ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి వారాంతపు జాతర మొదటి ఆదివారం భక్తజనం పోటెత్తారు. శనివారం రాత్రి నుంచే జాతర ప్రాంగణానికి భక్తులు చేరుకుని స్వామివారికి ఒగ్గు పూజారుల మేలుకొలుపు, అభిషేకాలు, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. జాతర ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. వాహనాలు ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయడంతో భక్తులు కొంతమేర అవస్థలు ఎదుర్కొన్నారు.
ఉదయం నుంచే భక్తులు క్యూలైన్‌లో బారులుతీరడంతో స్వామివారి దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టింది. ధర్మదర్శ నం, రూ.100 దర్శనం క్యూలైన్‌లో సైతం భక్తులు బారులుతీరడంతో కనీసం గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నృత్య మండ పం, సత్రాల వద్ద, రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీ పంలో బోనాలు, పట్నాలు వేయించుకుని ఒగ్గు పూజా రుల చేత తమ తాత, ముత్తాతలను వారిని స్మరించుకుని భక్తితో బోనం నైవేద్యం సమర్పించారు. కొందరు భక్తులు స్వామివారి రథ సేవలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవ విగ్రహాలతో ఉన్న స్వామివారు దేవేరులను రథంతోలాగి తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. పూజాది కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఈఓ సదానందం, పాల క మండలి సభ్యులు కుల్ల సోమేశ్వర్, సమ్మెట యాదగిరి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
క్యూలైన్ల బారికేడ్లు, పందిళ్లను తిరిగి ఏర్పాటు చేస్తాం
క్యూలైన్ల బారికేడ్లు, ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు తమ అనుమతి లేకుండానే తొలగించారని వాటిని తిరిగి పునరుద్ధరిస్తామని ఆలయ ఈఓ సదానందం తెలిపారు. భక్తులు వేలాదిగా తరలిరావడంతో క్యూలైన్‌లో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం స్వామివారిని 40 వేల మంది భక్తులకుపైగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment