srinivasullu
-
అడ్డగోలు నిర్ణయాలు ఆపండి
అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్, కొరముట్ల సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని మంగంపేట బెరైటీస్ విక్రయాల విషయంలో అడ్డగోలు నిర్ణయాలు సరైనవి కావని, ప్రభుత్వ తాజా నిర్ణయం కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20వేల మంది రోడ్డుపాలు కావాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం అసెంబ్లీలో ధ్వజమెత్తారు. ఏకపక్ష చర్యలతో కార్మికుల పొట్టకొట్టవద్దని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగంపేటలో లభ్యమయ్యే బెరైటీస్ ఖనిజం కారణంగా సుమారు 200 చిన్నతరహాపరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా సుమారు 20వేల మంది ఉపాధి పొందుతున్నారు. భూనిర్వాసితులు, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2004లో జీఓ నెంబర్ 296ను విడుదల చేసింది. 40ః60 నిష్పత్తిన ఖనిజాన్ని స్థానిక పరిశ్రమలు, ఎగుమతికి కేటాయింపులు ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. దీంతో కార్మికులు, మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్డున పడనున్న కార్మికులు: ఎమ్మెల్యే కొరముట్ల.... రాష్ట్ర ప్రభుత్వం జీఓ 296ను రద్దు చేయడంతో బెరైటీస్ ఖనిజాన్నే నమ్ముకుని జీవిస్తున్న 20వేల మంది కార్మికులు రోడ్డు పాలుకానున్నారని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే జాబు గ్యారంటీ అని చంద్రబాబు ప్రకటనలు ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే కార్మికుల పొట్టకొట్టడం ఎంతవరకూ సమంజసమన్నారు. చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పిన వారిలో భూ నిర్వాసితులు కూడా ఉన్నారన్నారు. -
విక్రమ్ లొంగుబాటు హైడ్రామా!
కల్వకుర్తి/మహబూబ్‌నగర్ క్రైం/అమ్రాబాద్: మావోయిస్టు దారగోని శ్రీనువాసులు అలియాస్ విక్రమ్ లొంగుబాటుకు సంబంధించి ఆదివారం రాత్రి పొద్దుపోయేవరకు కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో హైడ్రామా నెల కొంది. విక్రమ్‌ను నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలో లొంగుబాటుకు అంగీకరించగా.. స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న విక్రమ్ కుటుంబసభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నా రు. అయితే తీవ్ర హైడ్రామా మధ్య సా యంత్రం 6 గంటల తర్వాత విక్రమ్‌ను కల్వకుర్తి పీఎస్‌కు తీసుకొచ్చారు. పోలీసు లు రహస్యంగా రాత్రి 8 గంటల వరకు విచారించి..మరింత సమాచారం సేకరించి నట్లు తెలిసింది. అనంతరం జిల్లా కేంద్రం నుంచి జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్, ఓఎస్ డీ సూర్యప్రకాష్ కల్వకుర్తికి చేరుకున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్ ఆవరణలో సందడి నెలకొంది. విక్రమ్ భార్య లక్ష్మమ్మ తమ బి డ్డ, మామ, అన్నతో కలిసి అక్కడికి వచ్చిం ది. అయితే వారితో మాట్లాడకుండా పోలీ సులు అడ్డుకున్నారు. ఎస్పీ చేరుకున్న తర్వా త అక్కడి విక్రమ్ లొంగిపోతాడని అనుకున్నప్పటికీ ఎవరూ ఊహించని విధం గా అతని జిల్లాకేంద్రానికి ప్రత్యేకవాహనంలో తీసుకెళ్లారు. సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిసింది. ఏకే 47 అపహరించిన కేసులో.. అమ్రాబాద్ మండలంలోని తిర్మలాపూర్(బీకే) గ్రామానికి శ్రీనివాసులు అలియాస్ విక్రమ్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. గ్రామంలోనే వ్యవసాయం చేస్తుం డేవాడు. అప్పట్లో మావోయిస్టుల కార్యక్రమాలకు ఆకర్షితుడై 2004లో దళంలో చేరి నల్లమల దళ సభ్యునిగా, డిండి ఏరియాకమిటీ సభ్యునిగా పనిచేశారు. 2007లో ఆమనగల్లు మాజీ ఎంపీపీ పంతునాయక్ హత్యకేసులో విక్రమ్ ఏ5 ముద్దాయిగా ఉన్నాడు. అయితే ఈ హత్యకు ఉపయోగించిన ఏకే 47 ఆయుధాన్ని కోర్టులో భద్రపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మవోయిస్ట్ విక్రమ్ ఆ తరువాత కొన్ని రోజులకు పోలీసులకు లొంగిపోయాడు. అతని వద్ద నుంచి స్వాధీనపర్చుకున్న ఏకే 47 ఆయుధాన్ని కోర్టులో భద్రపరిచారు. ఈ క్రమంలో పలుమార్లు ఈ కేసుకు సంబంధించి విచారణకు జిల్లా కోర్టుకు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో కోర్టు స్టోర్‌రూమ్‌లో భద్రపరిచిన ఈ ఆయుధం 2013 జూన్ 20న అదృశ్యమైంది. 26న కోర్టు సిబ్బంది ఏకే 47 ఆయుధం అదృశ్యమైనట్లు గుర్తించారు. ఈ మేరకు కోర్టు సూపరింటెండెంట్ అల్బర్ట్ విక్టర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై ఎస్పీ విచారణ చేపట్టి ఇద్దరు కోర్టు సిబ్బందిని సస్పెండ్‌చేశారు. పలుకోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు విక్రమే ఈ ఆయుధాన్ని అపహరించి ఉంటాడని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 18 ప్రకాశం జిల్లా, మహబూబ్‌నగర్ సరిహద్దు నల్లమల అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో జిల్లా కోర్టు నుంచి అదృశ్యమైన ఏకే 47 ఆయుధం పోలీసులకు చిక్కింది. ఆ ఎన్కౌంటర్లో విక్రమ్ ఆ ఆయుధాన్ని వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆదివారం కల్వకుర్తి పోలీసులకు లొంగిపోయాడు. -
సాదాసీదా సమీక్ష
శుక్రవారం అనంతపురంలోని రెవెన్యూ భవన్లో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, చిత్రంలో పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు తదితరులు అనంతపురం కలెక్టరేట్ : జిల్లా అభివృద్ధిపై సమగ్ర సమీక్ష కాస్త సాదాసీదాగా ముగిసింది. మూడు అంశాలపై మూడున్నర గంటలపాటు చర్చించారు. మిగతా అంశాలను ప్రస్తావించలేదు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాలతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధికి పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతపురం, హిందూపురం ఎపీలు జేసీ దివాకర్‌రెడ్డి, నిమ్మలకిష్టప్ప గైర్హాజరయ్యారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో శుక్రవారం జిల్లా అభివృద్ధిపై తొలిసారి సమీక్ష ఏర్పాటు చేశారు. తొలుత తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పైప్‌లైన్ లీకేజీలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేశారు. అనంతరం కలెక్టర్ లోకేష్‌కుమార్ సమీక్ష ప్రారంభించారు. తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యలపై చర్చించారు. విద్య, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తదితర పథకాలపై సమీక్ష జరపకుండానే ముగించేశారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యేలు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రభాకర్‌రావును నిలదీశారు. దీనిపై ఎస్ఈ వివరణ ఇస్తూ 1258 గ్రామాల్లో నీటి సమస్య ఉందన్నారు. ధర్మవరం, పెనుకొండ, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ నీటి సమస్య పరిష్కారానికి రూ. 160 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. తాగునీటి పథకాల కరెంట్ బిల్లులు రూ.109 కోట్ల మేర పేరుకుపోయాయని, వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని పరిష్కరించేందుకు చేపట్టిన చర్యలను వివరించాలని ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రసాదరెడ్డిని కోరారు. రెండేళ్లు కావస్తున్నా రైతులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం లేదని నిలదీశారు. ట్రాన్స్ఫార్మర్ల సమస్య పరిష్కరించాలని సూచించారు. నాణ్యమైన విత్తనం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జేడీకి సూచించారు. తీర్మానాలు గుంతకల్లును రైల్వే జోన్ చేయాలి తాగునీటి సమస్యకు నాన్ సీఆర్ఎఫ్ పండ్ కింద రూ. 8 కోట్లు కేటాయించాలి. రూ. 10 కోట్లతో రిజర్వు పండ్ ఉంచాలి. ఏదైనా నియోజకవర్గంలో తాగునీటి సమస్య వచ్చినప్పుడు వీటిని వినియోగించాలి. తాగునీటి పథకాలకు 24 గంటలు కరెంట్ సరఫరా చేయాలి చేతి పంపుల మర్మమ్మతుకు మెకానిక్‌లను నియమించాలి. రూ. 5 వేల కోట్ల తాగునీటి పథకాలన్నింటిపై విచారణ చేయాలి. జిల్లాకు 7,400 కిలోమీటర్ల విద్యుత్ వైర్, 7 వేల ట్రాన్స్ఫార్మర్లు, 65 వేల విద్యుత్ స్తంభాలు కేటాయించాలి. ‘అనంత’కు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 10 వేల కోట్లు కేటాయించాలి. రూ. 7,476 కోట్లతో ‘ప్రాజెక్టు అనంత’ అమలు చేయాలి జిల్లాలో ఐఐటీ, ఐటీఐఆర్, టెక్స్టైల్ పార్కు, సోలార్ ఎనర్జీ సంస్థలు ఏర్పాటు చేయాలి పీఏబీఆర్‌కు 10 టీఎంసీల నికర జలాలు కేటాయించాలి. ఎయిమ్స్, ఐఐటీ సంస్థలు ఏర్పాటు చేయాలి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. గుంతకల్లును రైల్వే జోన్‌గా గుర్తించాలి. ‘ప్రాజెక్ట్ అనంత’ అమలుకు చర్యలు తీసుకోవాలి. ఐఐటీ, ఇతర జాతీయ సంస్థలు ఏర్పాటు చేసేలా తీర్మానంలో పెట్టాలి. -విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ విద్యుత్ సరఫరా మెరుగు పరచాలి కదిరికి పార్నపల్లి నుంచి తాగునీరు రావాల్సి ఉంది. రెండు ప్రాంతాలకూ ఒకే లైన్ మీదుగా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలి. కదిరిలో కొంతమంది రైతులు డీడీలు కట్టి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు కనెక్షన్ మంజూరు చేయలేదు. త్వరగా అందజేసేలా చర్యలు తీసుకోవాలి. - అత్తార్ చాంద్‌బాషా, ఎమ్మెల్యే, కదిరి ట్యాంకరు రవాణా చార్జీలు పెంచాలి పెనుకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించలేదు. నీటి సరఫరా నిమిత్తం ట్రాక్టర్‌కు ఇస్తున్న రూ.350 నుంచి రూ.500 పెంచాలి. -బీకే పార్థసారథి, ఎమ్మెల్యే, పెనుకొండ చెరువులు నింపాలి జిల్లాలో భూగర్భ జాలాలు అభివృద్ధి చెందాలి. ఇక్కడి చెరువులు నింపిన తరువాతే కడప జిల్లాకు నీటిని వదలాలి. జిల్లా కోటా మేరకు పూర్తి స్ధాయిలో నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. -జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాడిపత్రి చెరువులు నింపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి తాగునీటి సమస్య తీరాలంటే చెరువులను నీటితో నింపేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపై విచారణ జరిపించాలి. - వరదాపురం సూరి, ఎమ్మెల్యే, ధర్మవరం శింగనమల చెరువును గుర్తించాలి శింగనమల చెరువు ప్రాధాన్యతను గుర్తించండి. చెరువును నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలి. - యామినీ బాల, ప్రభుత్వ విప్ ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలి గత ఏడాది వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలి. స్కూళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. - గేయానంద్, ఎమ్మెల్సీ అగళిలో నీటి సమస్య పరిష్కరించండి మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అగళిలో సమావేశానికి వెళ్లినప్పుడు ప్రజలు తాగునీటి సమస్యపై నిలదీశారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ఉన్నా ప్రయోజనం లేదు. మొదట అగళిలో నీటి సమస్య పరిష్కరించండి. - ఈరన్న, ఎమ్మెల్యే, మడకశిర కాలువలు సరి చేయాలి హంద్రీనీవా నీరు సక్రమంగా అందడం లేదు. మరమ్మతులు చేపట్టి సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలి. - ప్రభాకర్‌చౌదరి, ఎమ్మెల్యే, అనంతపురం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలి రాయదుర్గంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అవకాశాలున్నాయి. టెక్స్టైల్ పార్క్, సోలార్ ఎనర్జీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. - మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ మోటార్లు కాలిపోతున్నాయి గుత్తి, గుంతకల్లు, వైటీ చెరువులలో తాగునీటి కొరత ఉంది. మోటార్లు కాలిపోతున్నాయి. తగిన చర్యలు తీసుకోవాలి. - జితేందర్‌గౌడ్, ఎమ్మెల్యే, గుంతకల్లు కరెంట్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలి జిల్లాలో తాగునీటి పథకాల నిర్వహణ భారంగా ఉంది. రూ.109 కోట్ల కరెంటు బకాయిలు ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదన పంపాలి. - కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ చీఫ్ విప్ హంద్రీనీవా త్వరగా పూర్తి చేయాలి ‘అనంత’లో తాగునీటి సమస్య పరిష్కారానికి హంద్రీనీవా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. - బాలకృష్ణ, ఎమ్మెల్యే, హిందూపురం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది జిల్లాలో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ ఉన్నా అధునాతన పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తీసుకొస్తాం. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించాలి. సమష్టిగా జిల్లా అభివృద్ధికి కలిసి రావాలి. -మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాలసునీత -
డిష్యూం.. డిష్యూం
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ, అధికారులు పరస్పర దాడులకు పాల్పడ్డారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీనివాస్‌కు, జైలర్ గుణశేఖర్, డిప్యూటీ జైలర్ శ్రీనివాసులు మధ్యఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల కిందట కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదీ శ్రీనివాస్ వంట చేస్తుండగా కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నావని జైలర్ గుణశేఖర్ గదమాయించాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ గుణశేఖర్‌పై తిరగబడ్డాడు. అంతలోపు అక్కడికి వచ్చిన డిప్యూటీ జైలర్ శ్రీనివాసులు గుణశేఖర్‌కు వత్తాసు పలుకుతూ ఇద్దరూ కలిసి జీవితఖైదీ శ్రీనివాస్‌పై దాడి చేశారు. తనపై అధికారులు దాడి చేయడంతో వారిపై శ్రీనివాస్కూడా ప్రతి దాడికి పాల్పడ్డాడు. అక్కడున్న సహచర ఖైదీలు, అధికారులు వీరిని అదుపు చేసేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. ఇదిలాఉండగా గతంలో నందికొట్కూరు జైలులో జీవిత ఖైదీ శ్రీనివాస్ ఉండేవాడు. అక్కడే డిప్యూటీ జైలర్ శ్రీనివాసులు పనిచేసేవాడు. జీవితఖైదీ, డిప్యూటీ జైలర్ 15 రోజుల తేడాతో కడప కేంద్ర కారాగారానికి వచ్చారు.నందికొట్కూరులో కూడా వీరి మధ్య విబేధాలు ఉండేవని సమాచారం. ఇది మనసులో పెట్టుకుని పరస్పరం దాడులకు పాల్పడినట్లు తెలిసింది. వారం రోజుల కిందట కేంద్ర కారాగారం నుంచి వరంగల్ సెంట్రల్‌జైలుకు ఐఎస్ఐ తీవ్రవాదులను తరలించారు. వరంగల్ సెంట్రల్ జైలు వద్ద వీరిని తనిఖీ చేయగా సెల్ఫోన్లు లభ్యమయ్యాయి. ఇలా కేంద్ర కారాగారం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. -
వేర్వేరు చోట్ల విద్యుత్ ప్రమాదాలు
ఉప్పునుంతల/గట్టు/ఆత్మకూర్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఉప్పునుంతల మం డలం వెల్టూరు, గట్టు మండలకేంద్రం లో, ఆత్మకూర్ జెన్కో దిగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ ప నులవద్ద బుధవారం జరిగిన వేర్వేరు విద్యుత్ ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెంద గా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా.. ఉప్పునుంతల మండలం వెల్టూరులో బుధవారం ఉదయం గొర్ల శ్రీనివాసులు (38) వి ద్యుదాఘాతంతో చనిపోగా అతని భార్య తృటిలో ప్రమా దం నుంచి బయటపడింది. నివాసులు సోదరుడు వెంకటయ్య ఇంటి నిర్మాణానికి నీళ్లు పట్టడానికి రోజు లాగే భార్యాభర్తలిద్దరు వెళ్లారు. మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు విద్యుత్ సర్వీస్‌వైరు తెగి ఇంటి పైకప్పు మీదున్న ఇనుపచువ్వపై పడింది. గమనించని శ్రీనివాసులు తడిగా ఉన్న చేతుల తో బయటికి తేలి ఉన్న ఇనుప చువ్వను పట్టుకోవడంతో విద్యుదాఘాతం సంభవించింది. పెద్దగా కేకవేయడంతో పక్కనే ఉన్న భార్య వసంత కాపాడే ప్రయత్నం చేసి గాయపడింది. రోదిస్తూ ఇరుగుపొరుగు వారిని పిలిచేలోపు శ్రీనివాసులు షాక్‌కు కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే చనిపోయాడు. గాయపడిన వసంతను గ్రామస్తులు 108 అంబులెన్స్‌లో అచ్చం పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ట్రాన్స్‌కో ఏడీఈ తౌర్యానాయక్, ఎమ్మా రై సుల్తాన్, వీఆర్వో భాస్కర్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మృతుని తమ్ముడు వెంకటయ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ యాదిరెడ్డి తెలిపారు. -
కమనీయం కామాక్షితాయి కల్యాణం
బుచ్చిరెడ్డిపాళెం (రూరల్), న్యూస్‌లైన్ : కోరిన కోర్కెలు నెరవేర్చే కల్పతల్లిగా పూజలందుకుంటున్న కామాక్షితాయి, మల్లికార్జునస్వామిల కల్యా ణం వైభవోపేతంగా జరిగింది. జొ న్నవాడ కామాక్షితాయి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా బుధవారం అమ్మవారి కి విశేష పూజలు జరిపారు. సర్వా లంకార శోభితులైన దేవదేవేరుల ను ఆలయం వెలుపలకు తీసుకొచ్చే స మయంలో ఎదురుకోలు ఉత్సవం ని ర్వహించారు. అనంతరం కల్యాణ వే దికపై స్వామి, అమ్మవారిని ప్రతిష్టిం పజేసి కల్యాణతంతు నిర్వహించా రు. ప్రత్యేక పూజల అనంతరం వేలాది మంది భక్తుల సమక్షంలో మాంగళ్యధారణ చేశారు. వల్లూరు రవీంద్రకుమార్‌రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించగా, కోవూ రు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వ్యాఖ్యాతగా గుంటూరుకు చెందిన పుల్లాబట్ల వెంకటేశ్వర్లు వ్యవహరించారు. కల్యాణోత్సవంలో ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, దేవాదా య శాఖ ఏసీ రవీంద్రనాథ్‌రెడ్డి, డీఎస్పీ రాంబాబు, ఆలయ ఈఓ శివకుమార్, పాలకమండలి సభ్యులు జి. చంద్రశేఖరరెడ్డి, ఎన్ మోహన్, ఆదూరు పూర్ణచంద్రరావు, జక్కంరెడ్డి కృష్ణారెడ్డి, ఎస్ శ్రీనివాసులు, కె. హరనాథ్, పి. మురళీ రాజేశ్వరమ్మ, ఎన్ రమ, వి. వెంకట శివగంగా ప్రసాద్, కొడవలూరు జెడ్పీటీసీ శ్రీధర్‌రెడ్డి, మాగుంట సతీష్‌రెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం నేతలు ద్వారకానాథ్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, ఉమామహేశ్వరరావు, హరనాథ్, రవి, కోటేశ్వరరావు, ఎంపీడీఓ శ్రీహరి, తహశీ ల్దారు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నేత్రపర్వంగా తెప్పోత్సవం కామాక్షితాయి సమేత మల్లికార్జున స్వామి తెప్పోత్సవం బుధవారం రా త్రి నేత్రపర్వంగా సాగింది. విశేష అలంకారంలో పెన్నానదిలో విహరిం చిన దేవదేవేరులను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. -
శుభకార్యానికి వచ్చి పరలోకాలకు..
సోమశిల, న్యూస్‌లైన్: బంధువుల ఇంట జరిగిన శుభకార్యానికి విచ్చేసి అందరితో సంతోషంగా గడిపారు ఆ దంపతులు. ఎటూ ఊరికి వచ్చాం కదా..అని సోమశిల జలాశయం వద్ద సరదాగా గడుపుదామని భావించారు. కొందరు బంధువులు కూడా వస్తామని ముందుకు రావడంతో 10 మంది బృందంగా సోమశిల జలాశయం వద్దకు వెళ్లారు. ఆనందంగా నీటిలో కేరింతలు కొడుతుండగా దంపతులైన శ్రీనివాసులు(30), నాగరత్నమ్మ(28)తో పాటు వారి మేనకోడలు స్వాతి(13)ని మృత్యువు కబళించింది. సోమశిల జలాశయం వద్ద ఆదివారం జరిగిన ఈ సంఘటన ఇటు సోమశిలతో పాటు అటు ఉప్పలపాడులో విషాదం నింపింది. బెంగళూరులోని శేషాద్రిపురంలో ఉండే కలువాయి శ్రీనివాసులు, నాగరత్నమ్మ బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడుకు వచ్చారు. మూడు రోజుల క్రితం జరిగిన వివాహ వేడుకలో బంధువులందరితో కలిసి సరదాగా గడిపారు. గ్రామానికి వచ్చినప్పుడల్లా సోమశిల జలాశయం వద్దకు విహారయాత్రకు వెళ్లే అలవాటు వీరికి ఉంది. అందులో భాగంగా ఉప్పలపాడులోని బంధువులు 10 మందితో కలిసి సోమశిల జలాయశం వద్దకు వెళ్లారు. వీరికి మేనకోడలైన స్వాతి(చెరుకూరు యానాదయ్య, అచ్చమ్మ కుమార్తె) కూడా జలాశయంలోని మునిగేందుకు వెళ్లింది. అందరూ కలిసి జలాశయం కింది భాగంగా పెన్నానదిలో కేరింతలు కొట్టసాగారు. ఇంతలో నాగరత్నమ్మ దిగిన చోట పాచి ఎక్కువగా ఉండడంతో ఆమె లోతులోకి జారిపోయింది. గమనించిన వెంకటేశ్వర్లు కాపాడే ప్రయత్నంలో తానూ మునిగిపోయాడు. వీరిద్దరిని రక్షించాలనే ప్రయత్నంలో స్వాతి తన చేతిని అందిచ్చింది. ఈ ప్రయత్నంలో ముగ్గురూ నీటిలో మునిగిపోయారు. గమనించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక మామిడిచెట్ల సెంటర్లో ఉండే జాలర్లు నీటిలో దిగి మృతదేహాలను వెలికితీశారు. సంఘటన స్థలాన్ని ఆత్మకూరు సీఐ అల్తాఫ్హుస్సేన్, అనంతసాగరం ఎస్సై పుల్లారావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనాథైన చిన్నారి శ్రీనివాసులు, నాగరత్నమ్మ నీటిలో మునిగి చనిపోవడంతో వీరి కుమారుడు నానేష్(5) అనాథగా మారాడు. తల్లిదండ్రులిద్దరూ నీళ్లలో మునిగిపోవడం చూసిన నానేష్ ‘మా అమ్మా..నాన్న నీళ్లలో మునుగుతూ పోయారు’ అని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. ఉప్పలపాడులో విషాదం గ్రామానికి చెందిన మంగళ రవికుమార్ వివాహం మూడు రోజుల క్రితం జరిగింది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన భార్యాభర్తలతో పాటు వారి మేనకోడలైన గ్రామానికి చెందిన చిన్నారి మృతిచెందడంతో ఉప్పలపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మంత్రులుగా ఇద్దరే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాష్ట్ర మంత్రివర్గంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు స్థానం దక్కనుంది. ఈ మేరకు వారిద్దరికీ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక శాసనసభ స్థానాలను చేజిక్కించుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈలోగా మంత్రివర్గాన్ని ఇప్పటికే చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో జిల్లా నుంచి ఇద్దరికి స్థానం ఖాయమైనట్లు తెలుస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు మంత్రివర్గంలో బెర్తును చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. 2005, 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పరిటాల సునీత గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరే సమయంలో పరిటాల సునీత తీవ్రంగా ప్రతిఘటించిన విషయం విదితమే. జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇచ్చే సమయంలో మంత్రి పదవి ఇస్తానని పరిటాల సునీతకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అప్పట్లో టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అప్పట్లో ఇచ్చిన మాట మేరకు పరిటాల సునీతకు మంత్రివర్గంలో చంద్రబాబు స్థానం కల్పించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆమెకు దక్కే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇక చంద్రబాబు పిలుపు మేరకు 1999 ఎన్నికల్లో కాలవ శ్రీనివాసులు రాజకీయ అరంగేట్రం చేశారు. 1999 ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన కాలవ.. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ.. సార్వత్రిక ఎన్నికల్లో రాాయదుర్గం అసెంబ్లీ స్థానం పోటీ చేసి గెలుపొంది తొలి సారిగా శాసనభలోకి అడుగుపెట్టనున్నారు. గత ఐదేళ్లుగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేస్తోన్న కాలవ చంద్రబాబుకు సన్నిహితుడుగా ముద్రపడ్డారు. తనకు అత్యంత సన్నిహితుడైన కాలవకు మంత్రివర్గంలో చంద్రబాబు స్థానం కల్పించినట్లు సమాచారం. మంత్రివర్గంలో కాలవకు కీలకమైన శాఖ దక్కే అవకాశం ఉందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులుకు రెండు రోజుల క్రితమే చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలో పరిటాల సునీతకు.. అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలో కాలవ శ్రీనివాసులుకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన నేపథ్యంలో జిల్లా నుంచి ఇంకెవరికీ అమాత్యయోగం పట్టే అవకాశం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇది మంత్రి పదవి కోసం రాజీ లేని పోరాటం చేసిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు అశనిపాతంగా మారింది. -
విధిరాత.. మృత్యుగీత
పని మీద బయటకు వెళ్లిన అతను మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. కాళ్లు, చేతులు కడుక్కుని భోజనం చేసేందుకు కూర్చున్నాడు. తల్లి వడ్డిస్తుండగా బయటి నుంచి ఏవో కేకలు వినిపించాయి. రోడ్డు మీద చొప్ప ట్రాక్టర్‌కు మంటలు అంటుకున్నాయని తెలుసుకుని తినే పళ్లాన్ని పక్కన పెట్టి నీటి బిందె తీసుకుని వెళ్లాడు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు పశుగ్రాసం తీసుకెళ్తున్న యువకుడు కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. - న్యూస్‌లైన్, సంజామల ఆల్వకొండ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కుటుంబానికి ఆసరాగా ఉన్న యువకులు ప్రాణాలు కోల్పోయారు. కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట చెందిన మంగలి రామాంజనేయులు (21) అతని పెద్దనాన్న పశువులకు అవసరమైన జొన్న చొప్పను కొనుగోలు చేసేందుకు ఉదయం ముగ్గురు కూలీలతో ట్రాక్టర్లో సంజామల మండలం ఆల్వకొండకు చేరుకున్నాడు. ట్రాలీలో చొప్ప నింపుకొని తిరిగి వెళ్తుండగా ఎస్సీ కాలనీ సమీపంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు తాకి మంటలు చెలరేగాయి. టాలీపై కూర్చున్న రామాంజనేయులు, కూలీలు గమనించి కిందకు దూకారు. మంటలు ఆర్పే ప్రయత్నంలో కేకలు వేశారు. ప్రమాద స్థలానికి పక్కనే ఉన్న ఇంట్లో భోజనం చేస్తున్న తోక శ్రీనివాసులు (25) కేకలు విని తినే భోజనం పక్కన పెట్టి మంటలు ఆర్పేందుకు నీటి బిందెను తీసుకెళ్లాడు. అతనితో పాటు కాలనీ వాసులు కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో ట్రాక్టర్ తగులబడి పోతుందని భావించిన డ్రైవర్ చొప్పకు కట్టిన తాళ్లను కత్తితో కోసి ట్రాలీ లిఫ్ట్‌ను ఎత్తాడు. వెనుక నుంచి మంటలు ఆర్పుతున్న శ్రీనివాసులు, రామాంజనేయులుపై తగులబడుతున్న చొప్ప పడి ఇరుక్కుపోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గ్రామస్తులు మంటలు ఆర్పేసేలోగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోవెలకుంట్ల సర్కిల్ ఇన్చార్జి ఎస్ఐ పులిశే ఖర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను కోవెలకుంట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆధారం కోల్పోయిన కుటుంబాలు ఆల్వకొండ గ్రామానికి చెందిన మార్తెమ్మ, దేవదాసు దంపతులకు ఓ కుమారుడు. ముగ్గురు కుమార్తెలు. కుమారుడు శ్రీనివాసులుకు వివాహం కాగా భార్య విడిపోయింది. ఈ క్రమంలో శ్రీనివాసులు గ్రామంలో తాపీ మేస్త్రీగా పని చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉన్నాడు. సాయం చేయడానికి వెళ్లిన ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తిమ్మనాయుని పేటకు చెందిన చౌడప్ప, వీరమ్మ దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి వివాహం కాగా, చిన్న కుమారుడు రామాంజనేయులు ఇంటర్ పూర్తి చేశాడు. అతను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో మృతి చెందడంతో సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. రోదిస్తున్న మృతుడు శ్రీనివాసులు తల్లిదండ్రులు -
సంపూర్ణం
ఆంధ్రప్రదేశ్ పునర్య్వస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏపీ ఎన్జీవోలు, టీడీపీ నేతలు కూడా నిరసన కార్యక్రమాలనుచేపట్టారు. బంద్ ప్రభావంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాక్షి, కడప: కడపలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఉదయం నుంచి రోడ్డపై ర్యాలీ నిర్వహిస్తూ దుకాణాలు మూయించారు. కోటిరెడ్డిసర్కిల్‌లో బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకుని ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాసీమబాబు, అధికారప్రతినిధి అఫ్జల్ఖాన్, హఫీజుల్లా. గ్రంథాలయసంస్థ మాజీ అధ్యక్షుడు అందూరి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్జీవోలు బంద్‌లో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదించారు. అంబేద్కర్ సర్కిల్లో టీడీపీ నేత గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో టైర్లుకాల్చి నిరసన తెలిపారు. ప్రైవేటు పాఠశాలల యజమానులు, విద్యార్థులు విభజనబిల్లును దహనం చేశారు. గాంధీ విగ్ర హం కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూయించారు. కార్యక్రమంలో పోలా శ్రీనివాసరెడ్డి, శరత్‌కుమార్‌రాజు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీవో నేత రమణ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు అరెస్టుకు నిరసనగా ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త రాచమల్లు ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఉదయం నుంచి పార్టీకార్యకర్తలు పట్టణంలో ర్యాలీచేపట్టి దుకాణాలను మూయించి, వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ర్యాలీలో రాచమల్లుతో పాటు మునిసిపల్ కమిషనర్వెంకటకృష్ణ, ఏపీ ఎన్జీవోల సంఘం పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే లింగారెడ్డి సతీమణి లక్ష్మీప్రసన్న, ఈవీ సుధాకరరెడ్డి, గాండ్లనారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. రైల్వేకోడూరులో వైఎస్సార్సీపీ జిల్లా అధికారప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి, మైనార్టీనాయకుడు అన్వర్‌బాషా ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. టోల్గేట్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బైక్‌లలో తిరిగి దుకాణాలను మూయించారు. జేఏసీ నేతలు ఓబులేసు, బాలకృష్ణంరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. జమ్మలమడుగులో వైఎస్సార్‌పార్టీ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. రూరల్ పరిధిలో మాజీ జెడ్పీటీసీ శివనాథరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. మహిళా విభాగం నాయకురాలు అల్లెప్రభావతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కమలాపురంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు రాజుపాళెం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి, రైతువిభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. జేఏసీ నేతలు రాజగోపాల్‌రెడ్డి, సీవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో వైఎస్సార్‌కాంగ్రెస్ మునిసిపల్ పరిశీలకుడు వరప్రసాద్, చవ్వాసుదర్శనరెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో వైఎస్సార్‌పార్టీ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. రాయచోటిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజనవిభాగం స్టీరింగ్ కమిటీ సభ్యుడు మదన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూయించారు. బద్వేలులో ఎన్జీవోలు, రెవెన్యూఉద్యోగులు, టీడీపీ నేతలు బంద్ నిర్వహించారు. -
మళ్లీ ‘గుట్ట’ సర్వే..!
వివాదాస్పదంగా మారిన మన్నాపురం క్వారీ వద్ద శుక్రవారం మళ్లీ రగడ చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు మరో మారు ఆధునిక పద్ధతుల్లో సర్వేకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి డీకే అరుణ భర్త భరత్‌సింహారెడ్డి , దీనిపై పిటీషన్ వేసిన వైఎస్సార్సీపి నియోజకవర్గ సమన్వయ కర్త కృష్ణమోహన్‌రెడ్డిల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మరోవైపు అక్కడి రైతులు క్వారీ వల్ల తమకు వస్తున్న ఇబ్బందులపై అధికారులను నిలదీశారు. ధరూరు, న్యస్లైన్ : మంత్రి డీకే అరుణ కుమార్తె స్నిగ్దారెడ్డి పేరున నడుస్తున్న క్వారీ వద్ద శుక్రవారం మైనింగ్, సర్వే, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో మరోసారి సర్వే చేపట్టారు. మండల పరిధిలోని మన్నాపురం సమీపంలో ఉన్న గుట్ట వద్ద (సర్వే నెంబర్ 327, 135) రాయిని తీసుకునేందుకు మైనింగ్ శాఖ నుంచి ఒక హెక్టారును లీజుకు తీసుకుని అంతకంటే ఎక్కువగా తవ్వకాలు జరిపారని గతేడాదినవంబరు 11న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డి హై కోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హై కోర్టు ఆదేశాల మేరకు జనవరి 29న మైన్స్ డై రెక్టర్ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలో క్వారీ వద్ద విచారణ జరిపి సర్వే నిర్వహించారు. అప్పుడు హద్దులను ఏర్పాటు చేసిన అధికారులు తిరిగి శుక్రవారం క్వారీ వద్దకు చేరుకుని మరోసారి విచారణ చేశారు. ఆధునిక సామగ్రితో కచ్చితత్వాన్ని సాధించేందుకు వినియోగ పడుతుందని ఆ విధానంలో సర్వే చేపట్టినట్టు ఆ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. గుట్టతో పాటు గుట్టకు చేరుకునే నలుమూలల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వే వద్దకు పిటీషనరు తరపున ఐదుగురిని, క్వారీకి సంబంధించిన వారిని ఐదుగురిని మాత్రమే పంపారు. గద్వాల ఆర్డీఓ నారాయణరెడ్డి, తహశీల్దార్ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. మామా, అల్లుళ్ల మాటల యుద్ధం మంత్రి డీకే అరుణ భర్త, మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి.. ఆమె మేనల్లుడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్‌రెడ్డిలు ఈ సందర్భంగా పరస్పరం దూషించుకున్నారు. ‘నువ్వెంత...అంటే నువ్వెంత’ అనే రీతిలో ఇరు పార్టీల కార్యకర్తలు, పోలీసుల ముందే పత్రికలు రాయలేని విధంగా, తీవ్ర పద జాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యవహారమంతా గద్వాల సీఐ షాకీర్ హుస్సేన్ ఎదురుగానే జరగింది. వెంటనే తేరుకున్న సీఐ వారిద్దరినీ అక్కడి నుంచి పక్కకు పంపించారు. తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, న్యాయవాది షఫీఉల్లాల మధ్య కొంత సేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. తీసుకున్న దానికంటే కొసరుకున్నదే ఎక్కువ - వైఎస్సార్ సీపీ కృష్ణమోహన్‌రెడ్డి మన్నాపురం గుట్ట వద్ద మైనింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకున్నది హెక్టారే. కానీ నిబంధనలకు విరుద్ధంగా 40-50 ఎకరాల్లో తవ్వకాలు జరిపిన భరతసింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలి. శుక్రవారం జరిపిన పర్వే నిష్పక్షపాతంగా ఉండాలి. పోలీసులు ఏ కపక్షంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. చుట్టుముట్టిన రైతులు గుట్ట చుట్టు ఉన్న తమ పొలాల్లో బాస్టింగ్ కారణంగా దుమ్ము థూళి పేరుకుపోయి పంటలు పండని పరిస్థితి నెలకొందనీ ఏళ్ల తరబడిగా తాము వేసుకుంటున్న పంటలు చేతికందడం లేదనీ తమకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని మండల పరిధిలోని మన్నాపురం, సోంపురం గ్రామాల రైతులు తిరుగు ముఖం పడుతున్న అధికారులను చుట్టు ముట్టి నిలదీశారు. న్యాయం చేసేలా చూస్తామనడంతో వారు శాంతించారు. -
విభజనపై జగన్ అలుపెరగని పోరు
వెంకటాచలం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ను అడ్డుకుని తెలుగువారందరినీ సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కనుపూరుకు చెందిన , రాష్ట్రమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అనుచరులు, ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి సన్నిహితులైన పలువురు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో మాజీ సర్పంచ్ నాటకం శ్రీనివాసులు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు చింతంరెడ్డి దొరసానమ్మ, చింతంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, కోఆపరేటివ్ బ్యాంకు మాజీ సభ్యుడు షేక్ ఖాజా, నీటి సంఘ అధ్యక్షుడు చెంగన కృష్ణయ్య, శిఖామణి, పచ్చబట్ల మస్తానయ్య, కుంపాటి ప్రభాకర్, చవికల పోలయ్యతో పాటు మరో 500 మంది ఉన్నారు. వీరికి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని సోనియాగాంధీ ప్రయత్నిస్తుంటే, జగన్మోహన్రెడ్డి సమైక్యం గా ఉంచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నారని ప్రజలకు అర్ధమైందన్నారు. కాంగ్రెస్, టీడీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీలలు కోకొల్లలు
నెల్లూరురూరల్, న్యూస్‌లైన్ : నగరంలోని లేక్యూకాలనీలో పదో వీధిలో బద్దెపూడి శ్రీనివాసులు ఇంట్లో నకిలీ వ్యవహారం బట్టబయలు కావడంతో ఒక్కొక్కటిగా నకిలీలు వెలుగు చూస్తున్నాయి. నగర శివారుప్రాంతంలో నివేశ స్థలాల ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్యతరగతి వారికి సొంతింటి కల నెరవేర్చుకోవడం నానాటికి కరువవుతోంది. పేదల ఆశలను కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ పట్టాలు అధికారులకు చిక్కడంతో దళారుల వద్ద తాము తీసుకున్న నివేశ స్థలాల పట్టాలు, భూముల పట్టాలు బోగస్ అని వెల్లడవడంతో లబోదిబోమంటున్నారు. వరదకాలువలు, పంట కాలువలు, ప్రభుత్వ శివాయి భూములకు నకిలీ పట్టాలు సృష్టించి అధికారుల నుంచి ఇప్పిస్తున్నట్టు దళారులు నమ్మబలికి అందినంత దోచుకుంటున్నారు. నకిలీ గుట్టురట్టు కావడంతో తాము మోసపోయినా బయటకు చెప్పుకోలేక అంతర్మథనం చెందుతున్నారు. కొత్తూరు పరిధిలోని చంద్రబాబునగర్, ఎన్జీఓ లేఅవుట్, శ్రామికనగర్ వద్ద ఉన్న నెల్లూరు చెరువుకు వెళ్లే వరదకాలువ, రవిచంద్ర గిరిజనకాలనీ సమీపంలోని కనుపూరుకాలువ పోరంబోకు స్థలాలకు కొందరు దళారులు ఒక్కొక్క పట్టాకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. ఎవరైనా పట్టాలపై సందేహాలు వ్యక్తం చేసినా తహశీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి వాటిని చూపించుకోండంటూ తెలివిగా తప్పించుకు తిరిగేవారు. కొత్తూరు, కల్లూరుపల్లి, పడారుపల్లి, ఆమంచర్ల, కొండాయపాళెం తదితర ప్రాంతాల్లో నకిలీ పట్టాలు వెలుగుచూస్తున్నాయి. తహశీల్దార్ కార్యాలయంలోని కొందరు కిందిస్థాయి సిబ్బందికి నకిలీ పట్టాలు తయారీ ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరు పరోక్షంగా ముఠా సభ్యులకు తోడ్పాటు అందించటం, దీనికితోడు అధికారపార్టీ అండదండలు మెండుగా ఉండటంతో నకిలీ పట్టాల తయారీదారులు యథేచ్ఛగా చెలరేగిపోయారు. నగర శివారు ప్రాంతాల్లో ఏ స్థలానికి అధికారులు ధ్రువీకరించిన పట్టా ఉందో, ఏ పట్టా నకిలీదో తెలుసుకోలేని సంకటస్థితిలో స్థలాల యాజమానులు కొట్టుమిట్టాడుతున్నారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు నకిలీ పట్టాల తయారీదారులను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు విమర్శలున్నాయి. ఉన్నతస్థాయిలో విచారణ చేపట్టి నకిలీ పట్టాలతయారీ ముఠా గుట్టును బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై తహశీల్దార్ నరసింహులను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా తమ కార్యాలయ సిబ్బంది దళారులకు సహకరించిన విషయం తనకు తెలియదన్నారు. పరారీలో ఉన్న బద్దెపూడి శ్రీనివాసులు పోలీసులకు దొరికితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. -
వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: వివాహిత అదృశ్యంపై ఒకటో నగర పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు... నగరంలోని మూలాపేటకు చెందిన అళహరి వాసుకు బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన కల్పనతో 10 ఏళ్ల కిందట వివాహమైంది. వాసు కుక్కర్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. గత కొద్ది రోజులుగా కల్పన ప్రవర్తన సరిగాలేకపోవడంతో దంపతుల నడుమ విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ రాత్రి కల్పన ఇంట్లో నుంచి అదృశ్యమైంది. ఆమె కోసం భర్త గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఒకటోనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ మద్ది శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధ్యాయులను బాడీగార్డుల్లా తిప్పుకుంటున్నారా?
కోట, న్యూస్‌లైన్: ఉపాధ్యాయులను బాడీగార్డుల్లా తిప్పుకుంటున్నారా అని ఎంఈఓ శ్రీనివాసులుపై కలెక్టర్ శ్రీకాం త్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కర్లపూడి పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో కలెక్టర్ శ్రీకాంత్ మంగళవారం పర్యటించారు. స్థానిక ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. ఎంఈఓ శ్రీనివాసులు తో పాటు ఉన్న కొందరు ఉపాధ్యాయులను మీరెవరని కలెక్టర్ ప్రశ్నించారు. తాము ఎమ్మార్పీలమని వారు తెలి పారు. ఎమ్మార్పీ వ్యవస్థలేదు కదా, ఉపాధ్యాయులను మీకు బాడీగార్డులగా తిప్పుకుంటున్నారా అంటూ ఎం ఈఓపై కలెక్టర్ మండిపడ్డారు. ఎం ఈఓతో పాటు ఉన్న ఉపాధ్యాయుడు రమేష్‌ను ‘నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావ్? పాఠశాలకు వెళ్లి ఎన్ని రోజులైంది’ అని కలెక్టర్ ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో డీఈఓ ఆఫీసుకు సరెండర్ చేయాలని కలెక్టర్ అదేశించారు. గిరిజనకాలనీలో ఖాళీగా ఉన్న గిరిజనుల నివాసాలను ఆయన పరిశీలించారు. దెయ్యాల భయంతో గిరిజనులు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లినట్టు కలెక్టర్‌కు చెప్పారు. గృహాలను వినియోగంలోకి తేవాలని, పరిసరాలను శుభ్రం చేసి ఇతరులకు కేటాయిం చాలని అధికారులకు సూచించారు. గిరిజనులు వలస వెళ్లడానికి కారణం మూఢనమ్మకాలు కాదని, రాజకీయ కక్షల కారణంగానే కొందరు రాత్రిపూట గిరిజనులను భయపెట్టి ఖాళీ చేయిం చారని స్థానికులు వివరించారు. పథకాలపై ఆరా ప్రశాంతినగర్ గిరిజన కాలనీ పక్కా గృహాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పథకాలు ఏ విధంగా సద్వినియోగ పరచుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల దూరం కావడంతో పిల్లలు వెళ్లలేక పోతున్నారని వారు కలెక్టర్ దృష్టికి తేగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని విద్యాశాఖాధికారులకు ఆయన సూచించారు. కర్లపూడి పంచాయతీ పరిధిలో 11 బెల్టుషాపులు ఉన్నాయని, శాంతిభధ్రతలకు విఘాతం కలుగుతోందని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వాటిని తొలగించాలని శ్రీకాంత్ ఆదేశించారు. చిట్టేడు ఎస్టీ గురుకులంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జరిపారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ వర్షిణి, గూడూరు ఆర్డీఓ మధుసూదన్‌రావు, కోట తహశీల్దార్ చెన్నయ్య, ఎంపీడీఓ వెంకటనారాయణ, ఎస్పీహెచ్ఓ సుందరరావు ఉన్నారు. సొనకాలువల పరిశీలన చిల్లకూరు:మండల తీరప్రాంతంలోని వేళ్లపాళెం రెవెన్యూ పరిధిలో కాకువారిపాళెం గ్రామసమీంలోని మొండి సొనకాలువను మంగళవారం కలెక్టర్ శ్రీకాంత్ పరిశీలించారు. సొనకాలువల ద్వారా రెండు పంటలు పండించుకుంటున్నామని, అయితే సిలికా భూముల్లో లోతుగా తవ్వకాలు చేపట్టడంతో సొనకాలువలు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పంటలు పండించుకోలేకపోతున్నామంటూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామసర్పంచ్ రావుల వెంకటేశ్వర్లు కలెక్టర్‌తో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సొనకాలువకు మరమ్మతులు చేయడం కష్టమవుతుందన్నారు. జనవరిలో మరమ్మతులు చేపడితే సౌలభ్యంగా ఉం టుందన్నారు. మరోసారి పరిశీలిస్తామని కలెక్టర్ అన్నారు. వాకాడు: స్థానిక ఎన్బీకేఆర్ 30 పడకల ప్రభుత్వాస్పత్రి పనితీరుపై కలెక్టర్ శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కు.ని. ఆపరేషన్లు సరిగా జరగడం లేదని గుర్తించారు. -
‘విజయం’ కోసం..
కడప రూరల్, న్యూస్‌లైన్ : విజయదశమి పర్వదినం రోజున శనివారం జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు, నిరసనలు కొనసాగాయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని సమైక్యాంధ్ర కోసం పోరాడుతామని తన వద్దకు వచ్చిన ఎన్జీవోలకు రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రమాణం చేసి హామీ పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, నగేశం, వెంకటేశ్వర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మనోహర్‌రెడ్డి, గంగిరెడ్డి పాల్గొన్నారు. కడపలో మంత్రి అహ్మదుల్లా ప్రమాణం చేసి హామీ పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎన్జీవో నాయకులు శ్రీనివాసులు, గోపాల్‌రెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో జేఏసీ ఆధ్వర్యంలో తహశీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పర్యవేక్షణలో భవిష్యత్తు ఉద్యమ ప్రణాళికను రూపొందించారు. ఈ నెల 15న రైతు గర్జన, 19న విద్యార్థిసింహగర్జన, 23వ తేదీన సర్వమత ప్రార్థనలు చేపట్టాలని నిర్ణయించారు. కడపలో ఎన్జీవోలు దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు రామ్మూర్తినాయుడు, ఉపాధ్యాయ జేఏసీ నాయకుడు నాగమునిరెడ్డి, వెంకటశివారెడ్డి, చిల్లర దుకాణ వర్తకుడు షేక్ కరీముల్లాబాష తదితరులు పాల్గొన్నారు. జమ్మలమడుగులో జేఏసీ కన్వీనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు పాత బస్టాండు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. మైదుకూరు, పోరుమామిళ్లలో ఉపాధ్యాయ జేఏసీ, మున్సిపల్ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో కుళాయప్ప, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
చదువుకోవాలని ఉంది
వంగూరు, న్యూస్‌లైన్: ‘మాచెల్లెల్ని గుర్తు తెలియని వారికి అమ్మేశారు.. నన్ను, మా అక్కను జీతం ఉంచారు మా అమ్మానాన్న.. చదువుకోవాలని ఉన్నా చదివించే వారు లేక గొర్రెలను కాస్తున్నా..’ అని ఓ బాలకార్మికురాలు అన్న మాటలు శనివారం అధికారులను ఆవేదనకు గురిచేశాయి. అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామానికి చెందిన బాలయ్య, ఎల్లమ్మ దంపతులకు అంజమ్మ, దివ్య, రాణి అనే ముగ్గురు కూతుళ్లు. వీరి తల్లిదండ్రులు కనీస బాధ్యత మరిచి కన్నప్రేమను దూరం చేసుకునే క్రమంలో చిన్నకూతురు రాణిని అమ్మేశారు. రెండోకూతురు దివ్యను వంగూరు మండలం సర్వారెడ్డిపల్లిలో గుండెమోని జంగయ్య అనే రైతు వద్ద ఏడాదికి రెండువేల జీతం చొప్పున కుదిర్చారు. మరో కూతురును ఇదే మండలంలో తిప్పారెడ్డిపల్లిలో ఒక రైతు వద్ద జీతం పెట్టారు. ఏడాదికి వీరిద్దరినుంచి వచ్చే జీతం తీసుకుంటూ నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో కూలీపనలు చేసుకుంటూ తల్లిదండ్రులు జీవనం గడుపుతున్నారు. ఇదిలాఉండగా వంగూరు మండలం సర్వారెడ్డిపల్లిలో గొర్రెలకాపరిగా పనిచేస్తున్న దివ్యను శనివారం గ్రామస్తుల సమాచారం మేరకు అధికారులు కలిశారు. తహశీల్దార్ శ్రీనివాసులు సర్వారెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి రైతు వద్ద ఉన్న దివ్య(12)ను పిలిపించుకుని ఆమెతో మాట్లాడారు. చదువుకోవాలని ఉందని దివ్య చెప్పడంతో తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ శంకర్‌నాయక్‌లు దివ్యను వంగూరు మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా అమ్మాయిని కదిలిస్తే గుక్క తిప్పుకోకుండా అన్ని విషయాలు చెప్పేసింది. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి కన్నీటిగాధలు ఉండనేఉన్నాయి.