టీటీడీ తరహాలో శ్రీశైలం క్యూలు
టీటీడీ తరహాలో శ్రీశైలం క్యూలు
Published Sat, Aug 13 2016 12:34 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
· ప్రధాన రాజగోపుర ప్రవేశానికి ముందున్న గేట్‌కు తాళాలు
· కేవలం వీఐపీలు, వీవీఐపీలు వెళ్లడానికి మాత్రమే అర్హులు ?
· ఆలయంలో విధులపై వెళ్లే సిబ్బందికి ఒకే దారి
· క్యూలలోనే లడ్డూప్రసాదాల టోకెన్లు
· వీఐపీలతో వచ్చిన ఇతరులకు రూ. 300 ప్రత్యేక టికెట్
శ్రీశైలం: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలం దేవస్థాన క్యూలు మార్చేందుకు ఈవో భరత్ గుప్త చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల తరహాలో నేరుగా ప్రధానాలయ ప్రవేశద్వారం నుంచి సాధారణ భక్తులు రాకుండా కేవలం వీఐపీలు, వీవీఐపీలు, ప్రత్యేక విధులపై హాజరైన జిల్లా ఉన్నతస్థాయి అధికారులు మాత్రమే ప్రవేశం కలిగేలా ఏర్పాట్లు చేశారు. మొన్నటి వరకు కష్ణదేవరాయ గోపురం ముందున్న మాడా వీ«ధిలో ఉన్న ఫ్రధాన ప్రవేశ ద్వారానికి తాళాలు వేసేశారు. ఎవరైనా వీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే అక్కyì నుంచి కష్ణదేవరాయగోపురం వద్దకు ్రçపవేశానికి అనుమతిస్తారని సమచారం. కాంప్లెక్స్ ముందు ఏర్పాటు చేసిన వద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లల తల్లులు క్యూ గుండా విధి నిర్వహణకు ఆలయంలోకి వెళ్లే అధికారులు, సిబ్బంది వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీంతో ఆలయంలోకి వెళ్లేందుకు ఒకే ఒక దారి మాత్రమే ఉండగా, మిగిలిన అన్ని దారుల వద్ద ఎవరు లోనికి వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు.
ఎస్‌ఎస్‌డీగా పిలుపు..
శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమల తిరుపతి తరహాలో తీర్చిదిద్దుతామని దేవాదాయశాఖమంత్రి మాణిక్యాలరావు మొదలుకొని ప్రిన్సిపల్ కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్‌లతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా చెబుతూ వచ్చారు. జాయింట్ కలెక్టర్ హోదాలో ఉన్న నారాయణ భరత్ గుప్తను ఈవోగా నియమించారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రస్తుతం టీటీడీగా పేరుకెక్కింది. శ్రీశైలాన్ని ఎస్‌బీఎంఎస్ (శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల) దేవస్థానంగా పిలుస్తున్నారు. ప్రస్తుతం దేవాదాయశాఖ అధికారులు ఆ శాఖ మంత్రి, దేవస్థానం ఈఓలతో చర్చించి ఎస్‌బీఎంఎస్‌ను ఎస్‌ఎస్‌డి(శ్రీశైలదేవస్థానం)గా మార్చాలనే నిర్ణయంలో ఉన్నట్లు, ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది.
క్యూల్లోనే లడ్డూప్రసాదం టికెట్లు
భక్తుల సౌకర్యం కోసం రూ. 100లు, రూ. 500లు టికెట్ తీసుకున్న భక్తులకు లడ్డూప్రసాదాల టికెట్లను క్యూలైన్లలోనే ఇవ్వాలనే ఆదేశాలు ఈఓ భరత్ గుప్త జారీ చేశారు. ఈ నిర్ణయం ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనానంతరం తిరిగి లడ్డూ కౌంటర్లకు చేరుకుని ఒక కౌంటర్‌లో టికెట్ కొని, మరో కేంద్రంలో లడ్డూప్రసాదాలను తీసుకోవాల్సిన భారం భక్తులకు తగ్గిందనే చెప్పవచ్చు.
వీఐపీలతో కలిసి వచ్చే వారికి రూ. 300 ప్రత్యేక టికెట్
సాధారణంగా వీఐపీలు ఎవరైనా కుటుంబసభ్యులతో వస్తే వారిని దేవస్థానం వారు ఆలయమర్యాదలతో ఆహ్వానిస్తారు. అయితే కొంత మంది వీఐపీలు బంధుమిత్ర సపరివారంగా పదుల సంఖ్య కంటే ఎక్కువగా వచ్చినప్పుడు వీఐపీలను మినహాయించి రూ. 300 ప్రత్యేక టికెట్‌ను జారీ చేయాల్సిందిగా సంబంధిత పర్యవేక్షకులకు సూచనలు జారీ చేసినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మల్లన్న భక్తుల దర్శనార్థమై వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులను మినహాయించి వారి వెంట వచ్చే వారందరికీ కూడా ఈ నిబంధన వర్తిస్తుందనే అభిప్రాయం డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారుల ద్వారా తెలిసింది.
Advertisement