజగోపురం వరకు ముగియగానే అక్కడి నుంచి భక్తులు ఆలయంలోకి వెళ్లేందుకు ఆకర్షణీయమైన క్యూలైన్లు రానున్నాయి. ఇక ఆలయంలోకి వెళ్లినాక 10ఫీట్లతో క్యూలైన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ పది ఫీట్ల వైడల్పుతో వచ్చే లైన్లో రెండు లేదా మూడు క్యూలైన్లు రానున్నట్లు తెలిసింది. ఒక క్యూలైన్ మార్గంలో భక్తులు దర్శనానికి వచ్చేది. మరొకటి దర్శనం అనంతరం భక్తులు వెళ్లడానికి, మూడవ క్యూలైన్ ఆలయంలోకి ఆచార్యులు వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు వరుసల క్యూలైన్ ఏర్పాటు చేయడంతో భక్తులతో పాటు ఆచార్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసే విధంగా వైటీడీఏ అధికారులు ఆలోచిస్తున్నారు. బంగారు వర్ణంలో.. ఇప్పటికే ఆలయాన్ని అంతా బంగారు వర్ణంలో తీర్చి దిద్దేందుకు వైటీడీఏ అధికారులు కృషి చేస్తున్నారు. విద్యుత్ దీపాల అలంకరణ, ఆలయంలోని ప్రధాన గర్భాల ద్వారాలు, విమాన రాజగోపురం వంటివి బంగారు రంగులో మెరిసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే క్యూలైన్లను సైతం బంగారు రంగులోనే ఉండే విధంగా చేస్తున్నారు. విశాలమైన క్యూలైన్లు, మధ్యల మధ్యలో భక్తులు కూర్చోవడానికి బెంచీలు, అక్కడక్కడ ఆధ్మాతిక చిత్రాలు ఉండే విధంగా క్యూలైన్ ఏర్పాటు చేయనున్నారు. -
కరోనా: క్యూలైన్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
సాక్షి, వికారాబాద్: ప్రభుత్వం ప్రకటించిన కరోనా సాయాన్ని తీసుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఖాతాల్లో జమ అయిన రూ.1500 కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. కరోనా భయాల నేపథ్యంలో డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లిన ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ వరుసల్లో నిలుచోవడంతో కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. మీరు ఈ వీడియోలో చూస్తున్న దృశ్యాలు.. వికారాబాద్ జిల్లాలోని ధరూరు మండల కేంద్రం ఎస్బీఐ ధరూర్ శాఖ వద్ద రోడ్డుకు ఇరువైపులా మహిళలు వరుసలో నిలుచున్నవి. అయితే, వందలాది మంది సొమ్ము విత్ డ్రా కోసం ఎర్రటి ఎండలో బారులు తీరుతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. ఈక్రమంలోనే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కేంద్రంలో నానోత్ కమల (45) అనే మహిళ శుక్రవారం గుండెపోటుకు గురై మృతి చెందారు. కరోనా ఆర్థిక సాయం కోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద ఆమె క్యూలైన్లో నిలుచుండగా ఘటన జరిగింది. (చదవండి: గాంధీలో డ్యూటీ.. కానిస్టేబుల్‌కు కరోనా!) -
ఐనవోలుకు పోటెత్తిన భక్తజనం
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి వారాంతపు జాతర మొదటి ఆదివారం భక్తజనం పోటెత్తారు. శనివారం రాత్రి నుంచే జాతర ప్రాంగణానికి భక్తులు చేరుకుని స్వామివారికి ఒగ్గు పూజారుల మేలుకొలుపు, అభిషేకాలు, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. జాతర ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. వాహనాలు ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయడంతో భక్తులు కొంతమేర అవస్థలు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లో బారులుతీరడంతో స్వామివారి దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టింది. ధర్మదర్శ నం, రూ.100 దర్శనం క్యూలైన్లో సైతం భక్తులు బారులుతీరడంతో కనీసం గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నృత్య మండ పం, సత్రాల వద్ద, రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీ పంలో బోనాలు, పట్నాలు వేయించుకుని ఒగ్గు పూజా రుల చేత తమ తాత, ముత్తాతలను వారిని స్మరించుకుని భక్తితో బోనం నైవేద్యం సమర్పించారు. కొందరు భక్తులు స్వామివారి రథ సేవలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవ విగ్రహాలతో ఉన్న స్వామివారు దేవేరులను రథంతోలాగి తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. పూజాది కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఈఓ సదానందం, పాల క మండలి సభ్యులు కుల్ల సోమేశ్వర్, సమ్మెట యాదగిరి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. క్యూలైన్ల బారికేడ్లు, పందిళ్లను తిరిగి ఏర్పాటు చేస్తాం క్యూలైన్ల బారికేడ్లు, ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు తమ అనుమతి లేకుండానే తొలగించారని వాటిని తిరిగి పునరుద్ధరిస్తామని ఆలయ ఈఓ సదానందం తెలిపారు. భక్తులు వేలాదిగా తరలిరావడంతో క్యూలైన్లో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం స్వామివారిని 40 వేల మంది భక్తులకుపైగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. -
టీటీడీ తరహాలో శ్రీశైలం క్యూలు
· ప్రధాన రాజగోపుర ప్రవేశానికి ముందున్న గేట్‌కు తాళాలు · కేవలం వీఐపీలు, వీవీఐపీలు వెళ్లడానికి మాత్రమే అర్హులు ? · ఆలయంలో విధులపై వెళ్లే సిబ్బందికి ఒకే దారి · క్యూలలోనే లడ్డూప్రసాదాల టోకెన్లు · వీఐపీలతో వచ్చిన ఇతరులకు రూ. 300 ప్రత్యేక టికెట్ శ్రీశైలం: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలం దేవస్థాన క్యూలు మార్చేందుకు ఈవో భరత్ గుప్త చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల తరహాలో నేరుగా ప్రధానాలయ ప్రవేశద్వారం నుంచి సాధారణ భక్తులు రాకుండా కేవలం వీఐపీలు, వీవీఐపీలు, ప్రత్యేక విధులపై హాజరైన జిల్లా ఉన్నతస్థాయి అధికారులు మాత్రమే ప్రవేశం కలిగేలా ఏర్పాట్లు చేశారు. మొన్నటి వరకు కష్ణదేవరాయ గోపురం ముందున్న మాడా వీ«ధిలో ఉన్న ఫ్రధాన ప్రవేశ ద్వారానికి తాళాలు వేసేశారు. ఎవరైనా వీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే అక్కyì నుంచి కష్ణదేవరాయగోపురం వద్దకు ్రçపవేశానికి అనుమతిస్తారని సమచారం. కాంప్లెక్స్ ముందు ఏర్పాటు చేసిన వద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లల తల్లులు క్యూ గుండా విధి నిర్వహణకు ఆలయంలోకి వెళ్లే అధికారులు, సిబ్బంది వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీంతో ఆలయంలోకి వెళ్లేందుకు ఒకే ఒక దారి మాత్రమే ఉండగా, మిగిలిన అన్ని దారుల వద్ద ఎవరు లోనికి వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. ఎస్ఎస్డీగా పిలుపు.. శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమల తిరుపతి తరహాలో తీర్చిదిద్దుతామని దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావు మొదలుకొని ప్రిన్సిపల్ కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా చెబుతూ వచ్చారు. జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్న నారాయణ భరత్ గుప్తను ఈవోగా నియమించారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రస్తుతం టీటీడీగా పేరుకెక్కింది. శ్రీశైలాన్ని ఎస్బీఎంఎస్ (శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల) దేవస్థానంగా పిలుస్తున్నారు. ప్రస్తుతం దేవాదాయశాఖ అధికారులు ఆ శాఖ మంత్రి, దేవస్థానం ఈఓలతో చర్చించి ఎస్బీఎంఎస్ను ఎస్ఎస్డి(శ్రీశైలదేవస్థానం)గా మార్చాలనే నిర్ణయంలో ఉన్నట్లు, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. క్యూల్లోనే లడ్డూప్రసాదం టికెట్లు భక్తుల సౌకర్యం కోసం రూ. 100లు, రూ. 500లు టికెట్ తీసుకున్న భక్తులకు లడ్డూప్రసాదాల టికెట్లను క్యూలైన్లలోనే ఇవ్వాలనే ఆదేశాలు ఈఓ భరత్ గుప్త జారీ చేశారు. ఈ నిర్ణయం ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనానంతరం తిరిగి లడ్డూ కౌంటర్లకు చేరుకుని ఒక కౌంటర్లో టికెట్ కొని, మరో కేంద్రంలో లడ్డూప్రసాదాలను తీసుకోవాల్సిన భారం భక్తులకు తగ్గిందనే చెప్పవచ్చు. వీఐపీలతో కలిసి వచ్చే వారికి రూ. 300 ప్రత్యేక టికెట్ సాధారణంగా వీఐపీలు ఎవరైనా కుటుంబసభ్యులతో వస్తే వారిని దేవస్థానం వారు ఆలయమర్యాదలతో ఆహ్వానిస్తారు. అయితే కొంత మంది వీఐపీలు బంధుమిత్ర సపరివారంగా పదుల సంఖ్య కంటే ఎక్కువగా వచ్చినప్పుడు వీఐపీలను మినహాయించి రూ. 300 ప్రత్యేక టికెట్‌ను జారీ చేయాల్సిందిగా సంబంధిత పర్యవేక్షకులకు సూచనలు జారీ చేసినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మల్లన్న భక్తుల దర్శనార్థమై వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులను మినహాయించి వారి వెంట వచ్చే వారందరికీ కూడా ఈ నిబంధన వర్తిస్తుందనే అభిప్రాయం డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారుల ద్వారా తెలిసింది.