మమ్మేలు మల్లన్న.. | inavolu mallanna brahmotsavalu Begins in Warangal | Sakshi
Sakshi News home page

మమ్మేలు మల్లన్న..

Published Sun, Jan 14 2018 11:09 AM | Last Updated on Sun, Jan 14 2018 11:09 AM

inavolu mallanna brahmotsavalu Begins in Warangal - Sakshi

ఐనవోలు(వర్ధన్నపేట): డప్పు చప్పుళ్లు..శివసత్తుల పూనకాల తో  మమ్మేలు మల్లన్న.. సల్లంగ చూడు మల్లన్న అంటూ భక్తుల మొక్కులు.. ఒగు ్గకళాకారుల డోలు మోతలతో  ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవా లు  ధ్వజారోహణంతో శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రాతః కాలంన ఒగ్గు పూజారులు స్వామివారికి మేలుకొలుపు పలి కారు. పూజారులు విఘేశ్వర పూజ చేసి ఉద యం మహాన్యాస రుధ్రాభిషేకం చేసి స్వామి వారికి, అమ్మవార్లకు నూతన వస్త్రాలంకణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 10 గంటలకు ధ్వజానికి కాషాయ çపతాకాన్ని ఏర్పాటు చేసి ఆ పతాకాన్ని చేత బూని వేద మంత్రాలతో ఆలయం చుట్టూ మంగళ వాయిద్యాలతో మూడు ప్రదక్షిణలు చేశారు.

బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఆటంకం కలుగకుండా జరుగాలని అందరి దేవుళ్లను ఆవా హన జరిపి ఆ కాషాయ పతా కాన్ని ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఆలయంపై ప్రతిష్ఠించి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లుగా ప్రకటించారు. అనంతరం మహాన్యాస రుధ్రాభిషేకం చేసి నీరాజ న మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్‌ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, ఈఓ సదానందం, ప్రధాన అర్చకులు నందనం శివరాజయ్య, పాతర్లపాటి రవీందర్, శ్రీనివాస్, మధుకర్‌శర్మ, మధుశర్మ, దువగిరి భీమన్న, పాతర్లపాటి నరేష్‌శర్మలతో పాటు పాలకమండలి సభ్యులు తక్కళ్లపెల్లి చందర్‌రావు, కుల్ల సోమేశ్వర్, యాకూబ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుని మొక్కులు మొక్కుకున్నారు. శివసత్తుల విన్యాసాలు, నృత్యాలు, బోనం నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి సమర్పించుకున్నారు.

నేడు భోగి ఉత్సవాలు
నేడు ఆదివారం భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మంద్ర పుష్పాల దర్శనాలుంటాయని ఆలయ అర్చకులు తెలిపారు.

స్వామివారికి ఎన్పీడీసీఎల్‌ సీఎండీ పూజలు∙
ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామిని శనివారం ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయంలోకి వారిని మంగళవాయిద్యాలతో లోనికి తీసుకెళ్లారు. అనంతరం గోపాల్‌రావు దంపతులకు స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాన్ని అందించి వేదపండితులు ఆశీర్వదించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మాణమవుతున్న 133/33 కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచిం చారు. ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, ఆలయ చైర్మన్‌ గజ్జెల్లి శ్రీరాములు, ఈఓ సదానందం, విద్యుత్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement