mallikarjuna swamy
-
హరహర మహాదేవ.. శంభో శంకర
సాక్షి, అచ్చంపేట : హరహర మహాదేవ.. శంభో శంకర.. ఓం నమఃశివాయ.. శివాయ నమ ఓం.. అంటూ ఒంటిపూట భోజనం.. సాయంత్రం అల్పాహారం.. అందుబాటులోని శివాలయంలో పూజలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు.. ధ్యానముద్రలతో ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతున్నారు శివదీక్షా స్వాములు. పంచాక్షరి నామజపం ఆ మల్లికార్జునస్వామి శివదీక్షను స్వీకరిస్తే తమకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని, కుటుంబమంతా ఆయురోగ్యాలతో తులతూగుతారని భావిస్తుంటారు. రవాణా సౌకర్యాలు ఉన్నా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శివనామ సంకీర్తనలు చేసుకుంటూ కాలినడకన కొండలు, గుట్టలు, బండరాళ్లు, ముళ్లకంపల అడ్డు తొలగించుకుంటూ శ్రీశైలం చేరుకుంటారు. ఈ ప్రయాణం శరీరానికి ఎంతో బాధ కలిగించినప్పటికీ మనస్సు మాత్రం ఆధ్యాతి్మకానందంతో పులకిస్తుందని, అది ప్రత్యక్షంగా అనుభవిస్తే తెలుస్తుందని శివస్వాములు పేర్కొంటున్నారు. వందల కి.మీ.ల దూరం నుంచి మండుటెండలను సైతం లెక్క చేయకుండా.. పుడమి తల్లి వేడికి పాదాలు బొబ్బలెక్కుతున్నా, మదిలో ప్రతిధ్వనిస్తున్న శివనామస్మరణతో కైలాస ద్వారం చేరుతున్నామని పేర్కొంటున్నారు. అక్కడి నుంచి తమ ప్రయాణం సాఫీగా జరుగుతుందని, ఇక శ్రీశైలం చేరినట్లేనని భావిస్తామని చెబుతున్నారు. ఆదుకుంటున్న అన్నదాన సత్రాలు శ్రీశైలంలో 50కిపైగా నిత్యాన్నదాన సత్రాలు ఉన్నాయి. అన్నదాన సత్రాల్లో అన్నపూర్ణాదేవికి అర్చనలు చేస్తున్నారు. వాసవీ సత్రం, కొండవీటి రెడ్ల సత్రం, మున్నూరుకాపు సత్రం, వెలమ సత్రం, విశ్వబ్రాహ్మణ సత్రం, అన్నదాన సత్రం, కమ్మసత్రం, కాకతీయ సత్రం, కంబం సత్రం, యాదవ సత్రం, శ్రీకష్ణదేవరాయ సత్రం, ఆరెకటిక, మేరుసంఘం, వెలమ, వందేళ్లనాటి కరివెన సత్రాలతోపాటు మరిన్ని సత్రాలు నిరాటకంగా నిత్యాన్నదానం చేయడంలో ముందున్నాయి. ఇక ఆశ్రమాలు, మఠాల సంగతి చెప్పక్కర్లలేదు. శివరాత్రి బహ్మోత్సవాల సందర్భంగా అటకేశ్వర సమీపంలోని నాలుగు ఆశ్రమాలు వేలాది మంది భక్తులకు అన్నదానం చేస్తున్నాయి. శ్రీశైలంలో ఒకరికి అన్నదానం చేస్తే కాశీలో లక్షమందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయనే నేపథ్యంలో అన్న వితరణకు తామూ భాగస్వాములం అవుతామని వేలాది మంది విశేషంగా అన్నసత్రాలకు విరాళాలు సమరి్పస్తున్నారు. శ్రీశైలంలో అన్నదాన ప్రభంజనంతో హర్షిత రేఖలు వ్యక్తం చేస్తూ ‘అన్నదాతా.. సుఖీభవ’ అంటూ దీవిస్తున్నారు. అటవీశాఖ నిబంధనలతో.. పాదయాత్రతో శ్రీశైల మహాక్షేత్రం వెళ్లే స్వాములకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చి షామియానాలు, ఉచిత భోజనం, మంచి నీటి సౌకర్యాలతోపాటు అల్పాహారం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పాదయాత్రతో వచ్చిన శివస్వాములకు నల్లమల దారిలోని మన్ననూర్, ఫర్హాబాద్, వట్టువర్లపల్లి, రాసమల్లబావి వద్ద గత పుష్కరకాలంగా దాతలు సేవలందిస్తున్నారు. కాలినడకన వెళ్లే శివస్వాముల ఆకలి తీర్చడంలో దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాలు చురుకైన పాత్ర పోషిస్తుంది. అచ్చంపేట– శ్రీశైలం నల్లమల అభయారణ మార్గంలో ప్రతిఏటా 20కిపైగా అన్నదాన కేంద్రాలు వెలిశాయి. మన్ననూర్ తర్వాత వటువర్లపల్లి వరకు ఎక్కడ కూడా వీరికి తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకదు. వటువర్లపల్లి తర్వాత మళ్లీ దోమలపెంట వరకు ఇదే పరిస్థితి. అటవీశాఖ వారు అటవీప్రాంతంలో తాగునీటి వసతి కలి్పంచాల్సి ఉన్నా ఇంత వరకు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. గతంలో కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాం కింద అటవీశాఖ వారు మంచినీటి సరఫరా, అల్పహార కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. కానీ గత నాలుగేళ్లుగా ఈ పద్ధతికి అటవీశాఖ స్వస్తి చెప్పి వీరి పేరిట డబ్బు ఖర్చు పెడుతున్నట్లు రికార్డులు చూపుతున్నారు. పాదయాత్ర చేసే స్వామలకు జంతువుల నుంచి ప్రాణహాని కలగకుండా అటవీ మార్గంలో సిబ్బందితో టీం ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై స్వాములకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక బస్సు సర్వీసులు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు, శివరాత్రిని పురస్కరించుకొన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ఆర్టీసీ డిపోల నుంచి సోమవారం నుంచి 22వ తేదీ వరకు ఆరురోజులపాటు శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. శ్రీశైలం కాలినడకన వెళ్లిన శివస్వాములు తిరుగు ప్రయాణం కోసం జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. గద్వాల డిపో నుంచి సోమవారం 35 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఐదురోజులపాటు 390 బస్సులను శ్రీశైలానికి నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లకుండా ఆర్టీసీ బస్సులో సురక్షిత ప్రయాణం చేయాలని అధికారులు కోరుతున్నారు. అచ్చంపేట డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని డీఎం మనోహర్ తెలిపారు. -
ఈవారం కథ
తెల్లార్తే భోగి... ఆ ఊళ్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఓ ఆచారం ఉంది. భోగిమంట వేయడానికి తడికెలు, కర్రల మోపులు, చెక్కతో చేసిన కొట్లు... ఏం దొరికితే వాటిని దొంగిలించి, మంటల్లో వేస్తారు.‘‘ఎంత పోడు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాడు తప్ప పట్టించుకోడు. ఈ మనిషితో ఏగలేక సస్తున్నా..’’ తాటాకులు మడెం (ముడుచుకుపోయిన తాటాకులు వెడల్పు అయ్యేందుకు అమర్చే పద్ధతి) తొక్కుతున్న యానాది ఈరన్నతో అంటుంది సుబ్బమ్మ. అవేవీ పట్టించుకోకుండా అలవాటైపోయినట్లు నులకమంచంపైన కూర్చొని చుట్ట తాగుతున్నాడు నరసయ్య. ‘‘మొన్న కురిసిన దబాటు వాన (ఒక్కసారి పెద్దగా కురిసి ఆగిపోయేది)కు ఉన్న రెండు బస్తాల వడ్లు తడిసిపొయ్యాయి. రేపు అయ్యి మరాడిస్తే నూకలవుతాయి. ఏం తింటాడో..! దండెం మీదున్న బట్టలన్నీ తడవకుండా మూటగట్టి మంచం మీద పెట్టా. ఇల్లు మడుగు కాకుండా చినుకులు పడేచోట గిన్నెలు పెడ్తే ఖాళీలేక ఈయన పంచలో ఓ మూల ముడుక్కుని కూర్చొన్నాడు’’ సుబ్బమ్మ బరిగొడ్ల కట్టుమట్ట (గేదెలు కట్టేసిన గుంజ చుట్టూ ఉండే స్థలం) చిమ్ముతూ మాట్లాతూనే ఉంది. నరసయ్య తాగుతున్న చుట్ట చివరి కొచ్చేసరికి విసిరేసి‘‘బస్టాండులో ఉన్న షాపు దగ్గరకొచ్చెయ్యండి. డబ్బులిస్తా’’ అని ఈరన్నతో చెప్పి పైకి లేశాడు. చీపురు కట్ట వెనుక చేత్తో తట్టి, ముందుకు వెనక్కు అయిన పుల్లలను సరిచేసి, వెళ్తున్న మొగుడి వైపు ఓ చూపు చూసింది సుబ్బమ్మ. ఆ చూపు గురించి నరసయ్యకు బాగా తెలుసు, కాబట్టే వెనక్కు తిరిగి చూడకుండానే వెళ్లిపోయాడు. ఎంకటేశం, నాగన్న తాటాకు మోపులు విప్పి ఆకులు అందిస్తుంటే గుడికట్టినట్లు చాలా అందంగా ఒక్కో ఆకును విడమర్చినట్లు పేర్చుతున్నాడు ఈరన్న. పదకొండు మోపుల తాటాకును రెండు మడేలు తొక్కాడు. సుబ్బమ్మ తలా గ్లాసుడు మజ్జిగ ఇచ్చింది. ‘‘బయట తాటాకు మోపు పన్నెండొందలు అమ్ముతుంది. ఒకప్పట్లా రెడ్లు బరవాస(ఊరకనే)గా ఇచ్చే రోజులు పొయ్యాయి. పాపం నరసన్న అయినా ఏం చేస్తాడు చెప్పు’’ అన్నాడు మజ్జిగ తాగుతూ ఈరన్న.‘‘ఏదో ఒకటి చెయ్యాలి కదా... ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని వానపడ్డప్పుడల్లా బిక్కుబిక్కుమంటూ ఉంటున్నా ఇంట్లోకి బయటకు తేడా లేకుండా పోయింది. పిల్లోడి పుస్తకాల సంచి కూడా తడిసిపోయింది. వాడు లబోదిబో అన్నాడు. కాస్త ఎండుగడ్డన్నా కరువు(ఇంటి పైకప్పులో గుంతలు పడిన స్థలం)ల దగ్గర ఏయించమన్నా.’’ సుబ్బులు తన బాధల గురించి చెప్తూనే ఉంది.‘‘ఇప్పుడే కదా మడెం తొక్కాం. రెండు వారాలైతే ఆకులు సదరం (హెచ్చుతగ్గులు పోవడం) అవుతాయి. సంక్రాంతి పండగనెల పెట్టబోతున్నారు. మాకు పెద్దగా పనులేం ఉండవు. ఎట్లా కప్పేందుకు యరమాల నారాయణ ఉన్నాడుకదా... రెండు దూలాల ఇల్లు. రెండు రోజులు పట్టిద్ది. చూద్దాం ఒకరోజులో...’’ అన్నాడు ఈరన్న.తాగిన గ్లాసులిచ్చి, బస్టాండుకు బయల్దేరారు.షాపులో గడ్డం చేస్తున్న నరసయ్య దగ్గరకు ఆచారి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ‘‘నరసన్నా... ఆ వజ్జిరెడ్డిపాలెం రామయ్య, వెంకటనర్సు ఈ ఏడాది సంక్రాంతి పండగ బిందెతీర్థం మేళాం ఒప్పుకుంటున్నారు’’ అని ఆయాసం ఆపుకుంటూ చెప్పాడు. ‘‘అదెలా కుదురుద్ది! మా తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. వాళ్లొచ్చి దూరితే ఎలా ఒప్పుకుంటా?’’ అంటూ చేస్తున్న గడ్డం సరిగా చేశాడో లేదో కూడా పట్టించుకోకుండా ఆచారితోపాటు జాలమ్మచెట్టు (రచ్చబండ) దగ్గరకు వెళ్లాడు నరసయ్య. అక్కడ ఊరి పెద్దలందరూ కూర్చొని ఉన్నారు. రామయ్య, వెంకటనర్సు నరసయ్యను చూసి ముఖాలు తిప్పుకున్నారు.‘‘ఒరే...! ఇదేం పాడుబుద్ధిరా మీకు..? పక్కోడి నోటికాడ కూడు తియ్యాలని చూస్తున్నారు. మీ ఊళ్లోకి మీరు పిలవంది మేం ఏ మేళానికైనా వస్తున్నామా?’’ నిలదీశాడు నరసయ్య. ‘‘అదికాదు నరసయ్య... బిందెతీర్థం అంటే పండగ నెల పెట్టినప్పటి నుంచి పండగెళ్లిందాకా... రోజూ పని. పొద్దున్నే నాలుగు గంటలకు లేవాలి. ఒకటా రెండా మూడు గుళ్లు తిరగాలి. నీకు వయసు పెరుగుతుంది కదా..’’ అన్నాడు ఊరి పెద్ద వీరయ్య.అంటే ఈ నాటకం వెనుక వీరయ్య హస్తం ఉందన్నమాట అనుకున్నాడు మనసులో నరసయ్య.‘‘ప్రతి ఏడాదిలాగే, పక్కూరి నుంచి ఒక సన్నాయిని పిలుచుకుంటా’’ చెప్పాడు నరసయ్య.‘‘అదికాదు’’ అంటూ ఆదిరెడ్డి ఏదో చెప్పబోయాడు. నరసయ్యకు కోపం నషాలానికి ఎక్కింది.‘‘సరే... మీ ఇష్టం. ఈ బిందెతీర్థం వాళ్లకే ఇవ్వండి. ఇక ఊళ్లో ఏ చావొచ్చినా, పెళ్లొచ్చినాఏ కార్యం జరిగినా అన్నింటికి వాళ్లనే పిలిపించుకోండి’’ అని భుజాన ఉన్న కండువా విదిలించి, వెళ్లడానికి రెండడుగులు వేశాడు. ఆ మాట వెనకున్న అర్థం వీరయ్యకుబోధపడింది. ‘‘నరసయ్యా... నరసయ్యా’’ అని వెనక్కు పిలిచాడు.‘‘సరే... నీ ఇష్టం. అలాగే కానివ్వు’’ అంటూ పైకి లేచాడు. అతనితోపాటు మిగిలిన వాళ్లందరూ కదిలారు. నరసయ్య వైపు రామయ్య, వెంకటనర్సు కొరకొరగా చూశారు. అవేవీ పట్టించుకోకుండా ఆచారితో కలిసి షాపునకు బయల్దేరాడు నరసయ్య. ∙∙∙పండగ నెల పెట్టారు. రోజూ ఆచారి మూడున్నర గంటలకల్లా నరసయ్య ఇంటికొచ్చి నిద్రలేపే వాడు. నరసయ్య డోలు తీసుకొని బయటకొచ్చేవాడు. ఇద్దరూ బస్టాండు దగ్గరున్న కన్నేశ్వరస్వామి గుడికి వెళ్లేవాళ్లు. అప్పటికే సన్నాయి వాయించడం కోసం మన్నూరు నుంచి వచ్చిన నాగలింగం గుడి దగ్గర ఉండేవాడు. ఆచారి కన్నేశ్వరస్వామి గుడిలోని బావి నీళ్లతో స్నానం చేసి, తడిబట్టలతో బావి చుట్టూ తిరిగి రాగిబిందె నిండా నీళ్లు నెత్తిన పెట్టుకుని రామలింగేశ్వర స్వామి గుడికి బయల్దేరేవాడు. పూజారితో పాటు నరసయ్య డోలు, నాగలింగం సన్నాయి వాయించుకుంటూ వీధిలో వెళ్లేవాళ్లు. రామలింగేశ్వరస్వామి గుడిలో ఉన్న శివలింగాన్ని ఆ నీళ్లతో అభిషేకించి, ఆ గుడిలో ఉన్న బావిలోంచి నీళ్లు తీసుకొని మల్లికార్జునస్వామి గుడికి వెళ్లేవాళ్లు. అక్కడ ఉన్న లింగాన్ని ఆ నీళ్లతో అభిషేకించేవాడు ఆచారి. మళ్లీ అక్కడున్న బావిలోంచి నీళ్లు తీసుకుని తిరిగి కన్నేశ్వరస్వామి గుడికి వచ్చేవాళ్లు. పూజారి మల్లికార్జునస్వామి గుడి నుంచి తెచ్చిన నీళ్లతో కన్నేశ్వరస్వామిని పూజించేవాడు. పండగనెల పెట్టింది మొదలు పూర్తయ్యేవరకు ఇలా చేయడం ఆ ఊరి ఆచారం. బిందెతీర్థం మేళాం విని ఊళ్లో ఆడవాళ్లు నిద్రలేచే వాళ్లు. ఇంటి ముందు చిమ్మి పేడకల్లాపు చల్లేవాళ్లు. అందంగా రకరకాల ముగ్గులు వేసేవాళ్లు. నెలంతా బిందెతీర్థం వల్ల ఆచారికి నూటయాభై రూపాయలు. నరసయ్యకు రెండు వందలు. దాంట్లో వంద మన్నూరు నుంచి వచ్చిన నాగలింగానికి పోతుంది. తనకు వంద మిగులుతుంది. దానికన్నా ఊరి ఆచారం, దేవుడి మేళం అన్న తృప్తి కలుగుతుంది అంటాడు నరసయ్య. అన్నింటికి మించి మా ఊరు అనే ఆలోచనే నరసయ్యకు గొప్ప‘‘ఆకులు మడెం తొక్కించి నెలరోజులు దాటింది. వాళ్లేమో పది రోజుల్లో వస్తామని చెప్పారు. ఇంతవరకు అతీగతి లేదు. భోగి కూడా వస్తుంది. భోగికి ముసురు పట్టిందంటే వారం రోజులు తగ్గదు వాన’’ పొద్దున్నే మజ్జిగ చిలుకుతూ, పొది (కత్తులు, కత్తెర్లు, ఆకురాయి వంటి మంగలి సామాను ఉండే సంచి) తీసుకుని ఊళ్లోకి వెళ్తున్న నరసయ్యతో అంది సుబ్బులు. ‘‘అలాగేలే.. కనుక్కుంటా...’’ అంటూ వెళ్లబోతున్న నరసయ్యతో... ‘‘ఈ సారి వాన వచ్చిందంటే నువ్వు నేను మూటముల్లె సర్దుకొని ఆ దేవుడి పంచల్లోకి వెళ్లాల్సిందే’’ గట్టిగా చెప్పింది. పెళ్లాం చెప్పేదానిలో కూడా నిజం ఉంది. ఏడు కట్టలు తడపలు తెప్పించి వారం రోజులు అవుతుంది. బజారులో ఈరన్న కనిపిస్తే రమ్మని చెప్పాలి. ఎట్లా యరమాల నారాయణ ఇంటి దగ్గరే ఉంటాడు. ఎప్పుడు పిలిచినా వస్తాడు. అనుకుంటూ ఊళ్లోకి బయల్దేరాడు నరసయ్య. బుస్సు హోటల్ దగ్గర ఈరన్నటిఫిన్ తింటూ కనిపించాడు. ‘‘ఏం ఈరన్నా! ఇల్లేమన్నా కప్పేదుందా? లేదా?’’ అడిగాడు.‘‘ఈ రోజు జాలిరెడ్డి పసుపుతోటలో పనుంది. ఎల్లుండి కదా భోగి. రేపు వస్తాం. తడపలు నానేసి పెట్టు’’ అని చెప్పాడు ఈరన్న. ‘‘హమ్మయ్య..!’’ రేపటికి ముడిపడింది అనుకుంటూ సంతోషంగా టీ తాగేసి, గడ్డం చేయడానికి లింగారెడ్డి ఇంటికి బయల్దేరాడు నరసయ్య.అనుకున్నట్లుగానే ఈరన్న, ఎంకటేశం నాగన్నతోపాటు మరో ముగ్గుర్ని తీసుకొని పొద్దున్నే వచ్చాడు. నరసయ్య బిందెతీర్థం పని ముగించుకుని ఇంటిదగ్గరే ఉన్నాడు. అప్పటికే సుబ్బులు ఇంట్లో సామానంతా భద్రంగా మూటలు గట్టి మంచాలు బయటేసి వాటిపై పెట్టింది. ఈరన్న, ఎంకటేశం ఇల్లు ఎక్కి కట్లు కోసి, పాత తాటాకులు పూర్తిగా తీసేశారు. తర్వాత యరమాల నారాయణ పైకెక్కి ఎక్కడెక్కడ కట్లు వదులయ్యాయో చూసి, కొత్త తడపలతో గట్టిగా కట్టాడు. మూలవాసం (కింద చూరు నుంచి దూలం మీదుగా పై వరకు నాలుగు మూలలా ఉండే వెదురు కట్టెలు) ఒకటి పుచ్చినట్లు అనిపిస్తే కొత్తది వేసి బిర్రుగా కట్టాడు. అందరూ కలిసి పదిగంటలకల్లా ఇంటిని కప్పుకు సిద్ధం చేశారు. నాగన్న మిగిలిన ఇద్దరూ కొన్ని తడపలను ఒకదానితో ఒకటి ముడేసి పొడుగ్గా చేశారు. పట్నార తడపల్ని (తాటి బద్దల పైతోలుతో వలిచేవి, గట్టిగా ఉంటాయి) ప్రత్యేకంగా పక్కన పెట్టారు. యరమాల నారాయణ గోసి పెట్టుకొని సూరుకట్టు బద్ద (ఒక చివర బాణంలా ఉండి రంధ్రంతో, మూరపొడుగు ఉన్న వెదురు బద్ద) తీసుకుని ఇల్లెక్కాడు. ఈరన్న తడపలు (ఆకు కోసిన తర్వాత మిగిలిన తాటి మట్టలను దొరువుల్లో నానేస్తారు. వాటిని పల్చగా చీలుస్తారు) తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. నారాయణ హెచ్చుతగ్గులు చూసుకుంటూ ఆకుల్ని ఇంటిపైన ఒకదాని తర్వాత ఒకటి కప్పుగా అమర్చుతున్నాడు. ఆకులు గాలికి ఎగరకుండా సూరుకట్టు బద్దతో ఆకుల మధ్య నుంచి లోపలకు పొడిస్తే దాని రంధ్రంలో తడప గుచ్చుతున్నాడు లోపలున్న ఈరన్న. దాన్ని పైకి లాక్కుని కప్పుకున్న కర్రలకు అనువుగా మళ్లీ సూరికట్టు బద్దతో లోపలకు గుచ్చి ఇస్తే రెండు తడప కొసల్ని వెదురు కట్టెకు, ఆకులకు కలిపి గట్టిగా ఏనుగు ముళ్లేస్తున్నాడు ఈరన్న. తాటాకుతో ఇల్లు కప్పడం అద్భుతమైన కళ. నేర్చుకుంటే వచ్చేది కాదు. బతుకులో భాగం కావాలి. అక్షరం ముక్కరాని నారాయణ, బడి ఎలా ఉంటదో తెలియని ఈరన్నకు ఎలా అబ్బిందో (వచ్చిందో)... పదో తరగతి చదువుకుంటున్న నరసయ్య కొడుక్కు అర్థంగాక వింతగా చూస్తా ఉన్నాడు. సమయం రెండు అయింది. అందరూ పనులాపి, మళ్లీ సుబ్బులు పెట్టిన అన్నం తిన్నారు. అప్పటికి కప్పటం రెండు అరలే పూర్తయ్యాయి. ఇంకా అయిదు అరల పని ఉంది. వెంటనే పని మొదలు పెట్టారు. సాయంత్రం ఆరు అయినా కప్పు పూర్తికాలేదు. ఆకులు మిగిలి ఉన్నాయి. తడపలూ ఉన్నాయి. పొద్దే లేదు. అసలే యరమాల నారాయణకు చూపుతగ్గి ఏడాదైంది. అందులో కప్పాల్సింది నడికొప్పు. ఆకు సరిగా పడలేదంటే, సూరులోకి జారే నీళ్లన్నీ, నట్టింట్లో పడతాయి. ‘‘నరసన్నా! కష్టం...! ఇక రేపు భోగో గీగో...! పొద్దున్నే వచ్చి, ఈ పని చేసి అప్పుడే ఇళ్లకెళ్లి భోగి నీళ్లు పోసుకుంటాం’’ అన్నాడు ఈరన్న. నారాయణ చెప్పకపోయినా అతనిది అదే మాట. సుబ్బులు కూడా ఏమీ అనలేక పోయింది. నరసయ్య కూడా ‘‘సరే..!. రేపు పొద్దున్నే రండి...’’ అన్నాడు. రేపటి కోసం మిగిలిన తాటాకులన్నీ ఏరి మోపు కట్టాడు నాగన్న. తడపలూ పక్కనే పెట్టాడు. కాళ్లూ చేతులు కడుక్కుని అందరూ వెళ్లిపోయారు.తెల్లార్తే భోగి... ఆ ఊళ్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఓ ఆచారం ఉంది. భోగిమంట వేయడానికి తడికెలు, కర్రల మోపులు, చెక్కతో చేసిన కొట్లు... ఏం దొరికితే వాటిని దొంగిలించి, మంటల్లో వేస్తారు. ఆ రాత్రంగా ఏవీ పోకుండా ఇళ్లల్లో వాళ్లు కాపలా కాస్తుంటారు. కొందరు గుంపుగా కలిసి వీధుల్లో తిరుగుతూ ఉంటే, ఆకతాయి కుర్రాళ్లు దొంగతనం చేయడానికి ఏం దొరుకుతాయా అని మాటువేస్తుంటారు. పైగా ఆరోజు భోగిమంటల్లో వేయడానికి ఏం దొంగిలించినా తప్పు కాదు. సంప్రదాయం. నరసయ్య ఇంటికప్పు సగంలో ఉందని ఊళ్లో అందరికీ తెలుసు. కానీ అతడి మంచితనం గురించి తెలిసిన వాళ్లెవరూ ఆవైపు చూడరు. ఆ ధైర్యం నరసయ్యలో కొండంత ఉంది. కానీ ఎందుకైనా మంచిదని మంచం మోపు దగ్గరే వేసుకుని, చుట్ట తాగుతూ రాత్రంతా మేలుకున్నాడు. దొంగల గుంపు అటుగా వస్తే సరదాగా ‘‘ఏం దొరక లేదా?’’ అని పలకరించాడు. వాళ్లూ నవ్వుతూ ‘‘నరసన్న పడుకో... మీ ఇంటికి ఎందుకొస్తాం’’ అని వెళ్లిపోయారు. భోగి కదా అని ఆచారి మూడు గంటలకే వచ్చి పిలిచాడు. నరసయ్య డోలు తీసుకొని వెళ్తూ ‘‘ఇదిగో జాగ్రత్తా... ఆ తాటాకు మోపు అక్కడే ఉంది’’. అని పెళ్లానికి చెప్పాడు. పందిట్లో పడుకుని ఉన్న సుబ్బులుకు మాగన్నుగా (కొద్దిగా) నిద్ర పట్టింది. పిల్లలు మరో మంచం మీద నిమ్మచెట్ల కింద హాయిగా నిద్ర పోతున్నారు.‘‘ఏం నరసన్నా ఇల్లు పూర్తి కాలేదా...’’ అడిగాడు ఆచారి. ‘‘లేదు ఇంకొద్దిగా ఉంది. ఈ రోజు పొద్దున్నే అయిపోతుంది’’ అన్నాడు నరసయ్య.‘‘మరి తాటాకు మోపు... అక్కడే ఉంది. భోగి కదా...’’ అన్నాడు ఆచారి.‘‘మూడు దాటింది..! ఇంకెవరు వస్తారు?’’ అని ధీమాగా అన్నాడు నరసయ్య.ఆచారి కన్నేశ్వరిస్వామి గుడిలో నీళ్లు తీసుకుని రామలింగేశ్వరస్వామి గుడికి వస్తున్నాడు. ఆచారితో పాటు నరసయ్య, నాగలింగం భోగి పండుగనే సంతోషంతో ఉత్సాహంగా మేళం వాయిస్తూ ఉన్నారు. డోలుకుడివైపున్న మూతమీద పుల్ల దుబ్ దుబ్ అని శబ్దంచేస్తుంటే, అందుకు తగ్గట్టు ఎడం వైపున్న మూతపై అతడి బొట్టెలున్న (ప్రత్యేకంగా డోలు వాయించేటప్పుడు పెట్టుకునే తొడుగులు) వేళ్లు అద్భుతంగా నాట్యం చేస్తున్నాయి. నాగలింగం సన్నాయిని తిప్పుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నట్లుగా ఊదుతున్నాడు. మంగళవాయిద్యాల చప్పుడికి లేచిన ఆడవాళ్లు, సంతోషంగా చిరునవ్వుతో వాళ్లను పలకరిస్తున్నారు. కల్లాపు చల్తున్న వాళ్లు, ముగ్గులేస్తున్న వాళ్లు, మేళం శబ్దానికి తలలు ఎత్తి చూసి ఆనందిస్తున్నారు. మల్లికార్జునస్వామి గుడి నుంచి బిందెతీర్థం కన్నేశ్వరస్వామి గుడికి తీసుకుని వెళ్తున్నారు ముగ్గురూ. ఆచారి నెత్తిన బిందెలో ఉన్న మంచినీళ్ల తీర్థం, నాగలింగం సన్నాయి, నరసయ్య డోలు.. వేకువజామున మేలుకొలుపు పాడుతోంది ఊరికి. వీధి మధ్యలో పెద్ద భోగిమంట. అప్పుడే ఎవరో వేసినట్లున్నారు. మంటల కొసల్లోంచి తాటాకు రవ్వలు గాల్లోకి లేస్తున్నాయి. నరసయ్యకు మనసులో ఏదో చెడు తోచింది. తీరా దగ్గరకు వెళ్లారు. మిగిలిన ఇల్లు కప్పడానికి ఉంచిన తాటాకులు అవి. మంటల్లో తగలబడి పోతున్నాయి. అప్పటి వరకు కళాత్మకంగా శివుడి ఢమరుక శబ్దాలను మోగించిన నరసయ్య డోలు హఠాత్తుగా మూగపోయింది. ‘‘నరసన్నా ఇవి నీ ఇంట్లో ఆకులే...’’ అరుస్తున్నట్లు అన్నాడు ఆచారి. ముందు వెనుక ఆలోచించకుండా నెత్తిమీదున్న బిందెతీర్థం మంటపై పోశాడు. శివలింగాన్ని సైతం శుద్ధి చేసే బిందెతీర్థం ఆ మంటను మాత్రం ఆర్పలేకపోయాయి.ఊరికోసం. దేవుడి కోసం బిందెతీర్థం మేళంకోసం గొడవపెట్టుకున్న నరసయ్య చూపు, గుండె ఆ మంటల్లాగే ఎగిసిపడుతున్నాయి. నాగలింగం సన్నాయి ఆపేసి బండరాయిలా నిలబడి చూస్తున్నాడు. మేళం ఆగిపోవడంతో అందరూ గుమిగూడారు. ఇళ్లల్లోంచి నీళ్లు తెచ్చి మంటలనైతే ఆపారు. కానీ, అప్పటికే ఆకులన్నీ బూడిదై పోయాయి.\నరసయ్యకు తెలుసు... ఎవరు ఆ పనిచేశారో...! ఎవరు చేయించారో...!?నిద్రలేచిన సుబ్బులు తాటాకుమోపు కనిపించలేదని అందర్నీ కోపంతో తిట్టిపోస్తుంది.రేపు ఊరి పెద్దమనుషులు ఆచారికి ఏ శిక్ష విధిస్తారో తెలియదు. ఎవరో పిలిచినట్లు ఆకాశంలో మబ్బులన్నీ కురవడానికి నల్లగా ఒకచోట చేరాయి.పూర్తిగా కప్పులేని ఇల్లు మాత్రం గోపురం లేని ఆలయంలా నిలబడి చూస్తోంది. ∙ -
ఐనవోలుకు పోటెత్తిన భక్తజనం
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి వారాంతపు జాతర మొదటి ఆదివారం భక్తజనం పోటెత్తారు. శనివారం రాత్రి నుంచే జాతర ప్రాంగణానికి భక్తులు చేరుకుని స్వామివారికి ఒగ్గు పూజారుల మేలుకొలుపు, అభిషేకాలు, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. జాతర ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. వాహనాలు ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయడంతో భక్తులు కొంతమేర అవస్థలు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లో బారులుతీరడంతో స్వామివారి దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టింది. ధర్మదర్శ నం, రూ.100 దర్శనం క్యూలైన్లో సైతం భక్తులు బారులుతీరడంతో కనీసం గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నృత్య మండ పం, సత్రాల వద్ద, రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీ పంలో బోనాలు, పట్నాలు వేయించుకుని ఒగ్గు పూజా రుల చేత తమ తాత, ముత్తాతలను వారిని స్మరించుకుని భక్తితో బోనం నైవేద్యం సమర్పించారు. కొందరు భక్తులు స్వామివారి రథ సేవలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవ విగ్రహాలతో ఉన్న స్వామివారు దేవేరులను రథంతోలాగి తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. పూజాది కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఈఓ సదానందం, పాల క మండలి సభ్యులు కుల్ల సోమేశ్వర్, సమ్మెట యాదగిరి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. క్యూలైన్ల బారికేడ్లు, పందిళ్లను తిరిగి ఏర్పాటు చేస్తాం క్యూలైన్ల బారికేడ్లు, ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు తమ అనుమతి లేకుండానే తొలగించారని వాటిని తిరిగి పునరుద్ధరిస్తామని ఆలయ ఈఓ సదానందం తెలిపారు. భక్తులు వేలాదిగా తరలిరావడంతో క్యూలైన్లో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం స్వామివారిని 40 వేల మంది భక్తులకుపైగా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. -
కొమురెల్లి కోరమీసాల మల్లన్న
పుణ్య తీర్థం కొండ చెరికలో ఉన్న కోరమీసాల కొంరెల్లి మల్లన్నను కొలిచిన వారికి కొంగు బంగారమే.. మల్లన్న దర్శనం పుర్వజన్మ సుకృతం అంటారు. తెలంగాణలో ప్రతి జిల్లా నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. స్థల పురాణం కొమురవెల్లి మల్లన్న ఈ పర్వతంపై 11వ శతాబ్దంలో వెలసినట్లు ప్రతీతి. యాదవ కులస్తుడైన ఓ గొర్రెల కాపరి కలలో స్వామి కన్పించి నేను ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్నాను. దర్శించుకొమ్మని, కొలిచిన వారి కొర్కెలు తీరుస్తానని చెప్పినట్లు ప్రచారం. అనాటి నుండి ఆ ప్రాంతం ప్రజలు పూజలు చేయడం మొదలు పెట్టారు. అప్పటికే వీరశైవ సాంప్రదాయం విరాజిల్లుతున్న కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగమైన కొముర వెల్లిలో వెలసిన మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడి పూజారులు చెబుతుంటారు. చెక్కు చెదరని పుట్టమట్టి విగ్రహం ఇంద్రకీలాద్రిపై కొండ చెరికలో వెలసిన మల్లన్న దేవునికి పూజలు మొదలై ఐదు వందల యేళ్లయింది. విచిత్రం ఏమిటంటే... 500 సంవత్సరాల క్రితం పుట్టమట్టితో విగ్రహాన్ని తయారు చేశారు. దేవుడికి కోరమీసాలు కూడా పెట్టారు. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ విగ్రహం నాభిలో శివలింగం ఉండటం ప్రత్యేకత. యాదవుల ఆడబిడ్డ గొల్ల కేతమ్మ, లింగ బలిజల ఆడబిడ్డ బలిజ మేడలమ్మను పాణిగ్రహణం చేసుకొని స్వామి ఇక్కడ వెలిసినట్లు నానుడి. అందుకోసమే స్వామి వారికి ఇరుపక్కల గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మల విగ్రహాలు ఏర్పాటు చేశారు. పట్నాల మల్లన్న దేవస్థానంలో వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం లింగ బలిజలు అర్చన చేయగా, స్వామి వారికి యాదవ కుల ఆచారం ప్రకారం ఒగ్గు పూజారులు వివిధ రంగుల, రంగాలంకార పట్నాలతో స్వామి వారిని కొలుస్తారు. అనంతరం బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలతో స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వయంగా నివేదన తయారు చేసి ఒగ్గు పూజారుల ద్వారా పట్నం వేయించడం విశేషం. స్వామి వారికి బోనం చేసే కుండను భద్రంగా ఇంటికి తీసుకెళ్లి దాంట్లో పాలు పితకడం, పాలు కాచడం చేస్తే ఆ కుటుంబంలో ఆయురారోగ్యాలతోపాటు, అష్ట ఐశ్వర్యాలు చేకూరతాయని, పశుసంపద, పాడిపంటలతో ఆ ఇల్లు తులతూగుతుందని విశ్వాసం. అదేవిధంగా గంగరేగు చెట్టు, ఒళ్లు బండ ఇక్కడ ప్రత్యేకత. గంగరేగు చెట్టుకు ప్రదక్షిణ చేసి ఒళ్లు బండ వద్ద ప్రణమిల్లి చెట్టు వద్ద పట్నం వేసిన వారి కోరికలు తీరుతాయని నమ్మకం. కోర్కెలు తీరాలని కొబ్బరి కాయల ముడుపులు కట్టడం అనవాయితీ. తడి బట్టలతో దేవాలయం ముందుండే ఒళ్లు బండ వద్ద ఒళ్లుపట్టుకుని, కోడెలు కట్టేస్తామని మొక్కిన వారికి సంతానం కల్గుతుందని నమ్మకం. స్వామివారి బండారి, గంగిరేగు చెట్టు ఆకు ఎంతో మహిమ గలవని, బండారి నుదుట పెట్టుకొని గంగిరేగు ఆకును ఔషధంగా తీసుకుంటే సర్వరోగాలు తొలగిపోతాయని విశ్వాసం. కన్నుల పండుగగా.. మల్లన్న కల్యాణం తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా మొక్కే కొంరెల్లి మల్లన్న కల్యాణం ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా జరుగుతుంది. మార్గశిర బహుళ ద్వాదశి స్వామివారి దృష్టికుంభం (బలిహరణము) నుండి మొదలయ్యే ఉత్సవాలు మార్గశిర బహుళ ద్వాదశిరోజు కల్యాణం, ఏటా మహాశివరాత్రి రోజు పెద్దపట్నం, ఫాల్గుణ మాసం బహుళ త్రయోదశి రోజు అగ్నిగుండాల ప్రజ్వలన మొదలైన ప్రత్యేక కార్యక్రమాలు, ప్రతి రోజు స్వామివారికి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా చేరుకోవచ్చు ప్రసిద్ధ కొమురెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఉంది. హైదరాబాద్ నుండి రాజీవ్ రహదారి మీదుగా 80 కిలోమీటర్లు, వరంగల్ నుండి జనగామ మీదుగా 110 కిలోమీటర్లు, కరీంనగర్ నుండి సిద్దిపేట మీదుగా వస్తే 80 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ క్షేత్రానికి ఇలా వెళ్లాలి వైఎస్ఆర్ జిల్లాలో వేంపల్లె సమీపంలో ఉన్న గండి వీరాంజనేయస్వామి క్షేత్రానికి పలు మార్గాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుండి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. కడప నుండి వేంపల్లె మీదుగా గండికి (53కి.మీ) చేరుకోవచ్చు. అలాగే తిరుపతి నుంచి రాయచోటి, లక్కిరెడ్డిపల్లె మీదుగా గండి క్షేత్రానికి చేరుకోవచ్చు. మదనపల్లె, పీలేరు ప్రాంత వాసులు రాయచోటి మీదుగా గండికి చేరుకోవచ్చు. అలాగే కదిరి, పులివెందుల, వేంపల్లె మీదుగా గండికి చేరుకొనే మార్గాలు ఉన్నాయి. – ఈరగాని భిక్షం సాక్షి, సిద్దిపేట -
మల్లన్నను దర్శించుకున్న ప్రధాని సోదరుడు
కర్నూలు: శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ దర్శించుకున్నారు. శనివారం ఉదయం ప్రహ్లాద్ మోదీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. -
ఘనంగా శ్రీశైల మల్లన్న కల్యాణోత్సవం
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ పరిధిలోని లింగాలగట్టులో ఆదివారం రాత్రి శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా లింగాలగట్టులోస్వామి అమ్మవార్ల ప్రచారరథంతో «శోభయాత్రను నిర్వహించారు. ఆ తర్వాత స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవాన్ని చేపట్టారు. లింగాలగట్టు, సున్నిపెంట, బ్రహ్మగిరి ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. -
శ్రీశైలం మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం
చీరాల: శ్రీశైలం మల్లన్న పెళ్లికి తలపాగ సిద్ధమైంది. మహాశివరాత్రి రోజున ఈ తలపాగా చుట్టిన తర్వాతే మల్లికార్జున స్వామికి భ్రమరాంబతో పెళ్లి తంతు మొదలవుతుంది. పరమశివుణ్ని పెళ్లి కుమారుడిగా అలంకరించే వస్త్రాన్ని ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి హస్తినాపురంలోని ఓ చేనేత కుటుంబం నేస్తుంది. ఇక్కడి పృథ్వీ వంశస్థులు వందేళ్లకు ముందు నుంచి ఈ ఆచారం కొనసాగిస్తున్నారు. ఏటా మహా శివరాత్రిన జరిగే శ్రీశైలం మల్లన్న కల్యాణోత్సవంలో శివుణ్ని వరుడిగా అలంకరణ చేస్తారు. 150 గజాలు ఉండే ఈ వస్త్రాన్ని ఆలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ చుడతారు. కల్యాణం అనంతరం ఈ వస్త్రాన్ని వేలంలో దక్కిం చుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సైతం పోటీపడతారు. ఈ తలపాగాతో మం గళవారం ఉదయం పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం ఊరేగింపుగా శ్రీశైలం బయల్దేరింది. తాను నేసిన బట్టతో పరమశివుణ్ని వరుడిగా అలంకరించడం తన అదృష్టమని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాగా, మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కల్యాణోత్సవానికి ఏపీ ప్రభుత్వం తరపున ఆర్అండ్ బి, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు దంపతు లు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. -
అశ్వ వాహనంపై ఆదిదంపతులు
- అద్దాల మండపంలో ఏకాంత సేవ శ్రీశైలం: సంక్రాంతి పర్వదినాన వధూవరులైన పార్వతీ సమేత మల్లికార్జున స్వామి వార్ల ఏకాంత సేవను మంగళవారం రాత్రి అద్దాల మండపంలో ఆగమ సంప్రదాయానుసారం వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. పుష్పోత్సవ, శయనోత్సవ వేడుకలను కనుల పండువగా చేపట్టి ఏకాంత సేవకు సిద్ధం చేసిన అద్దాల మండపం తలుపులను మూసేశారు. అంతకు ముందు అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను అశ్వవాహనంపై అధిష్టింపజేసి వాహన పూజలు చేశారు. ఆ తర్వాత అశ్వ వాహనాధీశులైన ఆదిదంపతులను మూడుసార్లు ఆలయప్రదక్షిణ చేయించి యథాస్థానానికి చేర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద స్వామివార్ల పుష్పోత్సవ సేవకు పరిమళభరితమైన పుష్పాలతో మండపాన్ని సన్నద్ధం చేశారు. రాత్రి 9.30 గంటల తర్వాత స్వామి అమ్మవార్లకు వేదమంత్రోచ్ఛారణ మధ్య, మంగళవాయిద్యాల నడుమ శయనోత్సవ సేవా కార్యక్రమం అద్దాల మండపంలో నిర్వహించారు. పరిమళ భరిత పుష్పాలైన పసుపు చేమంతి, తెల్లచేమంతి, కనకాంబరాలు, కాగడాలు, గులాబి, మందార, ఎర్రగన్నేరు, దేవగన్నేరు, ముద్ద గన్నేరు, ఆస్టర్, గ్లైలార్డియా, సువర్ణ గన్నేరు, గ్లాడియోలస్ తదితర పుష్పాలు, ఫలాలను ఏకాంత సేవకు సిద్ధం చేశారు. అలాగే స్వామివార్ల ఏకాంత సేవ కోసం అద్దాల మండపంలోని ఊయలతల్పాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి శ్రీ పార్వతీ మల్లికార్జున స్వామివార్ల ఏకాంత సేవను ఆగమ సాంప్రదాయానుసారం వేదమంత్రోచ్ఛారణల మధ్య చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
మల్లన్న దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు
విజయదశమి సందర్భంగా శ్రీశైలానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులుతీరారు. ప్రస్తుతం అమ్మవారి సర్వ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిట లాడుతోంది. -
మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.57 కోట్లు
శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో ఉగాది మహోత్సవాలలో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు రూ.1,57,81,930 వచ్చినట్లు ఈఓ సాగర్‌బాబు తెలిపారు. బుధవారం శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో అధికారులు, సిబ్బంది లెక్కింపు చేపట్టారన్నారు. నగదుతో పాటు యూఎస్ఏ డాలర్లు 51, దిర్హమ్స్5, బహ్రేయిన్ దినార్స్ 2 లభించాయన్నారు. ఈ నెల 2 నుంచి బుధవారం వరకు మొత్తం 11 రోజులకు స్వామి అమ్మవార్లకు వచ్చిన ఆదాయంగా ఈఓ వెల్లడించారు. -
రమణీయంగా మల్లి కార్జునస్వామి కల్యాణం
హైదరాబాద్ (గోల్నాక): బాగ్ అంబర్‌పేటలోని గంగాబౌలి మల్లన్నగుడిలో సోమవారం శ్రీ మల్లి కార్జునస్వామి వారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కల్యాణం సందర్భంగా నిర్వాహకులు ఆకట్టుకునే సదర్‌పటాన్ని వేశారు. గుడి ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండాలలోని నిప్పుల్లో నుంచి నడిచి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం మల్లన్నస్వామివార్లను ఊరేగింపు నిర్వహించారు. -
దీపారాధనతో లోకశాంతి
రావివలస(టెక్కలి): ప్రతి ఇంటిలో భగవంతునికి దీపాన్ని వెలిగించి ఆరాధిస్తే ఆ కుటుంబానికే మంచిదని, మహా పుణ్య క్షేత్రాల్లో దీపాలు వెలిగిస్తే ఆయా వంశంతో పాటు లోకశాంతి జరుగుతుందని విశాఖపట్టణం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. టెక్కలి మండలం రావివలస గ్రామంలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయ సన్నిధిలో గురువారం ‘కైలాస ప్రస్థార ప్రయుక్త యంత్రం లక్షదీపారాధన’ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథ/గా హాజరైన స్వరూపానందేంద్ర స్వామిజీ దీపారాధన ప్రాధాన్యాన్ని భక్తులకు వివరించారు. హృదయంలోని దివ్యజ్యోతి స్ఫూర్తితో భగవంతునికి వెలుగు రూపంలో వెలిగించేది దీపారాధనగా పేర్కొన్నారు. పవిత్రమైన హిందూమతంలో ప్రతిచిన్న శుభకార్యానికి దీపాన్ని వెలిగించి భగవంతున్ని ప్రార్థించడం సాంప్రదాయమన్నారు. జీవన్ముక్తి స్థితితో దీపాన్ని వెలిగిస్తే ముక్తి కలుగుతుందన్నారు. దీపాన్ని వెలిగించే మతం హిందూమతం అని, దీపాలు ఆర్పే మతం విదేశీ మతంగా పేర్కొన్నారు. మల్లన్న సన్నిధిలో కైలాస ప్రస్థార యంత్రంతో నిర్వహించిన దీపారాధనలో పాల్గొన్న భక్తులు ఎంతో అదృష్టవంతులన్నారు. ఆరేళ్ల కిందట ఈ దేవస్థానాన్ని సందర్శించిన తరువాతే తనకు శక్తివంతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయాన్నరు. అనంతరం మొదటి దీపాన్ని వెలిగించి లక్ష దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ నిర్వాహకులు మల్లన్న చిత్రపటాన్ని స్వరూపానందేంద్ర సరస్వతికి జ్ఞాపికగా అందజేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 275 కుటుంబాలు హాజరై లక్షదీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆనందాశ్రమం నిర్వాహకుడు శ్రీనివాసానంద స్వామి, దేవాదాయ శాఖ ఏసీ శ్యామలాదేవి, సూపరింటెండెంట్ పరమహంస, సంతబొమ్మాళి జెడ్పీటీసీ సభ్యురాలు లమ్మత లక్ష్మి, రావివలస సర్పంచ్ బడే జగదీష్, నిర్వాహకులు ఎల్.ఎల్.నాయుడు, లమ్మత మధు, ఎంపీ రామ్మోహన్నాయుడు తల్లి విజయలక్ష్మి, దేవస్థానం ఈవో జి.గురునాథరావుతో పాటు 16 మంది రుత్వికులు పాల్గొన్నారు. -
శ్రీశైలం.. ఇల కైలాసం
శ్రీశైలం: కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైలాలయం శివరాత్రి శోభను సంతరించుకుంది. దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. భక్తుల రద్దీని ముందుగానే ఊహించిన అధికారులు ఆదివారం రాత్రి మైకుల ద్వారా ప్రాతఃకాలసేవా టికెట్లను నిలుపుదల చేసినట్లు ప్రకటించారు. స్వామివార్ల గర్భాలయంలో నిర్వహించే రుద్రాభిషేకాలు, అమ్మవారి శ్రీచక్రం ఎదుట నిర్వహించే కుంకుమార్చన తదితర ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపేస్తూ ఈఓ సాగర్‌బాబు ప్రకటించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక సోమవారం, అందులోనూ కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో పుణ్య నదీ స్నానం ఆచరించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్షేత్రం పోటెత్తింది. రద్దీ విపరీతంగా పెరగడంతో వసతి సౌకర్యాలు లభించక వందలాది భక్తులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సోమవారం వేకువజామునే పవిత్ర పాతాళగంగలో పుణ్య స్నానాలాచరించుకున్న భక్తులు నేరుగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రత్యేక, అతిశీఘ్ర, ఉచిత దర్శన క్యూలలో నిరీక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత అభిషేకాలు లేకపోవడంతో వీఐపీలు సైతం స్వామివార్లను దూరం నుంచే దర్శించుకున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ నుంచి ప్రధాన మాడా వీధిలోని గంగాధర మండపం వరకు రోడ్డుపైనే భక్తులు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3.30గంటల వరకు రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. సాయంకాల పూజావేళల అనంతరం రాత్రి 6గంటల నుంచి రద్దీ మళ్లీ కొనసాగింది. ఉచిత దర్శనానికి 7గంటలకు పైగా సమయం పట్టగా, ప్రత్యేక దర్శనానికి 5గంటలు, అతిశీఘ్ర దర్శనానికి 3గంటల పాటు భక్తులు క్యూలలో వేచి చూడాల్సి వచ్చింది. అయితే ముందస్తుగా చివరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఆన్లైన్లో టికెట్ పొందిన అభిషేక సేవాకర్తలకు వృద్ధ మల్లికార్జునస్వామివార్ల వద్ద అభిషేకాలను నిర్వహించుకునే సౌలభ్యం కల్పించారు. పవిత్ర పాతాళగంగ పుణ్యనదీ స్నానాలు, స్వామివార్ల దర్శనం, కార్తీకదీపారాధనలు, వ్రతనోములతో చివరి కార్తీక సోమవారాన భక్తులు ఉపవాసదీక్షలను విరమించారు. దర్శనానంతరం మల్లన్న భక్తులకు లడ్డూ ప్రసాదాల కొరత రాకుండా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా క్యూలలో వృద్ధులు, చిన్నారులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు పాలవితరణ చేశారు. -
కమనీయం కామాక్షితాయి కల్యాణం
బుచ్చిరెడ్డిపాళెం (రూరల్), న్యూస్‌లైన్ : కోరిన కోర్కెలు నెరవేర్చే కల్పతల్లిగా పూజలందుకుంటున్న కామాక్షితాయి, మల్లికార్జునస్వామిల కల్యా ణం వైభవోపేతంగా జరిగింది. జొ న్నవాడ కామాక్షితాయి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా బుధవారం అమ్మవారి కి విశేష పూజలు జరిపారు. సర్వా లంకార శోభితులైన దేవదేవేరుల ను ఆలయం వెలుపలకు తీసుకొచ్చే స మయంలో ఎదురుకోలు ఉత్సవం ని ర్వహించారు. అనంతరం కల్యాణ వే దికపై స్వామి, అమ్మవారిని ప్రతిష్టిం పజేసి కల్యాణతంతు నిర్వహించా రు. ప్రత్యేక పూజల అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో మాంగళ్యధారణ చేశారు. వల్లూరు రవీంద్రకుమార్‌రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించగా, కోవూ రు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వ్యాఖ్యాతగా గుంటూరుకు చెందిన పుల్లాబట్ల వెంకటేశ్వర్లు వ్యవహరించారు. కల్యాణోత్సవంలో ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, దేవాదా య శాఖ ఏసీ రవీంద్రనాథ్‌రెడ్డి, డీఎస్పీ రాంబాబు, ఆలయ ఈఓ శివకుమార్, పాలకమండలి సభ్యులు జి. చంద్రశేఖరరెడ్డి, ఎన్ మోహన్, ఆదూరు పూర్ణచంద్రరావు, జక్కంరెడ్డి కృష్ణారెడ్డి, ఎస్ శ్రీనివాసులు, కె. హరనాథ్, పి. మురళీ రాజేశ్వరమ్మ, ఎన్ రమ, వి. వెంకట శివగంగా ప్రసాద్, కొడవలూరు జెడ్పీటీసీ శ్రీధర్‌రెడ్డి, మాగుంట సతీష్‌రెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం నేతలు ద్వారకానాథ్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, ఉమామహేశ్వరరావు, హరనాథ్, రవి, కోటేశ్వరరావు, ఎంపీడీఓ శ్రీహరి, తహశీ ల్దారు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నేత్రపర్వంగా తెప్పోత్సవం కామాక్షితాయి సమేత మల్లికార్జున స్వామి తెప్పోత్సవం బుధవారం రా త్రి నేత్రపర్వంగా సాగింది. విశేష అలంకారంలో పెన్నానదిలో విహరిం చిన దేవదేవేరులను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. -
ధ్వజారోహణలో అపశృతి
శ్రీశైలం,న్యూస్‌లైన్: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీలక ఘట్టమైన ధ్వజరోహణంలో అపశృతి చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం ధ్వజ పటావిష్కరణ చేసి, సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ చేస్తున్న సమయంలో తాడు తెగి పోవడంతో ధ్వజపటం కిందపడిపోయింది. దీంతో వేదపండితులు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రెండు నిమిషాల పాటు భక్తజనం శివపంచాక్షరి నామజపం నిలిపేసి అచేతనంగా ఉండిపోయారు. ఆలయ అర్చకులకు, వేదపండితులకు లఘు సంప్రోక్షణాధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం వారు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ మల్లికార్జున స్వామిని శాంతింపజేయడానికి పంచాక్షరి నామ ప్రణవనాదంతో పాటు లింగాష్టకం, బిల్వాష్టకంలను భక్తులతో పఠనం చేయించారు. సంప్రోక్షణానంతరం తిరిగి యథావిధిగా వేదమంత్రోచ్ఛరణల మధ్య ధ్వజారోహణ గావించారు. -
ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలు షురూ
ఐనవోలు (వర్ధన్నపేట రూరల్), న్యూస్‌లైన్ : వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు మల్లికార్జున స్వామి (ఐలోని మల్లన్న) ఉత్సవాలు ఆదివారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనము, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహానివేదన , నీరాజన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ వడిచర్ల శ్రీనివాస్, ఈఓ శేషుభారతి, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. నేడు స్వామివారికి నూతన వస్త్రాలంకరణ ఐనవోలు జాతర, బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం బోగిపండుగ సందర్భంగా స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, తోరణ బంధనం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనము, ధ్వజారోహణం, మహాన్యాస పూ ర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడోరోజు మంగళవారం మకర సంక్రాంతిని పురస్కరిం చుకుని మహన్యాస పూర్వక ఏకాద శ రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేపట్టనున్నారు. ఇదేరోజు సాయంత్రం గుడిచుట్టు ప్రభలతో కూడిన ఎడ్లబండ్లు ప్రదక్షిణలు చేయనున్నాయి. తరలివస్తున్న భక్తులు జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తు లు ఐనవోలుకు తరలివస్తున్నారు. ఈ ఉత్సవాలకు సుమారు రెండు లక్షల మంది రానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. 400 మంది సిబ్బందితో బందోబస్తు : డీఎస్పీ సురేష్ కుమార్ జాతర బ్రహ్మోత్సవాల్లో 400 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు మామునూరు డీఎస్పీ సురేష్ కుమార్ తెలిపా రు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ సమీపంలో పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జాతర నిర్వహణకు నలుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 29 మంది ఏఎస్సైలు, హెచ్‌సీలు, 156 మంది కానిస్టేబుళ్లు, 30 మంది మహిళా హోం గార్డులు, 140 మంది హోంగార్డులు విధులు నిర్వర్తించనున్నట్లు చెప్పారు. జాతరలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సహకరించాలని ప్రజలకు సూచించారు. ఐనవోలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : ఐన వోలు జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ హన్మకొండ డిపో మేనేజర్ అబ్రహం తెలిపారు. సోమవారం నుంచి 15వ తేదీ వరకు మూడు రోజులపాటు ప్రత్యేక బస్సులు నడుపనున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సులు వరంగల్ జిల్లా బస్‌స్టేషన్ నుంచి ఐనవోలుకు నడుస్తాయని, చార్జీలు పెద్దలకు రూ.23, పిల్లలకు రూ.12గా నిర్ణయించినట్లు వివరించారు. అదే విధంగా ఐనవోలు నుంచి యాదగిరిగుట్ట, కొమురవెల్లి పోవాలనుకునే వారికి అక్కడి నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. -
ముక్కోటి దేవతలు ఒక్క టైనారు...!
రావణవాహనాధీశుడైన మల్లన్న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లు రావణవాహనాధీశులై కనిపించారు. ప్రాతఃకాలపూజలనంతరం గర్భాలయముఖమండపంలోని ఉత్తరద్వారం ఎదురుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుంచి విశేషపూజలు నిర్వహించారు. ఉదయం 6.30గంటలకు రావణవాహనంపై ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. ఆలయప్రదక్షిణతో ఊరేగింపుగా శ్రీకృష్ణదేవరాయగోపురం గుండా ప్రధాన రథవీధికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి మండపం వరకు సాగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన వందలాది మంది భక్తులు రావణవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శించుకొన్నారు. కార్యక్రమంలో ఈఓ చంద్రశేఖర ఆజాద్‌తో పాటు ఏఈఓ రాజశేఖర్, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, వేదపండితులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులతో పోటెత్తిన శ్రీశైలం: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలం వేలాది మంది భక్తులతో పోటెత్తింది. శనివారం శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను 80వేలకు పైగా భక్తులు దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయపూజావేళల్లో మార్పులు చేశారు. వేకువజామున 3.30గంటలకు మంగళవాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహామంగళహారతులు జరిగేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు పాతాళగంగలో పవిత్రస్నానాలు చేసిస్వామిఅమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు. దీంతో ఉచిత, ప్రత్యేక,అతిశీఘ్ర దర్శన క్యూలు భక్తులతో కిటకిటలాడాయి. అభిషేకాలను నిర్వహించుకునే సేవాకర్తలను మాత్రమే గర్భాలయంలోనికి అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. - న్యూస్‌లైన్, శ్రీశైలం నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో ఆదివారం నుంచి ఈ నెల 18 వరకు ఏడు రోజుల పాటు మకర సంక్రమణ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఈఓ చంద్రశేఖర ఆజాద్ శనివారం విలేకరులకు తెలిపారు. ఆదివారం ఉదయం 9.15 గంటలకు యాగశాల ప్రవేశం, చండీశ్వరపూజ, కంకణధారణ, కలశస్థాపన ఉంటాయన్నారు. అదేరోజు సాయంత్రం 5.30గంటలకు అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణలు చేస్తారన్నారు. 13వ తేదీ నుంచి 17 వరకు ప్రతి రోజు శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, జపానుష్ఠానమలు, నిత్యహవనాలు, రుద్రహోమాలను నిర్వహిస్తారన్నారు. 15న మకర సంక్రాంతి రోజున రాత్రి 8గంటలకు పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, 16న సదస్యం, నాగవల్లి పూజలు చేస్తారన్నారు. 17న ఉదయం 9.45గంటలకు రుద్రయాగ, పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, వసంతోత్సవం, ధ్వజావరోహణ కార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు. 18న స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవ, శయనోత్సవపూజలను చేస్తారన్నారు. మల్లికార్జునస్వామివారికి ఏటా రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకు కల్యాణోత్సవం జరుగుతుందని, మకర సంక్రాంతిన మాత్రమే పార్వతీ సమేత మల్లికార్జునస్వామికి కల్యాణోత్సవం జరిపించడం విశేషంగా పేర్కొన్నారు. - న్యూస్‌లైన్, శ్రీశైలం కోదండరాముడికి లక్ష పుష్పార్చన వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో వెలిసిన శ్రీ సీతాసమేత శ్రీ కోదండరాముల వారికి లక్షపుష్పార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. డీసీ సాగర్‌బాబు ఆధ్వర్యంలో వేదపండితులు రాధాకృష్ణశర్మ, రవిశంకరఅవధాని, నాగేశ్వరశర్మ, జ్వాలా చక్రవర్తి, శాంతారాంభట్ తదితర పండిత బృందం వేకువజాము నుంచి విశేష పూజలు చేపట్టారు. ఉత్సవమూర్తులకు తిరుమంజనం, స్వామివారికి ఉత్తరద్వారంలో విశేష పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి నిర్వహించిన లక్షపుష్పార్చన పూజల్లో భక్తులు పాల్గొని పూలసేవల్లో తరించారు. ఆలయ అర్చకులు జనార్దనశర్మ, కొమ్మద్ది శంకరయ్య తదితరులు ప్రత్యేక అలంకరణ చేపట్టారు. కార్యక్రమాలకు పోచాబ్రహ్మనందరెడ్డి, శేషశయనారెడ్డి దంపతులు ఆర్థిక సహాకారం అందించినట్లు వారు వివరించారు. మహానంది క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేపట్టిన ఏడుకొండలవాడి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. - న్యూస్‌లైన్, మహానంది