Govardhan Reddy
-
నేటి రాజకీయాల్లో సామాజిక దృక్పథమేదీ?
పార్టీ టికెట్ సాధన మొదలు, ఎన్నికల ప్రచారం, ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రలోభాల పర్వం వరకు మొత్తం రూ.కోట్ల డబ్బు ముడిపడటంతో పోటీచేసే వారిలో సామాజిక కోణం, సేవాదృక్పథం లోపిస్తోంది. రియల్ వ్యాపారులు, పెద్దఎత్తున భూములు కబ్జా చేసినవారు, ఇతర వ్యాపారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసే వారి వద్ద అడ్డగోలుగా అక్రమ సంపాదన పెరిగి రాజకీయాల్లోకి వస్తుండటంతో ఎన్నికల్లో మామూలు వ్యక్తులు, సేవా దృక్పథం ఉన్నవారు పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది’ అని ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ కె.గోవర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో కె.గోవర్ద్ధన్‌రెడ్డితో సాక్షి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు. 1985 ఎన్నికల్లో రూ.లక్షన్నర ఖర్చుతో పోటీచేశా.. నేను ఓ డాక్టర్‌గా, ఓ సామాజిక కార్యకర్తగా దరఖాస్తు చేసుకుంటే.. 1985లో మలక్‌పేట నుంచి పోటీచేసేందుకు అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మొత్తం అయిన ఖర్చు కేవలం రూ.లక్షన్నర (పార్టీ ఇచ్చిన రూ.50 వేలు కలిపి). అప్పటి సీఎం నాదెండ్ల భాస్కరరావు, బీజేపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డితో పోటీపడి ఓటమి చవిచూశాను. ఆంధప్రదేశ్ ఫ్లోరోసిస్ విమోచన సమితి అధ్యక్షుడిగా, వివిధ సామాజిక సంఘాల అధ్యక్షుడిగా పనిచేశాను. సాగర్‌లో అణువిద్యుత్ కేంద్రం వద్దని రాజీవ్‌ని కోరాను.. నాగార్జునసాగర్‌లో అణువిద్యుత్ కేంద్రం పెడతారని ప్రచారం కావడంతో వెంటనే స్పందించాను. అప్పటి నల్లగొండ, ప్రకాశం తదితర జిల్లాల్లో ఫ్లోరోసిస్ సమస్య ఉన్నందున ఈ కేంద్రం పెడితే పర్యవసానాలు వివరిస్తూ దీనిని విరమించుకోవాలంటూ, నేరుగా ప్రధాని రాజీవ్‌గాంధీ కార్యాలయానికి లేఖ రాశాను. రెండువారాల్లోనే ప్రధాని సెక్రటరీ దూబే నుంచి ఆ లేఖ అందినట్టుగా జవాబు వచ్చింది. మూడునెలల తర్వాత ముంబైలోని అణు విద్యుత్ విభాగం డైరెక్టర్ విజయ మనోరమ నుంచి మరో వివరణ లేఖ (పీఎంఓ నుంచి నా వినతిపత్రం కాపీ వారికి అందాక) వచ్చింది. సమీప భవిష్యత్‌లో ఈ కేంద్రాన్ని పెట్టే ఉద్దేశం లేదని, పెట్టదలిస్తే అందరి అభిప్రాయాలు తీసుకుని, పబ్లిక్ హియరింగ్ నిర్వహించాకే దానిని చేపడతామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో తొలి ప్రజాప్రయోజన వ్యాజ్యం నాదే... 1991లో సిరీస్ ఇండస్ట్రీ కారణంగా భూగర్భజలాలు కలుషితం కావడంపై ఉమ్మడి ఏపీ హైకోర్టులో నేను మొట్టమొదటి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాను. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సీజే జస్టిస్ భగవతి సూచనలు జారీచేసిన మూడు నెలల్లోనే సీనియర్ న్యాయవాది, పీయూసీఎల్ నేత ప్రతాపరెడ్డి ద్వారా పిల్ దాఖలు చేశాను. కేసు జస్టిస్ రామాంజనేయులునాయుడు బెంచ్‌కు వెళ్లగా 24 గంటల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు చుట్టుపక్కల కాలనీలు, గ్రామాలకు మంచినీటిని పంపిణీ చేసేలా సిరీస్ సంస్థ ద్వారా ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టారు. ఎఫ్లూయెంట్స్‌ను ట్రీట్ చేసి బయటకు పంపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటం... రేడియాలజిస్ట్‌గా మొదటి ప్రైవేట్ క్లినిక్ పెట్టాక...నల్లగొండ నుంచి నాగార్జునసాగర్ దాకా ఎక్స్‌రే యూనిట్లే లేకపోవడంతో కాళ్లు వంకర అని, నడవలేకపోతున్నామని నా దగ్గరకు చాలా మంది వచ్చేవారు. అన్నిఎక్స్‌రేలలో తెల్లటి చారలు కనిపించడంతో దానిపై పరిశోధన జరిపితే ఫ్లోరోసిస్ జబ్బు అని తేలింది. ఎముకల్లో ఫ్లోరిన్ జమ కావడంతో ఈ జబ్బుకు కారణమని స్పష్టమైంది. ఇతరులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఫ్లోరోసిస్ విమోచన సమితిని ఏర్పాటు చేసి దాని ద్వారా చైతన్య కార్యక్రమాలు చేపట్టాను. 30 ఏళ్లకే ముసలితనం అనే వీడియోను చిత్రీకరించి ఫ్లోరోసిస్‌పై విస్తృత ప్రచారం చేశాము. సాగర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చే కృష్ణా జలాల్లో మార్గ మధ్యలో ఉన్న ఫ్లోరోసిస్ ప్రభావిత దాదాపు 150 గ్రామాలకు (శివన్నగూడెం దాకా) నీరు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించాం. ఏఎంఆర్ ప్రాజెక్ట్ వచ్చాక ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు కట్టి ఇచ్చారు. మిషన్ భగీరథ రావడంతో ఈ సమస్య దాదాపుగా తగ్గిపోయింది. -
ఆపన్నులకు అండ.. పేదలకు లీగల్ సర్వీసెస్ అథారిటీ భరోసా
హక్కులకు భంగం కలిగితే కోర్టును ఎలా ఆశ్రయించాలో తెలియదు.. పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు నమోదైతే ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు..న్యాయవాదిని పెట్టుకొనేంత ఆర్థిక స్తోమత లేదు.. ఇదీ సగటు పేదవాడి దుస్థితి. ఈ పరిస్థితుల్లో పేద ప్రజలు న్యాయం కోసం ఏం చేయాలి.. ఎవరిని ఆశ్రయించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా దాదాపు 25 ఏళ్ల క్రితం ఏర్పాటైందే ‘లీగల్ సర్విసెస్ అథారిటీ (ఎల్ఎస్ఏ)’. ఈ నెల 9న జాతీయ లీగల్ సర్విసెస్ అథారిటీ డే, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఆ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్: పేదలకు న్యాయ సా యం అందించడం, కోర్టు కేసులను మ ధ్య వర్తిత్వంతో పరిష్కరించడం, లోక్ అదాలత్‌లు నిర్వహించడమే కాదు.. వృద్ధులకు ఆసరాగా నిలవడం, పేద విద్యార్థులకు సాయం చేయడం సహా అనేక సామాజిక కార్యక్రమాలను లీగల్ సర్విసె స్ అథారిటీ నిర్వహిస్తోంది. పత్రికల్లో వచ్చిన కథనా ల ఆధారంగా లేదా సుమోటోగా పలువురి బాధల ను తీరుస్తోంది. కోవిడ్ సమయంలో ఆస్పత్రుల్లో పడకలు అందేలా చర్యలు తీసుకోవడం, విడిపోయి న భార్యాభర్తలను కలపడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం వసతు లు, వేతనం అందేలా చేయడం, మతిస్థిమితం కో ల్పోయిన వారికి ఆశ్రయం కల్పించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. 1995లో ఏర్పాటు లీగల్ సర్విసెస్ అథారిటీ చట్టం–1987 ప్రకారం 1995 నవంబర్ 9న జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటైంది. దీనికి జాతీయ స్థాయిలో ప్యాట్రన్ ఇన్ చీఫ్‌గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలు పని చేస్తాయి. వృద్ధ దంపతులకు ఆసరా.. ఖమ్మం జిల్లాకు చెందిన రామన్న, కృష్టమ్మ దంపతులు. ఉన్న ఆస్తినంతా పిల్లలకు పంచిపెట్టారు. మలి వయసులో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పిల్లలు వారిని నడిరోడ్డుపై వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారిని సంప్రదించింది. చట్టప్రకారం 3 ఎకరాల 20 గుంటల భూమిని తిరిగి వృద్ధ దంపతుల పేర రిజిస్ట్రేషన్ చేయించి ఆసరా కల్పించింది. అమరచింతలోని కియోస్‌్కలో వారికి ఆశ్రయం అందించింది. నిరుద్యోగులకు చేయూత.. మహబూబ్‌నగర్ జిల్లా సెంట్రల్ లైబ్రరీకి రోజూ సుమారు 200 మంది విద్యార్థులు, నిరుద్యోగులు వస్తుంటారు. ఉదయం 8 గంటలకు వచ్చిన కొందరు సాయంత్రం 6 గంటల వరకు అక్కడే చదువుకుంటా రు. వారిలో ఎక్కువ మంది పేదలే కావడం, మధ్యాహా్నలు భోజనం కూడా చేయడం లేదని గుర్తించిన జిల్లా లీగల్ సర్విసెస్ అథారిటీ.. మున్సిపల్ చైర్మన్‌తో సంప్రదింపులు జరిపింది. రూ. 5కే మంచి భోజనం అందేలా చర్యలు తీసుకొని చేయూతనిచ్చింది. 33 జిల్లాల్లో ప్రత్యేక న్యాయవాదులు పేదల కేసులను వాదించేందుకు, న్యాయ సలహా అందించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించాలన్న జాతీయ లీగల్ సర్విసెస్ అథారిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (జిల్లా స్థాయి), డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (సబ్–కోర్టు), అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (మేజిస్ట్రేట్ కోర్టు)ను పూర్తిస్థాయిలో నియమించారు. రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో 33 జిల్లాల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఏం న్యాయ సేవలు అందిస్తారు? 1). ఉచితంగా న్యాయ సలహాలు అందించడం 2). కేసులు పరిశీలించి బాధితుని తరఫున న్యాయవాదిని నియమించడం 3). కోర్టు ఫీజులను భరించడం 4). తీర్పు వచ్చిన తర్వాత కాపీలను ఉచితంగా అందజేయడం ఆశ్రయించడం ఎలా? ఉచిత న్యాయ సాయం కోసం మండల న్యాయసేవాధికార సంఘం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040–23446723 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించవచ్చు. న్యాయ సాయం ఎవరికి.. 1). షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు 2). మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు 3). మహిళలు, బాలబాలికలు 4). అంగవైకల్యం కలిగిన వ్యక్తులు 5). ప్రకృతి విపత్తులు, కుల, మత కల్లోలాల బాధితులు 6). పారిశ్రామిక కార్మికులు 7). రక్షణ గృహం, అనాథ గృహం, బాలల గృహం, మానసిక చికిత్సాలయంలో ఆశ్రయం పొందుతున్న వారికి.. 8). సంవత్సర ఆదాయం రూ.3 లక్షలు మించని వారికి... అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సాయం చేయడం కోసం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను రాష్ట్రంలో ప్రారంభించాం. దుక్కి దున్నే నాటి నుంచి పంటను మార్కెట్లో అమ్మేదాకా సాగు చట్టాలు, నియమాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తాం. కోర్టులపై భారం తగ్గించేందుకు లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నాం. – గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి -
5,58,883 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన వచ్చింది. ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5,58,883 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో కోర్టులో పెండింగ్ కేసులు 5,45,704 కాగా, ప్రీ లిటిగేషన్ కేసులు 13,179 ఉన్నాయి. మొత్తం రూ.180.10 కోట్ల పరిహారాన్ని అందించినట్లు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.శ్యామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ టి.వినోద్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జస్టిస్ శ్యామ్ కోషితో చెక్కులను కూడా అందజేసినట్లు తెలిపారు. హైకోర్టులో 404 కేసులు.. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ వినోద్ కుమార్ సూచనలతో నిర్వహించిన లోక్ అదాలత్‌లో హైకోర్టులోని 404 కేసులు పరిష్కారమయ్యాయి. అత్యదికంగా 204 మోటారు వాహనాల కేసులు, 71 కార్మికుల పరిహార వివాదానికి చెందినవి ఉన్నాయి. రూ.15 కోట్ల పరిహారాన్ని ప్రకటించారని, 1,100 మంది లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జి.వి.సీతాపతి, జస్టిస్ చల్లా కోదండరాం ఈ కేసులను పరిష్కరించారని వెల్లడించారు. -
వారికి తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : సహకారశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సహకారశాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వ్యవసాయం, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి కెవీవీ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. సహకారశాఖ సమీక్షలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ►ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ►గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే రైతులు, మహిళల ఆర్థిక స్థితిగతులు బలంగా ఉండాలి ►వ్యవసాయ కార్యకలాపాలకు, మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి ►తద్వారా వారిని చేయిపట్టుకుని నడిపించగలుగుతాం ►ఈ లక్ష్యసాధనలో ఆప్కాబ్, జిల్లాకేంద్ర సహకార బ్యాంకులు, పీఏసీఎస్‌లు, ఆర్బీకేలు భాగస్వామ్యం కావాలి ►అందుకే వీటి నెట్‌వర్క్‌ను కూడా విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది ►ఆర్బీకేల రూపంలో ప్రతి గ్రామంలో కూడా ఆప్కాబ్‌కు, జిల్లాకేంద్ర బ్యాంకులకు శాఖలు ఉన్నట్టే ►మరే ఇతర బ్యాంకుకు లేని అవకాశం సహకార బ్యాంకులకు మాత్రమే ఉంది ►వీటి ద్వారా కార్యకలాపాలను మరింత ముమ్మరం చేయాలి ►ఈ లక్ష్యం దిశగా పీఏసీఎస్(ప్యాక్స్), డీసీసీబీ, డీసీఎంఎస్, ఆప్కాబ్‌లు వాటి కార్యకలాపాలు పెంచాలి ►ఆప్కాబ్‌లో గతంలో చూడని పురోగతి కనిపిస్తోంది ►ఆప్కాబ్ మన బ్యాంకు.. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి ►ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, రైతు భరోసా కేంద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేశాం ►ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోకి 3 నుంచి 4 ఆర్బీకేలను తీసుకు వచ్చాం ►క్రెడిట్ మరియు నాన్ క్రెడిట్ సేవలు పీఏసీఎలు ఆర్బీకేల ద్వారా అందిస్తున్నాయి ►రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆర్బీకేల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్వీకరిస్తున్నాయి -
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసు.. శేషన్నను నిర్దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు
సాక్షి, హైదరాబాద్: పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి హత్యకేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న శేషన్నను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 2012 డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని బొగ్గులకుంట వద్ద పటోళ్ల గోవర్ధన్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆయన హత్యపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మావోయిస్టు, నయూ ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషన్నను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న పోలీసులు.. 2018 ఫిబ్రవరిలో అతన్ని అరెస్ట్ చేశారు. 11 ఏళ్ల విచారణ తర్వాత శేషన్నను నేడు నాపంల్లి నిర్దోషిగా ప్రకటించింది. -
వచ్చి అక్కడే ఉంటా..!
ఆత్మకూర్(ఎం): అమెరికాలోని ఫ్లోరిడాలో నల్లజాతీయులు జరిపిన దాడిలో మృతి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేట గ్రామవాసి కొత్త గోవర్ధన్‌రెడ్డి కాల్పుల ఘటనకు ఒక రోజు ముందు హైదరాబాద్‌లో ఉంటున్న భార్య, పిల్లలతో వీడియో కాల్ మాట్లాడినట్లు తెలిసింది. ‘డాడీ ఎప్పడొస్తావ్... మిమ్మల్ని చూడాలి’ అని కూతుళ్లు అడిగితే ‘వస్తానమ్మా.. త్వరలోనే వచ్చి అక్కడే ఉంటాను. ఏదైనా పని అక్కడే చేసుకుంటాను. నేనిక్కడ.. మీరక్కడ బాగాలేదు.. వస్తాను’ అని వీడియోకాల్‌లో గోవర్ధన్‌రెడ్డి అన్నట్లు కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. గోవర్ధన్‌రెడ్డి మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఫ్లోరిడాలో ఉన్న అతని స్నేహితులు ఇక్కడి వారికి వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నారు. గోవర్ధన్ అక్కడ అందరితో కలివిడిగా ఉండేవారని, ఆయన మృతి బాధాకరమని వారు పేర్కొన్నారు. గోవర్ధన్‌రెడ్డి మృతిచెందిన విషయాన్ని అతని తల్లిదండ్రులు నర్సిరెడ్డి, పద్మలకు గురువారం ఉదయం వరకు కుటుంబ సభ్యులు చెప్పలేదు. ‘మీ అల్లుడికి ఆరోగ్యం బాగా లేదు’అని చెప్పి బంధువులు వారిద్దరిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ప్రస్తుతం గోవర్ధన్‌రెడ్డి భార్య, పిల్లలు ఉంటున్న ఇంటికి వెళ్లాక విషయం తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శోకసంద్రంలో ఫ్రెండ్స్ కాలనీ హైదరాబాద్: అమెరికాలో ఉన్మాదుల దుశ్చర్యలకు బలైన కొత్త గోవర్ధన్‌రెడ్డి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు గురువారం పెద్దఎత్తున హైదరాబాద్ ఫిర్జాదిగూడ ఫ్రెండ్స్ కాలనీలోని ఆయన ఇంటికి తరలివచ్చారు. తల్లిదండ్రులకు ఆయన ఏౖకైక కుమారుడు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, పద్మమ్మను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. గోవర్ధన్‌రెడ్డికి భార్య శోభారాణి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. స్థానికంగా ఉన్న జాన్సన్ గ్రామర్ స్కూల్లో శ్రీయ పదో తరగతి, తులసి ఏడో తరగతి చదువుతున్నారు. మూడు రోజుల్లో గోవర్ధన్ మృతదేహం నగరానికి? 3 రోజుల్లో గోవర్ధన్ మృతదేహం నగరానికి వచ్చే అవకాశం ఉందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అక్కడే ఉన్న స్నేహితులు, బంధువుల సహాయంతో గోవర్ధన్ మృతదేహాన్ని నగరానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందని బంధువులు తెలిపారు. మృతదేహం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోండి: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కొత్త గోవర్ధన్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సీబీఐ ప్రిన్సిపల్ జడ్జిగా మధుసూదన్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీలను భర్తీ చేసేందుకు బుధవారం సాయంత్రం హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఏయే న్యాయాధికారులకు ఎక్కడెక్కడ పోస్టింగ్‌లు ఇవ్వాలన్న దానిపై కమిటీ తుది నిర్ణయం తీసుకున్న అరగంటలోపే ఆ వివరాలను హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. బదిలీలు, పోస్టింగులపై ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడం.. వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. ఏడుగురు జిల్లా జడ్జీలను వేర్వేరు స్థానాలకు బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇవ్వగా, 25 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతి కల్పించి ఆ మేర పోస్టింగ్‌లు ఇచ్చారు. కమ్యూనల్ అఫెన్సెస్ అదనపు సెషన్స్ జడ్జి కమ్ 7వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్ కమ్ 21వ అదనపు చీఫ్ జడ్జి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్న బీఆర్ మధుసూదన్‌రావు హైదరాబాద్, సీబీఐ ప్రిన్సిపల్ జడ్జిగా నియమితులయ్యారు. న్యాయవర్గాల్లో ఈయనకు చాలా సౌమ్యుడిగా పేరుంది. సికింద్రాబాద్ జుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా ఉన్న జీవీ సుబ్రహ్మణ్యం మహబూబ్‌నగర్ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న సీహెచ్‌కే భూపతిని జుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా నియమించింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు రెండవ అదనపు చీఫ్ జడ్జి బి.పాపిరెడ్డిని సంగారెడ్డి మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించింది. సీబీఐ కోర్టు మూడవ అదనపు స్పెషల్ జడ్జిగా ఉన్న డాక్టర్ టి.శ్రీనివాసరావును హైదరాబాద్ 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కమ్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ 18వ అదనపు చీఫ్ జడ్జిగా నియమించింది. ఈ కోర్టు ఎన్ఐఏ హోదా కలిగి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద దాఖలయ్యే కేసులను విచారిస్తున్న ఎస్.నాగార్జున హైదరాబాద్, లేబర్‌కోర్టు–1 ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. తెలంగాణ వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎస్.గోవర్ధన్‌రెడ్డిని ఏసీబీ ప్రిన్సిపల్ జడ్జిగా నియమించింది. ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి వీరంతా ఈ నెల 18లోపు రిలీవ్ అయి, 25లోపు కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వరరెడ్డి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 25 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతులు కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన ఈ 25 మందికి పలు చోట్ల పోస్టింగ్‌లు ఇచ్చింది. వీరు కూడా ఈ నెల 25లోపు కొత్త బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. -
ఆ నలుగురు హడల్
సాక్షి,సిటీబ్యూరో: గత ఎన్నికల్లో వారు ఓటమి చెందినా వారివారి పార్టీలను వీడలేదు. ఈ నాలుగున్నరేళ్లు ప్రజల్లోనే మమేకమై ఉన్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానాలు తమకు తప్పకుండా టికెట్ ఇస్తాయని ఆశించారు. కానీ కారణాలు ఏమైనా అనుకున్నది జరగలేదు. టికెట్ల పంపకాల్లో వారిని పక్కన పెట్టారు. దీంతో కలత చెంది తిరుగుబావుటాలు ఎగరేసి నగరంలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. తాము ఆశించిన పార్టీలు టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ నుంచి కొందరు, స్వత్యంత్ర అభ్యర్థులుగా మరికొందరు బరిలోకి దిగారు. ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. తమ బలమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని బూత్ స్థాయిలో పనిచేస్తున్నారు. అయితే, ఈసారి అధికంగా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల టికెట్ ఆశించి భంగపడ్డ వారే రెబల్స్‌గా పోటీలో ఉండడంతో తమ ఓటు బ్యాంక్‌కు ఏ రూపంలో గండి పడుతుందోనన్న భయం అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. జూబ్లీహిల్స్‌లో నవీన్ స్వతంత్ర బావుటా గడిచిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీచేసిన నవీన్ యాదవ్ 41,656 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. అయితే, ఈసారి ఆయనకు ఎంఐఎం టికెట్ నిరాకరించింది. స్థానికంగా బలమైన కేడర్ గల నవీన్ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో బూత్ ల వారిగా ఇప్పటికే కమిటీలను నియమించుకుని పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతున్నారు. సహజంగా ఎంఐఎం–టీఆర్ఎస్ల మధ్య ఉన్న సఖ్యత నవీన్‌యాదవ్ పోటీతో చెడిపోయింది. దీంతో మైనారిటీ ఓట్లపై టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ పెట్టుకున్న ఆశలు నెరవేరే పరిస్థితి లేదు. ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జిగా పనిచేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి భారీగానే ఓట్లు సాధించారు. ఈసారి కూడా టికెట్ తనకే ఇస్తారని ఆశించినా నెరవేరలేదు. దీంతో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. గోవర్ధన్‌రెడ్డి భార్య కవిత వెంకటేశ్వరనగర్ కార్పొరేటర్‌గా కూడా పనిచేస్తుండడం, ఆయనపై సాను భూతి వ్యక్తం ఉండడంతో టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. కూకట్‌పల్లిలో హరీష్‌రెడ్డి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ పన్నాల హరీష్‌రెడ్డి కూకట్పల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హరీష్ సతీమణి బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్య సైతం విస్తృతంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటి దాకా హరీష్ నియోజకవర్గాన్ని రెండుసార్లు చుట్టి వచ్చారు. బూత్‌స్థాయిలో విస్తృతమైన అనుచరగణాన్ని తయారు చేసుకుని ముందుకు వెళుతున్నారు. హరీష్ టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ ఓట్లు సైతం భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మేడ్చల్ నియోజకవర్గంలోనూ మాజీ టీఆర్ఎస్ నాయకుడు నక్కా ప్రభాకర్‌గౌడ్ ప్రధాన పార్టీలకు గట్టి సవాల్నే విసురుతున్నారు. ఆయనకు టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవంతో బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలను మించి ర్యాలీలు నిర్వహిస్తుండడం విశేషం. -
ఖైరతాబాద్‌లో ఉద్రిక్తత
బంజారాహిల్స్: టీఆర్ఎస్ ఖైరతాబాద్ టికెట్‌ను మన్నె గోవర్ధన్‌రెడ్డికి కేటాయించాలంటూ ఆయన అనుచరులు, మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. వరుసగా రెండోరోజు మంగళవారం తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన చేసేందుకు ‘మన్నె’ ఇంటి దగ్గరి నుంచి వెళ్తుండగా బంజారాహిల్స్ పోలీసులు కార్యకర్తను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు ముందుకు వెళ్లకుండా తాడు ఏర్పాటు చేయగా, దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో గోవర్ధన్‌రెడ్డి కూడా అటువైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే జరిగిన తోపులాటలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవర్ధన్‌రెడ్డి వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తమ నేతకు గుండెపోటు వచ్చిందని, రోడ్డుపై కుప్పకూలిపోయాడని తెలుసుకున్న టీఆర్ఎస్ నేత, ఎన్బీటీనగర్ వాసి సత్యనారాయణ రాయితో తలబాదుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో రక్తస్త్రావం జరిగి ఆయన కూడా కుప్పకూలిపోయారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్వీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖైరతాబాద్‌లోని పెరిక భవన్ పక్కన హోర్డింగ్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గోవర్ధన్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోవర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న కార్యకర్తలు భారీగా ఆస్పత్రి దగ్గరికి చేరుకొని నినాదాలు చేశారు. -
ఆడతా... ఆడిస్తా...
-
ఆడతా... ఆడిస్తా...
♦ గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం ♦ త్వరలో దేశవ్యాప్తంగా విస్తరణ సాక్షి, హైదరాబాద్ భారత బ్యాడ్మింటన్ అత్యుత్తమ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆటతో పాటు ఇప్పుడు ఆటగాళ్లను తీర్చి దిద్దేందుకు కూడా సిద్ధమైంది. ఆమె ఆధ్వర్యంలో ‘గ్లోబల్ బ్యాడ్మింటన్ అకాడమీ’ శనివారం ఇక్కడ ప్రారంభమైంది. నగరంలోని కూకట్‌పల్లిలో ఈ అకాడమీని నెలకొల్పారు. దీంతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న 25 కోర్టులను కూడా ఇక నుంచి గ్లోబల్ అకాడమీనే నిర్వహిస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్)లో కోచ్‌గా పని చేసిన గోవర్ధన్ రెడ్డి ఈ అకాడమీ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనుండగా, ‘ద్రోణాచార్య’ ఎస్ఎం ఆరిఫ్ కూడా శిక్షణలో పాలుపంచుకుంటారు. ప్రస్తుతానికి మాత్రం జ్వాల కోచింగ్ ఇవ్వకుండా పర్యవేక్షణకే పరిమితం కానుంది. ‘దాదాపు ఏడాది కాలంగా నా మనసులో ఉన్న ఆలోచన ఇప్పుడు వాస్తవరూపం దాల్చింది. చిన్నారులు, వర్ధమాన షట్లర్లకు అత్యుత్తమ సౌకర్యాలతో శిక్షణ అందించడం అకాడమీ లక్ష్యం. ఇక సింగిల్స్, డబుల్స్‌కు ఇక్కడ సమాన ప్రాధాన్యత లభిస్తుంది. డబుల్స్ శిక్షణ విషయంలో వివక్ష ఉండదు’ అని జ్వాల పేర్కొంది. తమ అకాడమీ లక్ష్యం ఒలింపియన్లను తయారు చేయడమే అని ఈ దశలోనే చెప్పడం అతిశయోక్తిగా అనిపిస్తుందని, ప్రతిభ ఉండి తగిన అవకాశాలు దక్కించుకోలేకపోతున్న ఆటగాళ్లను ప్రోత్సహించడమే తమ ముందున్న కర్తవ్యమని జ్వాల వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుల్లెల గోపీచంద్ అకాడమీతో పాటు పలు ఇతర అకాడమీలు కూడా పని చేస్తున్నాయి. వాటితో తాను పోల్చుకోవడం లేదని జ్వాల వెల్లడించింది. ‘ఆరోగ్యకరమైన పోటీ ఉండటం మంచిదే. కోచ్‌గా గోపీచంద్ ఘనతలను గౌరవిస్తాను. అయితే మరిన్ని అకాడమీలు ఉండటం వల్ల నష్టమేమీ లేదు. కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు లభిస్తే మంచిదే కదా’ అని ఆమె అభిప్రాయపడింది. మరోవైపు తాను క్రీడాకారిణిగా ఇంకా రిటైర్ కాలేదని 33 ఏళ్ల జ్వాల స్పష్టం చేసింది. గత జనవరిలో మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో మనూ అత్రితో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పాల్గొన్న జ్వాల రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. ‘ప్లేయర్‌గా ఇంకా రాణించగల సత్తా నాలో ఉంది. ర్యాంకు తక్కువగా ఉండటం వల్ల నేను ఎక్కువ టోర్నీలు ఆడటం లేదు. ఇప్పుడు చిన్న టోర్నీలతో మొదలు పెట్టాల్సి ఉంది. అయితే సీనియర్ సర్క్యూట్లో 18 ఏళ్లుగా నిరంతరాయంగా ఆడుతున్నాను కాబట్టి ఈ మాత్రం విరామం అవసరమని భావించా’ అని జ్వాల చెప్పింది. ప్రస్తుతం మహిళల డబుల్స్‌లో జ్వాల 28వ ర్యాంక్‌లో, మిక్స్డ్ డబుల్స్‌లో 340వ ర్యాంక్‌లో ఉంది. రూ. 25 కోట్ల పెట్టుబడి... జ్వాలకు చెందిన గ్లోబల్ అకాడమీకి ఆర్థికపరంగా ఫ్రాంచైజ్ ఇండియా–నాకౌట్ వెల్నెస్ ల్యాబ్స్ సంస్థ అండగా నిలుస్తున్నాయి. అకాడమీ నిర్వహణ కోసం ప్రాథమికంగా ఈ సంస్థ రూ. 25 కోట్లు వెచ్చిస్తుండటం విశేషం. ‘బ్యాడ్మింటన్ కోచింగ్‌కు కొత్త తరహాలో మార్గనిర్దేశనం చేయాలనే ఆలోచనతో ఇందులోకి అడుగుపెట్టాం. దశలవారీగా అకాడమీని విస్తరించి దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో 50 వరకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడమే మా లక్ష్యం. లాభనష్టాల గురించి అప్పుడే ఆలోచించడం లేదు’ అని నాకౌట్ వెల్నెస్ సహ యజమాని మోహిత్ వర్మ వెల్లడించారు. అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్రాంచైజ్ ఇండియా–నాకౌట్ వెల్నెస్ ల్యాబ్స్ సంస్థ సహ యజమాని మోహిత్ వర్మ, జ్వాల -
ఛత్తీస్‌గఢ్‌లో పాలమూరు జవాన్ మృతి
ల్యాండ్‌మైన్ పేలుడుతో ఘటన మహబూబ్‌నగర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని దాస్‌గూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్‌కు పాలమూరు జిల్లాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మృత్యువాత పడ్డాడు. కోయిలకొండ మండలం సంగనోనిపల్లి గ్రామానికి చెందిన గోవర్దన్‌రెడ్డి (28) రెండేళ్ల కిందట సీఆర్పీఎఫ్ దళంలో చేరాడు. ఆదివారం అక్కడ ప్రారంభించబోయే రోడ్డును శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆర్ఓపీ (రోడ్డు ఆపరేషన్ పార్టీ) జవాన్లు తనిఖీలు నిర్వహిస్తుండగా సమీపంలోని కల్వర్ట్ కింద గతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్ పేలింది. అదే బృందంలో ఉన్న గోవర్దన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సహచర జవాన్లు అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బెటాలియన్ అధికారులు ఆయన మృతదేహాన్న్ని రాయగఢ్‌కు తరలించి ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పంపించారు. సోమవారం స్వగ్రామంలో గోవర్దన్‌రెడ్డికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. -
మందుపాతర పేలి పాలమూరు జవాన్ మృతి
బీజాపూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి బీభత్సం సృష్టించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా బీజాపూర్ జిల్లా సర్కేగూడలో మావోలు మందుపాతర పేల్చారు. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్ గోవర్ధన్ రెడ్డి (28) మృతి చెందాడు. గోవర్ధన్ రెడ్డి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కోవెలకుంట మండలం సంగనోనిపల్లి. జవాను మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్థాయి పెంచి సేవలు తగ్గించారు
వెంకటాచలం: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి పెంచి క్లస్టర్ పరిధిలోకి తీసుకురావడంతో వైద్య సేవలు తగ్గాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా 24 గంటలూ వైద్య సేవలు అందించేదన్నారు. క్లస్టర్ పరిధిలో చేర్చడంతో ఉదయం 9 నుం చి సాయంత్రం 4 గంటల వరకే సేవలు అందిస్తున్నారన్నారు. ఎల్లవేళలా వైద్యం అందించేలా ఉన్నతాధికారులతో చర్చిస్తానన్నారు. కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు అవసరమైన భవనం, సిబ్బంది, పరికరాలను కోరుతూ నివేదిక పంపుతామని కాకాణి చెప్పారు. రికార్డులు పరిశీలించి నిధులు వినియోగంపై ఆయన ఆరా తీశారు. పేదలకు సరైన వైద్యం అందలేదన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమే అయినా దాని స్థాయికి తగినట్టు వసతులు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆస్పత్రిలో 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని కోఆప్షన్ మాజీ సభ్యుడు షేక్ కరీంసాహెబ్ కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, మండల ఉపాధ్యక్షుడు వల్లూరు శ్రీధర్‌నాయుడు, కోఆప్షన్ సభ్యులు అక్బర్, హుస్సేన్, ఎంపీడీఓ టి సుగుణమ్మ, తహశీల్దార్ డీవీ సుధాకర్, క్లస్టర్ డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ గీతామణి, వైఎస్సార్సీపీ నేతలు కసుపూరు కోదండరామిరెడ్డి, పెళ్లూరు సుధాకర్ రెడ్డి, ఆరుకుంట ప్రభాకర్‌రెడ్డి, నాటకం శ్రీనివాసులు, డబ్బుగుంట వెంకటేశ్వర్లు ,పాశం ప్రభాకర్, వెలిబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అన్ని వేళలా అందుబాటులో ఉంటా
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తోటపల్లిగూడూరు : నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అర్ధరాత్రయినా స్పందిస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్రాను. తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం ఓ సేవకునిలా పని చేస్తానన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకాణి మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు, సలహాలను అందించారు. నియోజకవర్గ ప్రజలు ఏ కష్టం వచ్చినా ఏ రాత్రయినా సరే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందిస్తానని, సమస్య ఉన్న ఎవరైనా తన సహాయం కోరవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పని చేస్తానన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని ఇక రాజకీయాలు అవసరం లేదని, అధికారులు, ఇతర పార్టీ నేతల సూచనలు, సలహాలు ఇస్తే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మండల పరిషత్ నిధులు, ఎమ్యెల్యే నిధులు, జిల్లా పరిషత్ నిధులతో నియోజక అభివృద్ధికి పాడుపడతానన్నారు. నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటువుతున్న పరిశ్రమల యాజమాన్యాల సహకారంతో ప్రగతి బాట పట్టిస్తానని కాకాణి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్వోగులు కూడా ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గాని అభివృద్ధిలో గాని అధికారులకు ఎలాంటి ఒత్తిడిలు ఉన్నా, ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులు పెట్టాలనే ఆలోచన చేయొద్దన్నారు. పలుశాఖల అధికారులను సుతిమెత్తగా మందలించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టిగా పని చేస్తేనే అభివృద్ధి నల్లేరుమీద నడకలా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రవిచంద్రప్రసాద్, తహశీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ సావిత్రమ్మ, జెడ్పీటీసీ సభ్యులు మన్నెం చిరంజీవిగౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షరాలు చెరుకూరు సరళకుమారి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీవి నీచ రాజకీయాలు
పొదలకూరు : వైఎస్సార్సీపీకి విప్ జారీ చేసే అధికారం ఉన్నా, లేదని దుష్ర్పచారం చేస్తూ టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ వైఎస్సార్సీపీకి విప్ జారీ చేసే అర్హత ఉందని కిందిస్థాయి అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులను అందజేసినా టీడీపీ నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతోందని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్ జారీ చేసే తమపార్టీ అభ్యర్థుల వివరాలను సంబంధిత అధికారులకు అందజేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే రాణించలేమని తెలిసి ప్రలోభాలకు గురిచేసి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు ధ్వజమెత్తారు. టీడీపీ ఎత్తులను తిప్పికొట్టి స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీ సంపూర్ణ మెజారిటీ సాధించిన మండలాల్లో మండలాధ్యక్షులు,ఉప మండలాధ్యక్షులను ఎన్నుకుంటామని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపించి వైఎస్సార్సీపీకి మండల పరిషత్ పీఠాలను అప్పజెప్పిన ప్రజలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 30 రోజులు కావస్తున్నా ఇంతవరకు రుణమాఫీ ప్రక్రియ చేపట్టకుండా కమిటీలతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. కనుపర్తి నివాసి అట్లా జానకిరామిరెడ్డికి చెందిన స్టేట్‌బ్యాంక్ ఖాతాలోని రూ.70 వేలను ఎలాంటి నోటీసులు లేకుండా పంట రుణానికి జమచేసుకున్నారన్నారు. ఇంతకంటే దారుణం ఏమి ఉంటుందని ప్రశ్నించారు. ఖా తాలో ఈ నెల ఒకటిన రూ.1,37,070 జమచేయగా అందులో నుంచి బ్యాంకు అధికారులు రూ.70 వేలు రుణ బకాయిలకు జమచేసుకోవడం పరిశీలిస్తే ప్రభుత్వం రుణమాఫీ అమలులో ఎంత వైఫల్యం చెం దిందో అర్థమవుతుందన్నారు. పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి ఉన్నారు. -
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా
వెంకటాచలం: గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పూడిపర్తిలో వైఎస్సార్సీపీ నాయకుడు కోడూరు కమలాకర్‌రెడ్డి తల్లి శ్రీదేవమ్మ శనివారం మృతిచెందింది. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం కాకాణికి స్థానిక ప్రజలు రహదారులు, తాగునీరు, విద్యుత్ కోతలు తదితర సమస్యలను ఆయనకు వివరించారు. ఆయన మాట్లాడుతూ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రతి గ్రామాన్నీ సందర్శిస్తానన్నారు. తనను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిపి, లోగడ ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబంలో ఒకడిగా ఉంటూ సేవ చేస్తానని తెలిపారు. శాసన సభ్యుడిగా తాను, ఎంపీ వరప్రసాద్‌రావు, జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షులను సమన్వయంతో పని చేయించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఎవరైనా స్వతంత్రంగా తమ సమస్యలను స్వయంగా గానీ, ఫోన్‌ద్వారాగానీ తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో కోడూరు కమలాకర్‌రెడ్డి, కోడూరు రఘునంధన్‌రెడ్డి,బుడంగుంట రామకృష్ణారెడ్డి, మారంరెడ్డి మధురెడ్డి, పోచారెడ్డి సుమంత్‌రెడ్డి, పోచారెడ్డి శ్రీనివాసులురెడ్డి, కోడూరు మనోహర్‌రెడ్డి, ఆములూరు సుధాకర్ నాయుడు, డక్కిలి రమణయ్య, నాశిన సుధీర్, నాశిన సుధాకర్, వెంపులూరు హరి, జానా శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తోటపల్లిగూడూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలో లేకపోయినా ఓ శాసనసభ్యుడిగా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారి కాకాణి శుక్రవారం మండలంలో పర్యటించారు. ముందు గా కాకాణి వరిగొండలోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం పంచాయతీలో పలు గ్రామాల్లో పర్యటించి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ఓటర్లకు కాకాణి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపించిన సర్వేపల్లి ప్రజల రుణం తీర్చుకుంటానన్నా రు. గతంలో తాను చేపట్టిన గడపగడపకు దీవెనయాత్ర తన విజయానికి దోహదపడిం దన్నారు. ఆ యాత్ర ద్వారా తాను చూసిన ప్రజా సమస్యలను పరిష్కరిం చేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. శాసనసభ్యుడికి అర్థం సేవ చేయడమేనని దానికి పర్యాయపదంగా నిలుస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధులతో స్థానిక సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. స్థానికంగా ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేం దుకు ప్రయత్నిస్తానన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలో లేకపోయినా సమర్థత కలిగిన ప్రతిపక్ష హోదా లో ప్రజా సమస్యలపై పోరాటం సాగి స్తుందన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చే వరకు పార్టీ పోరాటం సాగిస్తుందన్నారు. 1999లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉండి 2004, 2009లో అధికారం చేపట్టారని అదే ఆనవాయితీ జగన్మోహన్రెడ్డి విషయంలోనూ జరుగబోతుందన్నారు. ఈ ఐదేళ్లు నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహ పడకుండా పార్టీ కోసం పనిచేయాలన్నారు. అధికారం ఉంది కదా అని టీడీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని కాకాణి స్పష్టం చేశారు. పార్టీ మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, నాయకులు నెల్లిపూడి సునీల్‌కుమార్‌రెడ్డి, టంగుటూరు శ్రీనివాసులరెడ్డి, నెల్లిపూడి రాజగోపాలరెడ్డి, ఇసనాక రమేష్‌రెడ్డి, తిక్కవరపు సనత్‌రెడ్డి, కావలిరెడ్డి రవీంద్రరెడ్డి, కోడూరు దిలీప్‌రెడ్డి, కోడూరు వెంకురెడ్డి, మన్నెం చిరంజీవులగౌడ్, వేణుంబాకం సుమంత్‌రెడ్డి, వేనాటి జితేంద్రరెడ్డి, తూపిలి శ్రీధర్‌రెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్, నెల్లిపూడి శ్రీనివాసులరెడ్డి, దువ్వూరు శ్రీనివాసులరెడ్డి, తూపిలి నారాయణరెడ్డి, కోసూరు రవీంద్రయ్య, పంది రామసుబ్బయ్య, జానా శీనయ్య, జానా శేషు, ఉండ్రాళ్ల శ్రీనివాసులు, కటకం శ్రీనివాసులు పాల్గొన్నారు. -
విభజనపై జగన్ అలుపెరగని పోరు
వెంకటాచలం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ను అడ్డుకుని తెలుగువారందరినీ సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. కనుపూరుకు చెందిన , రాష్ట్రమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అనుచరులు, ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి సన్నిహితులైన పలువురు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో మాజీ సర్పంచ్ నాటకం శ్రీనివాసులు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు చింతంరెడ్డి దొరసానమ్మ, చింతంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, కోఆపరేటివ్ బ్యాంకు మాజీ సభ్యుడు షేక్ ఖాజా, నీటి సంఘ అధ్యక్షుడు చెంగన కృష్ణయ్య, శిఖామణి, పచ్చబట్ల మస్తానయ్య, కుంపాటి ప్రభాకర్, చవికల పోలయ్యతో పాటు మరో 500 మంది ఉన్నారు. వీరికి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని సోనియాగాంధీ ప్రయత్నిస్తుంటే, జగన్మోహన్రెడ్డి సమైక్యం గా ఉంచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నారని ప్రజలకు అర్ధమైందన్నారు. కాంగ్రెస్, టీడీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
ముత్తుకూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించాలని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమైక్య దీవెనయాత్రలో భాగంగా శుక్రవారం ముత్తుకూరులో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త దళితవాడ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో ఓటింగ్ జరపకుండా చర్చ చేపట్టడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఉంటే విభజన నిర్ణయంపై రాష్ట్రపతి పునరాలోచించేవారని కాకాణి అభిప్రాయపడ్డారు. తీర్మానం చేయకుండా, ఓటింగ్ జరపకుండా చర్చ చేపట్టడం ద్వారా సమైక్యవాదానికి తూట్లు పొడిచారన్నారు. తీర్మానానికి పట్టుబట్టిన వైఎస్సార్సీపీ శాసనసభ్యులను సభ నుంచి బహిష్కరించడంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు బయటపడిందన్నారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎమ్మెల్యేలను అరెస్టు చేసి, బలవంతంగా వ్యానులో తరలించడం వెనుక ఈ రెండు పార్టీల రహస్య ఒప్పందం ఉందన్నారు. ఈ ఉదంతం ద్వారా సమైక్యంపై ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి డ్రామాలాడుతున్న విషయం స్పష్టమైపోయిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశవాదం బట్టబయలయిందన్నారు. మొహం చూపని ఎమ్మెల్యే ఆదాల ఓట్లేసిన ప్రజలకు మొహం చూపని ఎమ్మెల్యేల్లో ఆదాల ప్రభాకరరెడ్డి ప్రముఖులని కాకాణి ఎద్దేవా చేశారు. పనుల కోసం ఎవరైనా వెళ్లి అడిగితే ‘నేనిచ్చిన నోటు, మీరేసిన ఓటుకు చెల్లు’ అంటూ హేళన చేసి పంపిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్దనరెడ్డి, నాయకులు దాసరి భాస్కర్‌గౌడ్, దువ్వూరు విజయభాస్కర్‌రెడ్డి, మారు సుధాకర్‌రెడ్డి, నంగా చెంగారెడ్డి, పోలిరెడ్డి చిన్నపరెడ్డి, కొడవలూరు రామిరెడ్డి, సర్పంచ్ పల్లంరెడ్డి జనార్దనరెడ్డి, దువ్వూరు గోపాలరెడ్డి, సన్నారెడ్డి రమణారెడ్డి, కారంచేటి ప్రసాద్‌శర్మ, సుమంత్‌రెడ్డి, జవహర్, టీ రాజ పాల్గొన్నారు. -
వైఎస్సార్ కంటి చూపుతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచారు
పొదలకూరు, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్సార్ కంటి చూపుతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి పాలించారని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గడపగడపకూ సమైక్యదీవెన యాత్రను గురువారం పొదలకూరు మండలం లింగంపల్లిలో కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ మరణానంతరం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే నాయకుడు కరువయ్యారన్నారు. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమ పథకాలు మరోవైపు కొనసాగించి జనరంజకంగా పాలించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి పాలించే సత్తా వైఎస్సార్ తర్వాత ఆయన తనయుడు జగన్‌కే ఉందన్నారు. జగన్మోహన్రెడ్డిని దీవిస్తే ఆయన రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడుతారన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన లేఖవల్లే తెలంగాణ విభజన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. బాబులాంటి నాయకుడ్ని ప్రజల్లో తిరగనీయకుండా జాగ్రత్త పడాలని పిలుపునిచ్చారు. ఓట్లు వేయించుకుని ప్రజలకు కనిపించకుండా తిరిగే నాయకులకు తనను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకుని తాను కాంట్రాక్టు పనులు చేయడం లేదని పరోక్షంగా సర్వేపల్లి ఎమ్మెల్యేను దుయ్యబట్టారు. జగన్ ఆశీస్సులతో వైఎస్సార్సీపీ సర్వేపల్లి అభ్యర్థిగా తాను అసెంబ్లీ బరిలో నిలబడతానని ధైర్యంగా చెప్పగలనని, తన పార్టీని విమర్శించే వారు ఏ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారో ప్రకటించాలన్నారు. అసమర్థ ముఖ్యమంత్రి వల్ల తెలంగాణ విభజన ప్రక్రియ వేగంగా సాగుతోందని విమర్శించారు. కండలేరు జలాలను చిత్తూరు జిల్లాకు తరలించేందుకు రూ.2600 కోట్లు నిధులను వెచ్చించేందుకు సీఎం, జిల్లా మంత్రి కూడబలుక్కున్నట్టు ఆరోపించారు. కాకాణి వెంట వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోనం బ్రహ్మయ్య, పేర్నేటి శ్యాంప్రసాద్‌రెడ్డి, బిరదోలు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, లింగంపల్లి నాయకులు ఎ.వెంకటరమణారెడ్డి, సుందరరామిరెడ్డి, పొదలకూరు నాయకులు వాకాటి శ్రీనివాసులురెడ్డి, వూకోటి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
పాల్వాయివి మతి స్థిమితం లేని మాటలు
భువనగిరి, న్యూస్‌లైన్ : రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి మతి స్థిమితం కోల్పోయి తనపై విమర్శలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. తాను భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పిలాయిపల్లి కాల్వద్వారా మూసీ జలాలను అందిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్ కాలువ పనులను వదిలివెళ్లినప్పటికీ ఏనాడూ పట్టించుకోని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి.. తాను చేసిన పనులను విమర్శించడం తగదన్నారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం విమర్శలతోనే కాలం గడిపుతున్నారని పేర్కొన్నారు. ఏడు సంవత్సరాలుగా పూర్తి కాని కాల్వను, త్వరగా పూర్తి చేయడానికి తాను రెండు సంవత్సరాల కాలం పాటుపడినట్లు తెలిపారు. ఇందుకోసం 6.7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కాల్వ పనుల్లో అక్కడక్కడా ఏవైనా మరమ్మతులు వస్తే అధికారులు వాటిని సరి చేయిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేసి ఆరోపణలు చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలని పాల్వాయి చేస్తున్నారని ఆరోపించారు. పిలాయిపల్లి కాలువ ద్వారా పోచంపల్లి, చౌటుప్పల్ మండలాలతో పాటు మునుగోడు నియోజకవర్గాల రైతులకు సాగు నీరు అందుతుందన్నారు. ఈ ప్రాంతాల్లో చెరువులను కూడా నింపుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. -
నకిలీ ఏసీబీ అధికారుల ఆటకట్టు
శేరిలింగంపల్లి, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులమంటూ ప్రభుత్వ అధికారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం అధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రివాల్వర్‌లో వాడే బుల్లెట్, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్ఓటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లాకు చెందిన గోతల శ్రీనువాస్ (46) పెయింటింగ్ కాంట్రాక్టర్. బంజారాహిల్స్‌లోని ఎన్బీటీనగర్లో ఉంటున్నాడు. ఇతని స్నేహితుడు ఆలేటి కిరణ్ కిశోర్ అలియాస్ సుభాకర్(30) చర్లపల్లిలోని ఓ కంపెనీలో పనిచేస్తూ సైనిక్‌పురిలో ఉంటున్నాడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరిద్దరూ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఏసీబీ అధికారుల అవతారం ఎత్తారు. తాము ఏసీబీ అధికారులమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి.. డబ్బు వసూలు చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం బంజారాహిల్స్‌లో వాటర్ కనెక్షన్ కోసం వెళ్తే జాప్యం జరిగింది. దీంతో వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ హఫీజ్‌కు శ్రీనివాస్ ఫోన్ చేసి మీపై చాలా ఆరోపణలు ఉన్నాయని బెదిరించాడు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సురేష్ మీతో మాట్లాడతారని కిరణ్కిశోర్తో మాట్లాడించాడు. ‘నీపై చాలా ఆరోపణలున్నాయి.. మీ ఇద్దరూ తేల్చుకోండి’ అని అతను ఫోన్ పెట్టేశాడు. హఫీజ్‌ను రూ.2 లక్షలు డిమాండ్ చేయగా రూ.1.25 లక్షలు ముట్టజెప్పాడు. ఇదే తరహాలో నేరేడ్మెట్ వాటర్‌వర్క్స్ డీజీఎం ఉమాశంకర్ నుంచి రూ.5 వేలు, 10 తులాల గోల్డ్ బిస్కెట్లు, మెదక్ జిల్లా రామచంద్రాపురం తహశీల్దార్ గీత నుంచి రూ.లక్ష, పార్వతీపురం సబ్‌రిజిస్ట్రార్ నుంచి రూ.10 వేలు వసూలు చేశారు. అదే విధంగా శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ రామకృష్ణారెడ్డిని రూ.2 లక్షలు, కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ శోభారాణి, రాజేంద్రనగర్ సీటీఓ కేఎల్ సుధాకర్, హైదర్‌నగర్ సీటీఓ వెంకటేశ్వరరావు, హైదర్‌నగర్ డీసీటీఓ నాగబాబును పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు. అయితే వారు తమపై వచ్చిన ఆరోపణలు ఏమిటో చెప్పాలని కోరడంతో మళ్లీ వారిని సంప్రదించలేదు. ఈక్రమంలోనే ఈనెల 10న శేరిలింగంపల్లి సర్కిల్-11 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ డి.సురేందర్‌రెడ్డిని బెదిరించడంతో ఆయన ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సూచన మేరకు సురేందర్‌రెడ్డి.. నకిలీ ఏసీబీ అధికారి శ్రీనివాస్‌కు డబ్బులు ఇస్తానని గచ్చిబౌలిలోని మహారాజ హోటల్‌కు రావాలని కోరాడు. శ్రీనివాస్ సదరు అధికారి నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. అప్పటికే అక్కడ మాటు వేసిన ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సీహెచ్ కుషాల్కర్, ఎస్ఐ ఎస్.రమేష్, శివకుమార్‌లతో పాటు చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన సమాచారంతో కిరణ్కిశోర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్‌ను గచ్చిబౌలిలోని ఓ దుకాణంలో ఖరీదు చేసినట్లు నిందితులు వెల్లడించారు. చందానగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ కుషాల్కర్, ఎస్ఐలు శివకుమార్, రమేష్ పాల్గొన్నారు. -
గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా ముంబైకి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఓ ముఠా గుట్టును సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు రట్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి రూ.10 లక్షల విలువ చేసే 148 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్ఓటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి తెలిపిన ప్రకారం... ఖమ్మం జిల్లా పాలెం మండలం సుబ్లాదే గ్రా మానికి చెందిన రైతు కొండా ఉపేందర్ (28), ప్రైవేట్ సెక్యూరిటీగార్డు గంధా శ్రీనాగరాజు (27), టైలర్ వేదులపరుపు వీరాంజనేయులు (35) త్వరగా డబ్బు సంపాదించి ధనవంతులు కావాలని గంజాయి స్మగ్లింగ్ మొదలెట్టారు. విశాఖపట్నం, అన్నవరం, జీముదుల్లా ప్రాంతాల నుంచి గంజాయిని నగరానికి తెచ్చి.. ఇక్కడి నుంచి ముంబైకి తరలిస్తున్నారు. పది, ఐదు కిలోల చొప్పున లగేజీ బ్యాగులలో గంజాయిని నింపి.. ఎవరీ అనుమానం రాకుండా ప్ర యాణికుల్లా ప్రైవేట్ బస్సుల్లో నగరానికి తెస్తున్నారు. ఈ ‘సరుకు’ను బాలానగర్ రాజుకాలనీలో అద్దెకు తీసుకున్న గదిలో భద్రపర్చి.. ఆ తర్వాత ముంబైకి తరలిస్తున్నారు. వీరి వ్యవహారంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్ఓటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ కుషాల్కర్, ఎస్.రమేష్‌లు శుక్రవారం అర్ధరాత్రి రాజుకాలనీలోని స్మగ్లర్ల గదిపై దాడి చేశారు. ఉపేందర్, వీరాంజనేయులు, నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన 148 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును బాలానగర్ పోలీసులకు అప్పగించారు.