CM YS Jagan Review Meeting on Co-operation Department - Sakshi
Sakshi News home page

వారికి తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి: సీఎం జగన్‌

Published Thu, Aug 10 2023 3:12 PM | Last Updated on Thu, Aug 10 2023 5:22 PM

 CM Jagans Review On Cooperation Department - Sakshi

సాక్షి, తాడేపల్లి : సహకారశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు.  సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సహకారశాఖపై సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకారశాఖ మంత్రి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వ్యవసాయం, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి కెవీవీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. 

సహకారశాఖ సమీక్షలో సీఎం జగన్‌ ఏమన్నారంటే..
►ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం
►గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే రైతులు, మహిళల ఆర్థిక స్థితిగతులు బలంగా ఉండాలి
►వ్యవసాయ కార్యకలాపాలకు, మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి
►తద్వారా వారిని చేయిపట్టుకుని నడిపించగలుగుతాం
►ఈ లక్ష్యసాధనలో ఆప్కాబ్, జిల్లాకేంద్ర సహకార బ్యాంకులు, పీఏసీఎస్‌లు, ఆర్బీకేలు భాగస్వామ్యం కావాలి
►అందుకే వీటి నెట్‌వర్క్‌ను కూడా విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది
►ఆర్బీకేల రూపంలో ప్రతి గ్రామంలో కూడా ఆప్కాబ్‌కు, జిల్లాకేంద్ర బ్యాంకులకు శాఖలు ఉన్నట్టే
►మరే ఇతర బ్యాంకుకు లేని అవకాశం సహకార బ్యాంకులకు మాత్రమే ఉంది
►వీటి ద్వారా కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలి
►ఈ లక్ష్యం దిశగా పీఏసీఎస్‌(ప్యాక్స్‌), డీసీసీబీ, డీసీఎంఎస్, ఆప్కాబ్‌లు వాటి కార్యకలాపాలు పెంచాలి
►ఆప్కాబ్‌లో గతంలో చూడని పురోగతి కనిపిస్తోంది
►ఆప్కాబ్‌ మన బ్యాంకు.. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి
►ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, రైతు భరోసా కేంద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేశాం
►ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  పరిధిలోకి 3 నుంచి 4 ఆర్బీకేలను తీసుకు వచ్చాం
►క్రెడిట్‌ మరియు నాన్‌ క్రెడిట్‌ సేవలు పీఏసీఎలు ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాయి
►రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆర్బీకేల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్వీకరిస్తున్నాయి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement