inavolu mallanna temple
-
ఐనవోలుకు పోటెత్తిన భక్తజనం
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి వారాంతపు జాతర మొదటి ఆదివారం భక్తజనం పోటెత్తారు. శనివారం రాత్రి నుంచే జాతర ప్రాంగణానికి భక్తులు చేరుకుని స్వామివారికి ఒగ్గు పూజారుల మేలుకొలుపు, అభిషేకాలు, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. జాతర ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. వాహనాలు ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయడంతో భక్తులు కొంతమేర అవస్థలు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లో బారులుతీరడంతో స్వామివారి దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టింది. ధర్మదర్శ నం, రూ.100 దర్శనం క్యూలైన్లో సైతం భక్తులు బారులుతీరడంతో కనీసం గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నృత్య మండ పం, సత్రాల వద్ద, రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీ పంలో బోనాలు, పట్నాలు వేయించుకుని ఒగ్గు పూజా రుల చేత తమ తాత, ముత్తాతలను వారిని స్మరించుకుని భక్తితో బోనం నైవేద్యం సమర్పించారు. కొందరు భక్తులు స్వామివారి రథ సేవలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవ విగ్రహాలతో ఉన్న స్వామివారు దేవేరులను రథంతోలాగి తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. పూజాది కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఈఓ సదానందం, పాల క మండలి సభ్యులు కుల్ల సోమేశ్వర్, సమ్మెట యాదగిరి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. క్యూలైన్ల బారికేడ్లు, పందిళ్లను తిరిగి ఏర్పాటు చేస్తాం క్యూలైన్ల బారికేడ్లు, ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు తమ అనుమతి లేకుండానే తొలగించారని వాటిని తిరిగి పునరుద్ధరిస్తామని ఆలయ ఈఓ సదానందం తెలిపారు. భక్తులు వేలాదిగా తరలిరావడంతో క్యూలైన్లో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం స్వామివారిని 40 వేల మంది భక్తులకుపైగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. -
మమ్మేలు మల్లన్న..
ఐనవోలు(వర్ధన్నపేట): డప్పు చప్పుళ్లు..శివసత్తుల పూనకాల తో మమ్మేలు మల్లన్న.. సల్లంగ చూడు మల్లన్న అంటూ భక్తుల మొక్కులు.. ఒగు ్గకళాకారుల డోలు మోతలతో ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవా లు ధ్వజారోహణంతో శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రాతః కాలంన ఒగ్గు పూజారులు స్వామివారికి మేలుకొలుపు పలి కారు. పూజారులు విఘేశ్వర పూజ చేసి ఉద యం మహాన్యాస రుధ్రాభిషేకం చేసి స్వామి వారికి, అమ్మవార్లకు నూతన వస్త్రాలంకణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 10 గంటలకు ధ్వజానికి కాషాయ çపతాకాన్ని ఏర్పాటు చేసి ఆ పతాకాన్ని చేత బూని వేద మంత్రాలతో ఆలయం చుట్టూ మంగళ వాయిద్యాలతో మూడు ప్రదక్షిణలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఆటంకం కలుగకుండా జరుగాలని అందరి దేవుళ్లను ఆవా హన జరిపి ఆ కాషాయ పతా కాన్ని ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఆలయంపై ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లుగా ప్రకటించారు. అనంతరం మహాన్యాస రుధ్రాభిషేకం చేసి నీరాజ న మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని రవీందర్రావు, ఈఓ సదానందం, ప్రధాన అర్చకులు నందనం శివరాజయ్య, పాతర్లపాటి రవీందర్, శ్రీనివాస్, మధుకర్‌శర్మ, మధుశర్మ, దువగిరి భీమన్న, పాతర్లపాటి నరేష్‌శర్మలతో పాటు పాలకమండలి సభ్యులు తక్కళ్లపెల్లి చందర్రావు, కుల్ల సోమేశ్వర్, యాకూబ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుని మొక్కులు మొక్కుకున్నారు. శివసత్తుల విన్యాసాలు, నృత్యాలు, బోనం నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి సమర్పించుకున్నారు. నేడు భోగి ఉత్సవాలు నేడు ఆదివారం భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మంద్ర పుష్పాల దర్శనాలుంటాయని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారికి ఎన్పీడీసీఎల్ సీఎండీ పూజలు∙ ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామిని శనివారం ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయంలోకి వారిని మంగళవాయిద్యాలతో లోనికి తీసుకెళ్లారు. అనంతరం గోపాల్‌రావు దంపతులకు స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాన్ని అందించి వేదపండితులు ఆశీర్వదించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మాణమవుతున్న 133/33 కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచిం చారు. ఎంపీపీ మార్నేని రవీందర్రావు, ఆలయ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఈఓ సదానందం, విద్యుత్ ఇంజనీరింగ్ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అయ్యో దేవా.. ఇవేం పనులు
ఐనవోలు(వర్ధన్నపేట) : బ్రహోత్సవాలకు ముస్తాబవుతున్న ఐనవోలు మల్లన్న ఆల యంలో అభివృద్ధి పనుల మాటున శాస్త్ర విరుద్ధ పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. శాఖల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. క్రీ.శ. 1077-1129 మధ్య కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ పురాతన ఆలయం కాకతీయ శిల్పకళకు అద్దం పడుతోంది. ఈ ఆలయంలో ఏటా జరిగే మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కలెక్టర్ కిషన్ నేతృత్వంలో ఈ నెల 5న ఆయా శాఖల జిల్లా అధికారులతో గ్రామంలో సమీక్ష సమావేశం నిర్వహించి జాతర ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి పనుల్లో డొల్లతనం భక్తులకు మెరుగైన సేవలందించాలనే తలంపుతో రూ.లక్షలు ఖర్చు చేసి అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. ఆల యం ఎదురుగా ప్రాంగణంలో కుడి, ఎడ మ వైపు షాబాద్ బండ పరుస్తున్నారు. ఈ పనులు భక్తుల మనోభావాలకు విరుద్ధంగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాకతీయ అర్బన్ డెవలప్మెం ట్(కుడా) ఆధ్వర్యంలో రూ. 16 లక్షలతో ఆలయం కుడివైపున షాబాద్ బండతో ఫ్లోరింగ్ పూర్తి కాగా, రెండో విడతలో రూ. 20 లక్షలతో ఎడమవైపు ఫ్లోరింగ్ పనులు ప్రారంభించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ గర్భగుడి కంటే తక్కువ ఎత్తులో ఈ ఫ్లోరింగ్ పనులు చేపట్టాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా రెండు అడుగుల (ఫీట్లు) ఎత్తుగా ఈ పనులు చేస్తున్నార ని పూజారులు విమర్శిస్తున్నారు. పురావస్తు, దేవాదాయశాఖ సమక్షంలో జరగాల్సిన అభివృద్ధి పనుల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. వైభవాన్ని కోల్పోతున్న కాకతీయ కట్టడాలు ఆలయ అభివృద్ధి కోసం 2010లో పురావస్తుశాఖ రూ.కోటి విడుదల చేయగా ఆర్‌ఆండ్‌బీ శాఖ పనులు చేపట్టింది. ఈ నిధులతో ఆలయంలో ఫ్లోరింగ్ పనులు చేశారు. రెండేళ్లు కొనసాగిన ఈ పనులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆలయం ఎదురుగా ఉన్న నృత్యమండపం అభివృద్ధి చేయాల్సి ఉండగా పనులు చేయకుండానే సంబంధిత కాంట్రాక్టర్ నిధులు విడుదల చేసుకున్నాడ నే విమర్శలున్నాయి. పూర్తిగా శిథిలావస్థలో ఉన్న నృత్యమండపాన్నిఅభివృద్ధి చేశాక ఫ్లోరింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా ముందే ఫ్లోరింగ్ పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారు. నృత్యమండపంను అభివృద్ధి చేసే సమయంలో ఫ్లోరిం గ్ కోసం వేసిన బండలు(షాబాద్) పగిలి పోయే ఆస్కారం కూడా ఉంది. ఇదే జరిగి తే ప్రస్తుతం చేపట్టిన పనులు వృథాగా మా రుతాయి. ముందుచూపు లోపించడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దేవాదాయ, పురావస్తుశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆలయ అభివృద్ధి పనుల్లో మార్పు చేసి కాకతీయ శిల్పకళను, భక్తు ల మనోభావాలను కాపాడుతూ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.