Cooperation Department
-
రూ. 200 కోట్ల భూ దందా..
అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌లో అక్రమాలు చోటుచేసుకు న్నాయని అందులోని కొందరు సభ్యులు ఆరోపిస్తు న్నారు. ఈ మేరకు సహకార శాఖకు ఫిర్యా దు చేశారు. సొసైటీ సభ్యుల కోసం కొన్న భూమిలో కొంత వివాదా స్పద స్థలం ఉందని చెప్పి, ఆ మేరకు కోత విధించి ఇళ్ల స్థలాలు కేటాయించారు. చివరకు వివాదా స్పదం అని చెబుతూ వచ్చిన భూమిలో విల్లాలు నిర్మించి అమ్ముకునేందుకు మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు రంగం సిద్ధం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లాభాపేక్ష లేకుండా ఉద్యో గుల కోసం ఏర్పడింది. సాధారణ అటెండర్ మొదలుకొని అకౌంటెంట్ జనరల్ వరకు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఉద్యో గుల భాగస్వామ్యంతో డబ్బులు సమకూర్చు కొని భూమి కొనుగోలు చేసి దాన్ని లే ఔట్ చేసి సభ్యులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల న్నది దీని లక్ష్యం. ఈ సొసైటీ కింద ఇప్పటి వరకు 14 వెంచర్లు వేశారు. సొసైటీలో 5 వేల మంది వరకు సభ్యులున్నారు. అత్తాపూర్, శ్రీనగర్‌కాలనీ, ఆనంద్‌నగర్ కాలనీ, నలందా నగర్, అత్తివెల్లి, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేశారు. మేనేజింగ్ కమిటీనే ఈ వెంచర్లు, లేఔట్లు వేసే బాధ్యత తీసుకుంది. 13వ వెంచర్‌కు సంబంధించి ఏజీ సొసైటీ మేడ్చల్ మండలం అత్తివెల్లి గ్రామంలో 94.12 ఎకరాలు కొనుగోలు చేసింది. ఈ 13వ వెంచర్లో 1112 మంది సభ్యులు న్నారు. ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వారు కొనుగోలు చేసేలా 67 గజాలు, 150 గజాలు, 200, 267, 333, 400, 500 గజాల చొప్పున వెంచర్లు వేసి వాటికి లేఔట్ వేశారు. వివాదస్పద భూమి ఉందంటూ.. మొత్తం 94.12 ఎకరాల్లో 91 ఎకరాలు క్లియర్‌గా ఉందని 2020లో కోఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు రాసిన లేఖలో దాని అధ్యక్షుడు పేర్కొన్నారు. మిగిలిన 3.12 ఎకరాలపై అస్పష్టత నెలకొందని తెలిపారు. అయితే రెండేళ్ల తర్వాత 2022లో కేవలం 79.24 ఎకరాలకు మాత్రమే ఫైనల్ లేఔట్ అనుమతి వచ్చింది. మిగిలిన ఎకరాలకు మాత్రం లేఔట్ తీసుకోలేదు. సర్వే నెంబర్లో భూసంబంధిత వివాదాలున్నాయంటూ పక్కన పెట్టేశారు. ఆ మిగిలిన భూముల్లో ఒకటిన్నర ఎకరా మాజీ ఎమ్మెల్యే కబ్జాలో ఉందనీ, నాలుగు ఎకరాలు రైతుల ఆధీనంలో ఉందన్న వాదనలు వెల్లువెత్తాయి. కాగా, 2022 జూన్, జూలై నెలల్లో కోఆపరేటివ్ కమిటీ విచారణ చేపట్టి భూమి మొత్తం క్లియర్‌గానే ఉందని, భూవివాదాలు, మాజీ ఎమ్మెల్యేతో, రైతులతో ఉన్న వివాదాలను సరి చేసుకున్నామని నివేదికలో పేర్కొంది. కానీ 2022 సెప్టెంబర్‌లో అధ్యక్షుడు కేవలం 79.24 ఎకరాలకు మాత్రమే లేఔట్ తీసుకొచ్చారు. అంతా క్లియర్‌గా ఉన్నప్పుడు కేవలం 79.24 ఎకరాలకే ఎందుకు లేఔట్ తీసుకొచ్చారన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు. వివాదాస్పద భూముల్లో విల్లాలు.. మొత్తంగా లేఔట్ భూమిలో 1112 ఫ్లాట్లు ఇచ్చారు. 67, 150 గజాలు లేఔట్ ఉన్న వారికి పక్కాగానే ఇచ్చారు. కానీ 200 గజాలు ఇవ్వాల్సిన వారికి 166 గజాలు, 267 గజాలు ఇవ్వాల్సిన వారికి 200 గజాలు, 333 గజాలు ఇవ్వాల్సిన వారికి 233 గజాలు, 400 గజాలు ఇవ్వాల్సిన వారికి 300 గజాలు, 500 గజాలు ఇవ్వాల్సిన వారికి 350 గజాలు మాత్రమే ఇచ్చారు. అంటే 30 శాతం కోత విధించి ప్లాట్లు కేటాయించారు. వివాదంలో భూమి ఉందని చెప్పి తక్కువ కేటాయించారు. ఇక మిగిలిన 14.88 ఎకరాల్లో అనధికారికంగా విల్లాలు నిర్మించి అమ్ముకుందామని నిర్ణయించారు. ఆ మేరకు 2022లో కోఆపరేటివ్ సొసైటీ పేరు మీదనే విల్లాలు నిర్మిస్తామని బ్రోచర్ కూడా వేశారు. 150 గజాల్లో నిర్మిస్తున్న ఒక్కో విల్లా రూ. 1.08 కోట్లు అంటున్నారు. 14.88 ఎకరాలు ధర మార్కెట్లో రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. విల్లాల వ్యవహారంపై కొందరు సభ్యులు సహకారశాఖలో ఫిర్యాదు చేస్తే, బెదిరింపు కాల్స్, మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఐదుగురు సభ్యుల మేనేజ్మెంట్ కమిటీనే ఈ విల్లాల కుంభకోణానికి పాల్పడిందని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతా అక్రమాలమయమే.. సొసైటీ పెద్దలదంతా అక్రమాల మయమే. వివాదాస్పద భూమిలో విల్లాలు కడతామని, లేకుంటే వేలం పాడుతామని చెప్తూ, తద్వారా వచ్చిన సొమ్మును అందరికీ ఇస్తామని మేనేజ్మెంట్ కమిటీ చెబుతోంది. కానీ ఆ అధికారం వారికి ఎక్కడిది? 1112 మంది నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు, డాక్యుమెంటేషన్ చార్జీలు, మెంబర్షిప్, వెంచర్ నిర్వహణ, ఆఫీసు ఖర్చులు, అదనపు ఖర్చుల కింద 2022 నవంబర్‌లో రూ.9 కోట్లు వసూలు చేశారు. వాస్తవంగా ఒక్కొక్కరి నుంచి రూ. 9 వేలు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఒక్కొక్కరి నుంచి రూ.60 వేలు వసూలు చేశారు. – అరుణ్‌కుమార్, సొసైటీ సభ్యుడు ఎక్కడా అక్రమాలు జరగలేదు 13వ వెంచర్‌కు సంబంధించి మేమే చేస్తున్నాం. 8.4 ఎకరాలకు ఇంకా ఇప్పటివరకు అనుమతి రాలేదు. అనుమతి వస్తే విల్లాలు కడతాం. ఆ మేరకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. లేకుంటే భూమిని అమ్మి అందరికీ ఇస్తామని చెప్పాం. అంతేగానీ ఎక్కడా అక్రమాలు జరగలేదు. – నరేంద్రనాథ్, సొసైటీ అధ్యక్షుడు -
సహకారశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
వారికి తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : సహకారశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సహకారశాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వ్యవసాయం, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి కెవీవీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. సహకారశాఖ సమీక్షలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ►ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ►గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే రైతులు, మహిళల ఆర్థిక స్థితిగతులు బలంగా ఉండాలి ►వ్యవసాయ కార్యకలాపాలకు, మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి ►తద్వారా వారిని చేయిపట్టుకుని నడిపించగలుగుతాం ►ఈ లక్ష్యసాధనలో ఆప్కాబ్, జిల్లాకేంద్ర సహకార బ్యాంకులు, పీఏసీఎస్‌లు, ఆర్బీకేలు భాగస్వామ్యం కావాలి ►అందుకే వీటి నెట్‌వర్క్‌ను కూడా విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది ►ఆర్బీకేల రూపంలో ప్రతి గ్రామంలో కూడా ఆప్కాబ్‌కు, జిల్లాకేంద్ర బ్యాంకులకు శాఖలు ఉన్నట్టే ►మరే ఇతర బ్యాంకుకు లేని అవకాశం సహకార బ్యాంకులకు మాత్రమే ఉంది ►వీటి ద్వారా కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలి ►ఈ లక్ష్యం దిశగా పీఏసీఎస్(ప్యాక్స్), డీసీసీబీ, డీసీఎంఎస్, ఆప్కాబ్‌లు వాటి కార్యకలాపాలు పెంచాలి ►ఆప్కాబ్‌లో గతంలో చూడని పురోగతి కనిపిస్తోంది ►ఆప్కాబ్ మన బ్యాంకు.. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి ►ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, రైతు భరోసా కేంద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేశాం ►ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోకి 3 నుంచి 4 ఆర్బీకేలను తీసుకు వచ్చాం ►క్రెడిట్ మరియు నాన్ క్రెడిట్ సేవలు పీఏసీఎలు ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాయి ►రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆర్బీకేల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్వీకరిస్తున్నాయి -
‘జయలక్ష్మి’ లెక్క రూ.560 కోట్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన కాకినాడది జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ (ఎంఏఎం) కో ఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం అవినీతి లెక్క తేలింది. డిపాజిటర్ల సొమ్ము సుమారు రూ.560 కోట్ల మేర దారి మళ్లించినట్లు వెల్లడైంది. జయలక్ష్మి పాలకవర్గం అక్రమాల బాగోతాన్ని సహకార శాఖ అధికారుల బృందం నిగ్గు తేల్చింది. దాదాపు మూడు నెలలకుపైగా రాష్ట్రవ్యాప్తంగా 29 బ్రాంచీల్లో ఖాతాలను పరిశీలించి తుది నివేదికను సహకార శాఖ కమిషనర్ బాబు అహ్మద్ పరిశీలనకు పంపారు. వడ్డీ ఎరవేసి.. ఆకర్షణీయంగా 12.5 శాతం వడ్డీని ఎర వేయడంతో జయలక్ష్మి సొసైటీ బ్రాంచిల్లో సుమారు 20 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు రూ.కోట్లలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. గడువు తీరినా డబ్బులు చెల్లించకపోవడంతో జయలక్ష్మి సొసైటీ బాగోతం గత ఏప్రిల్ 6న వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదులతో చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్పర్సన్ విశాలాక్షి తదితరులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పోలీసులతో పాటు సీబీసీఐడీ పోలీసులు కూడా విచారణ చేపట్టారు. బాధితుల ఆక్రందన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, నలుగురు అసిస్టెంట్ రిజిస్ట్రార్లతో కూడిన కమిటీ ఏప్రిల్ 20 నుంచి విచారణ చేపట్టి అనేక అవకతవకలు గుర్తించింది. చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్పర్సన్ విశాలాక్షి కనుసన్నల్లోనే ఈ మొత్తం కుంభకోణం జరిగినట్టు నివేదికలో పొందుపరిచారు. డిపాజిటర్ల ఖాతాల నుంచి రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకూ వైస్ చైర్పర్సన్, కుటుంబ సభ్యుల పేరిట మళ్లించిట్టు కమిటీ తేల్చింది. రుణాలకు ఎటువంటి హామీ పత్రాలూ లేవు. ఆంజనేయులుకు వరుసకు మేనల్లుడు అయిన ఓ వ్యక్తికి ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ.70 కోట్ల వరకూ డబ్బులు మళ్లించారు. మరోవైపు పాలకవర్గంలో మెజారిటీ సభ్యులు డిపాజిటర్ల సొమ్ములను సొంతానికి వాడుకున్నారు. మరి కొందరికి ఎలాంటి హామీ లేకుండా రూ.200 కోట్ల వరకూ బదలాయించినట్టు గుర్తించారు. వైస్ చైర్పర్సన్ సమీప బంధువుకు సినిమా నిర్మాణం పేరుతో హామీ లేకుండా రూ.50 కోట్లు ఇచ్చేశారు. సర్పవరం మెయిన్ బ్రాంచి లెడ్జర్లో కొన్ని పేజీలు మాయమయ్యాయని నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. అక్టోబరు 9న పాలకవర్గ ఎన్నికలు సహకార శాఖ గత నెల 23న జయలక్ష్మి సొసైటీకి అడ్హాక్ కమిటీని నియమించింది. ఈ కమిటీ స్థానంలో కొత్త పాలకవర్గం ఎన్నిక జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు అడ్హాక్ కమిటీ చైర్మన్ సుబ్బారావు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఎన్నికల అధికారిగా రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆర్ఎస్ సుధాకర్‌ను నియమించారు. బోర్డు డైరెక్టర్లు, ఆఫీసు బేరర్ల నియామకానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబరు 9న పాలకవర్గ ఎన్నిక నిర్వహించి మర్నాడు ఫలితాలు ప్రకటిస్తారు. ఏకగ్రీవం అయితే అక్టోబర్ 2న పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. లేకపోతే 9న పోలింగ్ నిర్వహిస్తారు. జయలక్ష్మి సొసైటీ కుంభకోణంపై కొత్తగా ఎన్నికయ్యే పాలకవర్గం చర్చించి డిపాజిటర్లకు అండగా నిర్ణయం తీసుకోనుంది. విచారణ పూర్తి జయలక్ష్మి సొసైటీలో జరిగిన అవకతవకలపై నివేదికను ఉన్నతాధికారులకు పంపించాం. కొత్త పాలకవర్గం ఎన్నికకు అడ్హాక్ కమిటీ చైర్మన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏకగ్రీవం కాకుంటే పోలింగ్ నిర్వహిస్తాం. – ఆర్.దుర్గాప్రసాద్, జిల్లా సహకార అధికారి, కాకినాడ -
మీ స్థలం దక్కాలంటే.. ముడుపు చెల్లించాల్సిందే..
సాక్షి, జగదాంబ / ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): మీ సొసైటీకి సంబంధించిన భూమిపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి... వాటిని పరిష్కరించి మీ స్థలాలు మీకు దక్కేలా చేయాలంటే... ఓ 200 గజాల స్థలం నా తమ్ముడి పేరున రిజిస్ట్రేషన్ చేయించండి... లేదంటే మీ ఇష్టం... మీ స్థలాలు ఇబ్బందుల్లో పడతాయి... వాటిని రద్దు చేస్తానని బెదిరించిన సహకార శాఖ రిజిస్ట్రార్ బి.మోషా ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... పశు సంవర్థక శాఖ కో ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి హనుమంతువాక సమీపంలో 18 ఎకరాల 78 సెంట్లు స్థలం ఉంది. ఈ సొసైటీలో 284 మంది సభ్యులున్నారు. అయితే ఆ సొసైటీలో తన పేరు చేర్చలేదని ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ప్రసాద్ అనే వ్యక్తి సహకార శాఖ రిజిస్ట్రార్ బి.మోషాకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేయించిన మోషా సదరు సొసైటీ ప్రెసిడెంట్ సింహాద్రి అప్పడు, సెక్రటరీలను తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. మీ సొసైటీ స్థలాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని... మీ స్థలాలు మీకు దక్కాలంటే 200 గజాలు స్థలం తన తమ్ముడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలని డిమాండ్ చేశాడు. లేకుంటే వాటిని రద్దు చేస్తానని బెదిరించాడు. దీంతో రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు చేస్తూనే బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం టర్నర్ చౌల్ట్రీ వద్ద ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయిస్తుండగా ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వంలో సిబ్బంది మోషాను, అతని సోదరుడు మల్లిఖార్జునరావును అదుపులోకి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి ఎంవీపీ జోన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిని బుధవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రంగరాజు తెలిపారు. ఆ స్థలం విలువ మార్కెట్లో కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రిజిస్ట్రార్ మోషా ఇంటిలో సోదాలు సొసైటీ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఏసీబీకి చిక్కిన సహకార శాఖ రిజిస్ట్రార్ బి.మోషా ఇంటిలో ఏసీబీ సీఐ అప్పారావు మంగళవారం సోదాలు నిర్వహించారు. లాసెన్స్ బే కాలనీలో ఉన్న నివాసంలో అతని మేనల్లుడుని విచారించి, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పలు ఖాళీ డాక్యుమెంట్లతోపాటు బినామీలు, బంధువులు పేరు మీద ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. -
‘ఈ-సేవ’ ద్వారా సహకార రిజిస్ట్రేషన్లు
♦ రాష్ర్ట సహకార శాఖ నిర్ణయం ♦ పాత రిజిస్ట్రేషన్ల సవరణలు కూడా ఆన్లైన్లోనే ♦ రెండు నెలల్లో శ్రీకారం సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల రిజిస్ట్రేషన్లను ఇక నుంచి ఈ-సేవ ద్వారానే చేపట్టాలని సహకార శాఖ నిర్ణయించింది. రెండు నెలల్లోగా దీనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ శాఖ కూడా ఆమోదం తెలపడంతో కసరత్తు మొదలుపెట్టింది. ఈ-సేవల్లో అన్ని రకాల సహకార సంఘాల రిజిస్ట్రేషన్ల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సహకార శాఖ అధికారులు పరిశీలించి సొసైటీలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. సంబంధిత ధ్రువపత్రాన్ని నిర్ణీత సమయంలోగా మళ్లీ ఈ-సేవ ద్వారానే అందిస్తారు. ప్రస్తుతం సొసైటీల రిజిస్ట్రేషన్ పెద్ద ప్రహసనంగా ఉంది. పాత సొసైటీల మార్పుచేర్పులు కూడా... సహకార శాఖలో ఇప్పటికే 40 వేల వరకు అన్ని రకాల సహకార సంఘాలున్నట్లు అంచనా. ఆ సొసైటీల రిజిస్ట్రేషన్లను అన్నింటినీ సహకారశాఖే రిజిస్టర్ చేసింది. చిన్నస్థాయి సొసైటీలు మొదలు పశుసంవర్థక , వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆబ్కారీ, మత్స్య, హ్యాండ్లూమ్స్, సెరీకల్చర్, ఉద్యాన, పరిశ్రమలు, చక్కెర, వికలాంగులు, మహిళా శిశు సంక్షేమ శాఖల్లోనూ వేలాది సొసైటీలున్నాయి. ఒక్క బీసీ సంక్షేమశాఖ పరిధిలోనే వెనుకబడిన తరగతుల సంక్షేమ సహకార సంఘాలు, వృత్తి సంఘాలు కలిపి 10 వేల వరకున్నాయి. పశు సంవర్థకశాఖలో 3,500 గొర్రెల పెంపకందారుల సంఘాలున్నాయి. విజయ డెయిరీ పరిధిలో పాల ఉత్పత్తి సహకార సంఘాలు అనేక గ్రామాల్లో ఏర్పడ్డాయి. గీత కార్మిక సహకార సంఘాలున్నాయి. ఇవిగాక 11 ప్రభుత్వ శాఖల్లోనూ మరో 20 వేల సహకార సంఘాలున్నాయి. వాటిని కూడా సహకారశాఖలో కలిపే విషయంపైనా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు వేలాదిగా ఉన్న అపార్టుమెంట్ల సొసైటీల పర్యవేక్షణ బాధ్యతను కూడా తలకెత్తుకోవాలని సహకార శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో సహకారశాఖపై భారం పెరిగింది. ఈ నేపథ్యంలో సహకార సంఘాల రిజిస్ట్రేషన్లతోపాటు దాదాపు 60 వేలున్న పాత సొసైటీల్లోని బైలాస్లలో, కార్యవర్గాల్లో ఎలాంటి సవరణలు చేయాలన్నా కూడా ఇక నుంచి ఈ-సేవనే ఆశ్రయించాల్సి ఉంటుంది. దీనివల్ల ఆలస్యానికి అడ్డుకట్ట వేయడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే మార్చి నుంచి ఈ-సేవల ద్వారానే రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశముందని అంటున్నారు. పాత రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలనూ స్కానింగ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆ ప్రకారం లక్షలాది పేజీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. -
వేధింపుల అధికారిపై మంత్రికి ఫిర్యాదు
సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆ శాఖ సిబ్బంది సోమవారం మంత్రి బొజ్జల గోపాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. సహకార శాఖలో అదనపు రిజిస్ట్రార్ ఏవీవీ ప్రసాద్ వ్యవహర శైలిపై మంత్రికి ...వారు మొర పెట్టుకున్నారు. అధికారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు ఈ సందర్భంగా మంత్రిని కోరారు. -
నకి'లీలలు!
సహకార శాఖలో ఇంటి దొంగల గుట్టు రట్టయింది. ఓ ఆడిటర్ తన అధికారాన్ని చెలాయించి అక్రమంగా రుణాలు కాజేసిన బాగోతం బయటపడింది. ఇందుకు శాఖలోని మరి కొందరి ‘సహకారం’ కూడా తోడయింది. వెరసి,, తన పేరుతో పాటు కుటుంబసభ్యుల పేరున కూడా నకిలీ పట్టాపాస్‌పుస్తకాలు పెట్టి పెద్ద మొత్తం రుణాల పేరుతో కాజేసిన విషయం వెలుగుచూ సింది. ఇంత జరిగినా అతడిపై వేటు వేయాల్సిన ఉన్నతాధికారులు కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. - దొంగ పట్టాలు... ఆపై రుణాలు.. - తనతోపాటు కుటుంబసభ్యుల పేరిటా లోన్లు - బినామీ పేర్లతో రూ. కోటి వరకు స్వాహా - సహకార శాఖ ఆడిటర్ అవినీతి బాగోతం - అక్రమాలు వాస్తవమేనంటున్న డీసీఓ నిజామాబాద్ అర్బన్ : జిల్లా సహకార శాఖలో అవినీతి పర్వం జోరుగా సాగుతోంది. సహకార శాఖలోని ఆడిటర్ బోగస్ పట్టాలతో లక్షలాది రూపాయల రుణాలు పొందారు. ప్రభుత్వ ఉద్యోగి అయిఉండి, అదే శాఖలో తనతో పాటు కుటుంబసభ్యుల పేర్లతోనూ నకిలీ పట్టాలు సృష్టించి లోన్ తీసుకున్నారు. ఇలా మొత్తం రూ. కోటి వరకు లోన్ల రూపంలో కాజేశారనే ఆరోపణలున్నారుు. ఇలా జరిగింది... జిల్లా సహకార శాఖలో సుమారు పదేళ్లకు పైబడి ఆడిటర్‌గా అంబర్‌సింగ్ కొనసాగుతున్నాడు. ఇతను తన పేరున, మరో ముగ్గు రు కుటుంబసభ్యుల పేర్లపై నకిలీ పట్టాలు సమర్పించి లోన్ తీసుకున్నాడు. మాక్లూర్, కమ్మర్పల్లి మండలం కొనసముందర్ ప్రాథమిక సహకార సంఘాలలో అక్రమంగా రుణాలు పొందాడు. ఇతను ఆడిటర్‌గా ప్రాథమిక సహకార సంఘాల అకౌంట్ వ్యవహారాలను పరిశీలించేవారు. దీంతో అందులోని లొసుగులను బయటకు తీసి మాక్లూర్, కొనసముందర్ సహకార సంఘాల సెక్రటరీలను బెదిరించాడు. తనకు సహకార సంఘాలలో రుణ ం కావాలని, దీనికి సంబంధించిన దరఖాస్తులు, పాస్‌పుస్తకాలను అందిస్తానని చెప్పాడు. అదే శాఖలో ఉద్యోగి అరుునందన లోన్ ఇవ్వలేమని కార్యదర్శులు వ్యతిరేకించగా.. ‘ఆడిట్లో మీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చారుు’ అంటూ భయపెట్టడంతో వారు కూడా అతడికి సహకరించారు. కొనసముంద ర్ సొసైటీలో రూ.2.50 లక్షలు, మాక్లూర్ సహకార సంఘంలో రూ.4 లక్షలు, అమ్రాద్ సహకార సంఘంలో రూ.1.50 లక్షలు రుణ ం తీసుకున్నాడు. అతడికి ఏ మాత్రం భూమి లేకున్నా.. తన పేరున, కుటుంబసభ్యుల పేరున అక్రమ పట్టాలు సృష్టించాడు. వీఆర్వో, తహశీల్దార్, ఆర్డీవోల సంతకాలు ఫోర్జరీ చేశాడు. తనకు అనుకూలంగా ఉన్న సహకార సంఘాల్లో ఈ పత్రాలు పెట్టి రుణం తీసుకున్నాడు. మాక్లూర్ మండలం అమ్రాద్ సహకార సంఘంలో బినామీ పేర్లు, నకిలీ పట్టాలతో రూ.50 లక్షల వరకు వివిధ పేర్లపై రుణాలు పొందారు. నిజామాబాద్ మండలం మంచిప్ప సహకార సంఘంలో నకిలీ పట్టాలతో రుణ ం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు కాలేదు. అలాగే వర్ని, రేంజల్, నందిపేట, నవీపేట, కమ్మర్పల్లి, మాక్లూర్, ఎడపల్లి మండలాల్లో నకిలీ పట్టాలతో బినామీ పేర్లమీద మరికొందరు రుణాలు తీసుకున్నారు. వెలుగులోకి వచ్చిందిలా.. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ సొసైటీ చెర్మైన్ నకిలీ పట్టాల వ్యవహారాన్ని గుర్తించారు. పట్టా పాస్‌పుస్తకాలు కొత్తగా ఉండటం, సంతకాల్లో తేడా ఉండటంతో అనుమానం వచ్చి పరిశీలించారు. దీంతో ఆడిటర్‌కు సంబంధించిన రుణాల వివరాలను తనీఖీ చేశారు. అరుుతే ఇదంతా 20 రోజుల క్రితమే జరిగినప్పటికీ బయటకు రానీయకుండా ఆడిటర్ తీసుకున్న రూ.2.50 లక్షల రికవరీ చేరుుంచారు. మాక్లూర్ మండలం అమ్రాద్ సహకార సంఘంలో రుణాలు పొందిన లబ్దిదారుల పట్టాలను చైర్మన్ పరిశీలించగా నకిలీ పట్టాపాస్ పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రుణాలు పొందిన జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించగా సుమారు రూ.50 లక్షల వరకు నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్లు తేలింది. ఈ వ్యవహారంపై చైర్మన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. హుటాహుటిన బదిలీ..! నకిలీ పట్టాపాస్‌పుస్తకాలతో రుణాలు పొందిన ఆడిటర్‌ను జిల్లా సహకార శాఖ అధికారి శ్రీహరి రెండు రోజుల క్రితమే బదిలీ చేశారు. జిల్లా కేంద్ర సహకార శాఖ కార్యాలయంలో ఆడిటర్‌గా ఉన్న ఆయనను బోధన్ సహకార శాఖ పరిపాలన కార్యాలయానికి పంపించారు. కాగా, ఆడిటర్ అక్రమాలపై అధికారులకు ముందే తెలిసినా పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ఉద్యోగి అయి ఉండి సొంత శాఖలోనే సెక్రటరీలను బెదిరించి నకిలీ పట్టాలతో రుణాలు పొందడంపై జిల్లాస్థాయి అధికారులు పెదవివిప్పడం లేదు. ఆడిటర్‌కు సంబంధిత యూనియన్ నేతలు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదని ఓ నాయకుడు చెప్పారు. ఈ వ్యవహారంపై అధికారులు సైతం గత ఏడాదిన్నర కాలంగా వ్యవహారంపై ఎందుకు స్పందించలేదనే అనుమానాలకు తావిస్తోంది. -
రూ.13 కోట్లు గోల్మాల్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు నగరంలోని ఓ బ్యాంకు ఉద్యోగుల సొసైటీలో రూ.13కోట్లు గల్లంతైన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సొసైటీ ఫౌండర్ చైర్మన్ మాక్స్ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్లను సేకరించి, వాటిని రికార్డుల్లో నమోదు చేయలేదు. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో డిపాజిట్ చేసిన వ్యక్తులు.. జరిగిన మోసంపై పోలీసు, సహకార శాఖకు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. కొంతకాలంగా జరుగుతున్న విచారణలో డిపాజిట్ మొత్తాలు గల్లంతైనట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తిం చారు. జిల్లాలోని బ్యాంకు ఉద్యోగులకు క్రెడిట్ సొసైటీ ద్వారా సేవలు అందించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగి రామ్మోహనరావు ఫౌండర్ చైర్మన్‌గా పాలకవర్గ సభ్యులతో కూడిన సొసైటీని ఏర్పాటు చేశారు. బ్రాడీపేట 2/16లో సొసైటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సభ్యులకు సేవలు అందించేవారు. బ్యాంకు ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ క్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ పేరున ఏర్పాటైన ఈ సంస్థ బ్యాంకు ఉద్యోగులకు మాత్రమే సేవలు అందించాలి. ఇతర సభ్యులకు ఈ సొసైటీలో ప్రవేశం లేదు. అయితే 1995 మ్యాక్స్ చట్టానికి విరుద్ధంగా ఫౌండర్ చైర్మన్ గుంటూరు నగరంలోని కొందరు ప్రముఖుల నుంచి రూ.13 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఆ మొత్తాలకు సంబంధించిన బాండ్లను డిపాజిట్‌దారులకు ఇచ్చారే కాని అదే మొత్తాలను సొసైటీ రికార్డుల్లో నమోదు చేయలేదు. కొంతకాలానికి ఫౌండర్ చైర్మన్ ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో డిపాజిట్‌దారులు సొసైటీలోని తమ డిపాజిట్లపై ఆరా తీశారు. తమకు ఇచ్చిన బ్యాండ్లపై ఉన్న మొత్తాల కంటే తక్కువ మొత్తాలు సొసైటీ రికార్డుల్లో నమోదు అయినట్టు తెలుసుకుని మిగిలిన పాలకవర్గ సభ్యులను ప్రశ్నించారు. ఆ మొత్తాలతో తమకు సంబంధం లేదని వారు స్పష్టం చేయడంతో డిపాజిట్దారులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోంది. సమగ్ర విచారణ.. అయితే ఈ సొసైటీపై సమగ్రంగా విచారణ జరపాలంటే సహకారశాఖకు చెందిన అధికారుల సహకారం అవసరమని భావించి, కేసు వివరాలను రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్‌కు తెలియపరిచారు. దీనితో సొసైటీపై సమగ్ర విచారణకు జిల్లా సహకార శాఖ అధికారి (డీసీవో)ని ప్రత్యేక అధికారిగా నియమించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణలో ఫౌండర్ చైర్మన్ సేకరించిన డిపాజిట్‌ల్లో ఎక్కువ మొత్తాలు సొసైటీ రికార్డుల్లో నమోదు కాలేదని, నమోదుకాని మొత్తాలు గల్లంతైనట్టుగా భావిస్తున్నామని జిల్లా సహకార శాఖ అధికారి పాండురంగారావు సాక్షి ప్రతినిధికి వివరించారు. ఈ కేసులో మిగిలిన పాలకవర్గ సభ్యులపై కూడా విచారణ చేపట్టనున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. సొసైటీలో నిధులు దుర్వినియోగానికి మొత్తం పాలకవర్గం బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.