బుచ్చిరెడ్డిపాళెం (రూరల్), న్యూస్‌లైన్ : కోరిన కోర్కెలు నెరవేర్చే కల్పతల్లిగా పూజలందుకుంటున్న కామాక్షితాయి, మల్లికార్జునస్వామిల కల్యా ణం వైభవోపేతంగా జరిగింది. జొ న్నవాడ కామాక్షితాయి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా బుధవారం అమ్మవారి కి విశేష పూజలు జరిపారు.
సర్వా లంకార శోభితులైన దేవదేవేరుల ను ఆలయం వెలుపలకు తీసుకొచ్చే స మయంలో ఎదురుకోలు ఉత్సవం ని ర్వహించారు. అనంతరం కల్యాణ వే దికపై స్వామి, అమ్మవారిని ప్రతిష్టిం పజేసి కల్యాణతంతు నిర్వహించా రు. ప్రత్యేక పూజల అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో మాంగళ్యధారణ చేశారు. వల్లూరు రవీంద్రకుమార్‌రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించగా, కోవూ రు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
వ్యాఖ్యాతగా గుంటూరుకు చెందిన పుల్లాబట్ల వెంకటేశ్వర్లు వ్యవహరించారు. కల్యాణోత్సవంలో ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, దేవాదా య శాఖ ఏసీ రవీంద్రనాథ్‌రెడ్డి, డీఎస్పీ రాంబాబు, ఆలయ ఈఓ శివకుమార్, పాలకమండలి సభ్యులు జి. చంద్రశేఖరరెడ్డి, ఎన్ మోహన్, ఆదూరు పూర్ణచంద్రరావు, జక్కంరెడ్డి కృష్ణారెడ్డి, ఎస్ శ్రీనివాసులు, కె. హరనాథ్, పి. మురళీ రాజేశ్వరమ్మ, ఎన్ రమ, వి. వెంకట శివగంగా ప్రసాద్, కొడవలూరు జెడ్పీటీసీ శ్రీధర్‌రెడ్డి, మాగుంట సతీష్‌రెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం నేతలు ద్వారకానాథ్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, ఉమామహేశ్వరరావు, హరనాథ్, రవి, కోటేశ్వరరావు, ఎంపీడీఓ శ్రీహరి, తహశీ ల్దారు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా తెప్పోత్సవం
కామాక్షితాయి సమేత మల్లికార్జున స్వామి తెప్పోత్సవం బుధవారం రా త్రి నేత్రపర్వంగా సాగింది. విశేష అలంకారంలో పెన్నానదిలో విహరిం చిన దేవదేవేరులను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
కమనీయం కామాక్షితాయి కల్యాణం
Published Thu, May 29 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement