వెంకటాచలం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ను అడ్డుకుని తెలుగువారందరినీ సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కనుపూరుకు చెందిన , రాష్ట్రమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అనుచరులు, ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి సన్నిహితులైన పలువురు శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిలో మాజీ సర్పంచ్ నాటకం శ్రీనివాసులు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు చింతంరెడ్డి దొరసానమ్మ, చింతంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, కోఆపరేటివ్ బ్యాంకు మాజీ సభ్యుడు షేక్ ఖాజా, నీటి సంఘ అధ్యక్షుడు చెంగన కృష్ణయ్య, శిఖామణి, పచ్చబట్ల మస్తానయ్య, కుంపాటి ప్రభాకర్, చవికల పోలయ్యతో పాటు మరో 500 మంది ఉన్నారు. వీరికి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని సోనియాగాంధీ ప్రయత్నిస్తుంటే, జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యం గా ఉంచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నారని ప్రజలకు అర్ధమైందన్నారు. కాంగ్రెస్, టీడీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విభజనపై జగన్ అలుపెరగని పోరు
Published Sat, Feb 1 2014 3:28 AM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM
Advertisement