
రమణీయంగా మల్లి కార్జునస్వామి కల్యాణం
హైదరాబాద్ (గోల్నాక): బాగ్ అంబర్‌పేటలోని గంగాబౌలి మల్లన్నగుడిలో సోమవారం శ్రీ మల్లి కార్జునస్వామి వారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కల్యాణం సందర్భంగా నిర్వాహకులు ఆకట్టుకునే సదర్‌పటాన్ని వేశారు. గుడి ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండాలలోని నిప్పుల్లో నుంచి నడిచి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం మల్లన్నస్వామివార్లను ఊరేగింపు నిర్వహించారు.