Oggu artists
-
ఐనవోలుకు పోటెత్తిన భక్తజనం
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి వారాంతపు జాతర మొదటి ఆదివారం భక్తజనం పోటెత్తారు. శనివారం రాత్రి నుంచే జాతర ప్రాంగణానికి భక్తులు చేరుకుని స్వామివారికి ఒగ్గు పూజారుల మేలుకొలుపు, అభిషేకాలు, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. జాతర ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. వాహనాలు ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయడంతో భక్తులు కొంతమేర అవస్థలు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లో బారులుతీరడంతో స్వామివారి దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టింది. ధర్మదర్శ నం, రూ.100 దర్శనం క్యూలైన్లో సైతం భక్తులు బారులుతీరడంతో కనీసం గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నృత్య మండ పం, సత్రాల వద్ద, రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీ పంలో బోనాలు, పట్నాలు వేయించుకుని ఒగ్గు పూజా రుల చేత తమ తాత, ముత్తాతలను వారిని స్మరించుకుని భక్తితో బోనం నైవేద్యం సమర్పించారు. కొందరు భక్తులు స్వామివారి రథ సేవలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవ విగ్రహాలతో ఉన్న స్వామివారు దేవేరులను రథంతోలాగి తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. పూజాది కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఈఓ సదానందం, పాల క మండలి సభ్యులు కుల్ల సోమేశ్వర్, సమ్మెట యాదగిరి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. క్యూలైన్ల బారికేడ్లు, పందిళ్లను తిరిగి ఏర్పాటు చేస్తాం క్యూలైన్ల బారికేడ్లు, ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు తమ అనుమతి లేకుండానే తొలగించారని వాటిని తిరిగి పునరుద్ధరిస్తామని ఆలయ ఈఓ సదానందం తెలిపారు. భక్తులు వేలాదిగా తరలిరావడంతో క్యూలైన్లో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం స్వామివారిని 40 వేల మంది భక్తులకుపైగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. -
మేం కళాకారులం కాదా!
తెలంగాణఉద్యమంలో పాల్గొన్నాం: ఒగ్గు కళాకారులు మాకూ ఉద్యోగాలివ్వాలి సచివాలయం ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ హైదరాబాద్: టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఉద్యోగాలు కల్పించాలని ఒగ్గు కళాకారులు డిమాం డ్ చేశారు. తమకు అన్యాయం జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి విన్నవించుకునేందుకు సోమవారం 10 జిల్లాలకు చెందిన దాదాపు 400 మంది కళాకారులు రవీంద్రభార తి నుంచి సచివాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. వారిని లోపలికి అనుమతించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి డప్పులు వాయిస్తూ, నృ త్యాలు చేస్తూ నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి, సాయంత్రం విడుదల చేశారు. ప్రభుత్వం కేవలం 550 మంది కళాకారులకు మాత్రమే ఉద్యోగాలిస్తామనడం అన్యాయమన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా.. మధ్యాహ్నం ఎండను కూడా లెక్క చేయకుండా పెద్దలతోపాటు చిన్నపిల్ల లు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. చెప్పులు కూడా లేకుండా రోడ్డుపై నృ త్యాలు చేశారు. పిల్లలు కూడా ఎండలో డప్పులు వాయిస్తుండడంతో అక్కడి వారిని కలచివేసింది. ఒగ్గు కళాకారుడు రవి కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఒగ్గు కళాకారులమంతా కీలకంగా వ్యవహరించామని చెప్పారు. ఇతర కళాకారులతో తమను సమానంగా చూడాలని కోరారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలో దాదాపు వంద మంది ఒగ్గు కళాకారులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. రాత్రులు కూడా ఒగ్గు కథ చెప్పడం వల్ల చాలామంది కళాకారులు అనారోగ్యం బారిన పడుతున్నారని, తమకు కూడా హెల్త్‌కార్డులు జారీ అయ్యేలా చూడాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. -
సాంస్కృతిక శాఖపై దండెత్తిన ఒగ్గు కళాకారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యాలయంపైకి ఒగ్గు కళాకారులు దండెత్తారు. దీంతో సోమవారం రవీంద్రభారతి ప్రాంగణంలోని రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఓ ప్రాంతానికి చెందిన ఒగ్గు కథ కళాకారులకు అక్టోబర్ 7, 8 తేదీల్లో వర్క్‌షాపును ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు వారు రవీంద్రభారతికి వచ్చేందుకు రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే 5వ తేదీన వర్క్‌షాపు రద్దు చేస్తున్నట్లు సమాచారం అందించారు. అప్పటికే రవాణాకి కొంత మొత్తం వెచ్చించిన 132 మంది కళాకారులు సోమవారం ఉదయం 11.30కి రవీంద్రభారతికి చేరుకున్నారు. ఒగ్గు కథ, గొరవయ్యలు, తప్పెటగుళ్ళు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సత్యనారాయణ, నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు కార్యాలయం ఎదుట బ్యాండ్, డోల్, నపీరాలు వాయిస్తూ ధర్నాకు దిగి గంటపాటు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు అక్కడి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక శాఖ డెరైక్టర్ ఆర్.కవితాప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ చివరిలో ఒగ్గు కళాకారుల వర్క్‌షాపు నిర్వహించనున్నామన్నారు.