భువనగిరి, న్యూస్‌లైన్ : రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి మతి స్థిమితం కోల్పోయి తనపై విమర్శలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. తాను భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పిలాయిపల్లి కాల్వద్వారా మూసీ జలాలను అందిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్ కాలువ పనులను వదిలివెళ్లినప్పటికీ ఏనాడూ పట్టించుకోని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి.. తాను చేసిన పనులను విమర్శించడం తగదన్నారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం విమర్శలతోనే కాలం గడిపుతున్నారని పేర్కొన్నారు.
ఏడు సంవత్సరాలుగా పూర్తి కాని కాల్వను, త్వరగా పూర్తి చేయడానికి తాను రెండు సంవత్సరాల కాలం పాటుపడినట్లు తెలిపారు. ఇందుకోసం 6.7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కాల్వ పనుల్లో అక్కడక్కడా ఏవైనా మరమ్మతులు వస్తే అధికారులు వాటిని సరి చేయిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేసి ఆరోపణలు చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలని పాల్వాయి చేస్తున్నారని ఆరోపించారు. పిలాయిపల్లి కాలువ ద్వారా పోచంపల్లి, చౌటుప్పల్ మండలాలతో పాటు మునుగోడు నియోజకవర్గాల రైతులకు సాగు నీరు అందుతుందన్నారు. ఈ ప్రాంతాల్లో చెరువులను కూడా నింపుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.
పాల్వాయివి మతి స్థిమితం లేని మాటలు
Published Thu, Oct 24 2013 3:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement