Raj gopal reddy
-
రాజగోపాల్ రెడ్డి చేరికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ సమర్పించిన రాజగోపాల్ రెడ్డి
-
బీజేపీలో రాజ్ గోపాల్ రెడ్డి చేరికపై సస్పెన్స్
-
కాంగ్రెస్‌కు రాజీనామాపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
-
తీసి అవతల పారేద్దామా?
సాక్షి, హైదరాబాద్: ‘సభలో అబద్ధాలు చెప్పే వారు అవసరమా? తీసి అవతల పారేద్దామా? అబద్ధాలతో ప్రజ లను తప్పుదోవ పట్టించేవారు సభలో ఉండటానికి అర్హులా?’అని రాజగోపాల్‌రెడ్డి సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయి లో మండిపడ్డారు. సభలో అసత్య ఆరోపణలు చేసే వారిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చపై సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ‘శాసనసభలో ఏదిపడితే అది మాట్లాడటం కరెక్టు కాదు. కొత్త రూల్ అవసరమే. సింగపూర్‌లో ఒక చట్టం ఉంది. ఆరోపణ చేస్తే నిరూపించాలి. మన దగ్గర అలాంటి అవకాశం ఉందో పరిశీలించండి. ఇలాంటి వాటికి ఎక్కడో ఒక దగ్గర చరమగీతం పాడాలి. లేకపోతే అది రాష్ట్రానికి మంచిది కాదు. ఎవరికీ మంచిది’అని సీఎం పేర్కొన్నారు. ఆధారం లేకపోతే మాది అరణ్య రోదనే కదా! ‘మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక పథకంపై పిచ్చి కూతలు కూసే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంలోనే 334 ఆవాసాలకు నీళ్లు ఇచ్చాం. గ్రామ పంచాయతీల తీర్మానాలు ఉన్నాయి. నీళ్లు వచ్చాయని ఆయనే సంతకం చేశారు. మళ్లీ అబద్ధాలు చెబు తున్నారు. అంటే ఆయన సంతకం చేసింది అబద్ధమా? ఇదిగో ఆ పత్రం.. మీ దగ్గరే పెట్టం డి.. ఆయనపై ఏం యాక్షన్ తీసుకుంటారో ఆలోచించండి. మినిస్టర్‌ను తిట్టారు. ఈ రుజువు లేకపోతే మా పరిస్థితేంటి.. అరణ్య రోదనే కదా.. గతంలో ఆయన అన్న గవర్నర్‌పై మైక్ విసిరారు. ఈ అరాచకం మంచిది కాదు. ఎక్కడో చోట దెబ్బ కొట్టాలి. మీరు సీరియస్‌గా తీసుకోవాలి. సహించొద్దు. గుణపాఠం చెప్పాల్సిందే. మీరే నిర్ణయం తీసుకోండి. ఈ విషయంలో నివేదిక తెప్పించుకొని చర్యలు చేపట్టండి’ అని పేర్కొన్నారు. ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశాం ‘మిషన్ భగీరథ పథకంతో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌కు అడ్డుకట్ట వేశాం. ఇది అద్భుత పథకమని యావత్ దేశం ప్రశంసించింది. ఈ పథకం కోసం ఇప్పటికే రూ.41 వేల కోట్లు ఖర్చు చేశాం. మరో రూ.3 వేల కోట్లు అవసరం అవుతాయి. మిషన్ భగీరథ వల్ల నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య పోయిందని స్వయంగా కేంద్ర జల శక్తి శాఖనే ప్రకటించింది. భగీరథతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని ఇస్తున్నాం. అవికాకుండా అదనంగా రూ.90 లక్షలు కావాలని రాజగోపాల్‌రెడ్డి అడిగారు’ అని సీఎం వివరించారు. వస్తామన్నా వద్దని వారించా ‘మా పార్టీ తరఫున 88 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. ఉప ఎన్నికల్లో మరొ కటి, ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే. మొత్తం 90 మంది ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది టీఆర్ఎస్లోకి వస్తామంటే నేనే వద్దని చెప్పా. రాజ్యాం గం ప్రకారం నడుచుకోవాలని చెప్పా. దానిపై తప్పుడు ప్రచారం చేయొద్దు. రాజ్యాంగం ప్రకారం మూడింట రెండొంతుల ఎమ్మెల్యేలు విలీనం అయ్యారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనం అయ్యారు’ అని కేసీఆర్ తెలిపారు. కాగా, కాంగ్రెస్ సభ్యుడు విలీనంపై చేసిన ఆరోపణను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను సీఎం కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అంతటోళ్లే ఓడిపోయారు.. ‘ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అంతటివాళ్లే ఓడిపోయారు. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్‌కు 4 శాతం ఓట్లే వచ్చాయి. ప్రజాస్వామ్యంలో సహనం అవసరం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరు పని చేస్తారనుకుంటే ప్రజలు వారినే గెలిపిస్తారు. గొంతు ఉంది కదా అని అసత్య ఆరోపణలు చేయొద్దు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా కాంగ్రెస్‌కు బుద్ధి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారు. బ్యాలెట్‌తో జరిగిన జెడ్పీల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే మాట లేదు. గెలుపోటములపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. కేసుల మీద కేసులు వేస్తూ కాంగ్రెస్ నేతలు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. కేసులేసేది వాళ్లే.. నీళ్లు రావడం లేదని ఆరోపించేదీ వాళ్లే. ఉమ్మడి రాష్ట్రంలో అదే. ఇప్పుడు అదే పరిస్థితి. తెలంగాణపై మాట్లాడితే కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది. మాపై ఎన్నో కేసులు పెట్టి తెలంగాణను అడ్డుకోవాలని చూశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కాంగ్రెస్, బీజేపీ కుట్రలు ఆగలేదు. కాంగ్రెస్ నేతలు ఎంత నీచానికైనా దిగజారుతారు. ఏడు మండలాలు, సీలేరు ప్రాజెక్టు దక్కకుండా బీజేపీ కుట్రలు చేసింది. అభివృద్ధికి సహకరించకుండా ప్రతి దాన్ని రాజకీయం చేస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది’అని కేసీఆర్ దుయ్యబట్టారు. -
కేసీఆర్ పిలిచినా టీఆర్ఎస్లోకి వెళ్లలేదు
చౌటుప్పల్: టీఆర్ఎస్లోకి రావాలని తమను పిలిచినా వెళ్లలేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ సమస్యలు చెప్పేందుకు సీఎం అపాయింట్మెంట్ కోరితే చిల్లర నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ, 2014, 2019 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తమను టీఆర్ఎస్లోకి రమ్మని పిలిస్తే నిరాకరించామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్న తాము ఆ పార్టీలోకి ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. కోమటిరెడ్డి సోదరుల నీతి, నిజాయితీ రాష్ట్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. -
ఏదో ఆవేశంలో అలా మాట్లాడా: కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ : ఏదో ఆవేశంలో మాట్లాడిన మాటలను పట్టుకొని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. క్రమశిక్షణ సంఘం, పార్టీ హైకమాండ్లు ఏ చర్య తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను రాష్ట్ర నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని, ఇటువంటి సమయంలో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా.. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని సూచించారు. ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్నోకేసులు పెట్టి వేధించారని, అయినా పార్టీ కోసం కార్యకర్తలు.. తను కష్టపడుతున్నామని పేర్కొన్నారు. మునుగోడు నుంచి పోటీచేయమని అక్కడి ప్రజలు కోరుతున్నారని, ఇక్కడ సీటిస్తే అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతానన్నారు. ప్రతి ఎమ్మెల్యే సీటు ముఖ్యమేనని, గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలన్నారు. తొలి షోకాజ్ నోటీసుకే సమాధానం ఇచ్చానని, రెండోసారి నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కమిటీలను విమర్శిస్తూ.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమాధానమివ్వాలని ఆయనకు ఈ నెల 21న షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసుకు రాజగోపాల్ ఇచ్చిన సమాధానంపై కమిటీ సంతృప్తి చెందలేదు. దీంతో మరో షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయన ఈ నోటీసుకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి సమాధానం కోసం వేచి చూడాలని క్రమశిక్షణ సంఘం నిర్ణయించింది. ఆ తర్వాతే చర్యలు గురించి ఆలోచిస్తామని పేర్కొంది. -
కాంగ్రెస్‌లో ‘కోమటిరెడ్డి’ కాక
♦ ఇన్చార్జినే విమర్శించడంపై విస్మయం ♦ రాహుల్‌గాంధీతో టచ్‌లో ఉన్నారా? ♦ లేక అమీతుమీకి సిద్ధమయ్యారా? ♦ రాష్ట్ర కాంగ్రెస్‌లో జోరుగా చర్చలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిల తాజా వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపైనే కాకుండా నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియాపైనా వారు విమర్శలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఉత్తమ్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచే ఆయనపై వారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని గుర్తించేది లేదని, గడ్డాలు పెంచితే అధికారంలోకి రాలేమని నేరుగా విమర్శలు కూడా సంధించారు. ఉత్తమ్ నేతృత్వంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నాయకత్వ వైఫల్యమే కారణమంటూ దుయ్యబట్టారు కూడా. ఇప్పుడు మరింత ముందుకెళ్లి, ‘రాష్ట్ర నాయకత్వంలో మార్పు లేదు. 2019 దాకా ఇన్చార్జ్గా నేను, పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ ఉంటారు’ అంటూ కుంతియా చేసిన ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టడం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీని వెనుక వ్యూహం ఏమై ఉంటుందా అని కాంగ్రెస్ సీనియర్లలో చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి సోదరులు పార్టీ మారతారంటూ కాంగ్రెస్‌లో ఓ వర్గం కొంతకాలంగా ప్రచారం చేస్తోంది. వారి తాజా వ్యవహార శైలి ఆ దిశగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ పరువు తీస్తున్నారంటూ పీసీసీ సీనియర్లు కొందరు వారిపై ఇప్పటికే పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి సోదరులు మాత్రం తాము కేవలం స్థానిక నాయకత్వ వైఫల్యాన్నే ఎత్తి చూపుతున్నామని, పార్టీకి విధేయులమేనని చెబుతున్నారు. పార్టీలో తమ స్థానాన్ని పదిలం చేసుకోవడం కూడా వారి తాజా విమర్శల వెనక ఓ వ్యూహం కావచ్చన్న వాదన ఉంది. ఉత్తమ్ నేతృత్వంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్తే తమకు టికెట్లు వస్తాయో రావోనన్న అనుమానం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో తమ భవితవ్యం ఏమిటన్న దానిపై నేరుగా అధిష్టానం వద్దే తేల్చుకోవాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాహుల్‌తో టచ్‌లో ఉన్నారా..? కోమటిరెడ్డి సోదరులు రాహుల్‌తో టచ్‌లో ఉన్నారేమోనని కూడా పీసీసీ సీనియర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘‘ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో రాహుల్‌తో ఎక్కువ సాన్నిహిత్యమున్నది ఉత్తమ్‌కే. అలాంటి నేతతో పాటు ఏకంగా రాష్ట్ర ఇన్చార్జ్ మీదే విమర్శలు ఎక్కుపెట్టారంటే కచ్చితంగా ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. అధిష్టానంలోని ముఖ్య నేతల అండ ఉంటే తప్ప వారిలాంటి వ్యాఖ్యలు చేయలేరు. రాహుల్‌తోనూ, ఢిల్లీ ముఖ్యులతోనూ వారు టచ్‌లో ఉన్నట్టున్నారు. లేదంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి పార్టీలో కొనసాగడం అంత సులువు కాదు. ఇటు రాష్ట్ర ఇన్‌చార్జ్‌తో, పీసీసీ చీఫ్‌తో వైరం పెట్టుకుని, అటు అధిష్టానం పెద్దల సహకారమూ లేకపోతే పార్టీలో నెగ్గుకురావడం చాలా కష్టం. ఇవన్నీ తెలిసీ ఆషామాషీగా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు’ అని కాంగ్రెస్ ముఖ్య నాయకుడొకరు విశ్లేషించారు. పీసీసీ సారథ్యంతో పాటు ముఖ్య పదవుల్లో ఎలాంటి మార్పులూ ఉండవని కుంతియా ప్రకటించాక కూడా మౌనంగా ఉంటే పార్టీలో తమ ఉనికికే ప్రమాదమని కోమటిరెడ్డి సోదరులు భావిస్తున్నారు. పైగా ఎన్నికల నాటికి తమను పార్టీలో ఏకాకిని చేసే ప్రయత్నాలు ముమ్మరమవుతాయని అనుమానిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో తమ సన్నిహిత నేతలను ఇప్పటికే ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వారేం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
పాల్వాయివి మతి స్థిమితం లేని మాటలు
భువనగిరి, న్యూస్‌లైన్ : రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి మతి స్థిమితం కోల్పోయి తనపై విమర్శలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. తాను భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పిలాయిపల్లి కాల్వద్వారా మూసీ జలాలను అందిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్ కాలువ పనులను వదిలివెళ్లినప్పటికీ ఏనాడూ పట్టించుకోని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి.. తాను చేసిన పనులను విమర్శించడం తగదన్నారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం విమర్శలతోనే కాలం గడిపుతున్నారని పేర్కొన్నారు. ఏడు సంవత్సరాలుగా పూర్తి కాని కాల్వను, త్వరగా పూర్తి చేయడానికి తాను రెండు సంవత్సరాల కాలం పాటుపడినట్లు తెలిపారు. ఇందుకోసం 6.7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కాల్వ పనుల్లో అక్కడక్కడా ఏవైనా మరమ్మతులు వస్తే అధికారులు వాటిని సరి చేయిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేసి ఆరోపణలు చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలని పాల్వాయి చేస్తున్నారని ఆరోపించారు. పిలాయిపల్లి కాలువ ద్వారా పోచంపల్లి, చౌటుప్పల్ మండలాలతో పాటు మునుగోడు నియోజకవర్గాల రైతులకు సాగు నీరు అందుతుందన్నారు. ఈ ప్రాంతాల్లో చెరువులను కూడా నింపుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.